
వాషింగ్టన్: అమెరికా, కెనడాలను కార్చిచ్చులు ఇంకా వెంటాడుతున్నాయి. రోజుకో ప్రాంతంలో కార్చిచ్చులు రేగుతూ ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా వాషింగ్టన్‌లోని స్పోకాన్ ప్రాంతంలో మొదలైన కార్చిచ్చు త్వరితగతిన వ్యాపిస్తోంది. కొద్ది గంటల్లో 3 వేల ఎకరాలను భస్మం చేసింది. దీంతో భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. చాలా ఇళ్లు బూడిదగా మారాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శనివారం వాషింగ్టన్‌ను మంటలు కమ్మేయడంతో రెడ్ ఫ్లాగ్ వారి్నంగ్ జారీ చేశారు. అత్యంత తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వారి్నంగ్ జారీ చేస్తుంటారు.
కెనడాలో 200 కార్చిచ్చులు
కెనడా దేశంలోనూ కార్చిచ్చులు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. వాయవ్య కెనడా ప్రాంతంలో 200కుపైగా కార్చిచ్చు ఘటనలు సంభవించాయి. ఈ ఘటనల్లో అగ్గి దావానలంగా వేగంగా పరిసరాలకు వ్యాపించంతో వేలాది మందిని విమానాల్లో సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment