mutyala raju
-
మణిపూర్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులందరినీ రక్షించాం
-
‘విద్యార్థుల తరలింపు సీఎం జగన్ కృషి వల్లే సాధ్యమైంది’
సాక్షి, తాడేపల్లి : మణిపూర్‌లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రెండు ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కాగా, ఇంఫాల్ నుంచి 106 మంది విద్యార్థులతో ప్రత్యేక విమానం బయలుదేరింది. ఇక, విద్యార్థుల భోజన, రవాణా సదుపాయాలన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ సెక్రటరీ ముత్యాలరాజు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను రక్షించాం. ఈ ఆపరేషన్‌పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. మణిపూర్ సీఎస్‌తో మన ప్రభుత్వం టచ్‌లో ఉంది. ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా పెట్టుకుని మిగతా స్టూడెంట్స్‌ని గుర్తించాం. ఇప్పటి వరకు 161 మంది విద్యార్థులను గుర్తించాం. కమర్షియల్ ఫ్లైట్స్‌లో వారిని తీసుకురావాలంటే లేట్ అవుతుందని స్పెషల్ ఫ్లైట్స్ పంపాం. విమానయాన శాఖ కూడా వెంటనే స్పందించింది. కోల్కత్తా, హైదరాబాద్‌లో దిగిన విద్యార్థులను గమ్యస్థానాలకు చేరుస్తాం. హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యే క బస్సులు ఏర్పాటు చేశాం. కొందరికి రెగ్యులర్ ఫ్లైట్స్‌లో కూడా టికెట్టు బుక్ చేశాం. వారిని ఎయిర్‌పోర్టు నుంచి కార్లలో స్వస్థలాలకు పంపుతాం అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఫలించిన సీఎం జగన్ యత్నం -
మణిపూర్ నుండి చివరి విద్యార్థి వచ్చేవరకు ఈ ఆపరేషన్ ఆగదు
-
ఇదే కృషితో ఐఏఎస్ కొట్టాలి
ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్న చోట రోజు వారీ సమావేశాల్లో ఐఏఎస్ అధికారులు కూర్చుంటారు. వారితో కలిసి వివిధ రంగాల్లో స్థితిగతులు, రాష్ట్రంలో పరిస్థితి, వివిధ పథకాల అమలుపై సమీక్షలు చేస్తాం. ఇప్పుడు ఏ స్ఫూర్తితో అయితే మీరు కష్టపడి ఐఐటీల్లో చేరడానికి మంచి ర్యాంకులు సాధించారో.. అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో, కష్టపడి ఐఏఎస్ అధికారులు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. అప్పుడు మీరూ ఇదే స్థానాల్లో కూర్చుని పరిపాలనలో భాగస్వాములు కావచ్చు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివి ప్రతిష్టాత్మక ఐఐటీ ఇతర ఉన్నత విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ కృషిని ఇలాగే కొనసాగిస్తే కచ్చితంగా ఐఏఎస్ స్థానాల్లో కూర్చుంటారని విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపారు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్ధులు మంగళవారం సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి ల్యాప్‌టాప్‌లను బహూకరించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకున్నారు. విద్యార్థుల నేపథ్యాన్ని అడిగి తెలుసుకుని మరింత రాణించాలని ప్రోత్సహించారు. స్ఫూర్తి రగిలించే కథలు ఇక్కడే.. విద్యారంగంపై ప్రభుత్వాలు చూపే శ్రద్ధ, ధ్యాస పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యారంగాన్ని సంస్కరిస్తూ అమ్మఒడి, నాడు–నేడు సహా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే అధికారులు మన ముందే ఉన్నారన్నారు. ‘మీ ముందే ఇద్దరు ఐఏఎస్ అధికారులు కాంతిలాల్ దండే, సునీత మాట్లాడారు. వారు కూడా మీలాంటి వారే. ఐఏఎస్ అధికారులయ్యారు. మీరంతా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఇది అసాధ్యం కానే కాదు. ఐఐటీ వరకూ మీరు చేరుకోగలిగారు. ఇది దాటితే ప్రపంచం మీకు మెరుగైన అవకాశాల రూపంలో ద్వారాలు తెరుస్తుంది. మీరు ఇప్పటికే ఒక స్థాయికి చేరుకున్నారు. తొలి అడుగు వేసినట్లే భావించండి’ అని విద్యార్థులనుద్దేశించి సీఎం పేర్కొన్నారు. దేవుడి దయతో కష్టపడి చదువుతున్నారని, ఇలాగే కొనసాగించి దృష్టి కేంద్రీకరిస్తే కచ్చితంగా ఐఏఎస్‌ల స్థానాల్లో కూర్చుంటారని భరోసా కల్పించారు. అత్యంత సాధారణ నేపథ్యాలే.. ఐఏఎస్‌ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవని, సీఎంవోలో అదనపు కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజే దీనికి నిదర్శనమని సీఎం జగన్ చెప్పారు. ‘ముత్యాలరాజు జీవితం మన హృదయాలను కదిలిస్తుంది. వాళ్ల ఊరికి వెళ్లాలంటే పడవలే మార్గం. మనకు స్ఫూర్తినిచ్చే కథలు ఎక్కడో లేవు. ఇదే గదిలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల రూపంలో ఉన్నాయి. మీరు ఇదే కృషి కొనసాగిస్తే కచ్చితంగా ఆ స్థాయికి చేరుకుంటారు. నా పక్కనున్న స్థానాల్లో మీరు కనిపిస్తారు’ అని సీఎం పేర్కొన్నారు. కరోనా సమయంలో అడవుల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో.. 5 నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లి ఆన్లైన్లో చదువుకున్నామని చెప్పారు. తాము ఎలా, ఎంత కష్టపడిందీ వివరించారు. తమను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉన్నత చదువులకు అర్హత సాధించేలా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, గిరిజన సంక్షేమశాఖ ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ సహాయం కావాలన్నా సరే.. తన వైపు నుంచి సీఎంవో అదనపు కార్యదర్శి ముత్యాలరాజు అందుబాటులో ఉంటారని, ఫోన్ నంబరు ఇస్తారని, ఎప్పుడు అవసరమున్నా.. ఏం కావాలన్నా సహాయంగా నిలుస్తారని విద్యార్థులకు సీఎం భరోసానిచ్చారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. ఈ అధికారులంతా మీ స్థాయి నుంచే వచ్చారు కాబట్టి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎలా పరిష్కరించాలి? ఏ రకంగా మీకు తోడుగా నిలవాలనే విషయాలు వారికి బాగా తెలుసని సీఎం విద్యార్థులతో పేర్కొన్నారు. మొత్తం వ్యవస్థే మారిపోతుంది.. గిరిజన ప్రాంతాల నుంచి, కర్నూలులోని ఎమ్మిగనూరు తదితర చోట్ల నుంచి విద్యార్థులు ఐఐటీలో ర్యాంకు సాధించడం గర్వించదగ్గ విషయమని సీఎం అభినందించారు. ‘నేను పాదయాత్ర చేసినప్పుడు ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ఎంత వెనకబడి ఉన్నాయో చూశా. అలాంటి ప్రాంతం నుంచి ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే మారిపోతుంది. అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరుగుతాయి. పెద్ద పెద్ద చదువులు చదవాలన్న తపన పెరుగుతుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మార్గదర్శకంగా భావించి మెరుగైన చదువులు చదివే పరిస్థితి వస్తుంది. మొత్తం మార్పు కనిపిస్తుంది. ఇది జరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అంటూ సీఎం స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు. వైఎస్సార్ చొరవతో మూడేళ్లలోనే ఊరికి బ్రిడ్జి: ముత్యాలరాజు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా తన ప్రస్థానాన్ని తెలియజేయాలని సీఎం కోరడంతో సీఎంవో అదనపు కార్యదర్శి ముత్యాలరాజు తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ‘మాది కృష్ణా జిల్లా సరిహద్దులోని చిన్న గొల్లపాలెం. మా ఊరు ఒక దీవి. అటు పశ్చిమ గోదావరి ఇటు కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. చాలా మంది గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. నా సొంత చెల్లెలే ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నా. ఈ పరీక్షల్లో నాకు అఖిల భారత స్థాయిలో నంబర్ వన్ ర్యాంకు వచ్చింది. అప్పటి సీఎం వైఎస్సార్ పిలవడంతో నా తల్లిదండ్రులతో వెళ్లి కలిశా. ఏం కావాలని వైఎస్సార్ అడిగితే మా ఊరికి బ్రిడ్జి సదుపాయం కల్పించాలని కోరా. నేను రిటైర్ అయ్యేలోగా మా ఊరికి బ్రిడ్జి తేగలనేమోనని అనుకున్నా. వైఎస్సార్ చొరవతో మూడేళ్లలోనే బ్రిడ్జి వేయగలిగాం. దీనికోసం రూ.26 కోట్ల నిధులను ఆయన కేటాయించారు. ప్రస్తుతం విద్యా సంబంధిత అంశాలపై దృష్టిపెట్టా. అమ్మ ఒడి, నాడు–నేడు కార్యక్రమాలు చురుగ్గా చేయగలిగాం. ఏపీ చరిత్రలో ఇన్ని సీట్లు రాలేదు’ అని ముత్యాలరాజు తెలిపారు. ఇప్పటివరకూ 179 మందికి మంచి ర్యాంకులు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల నుంచి ఇప్పటివరకూ 179 మంది విద్యార్థులు వివిధ ఐఐటీలు, ఐఐటీల్లో ప్రిపరేటరీ కోర్సులు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. 2014లో ఒకే ఒక్క గిరిజన విద్యార్థి ఐఐటీకి ఎంపిక కాగా 2021లో 30 మంది సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల విద్యార్థులు సీట్లు సాధించేలా ర్యాంకులు తెచ్చుకోవడం గమనార్హం. వీరిలో 9 మంది నేరుగా ఐఐటీకి అర్హత సాధించగా 21 మంది విద్యార్థులు ప్రిపరేటరీ కోర్సు (ఏడాది పాటు ఐఐటీ నిపుణులతో శిక్షణ) అనంతరం మళ్లీ ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా ఐఐటీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందనున్నారు. 7 వేల లోపు ర్యాంకులు సాధించిన మరో 59 మంది ఎన్ఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఇంకా కౌన్సిలింగ్ జరుగుతున్నందున మరింతమందికి సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వీటితోపాటు నీట్ తదితర ప్రవేశ పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని, వాటిలో కూడా ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సీఎం ఉన్నారనే ధైర్యంతోనే చదువుకోగలిగాం మాది.. విశాఖ జిల్లా అనంతగిరి మండలం కోటపర్తివలస. జేఈఈ అడ్వాన్స్డ్ ఎస్టీ కేటగిరీలో నాకు 596వ ర్యాంక్ వచ్చింది. నేను ఈ ర్యాంకు సాధించడానికి సీఎం జగనన్నే నాకు స్ఫూర్తి. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద వంటి పథకాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. కరోనా కష్టకాలంలో మేము భయపడకుండా చదువుకోగలిగామంటే జగనన్న ఉన్నారన్న ధైర్యమే కారణం. సివిల్స్ సాధించి నాలాంటి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా ఉండటమే నా లక్ష్యం. – వరలక్ష్మి, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, మారికవలస, విశాఖపట్నం జిల్లా జగనన్న అమ్మఒడితో ఎంతో ప్రోత్సాహం.. మాది విజయనగరం జిల్లా కొట్టక్కి. జేఈఈ అడ్వాన్స్డ్ ఎస్టీ కేటగిరీలో నాకు 333వ ర్యాంకు వచ్చింది. అమ్మానాన్న వెదురుబుట్టలు అల్లుతారు. సీఎం సారే మాకు స్ఫూర్తి. నాలాంటి విద్యార్థుల సంక్షేమం కోసం మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి వంటి మంచి పథకాలు ప్రవేశపెట్టారు. వాటితో మా చదువులకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. – పార్ధసారధి, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం, విజయనగరం జిల్లా ‘నాడు–నేడు’తో మా కళాశాలను బాగా అభివృద్ధి చేశారు నాకు జేఈఈ అడ్వాన్స్డ్ ఎస్సీ కేటగిరీలో 507వ ర్యాంకు వచ్చింది. నేను ఎల్బీ చర్ల, నర్సాపురంలోని ఎస్సీ సంక్షేమ కళాశాలలో చదువుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో స్ఫూర్తి కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగపడింది. మంచి శిక్షణ అందించారు. ప్రభుత్వం నాడు–నేడు ద్వారా మా కళాశాలను చాలా బాగా అభివృద్ధి చేసింది. – బి.తరుణ్, గణపవారిగూడెం, లింగపాలెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మెరిట్ జాబితాపై కసరత్తు
