వయనాడ్‌ విలయం.. 206 మంది ఎక్కడ? | Wayanad Search Operation Continue Sixth Day Updates | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ విలయం.. 206 మంది ఎక్కడ?

Published Sun, Aug 4 2024 9:12 AM | Last Updated on Sun, Aug 4 2024 9:12 AM

Wayanad Search Operation Continue Sixth Day Updates

వయనాడ్‌ ప్రకృతి విలయానికి సంబంధించిన అప్‌డేట్స్‌.. 

👉వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి విలయం కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. వయనాడ్‌లో తాజాగా మృతుల సంఖ్యలో 357కు చేరుకుంది. ఇంకా 206 మంది ఆచూకీ తెలియటం లేదని అధికారులు చెబుతున్నారు.

👉ఆరో రోజు రెస్క్యూ బృందాలు సెర్చ్‌ ఆపరేషన్‌ కోసం ముందుకు సాగుతున్నాయి. 

 

 

 

👉ఇక, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో బురద, శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి అధునాతన రాడార్లను రప్పించి, గాలించిన తర్వాత సహాయక చర్యలు ముగుస్తాయి.

 

👉చెలియార్‌ నదిలో లభ్యమైన మృతదేహాలు, శరీర భాగాల్ని గుర్తించటం కష్టంగా మారింది. జిల్లాలో ఇప్పటివరకు 215 మృతదేహాల్ని వెలికితీశారు. ఇందులో 87 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 30 మంది చిన్నారులుగా గుర్తించారు.

👉ఇక​, కల్పేట ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కే హాషిస్‌ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించింది. అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకోగా, నాలుగున్నర గంటలపాటు శ్రమించి తాళ్ల సహాయంతో రెస్క్యూ బృందం కొండపైకి చేరుకొని గిరిజన కుటుంబాన్ని కాపాడింది.

👉వయనాడ్‌ బాధితులకు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటుడు మోహన్‌లాల్‌ ముందుకొచ్చారు. టెరిటోరియల్‌ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌ కర్నల్‌ హోదాలో ఉన్న ఆయన- సైనిక దుస్తుల్లో వచ్చి, విపత్తు ప్రాంతాన్ని సందర్శించి బలగాలతో సమావేశమయ్యారు. విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా రూ.3 కోట్ల విరాళాన్ని బాధితుల కోసం ఇస్తున్నట్లు తెలిపారు.

 

 

 

👉వయనాడ్‌ విపత్తులో ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక రోజంతా ఓ కుటుంబం చేసిన యుద్ధం వెలుగులోకి వచ్చింది. చూరల్‌మలలోని అంజిశచలయిల్‌ ప్రాంతానికి చెందిన సుజాత కుటుంబం ఒకే రోజు రెండు భయంకర అనుభవాలను ఎదుర్కొన్నది. కొండ చరియలు విరిగిపడటంతో ఈ కుటుంబం దగ్గరలో ఉన్న ఓ కొండపైకి చేరుకుని ఒక చిన్న గుహ లాంటి ప్రదేశంలో తలదాచుకున్నది.

 

 👉అయితే, వీరి పక్కనే ఒక అడవి ఏనుగుల మంద కూడా ఉన్నది. తమను ఏమీ చేయవద్దని ఏనుగులను ప్రార్థించామని, అవి తమ జోలికి రాలేదని సుజాత చెప్పారు. మరునాడు ఉదయం సహాయ సిబ్బంది వీరిని రక్షించారు. ప్రస్తుతం సుజాతతో పాటు ఆమె మనవరాలు మృదుల సురక్షితంగా ఉండగా, మిగతా కుటుంబసభ్యులు గాయాలతో చికిత్స పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement