శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్‌లో భద్రతా బలగాలు లష్కరే తోయిబా టాప్ కమాండర్ ముజాఫర్ నైకూ అలియాస్ ముజ్ మౌల్విని హతమార్చాయి. మిలిటెంట్ ఉన్నాడన్న సమాచారంతో భద్రతా సిబ్బంది గుల్జార్‌పురాలో గురువారం సాయంత్రం ఆపరేషన్ ప్రారంభించాయి. తప్పించుకునేందుకు మిలిటెంట్ గ్రెనేడ్ విసరగా కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఇరు వర్గాల మధ్య కొంతసేపు జరిగిన కాల్పుల్లో మిలిటెంట్ మరణించాడు.