సాక్షి, ఏలూరు (టూటౌన్) : గ్రామ, వార్డు సచివాలయ నియామక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మెరిట్ జాబితా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ ఈ జాబితా రూపకల్పనలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. ఈ జాబితాపై జిల్లా అధికారులతో పాటు జిల్లాపరిషత్ ఉద్యోగులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకూ జిల్లాలోని మొత్తం 19 రకాల పోస్టులకు 14 రకాల పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా 9,576 పోస్టులకు 1,41,806 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు 1,28,268 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 రోజుల్లోనే వెలువరించి రికార్డు నెలకొల్పింది. జిల్లాలకు సంబంధించి జాబితాను ఈ నెల 21నే పంపినా.. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వారీగా తుది మెరిట్ జాబితా రూపకల్పన ప్రక్రియలో జిల్లా అధికారులు తలమునకలయ్యారు. దీనికి సంబంధించి ఆయా శాఖల సిబ్బంది శనివారం అర్ధరాత్రి వరకూ కష్టపడి ఒక జాబితాను రూపొందించారు. దీనిని ఆదివారం ఉదయం కలెక్టర్ ముత్యాలరాజుకు సమర్పించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ దీనిలో లోపాలు కనిపిస్తున్నాయని, వాటిని సరిచేసిన తర్వాతనే అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆదివారం అయినా జిల్లా యంత్రాంగం పూర్తి సమయాన్ని జాబితాల రూపకల్పనపైనే పెట్టింది. ఆదివారం మధ్యాహ్నం కలెక్టర్ స్వయంగా జిల్లాపరిషత్ సమావేశ మందిరంలోనే ఉండి జాబితా రూపకల్పన ప్రక్రియను సమీక్షించారు. అధికారుల అనుమానాలు నివృత్తి చేశారు. రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు జాబితా రూపకల్పనలోనే నిమగ్నమయ్యారు. -
కలెక్టర్ సీరియస్
సాక్షి, పోడూరు(పశ్చిమ గోదావరి) : కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మంగళవారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో సిబ్బంది హడలెత్తిపోయారు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ సమయంలో స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయిన కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్(ఏబీసీడబ్ల్యూఓ)ను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్టేరు సమీపంలో ఉన్న నెగ్గిపూడి బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను నాలుగునెలల కిందటే ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి స్కూలు ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 12వ తేదీ నుంచే స్కూళ్లు తెరిచినా ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ పొందకపోవడంతో తరగతులు నిర్వహించడంలేదు. 11 హాస్టళ్ల నుంచి దాదాపు 219 మంది విద్యార్థులు నెగ్గిపూడిలోని రెసిడెన్షియల్ స్కూల్లో చేరాల్సి ఉంది. ఇంతవరకు ఒక్కరూ చేరలేదు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో ఆయన రికార్డులను పరిశీలించడంతో ఈ వైఫల్యాలన్నీ వెలుగుచూశాయి. ఎస్సీ బాలికల హాస్టల్ పరిశీలన కలెక్టర్ రేవు ముత్యాలరాజు మంగళవారం మద్యాహ్నం తణుకు పట్టణంలో అకస్మికంగా పర్యటించారు. మంగళవారం తణుకులోని ఇరగవరం కాలనీలో గల ఎస్సీ బాలికల హాస్టల్‌ను కలెక్టర్ ముత్యాలరాజు అకస్మికంగా తనిఖీ చేశారు. తను పరిశీలిస్తున్న విషయం కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్త పాటించారు. ముందుగా తణుకు మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే తణుకు పట్టణంలో గతంలో సేకరించిన రాజీవ్ స్వగృహ పథకంలో ఉద్యోగుల గృహ వసతి కోసం సేకరించిన 20.8 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఇరగవరం కాలనీలో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అందులో విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ ఎల్ శివకుమార్ ఉన్నారు. -
దళితులను హింసిస్తున్న కలెక్టర్
నెల్లూరు(సెంట్రల్): దళిత మహిళా ప్రజాప్రతినిధులుగా ఉన్న తమకు ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా చెక్పవర్లు రద్దు చేయించి మానసికంగా తమను హింసిస్తున్నారని పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ ఆరోపించారు. నెల్లూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం కలెక్టర్ తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి పొరపాటు జరగకపోయినా, ఏ నేరం చేయక పోయినా, ఎక్కడా అవినీతికి పాల్పడకపోయినా తమ చెక్‌పవర్ రద్దు చేయించి మహిళలను, దళితులను అణగదొక్కడానికి కలెక్టర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా చట్ట విరుద్ధమైన , న్యాయ సమ్మతం కాని పనులు చేయమని చెప్పిన మాటలకు తాము నిరాకరించడం తప్పుగా భావించిన కలెక్టర్ తమ చెక్ పవర్ రద్దు చేయించడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కలెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా పెత్తనం చేయడం శోచనీయమన్నారు. గతంలో ఎంతో మంది కలెక్టర్లు జిల్లాలో పనిచేశారని, ప్రస్తుత కలెక్టర్ తీరు, అసమర్థంగా పాలన ఇంత వరకు ఎవరూ చేయలేదన్నారు. ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అధికారులతో విమర్శలు చేయిస్తూ, దళిత మహిళలమైన తమ మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు. కలెక్టర్ పద్ధతి మార్చుకోక పోతే జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఏకమై కలెక్టరేట్‌ను దిగ్బంధం చేసి మా హక్కుల కోసం పోరాటం చేస్తామే తప్ప, మీ లాంటివారిని విడిచి పెట్టబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకటాచలం సర్పంచ్ మణెమ్మ, వెంకటాచలం ఎంపీపీ అరుణమ్మ మరి కొంత మంది మహిళలు పాల్గొన్నారు. -
ఆరోజు నన్ను ఎందుకు ప్రశ్నించలేదు : కాకాణి
సాక్షి, నెల్లూరు : సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుపై మండిపడ్డారు. జిల్లాలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. అవినీతిపై పాలనాధికారి చర్యలు తీసుకోవాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. ఐదేళ్లు జెడ్పీ ఛైర్మెన్‌గా పనిచేసిన అనుభవం తనకు ఉందని అధికారులను గౌరవించడం తనకు తెలసునని చెప్పారు. ఒకరు చెబితే తెలుసుకొనే స్థితిలో లేననన్నారు. జిల్లాలో అనేక మంది గొప్పవాళ్ళు కలెక్టర్లుగా సమర్థవంతంగా పనిచేశారని చెప్పిన ఆయన.. ప్రభుత్వ ఉత్తర్వులను పక్కన పెట్టి, పాలకవర్గం మెహర్భాని కోసం కలెక్టర్ వేరే ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. స్వచ్చ భారత్ అవార్డు అందుకున్న కలెక్టర్‌కు ఇవి కనిపించడం లేదా నిలదీశారు. కలెక్టర్ అవినీతి పరుడని తాము అనలేదని, పాలన గాడి తప్పిందని హెచ్చరిస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించమని కోరడం ప్రజాప్రతినిధిగా తప్పా అని అడిగారు. గతంలో ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వ అధికారులకు అండగా నిలిచానని గుర్తు చేసిన ఆయన, ఆ రోజు తన తీరును అధికారాలు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. జిల్లాలో అధికార పార్టీ నాయకుల అవినీతికి ప్రభుత్వ అధికారులను బలిపశువులను చేస్తున్నారని కాకాణి అన్నారు. -
దొంగబిల్లులు డ్రా చేసినా చర్యలేవీ!
