గాంధీ నగర్ : గుజరాత్ (Gujarat)లో విషాదం చోటు చేసుకుంది. పోర్‌బందర్ ఎయిర్‌పోర్ట్ (Porbandar Airport)లో ఘోర హెలికాప్టర్ (helicopter crash porbandar) ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్‌కు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు సమాచారం. అయితే మరణాలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రమాదం వెంటనే హెలికాప్టర్ భూమిని ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలంలో విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Helicopter of Indian Coast Guard ALH Dhruv 'crashed' in Porbandar, Gujarat during a routine training sortie.
3 crew members DEAD. pic.twitter.com/vt4L025Ifl— RAMULU.B (@vedicramrekha) January 5, 2025
Comments
Please login to add a commentAdd a comment