sicial media
-
ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా ?
ఇంద్రధనుస్సులో ఏడు రంగులు కలయిక ఒక అద్భుతం. ప్రతి రంగు దేనికదే ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అలాగే ఈ రంగులను శాంతికి, మంచి ఆలోచనలకు, ఉత్సాహానికి, బాధకు ఒక్కొక్క రంగుని నిర్దేశించారు. ఏంటి ఇదంతా అని అనుకోకండి అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఇంటర్నేట్ ప్రభంజనంతో చిన్న పెద్ద అంతా ఎక్కువగా సోషల్ మాధ్యమాలతోనే గడుపుతుంటారు. అయితే ఈ మధ్య అంతా ఎక్కువగా ఎరుపు రంగు జెండాల(రెడ్ ఫ్లాగ్స్) ఎమోజీలనే ఎక్కువగా వాడుతుంటున్నారట. నెటిజన్లు నుంచి ప్రముఖ దిగ్గజ కంపెనీల వరకు అంతా ఎరుపు రంగు జెండా చిహ్నాలనే అత్యధికంగా వాడుతున్నారట. అయితే ఎరుపు రంగు అంటే కోపానికి, దూకుడు స్వభావానికి సంకేతంగా చెబుతారు. అంతేకాదు మనందరి దృష్టిలో రెడ్ అంటే డేంజర్‌కి గుర్తు అని తెలుసు. అంతెందుకు హెచ్చరికలను కూడా రెడ్ అలర్ట్ అంటూ ఎరుపు రంగు అక్షరాలతో తెలియజేస్తారు. అలాంటి రెడ్ ఎమోజీలను ఎక్కువగా వాడుతూ తమకు ఇష్టం కానివాటిని, వద్దునుకుంటున్నవాటిని, వదిలేస్తున్నా అని చెప్పడానికీ ఈ ఎరుపు రంగుల జెండాలనే వాడుతూ అసలు విషయాన్ని చెప్పకనే చెబుతున్నారట. ప్రస్తుతం నెట్టింట ఇది కాస్త తెగ వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో 1.5 మిలియన్ల రెడ్ ఫ్లాగ్‌లను ఉపయోగించారట. ఆఖరికీ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ గేమింగ్ ఇండస్ట్రీ నెట్ ఫ్లిక్స్ కూడా ఈ ఫ్లాగ్‌లను ఉపయోగించడం విశేషం. -
ట్యాప్ గుర్తుకు ఓటేయండి!
ప్రతి ఊరు... ప్రతి ఇల్లు... నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు నందమూరి కల్యాణ్‌రామ్. ‘ట్యాప్ గుర్తుకు ఓటేయండి’ అని ప్రజల్ని కోరుతున్నారు. ట్యాప్ గుర్తుకు ఓటేయడం ఏంటి? ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరారా? లేదా కొత్తగా పార్టీ ఏదైనా ప్రారంభించారా? అని ఏవెవో ఊహించుకోకండి! ఎందుకంటే... ఆయన ఓట్లు వేయమంటున్నది రీల్ లైఫ్‌లోనే! ఉపేంద్ర మాధవ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఎమ్మెల్యే’. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి... అనేది ఉపశీర్షిక. ఇటీవలే ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఉన్నారు. ‘‘వీరభద్రాపురం నియోజకవర్గ ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓట్లు వేసి అత్యంత మెజారిటితో గెలిపించ ప్రార్థన. మీ కల్యాణ్! ట్యాప్ గుర్తుకే మన ఓటు’’ అని రాసిన వాల్ పోస్టర్లు, పాంప్లెట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ ఎమ్మెల్యేగా నటించబోతున్నారని ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. వీరభద్రాపురం అనే విలేజ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో ఉంది. సో... గోదావరి అందాలను ఈ సినిమాలో చూడొచ్చని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. -
విద్యార్థులా? పచ్చి గూండాలా?
-
వైరల్‌గా మారిన విద్యార్థుల వీడియో
పాఠశాల విద్యార్థులు తరగతిగదిలోనే గుండాల తరహాలో వ్యవహరిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విద్యార్థిని టార్గెట్ చేసి కొందరు విద్యార్థులు చితకబాదుతున్న ఈ వీడియోను కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అనంతరం.. సంబంధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులకు చేరేంతవరకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయాలంటూ ఫేస్బుక్, వాట్సప్‌లలో ఇది విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియో ఏ పాఠశాలకు సంబంధించినది అనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ.. విద్యార్థులు ధరించిన యూనిఫాంను బట్టి చూస్తే ఈ ఘటన కేంద్రీయ విద్యాలయంలో చోటుచేసుకున్నట్లుగా భావిస్తున్నారు. విద్యార్థుల అమానుష ప్రవర్తనను తెలిపేలా ఉన్న ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటీజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.