నెల్లూరు(సెంట్రల్): పనులు చేయకుండా దొంగబిల్లులు డ్రా చేసిన, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా బిల్లులు చెల్లింపులు చేసిన వారిపై కలెక్టర్ ముత్యాలరాజు చర్యలెందుకు తీసుకోవడంలేదని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంత అసమర్థ కలెక్టర్ ఎక్కడా చూడలేదన్నారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. జిల్లాను దోచుకుంటున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కలెక్టర్ వత్తాసు పలకడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి టీడీపీ నేతల జాబితాను సంబంధిత శాఖ అధికారులకు అందించి వీరు చెప్పిన పనులు చేయాలని, పనులు చేయకపోయినా బిల్లులు మంజూరుచేయాలని మంత్రి కొందరు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శి పేరుతో సంబంధంలేని వ్యక్తులు తీర్మానం పెట్టారన్నారు. ఈ విషయంలో కార్యదర్శి లిఖితపూర్వకంగా రాసిచ్చినా సంబంధిత వ్యక్తులపై కలెక్టర్ చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. గతంలో రామదాసుకండ్రిగ భూములకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి వాటిపై మంత్రి సంతకాలు పెట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారన్నారు. పీఆర్ కార్యాలయంలో ఇంజినీర్లను ఏమైనా అడిగితే తమకు తెలియదనే సమాధానం వస్తోందన్నారు. పసుపు కుంభకోణంలో వీఆర్వోలను సస్పెండ్ చేసి కలెక్టర్ చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు. ఫోర్జరీ తీర్మానాలతో రూ.8 కోట్ల రోడ్ల పనుల్లో మంత్రి ముడుపులు తీసుకున్నా, ఫోర్జరీ పట్టాలతో రైతుల పరిహారాన్ని కాజేయాలనుకున్నా కలెక్టర్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా భారీ స్థాయిలో అవినీతి, అవకతవకలు జరుగుతుంటే జిల్లాకు కలెక్టర్ ఉన్నారా, లేక సోమిరెడ్డి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారా అనే అనమానం కలుగుతోందన్నారు. మామూళ్లు ఇవ్వకపోతే బెదిరింపులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇంగితజ్ఞానం లేకుండా నిజాయితీగా పనిచేసే వారిపై నోరు పారేసుకుంటారని కాకాణి విమర్శించారు. ఇంజి నీరింగ్ అధికారులు టీడీపీ నేతలకు మామూళ్లు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారన్నారు. నిజాయితీగా ఉండే ఓ మహిళా ఇంజినీర్‌పై డోంట్ టాక్ రబ్బీష్ అని ఆగ్రహం వ్యక్తం చేయడం, మరో అధికారిని యూజ్‌లెస్‌ఫెలో అని తిట్టడం సోమిరెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పనులు నాణ్యత జరిగాయా? లేదా? అని విచారణకు ఆదేశించగల దమ్ము చంద్రమోహన్‌రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. దిగజారుడు పనులు చేయిస్తూ, దొంగబిల్లులు చేసుకోమని చెబుతూ ఓట్లు వేయాలని షరతులు పెడుతుండటం సిగ్గుమాలిన చర్య అన్నారు. రాష్ట్రంలోని టాప్‌టెన్ అవినీతిపరుల్లో సోమిరెడ్డి ఒకరన్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి మంత్రి చేస్తున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీటీసీలు వెంకటశేషయ్య, నెల్లూరు శివప్రసాద్ పాల్గొన్నారు. -
కలెక్టర్‌పై టీడీపీ నేతల కన్నెర్ర
తమ సిఫారసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం నీరు- చెట్టు అవినీతిపై విచారణకు ఆదేశించడం జీర్ణించుకోలేకపోతున్న నేతలు ఇలాగైతే జిల్లాలో పార్టీని నడపలేమని సీఎంకు విన్నపాలు సమస్య పరిష్కరించాలని మంత్రికి సీఎం ఆదేశం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుపై టీడీపీ నేతలు కన్నెర్ర చేశారు. కలెక్టర్ తమ సిఫారసులు పట్టించుకోవడం లేదనీ, నీరు-చెట్టు పనుల మీద విచారణ చేస్తున్నారని వారు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ముత్యాలరాజుకు ప్రభుత్వం జూలైలో పదోన్నతి కల్పించి కలెక్టర్‌గా నియమించింది. జూలై 25వ తేదీ ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ శాఖాధిపతులను (హెచ్ఓడీ) పరుగులు తీస్తున్నారు. హెచ్ఓడీలు సరిగ్గా పనిచేస్తే కింది స్థాయి ఉద్యోగులు