సాక్షి, తాడేపల్లి : మణిపూర్‌లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రెండు ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కాగా, ఇంఫాల్ నుంచి 106 మంది విద్యార్థులతో ప్రత్యేక విమానం బయలుదేరింది. ఇక, విద్యార్థుల భోజన, రవాణా సదుపాయాలన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ సెక్రటరీ ముత్యాలరాజు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను రక్షించాం. ఈ ఆపరేషన్‌పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. మణిపూర్ సీఎస్‌తో మన ప్రభుత్వం టచ్‌లో ఉంది. ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా పెట్టుకుని మిగతా స్టూడెంట్స్‌ని గుర్తించాం. ఇప్పటి వరకు 161 మంది విద్యార్థులను గుర్తించాం.
కమర్షియల్ ఫ్లైట్స్‌లో వారిని తీసుకురావాలంటే లేట్ అవుతుందని స్పెషల్ ఫ్లైట్స్ పంపాం. విమానయాన శాఖ కూడా వెంటనే స్పందించింది. కోల్‌కత్తా, హైదరాబాద్‌లో దిగిన విద్యార్థులను గమ్యస్థానాలకు చేరుస్తాం. హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యే క బస్సులు ఏర్పాటు చేశాం. కొందరికి రెగ్యులర్ ఫ్లైట్స్‌లో కూడా టికెట్టు బుక్ చేశాం. వారిని ఎయిర్‌పోర్టు నుంచి కార్లలో స్వస్థలాలకు పంపుతాం అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఫలించిన సీఎం జగన్ యత్నం
Comments
Please login to add a commentAdd a comment