బాగా పనిచేస్తారనే సూత్రంతో ముందుకు పోతున్నారు. నెలరోజుల్లోపే జిల్లా పరిస్థితులు అవగాహన చేసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, జిల్లాలో మరో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన పెండింగ్ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. దగదర్తి విమానాశ్రయం భూసేకరణ వ్యవహారంలో కొందరు దళారులు, అధికార పార్టీ నేతలు భూ యజమానుల వివరాలు గల్లంతు చేసి తమకు కావాల్సిన వారి పేర్లు చేర్చే ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ కఠినంగా వ్యవహరించడంతో కింది స్థాయి అధికారులు కలెక్టర్ ఊరుకోరు అని చెప్పి అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల నుంచి తప్పించుకోగలుతుతున్నారు. వెబ్ ల్యాండ్ వ్యవహారంలో జిల్లాలోని విడవలూరు,కోట,ఉదయగిరి, కొడవలూరు, కోవూరు, రాపూరు మండలాల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతిపై కలెక్టర్ గట్టిగా స్పందించారు. అటవీ, ప్రభుత్వ, డీకేటీ, ప్రైవేట్ భూములను సైతం ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీద వన్‌బీలో ఎక్కించిన అవినీతి కట్టడికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మండల తహశసీల్దార్ కార్యా లయాల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లందరినీ ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్‌కు బదిలీ చేశారు. ఈ నిర్ణయం అమలు జరిగిన వెంటనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక నాయకుడు కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీలు ఉపసంహరించుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. నిర్ణయం అమలు జరిగిపోనందువల్ల దాన్ని వెనక్కు తీసుకోవడానికి కలెక్టర్ ఇష్టపడలేదు. దీంతో సదరు నాయకుడు ఆయన మీద ఆగ్రహించారని తెలిసింది. నీరు-చెట్టు అవినీతిపై విచారణ రెండున్నరేళ్లలో జిల్లాలో సుమారు రూ.350 కోట్ల విలువైన నీరు- చెట్టు పనులు జరిగాయి. ఇందులో గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో నిధుల కుంభకోణం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే, టీడీపీ నేతలు, నీటిపారుల శాఖ అధికారులు కలిసి పనులు చేయకుండానే ఎంబుక్కులు రాసి నిధులు దిగమింగారని అధికార పార్టీ నాయకులే కోర్టు కెక్కారు. ఈ కుంభకోణంలో అధికారులు 30 శాతం, అధి కార పార్టీ నాయకులు 70 శాతం తినేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఇందులో కొన్ని విషయాలు బయటపడ్డాయి. దీంతో పాటు సర్వేపల్లి, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్,గూడూరు నియోజకవర్గాల్లో సైతం నీరు- చెట్టు పనుల్లో భారీ అవినీతి జరిగిం దని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ఆయన ఈ పనులన్నింటి మీద విచారణ జరిపించడానికి అధికారులను నియ మించారు. ఇదే సందర్భంలో రూ.70 కోట్లకు సంబంధించి పంపిన కొత్త పనుల ప్రతిపాదనలను కలెక్టర్ తిప్పి కొట్టారు. ఈ నిర్ణయాల మీద జిల్లా టీడీపీ నేతలకు చెప్పరాని కోపం వచ్చింది. పనులు చేసింది తమ పార్టీ వారే అయినప్పుడు వాటి మీద విచారణ ఎలా జరిపిస్తారనీ, కొత్త పనులకు ఆమోదం ఇవ్వకుండా వెనక్కు ఎలా పంపుతారని ఆ నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ విషయం నేరుగా కలెక్టర్‌తో మాట్లాడకుండా మంత్రి నారాయణ, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఇలాగే ఉంటే జిల్లాలో తాము పనిచేయలేమనీ,పార్టీని కూడా నడపలేమని కొందరు నాయకులు ఇటీవల సీఎంకు గట్టిగా చెప్పారని సమాచారం.అరుుతే ఈపీడీసీఎల్‌లో ముత్యాలరాజు అమలు చేసిన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వడం, మూడు నెలలు తిరక్కుండానే కలెక్టర్ మీద ఒత్తిడి పెంచడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోననే భయంతో సీఎం ఈ ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి వారి మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రి నారాయణకు సూచించారని తెలిసింది.