విలయనాడ్‌: 200 దాటిన మృతుల సంఖ్య | Kerala Wayanad Landslides July 31 Telugu News Live Updates | Sakshi
Sakshi News home page

Wayanad Landslides: విలయనాడ్‌: 200 దాటిన మృతుల సంఖ్య

Published Wed, Jul 31 2024 7:48 AM | Last Updated on Wed, Jul 31 2024 8:59 PM

Kerala Wayanad Landslides July 31 Telugu News Live Updates

కేరళ వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 200 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. రక్షించిన వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  ప్రస్తుతం వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు భారీ వర్షంలోనే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు  విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం గురించి పినరయి విజయన్‌ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని వారం రోజుల ముందే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యంపై పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. 

కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో మంగళవారం వాయనాడ్ జిల్లాలో  కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించారు, మరో 200 మంది గాయపడ్డారు. ఇక 180 మంది గల్లంతవ్వగా వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

కేరళ వాయినాడ్‌లో  జరిగిన  ఘటనపై విచారం వ్యక్తం చేసిన  మంత్రి సీతక్క

  • కేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందామని పిలునిచ్చిన సీతక్క

  • ఆపదలో ఉన్నవారికి మానసిక ధైర్యాన్ని, మనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యత

  • వయనాడ్ లో వరదల వల్ల  కొండచరియలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు

  • అంత్యంత హృదయ విషాదకర ఘాటనతో ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నమైయ్యాయి

  • చేయి చేయి కలిపి కేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందాం

  • కాంగ్రెస్ పార్టీకి , నాకు కేరళ రాష్ట్రంతో ప్రత్యేక అనుబందం ఉంది

  • వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలునిచ్చిన మంత్రి

వయనాడ్‌తో పాటు మరో ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక.. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలో సర్వం కోల్పోయిన వాళ్ల కోసం ఆహారం, బట్టలు, మందులు అందించేందుకు, రక్తదానం కోసం.. ఆర్థిక సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ ప్రే ఫర్‌ వయనాడ్‌ లాంటి హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండ్‌ అవుతున్నాయి. 

  • చలియార్‌ నది నుంచి 15 మృతదేహాల్ని బయటకు తీసిన రెస్క్యూ టీంలు

  • నీలంబూర్‌ నుంచి ఐదు ఆంబులెన్స్‌లలో మృతదేహాలు మెప్పాడికి పయనం.. మృతదేహాల తరలింపు కోసం 28 ఆంబులెన్స్‌ల ఏర్పాటు

  • మృతుల సంఖ్య 168కి చేరిక

  • ముందక్కై గ్రామం శివారులోని ఎలా రిసార్ట్‌, వన రాణి రిసార్ట్‌లలో తలదాచుకున్న 19 మందిని రక్షించిన ఆర్మీ.. సురక్షిత ప్రాంతాలకు తరలింపు

  • యుద్ధ ప్రాతిపాదిక.. ముందక్కై చురాల్‌మల్‌ మధ్య వారధిని నిర్మాణం చేపట్టిన ఆర్మీ. వారిధి పూర్తైతే ఆంబులెన్స్‌లతో పాటు ఆహారం, తాగునీరు సరఫరా చేసేందుకు సిద్ధమైన అధికారులు

  • 481 మందిని రక్షించినట్లు ప్రకటించుకున్న సహాయక బృందాలు

 

 

 

యుద్ధ ప్రతిపాదికన రెస్యూ ఆపరేషన్‌

  • తాత్కాలిక వంతెనలతో పలువురిని రక్షించిన సహాయక బృందాలు

  • ఆర్మీ జాగిలాలతో శిథిలాల కింద తనిఖీలు

  • అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య

  • ప్రమాదకరస్థాయిలో కేరళ నదులు

  • గల్లంతైనవారిపై కేరళ సర్కార్‌ ఫోకస్‌

  • వివరాలు తెలుసుకుంటున్న జిల్లా యంత్రాంగం

  • ముందక్కైలో టీ ఎస్టేట్‌ కార్మికులు గల్లంతు

  • ప్రమాదం తర్వాత కనిపించని కార్మికులు

  • కార్మికుల్లో బెంగాల్‌, అసోంవాసులే ఎక్కువ

  • రేషన్‌కార్డు, ప్రభుత్వం దగ్గర  ఉన్న ఇతర సమాచారం ప్రకారం ఆరా

  • ఆచూకీ లేనివారి గురంచి హెల్ఫ్‌లైన్లకు వందల కొద్దీ కాల్స్‌

  • నీలంపూర దగ్గర కొన్ని మృతదేహాల గుర్తింపు

  • మరో 3 వేల మందిని రక్షించిన సహాయక బృందాలు
     

 

కేరళ కేబినెట్‌ ఎమర్జెన్సీ భేటీ

  • అత్యవసరంగా సమావేశమైన కేరళ మంత్రి మండలి

  • సీఎం విజయన్‌ అధ్యక్షతన జరుగుతున్న సమావేశం

  • వయనాడ్‌ విపత్తుపై చర్చ ప్రధాన ఏజెండాగా కొనసాగుతున్న భేటీ 

 

వయనాడ్‌ విపత్తుపై ఖర్గే రియాక్షన్‌

  • పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వయనాడ్‌ విపత్తుపై స్పందించిన నేతలు

  • వయనాడ్ వరదలు దురదృష్టకర సంఘటన, ఇది జాతీయ విపత్తు

  • వయనాడ్‌లో పరిస్థితిని చాలా సీరియస్‌గా తీసుకున్నాం.

  • రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ లో పర్యటిస్తారు.

  • పార్టీ కార్యకర్తలు పునరావాస పనుల్లో నిమగ్నమయ్యారు.

  • రాజ్యసభలో వయనాడ్ వరదల అంశాన్ని లేవనెత్తుతాం.

  • కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

  • వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి.

:::మల్లికార్జున ఖర్గే ,కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్.

 

ఎటు చూసిన బురద.. ఆర్తనాదాలే

  • కేరళలోని వయనాడ్‌ జిల్లా మెప్పాడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 

  • కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి

  • . వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు.  

  • ఎటుచూసినా.. అయిన వాళ్ల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, మూగ జీవాలను కోల్పోయి ఏడుస్తున్న దృశ్యాలు అగుపిస్తున్నాయి

  • సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న వాళ్లూ కనిపిస్తున్నారు

  • మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల(అసోం, బెంగాల్‌కు చెందినవాళ్లే ఎక్కువ) ఆచూకీ దొరకడం లేదు.

కేరళ ఆరోగ్య మంత్రికి ప్రమాదం.. స్వల్ప గాయాలు

  • కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

  • వయనాడ్‌ సహాయక చర్యల పరిశీలనకు వెళ్తుండగా జరిగిన ప్రమాదం

  • మంజేరి వద్ద స్కూటీతో మంత్రి వాహనం ఢీ

  • వీణా జార్జ్‌కు స్వల్ప గాయాలు..  ఆసుపత్రికి తరలింపు 

     

 

VIDEO Credits:  Lokmat Times

 

  • వయనాడ్‌లో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

  • కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 156 చేరిన మృతుల సంఖ్య

 

 

  • సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గ్రామస్థులంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమైంది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. 

  • బురద మట్టిలో కూరుకుపోయిన గ్రామస్థులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. తొలుత ముందక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారమందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంత మంది బాధితులను సమీపంలోని చూరాల్‌మలలోని వెల్లారిమల పాఠశాలవద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. 

  • మంగళవారం తెల్లవారుజామున 4.10 గంటలకు ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరంసహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. 

  • చుర్మలమల గ్రామంలోని కొంత భాగం తుడిచి పెట్టుకుపోయింది. 

  • ముందక్కైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. 

 


కేరళ జల విలయం

  • వయనాడులో 150 దాటిన మృతుల సంఖ్య

  • సహాయక చర్యలు ముందుకు సాగే కొద్ది.. బయటపడుతున్న మృతదేహాలు

  • గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

  • వరదల్లో కిలోమీటర్ల దూరం వరకు చలియార్ నదిలో కొట్టుకుపోయిన మృతదేహాలు

  • టీ గార్డెన్లలో పనిచేస్తున్న 600 మంది కార్మికుల ఆచూకీ గల్లంతు

  • ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్న ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ , ఎన్డీఆర్ఎఫ్

  • ముందకై , చూరల్మల లో భారీ ఎత్తున  ప్రాణ నష్టం

  • చూరల్మలలో వంతెన కొట్టుకుపోవడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం

  • తాత్కాలిక వంతెన నిర్మించిన ఎన్ డి ఆర్ ఎఫ్, ఆర్మీ

  • మరో నాలుగు రోజులపాటు వయనాడు సహా నాలుగు జిల్లాలలో భారీ వర్షాలు

  • వయనాడుకు  ఎవరూ రావొద్దని కోరిన కేరళ సీఎం పినరయ్ విజయన్ విజ్ఞప్తి 

  • ఈ నేపథ్యంలోరాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా

  • అరేబియా సముద్రం వేడెక్కాడంతో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు

  • అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ భారీ వర్షం పడిందంటున్న వాతావరణ నిపుణులు

  • కొండ చరియలు విరిగిపడే ప్రమాదాన్ని ముందే పసిగట్టే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్న నిపుణులు

 

వయనాడ్‌ తొలిరోజు రెస్క్యూ ఆపరేషన్‌లో.. 

  • మరణాలు: 151 (తాజా ప్రకటనతో కలిపి)

  • రక్షించింది: 481 మంది

  • గుర్తించిన మృతదేహాలు:39 మాత్రమే

  • బంధువులకు అప్పగించిన మృతదేహాలు: 32

  • చలియార్‌ నది నుంచి 31 మృతదేహాల సేకరణ

  • ఆస్పత్రిలో చేరిన వాళ్ల సంఖ్య: 128

  • వయనాడ్‌ రిలీఫ్‌ క్యాంప్‌ల సంఖ్య: 45

  • రిలీఫ్‌ క్యాంప్‌కి చేరింది: 3,069

  • మిస్సింగ్‌: 98 (అధికారిక ప్రకటన)

400 కుటుంబాల జాడపై ఇంకా స్పష్టత రాలేదు. ఉత్తరాధి నుంచి వలస వచ్చిన కూలీల పరిస్థితిపై వాళ్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

రాహుల్‌, ప్రియాంక పర్యటన వాయిదా
వయనాడ్‌ విలయం గురించి తెలియగానే.. అక్కడి మాజీ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పినరయి విజయన్‌తో పాటు వయనాడ్‌ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారాయన. నిన్న సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి విపత్తు ప్రాంతంలో సందర్శించాలనుకున్నారు. అయితే.. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో త్వరలో ఆయన అక్కడకు వెళ్లనున్నట్లు సమాచారం. 

 

సుమోటోగా ఘటన
వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ (NGT) దక్షిణాది ధర్మాసనం సుమోటోగా విచారణకు తీసుకుంది. జ్యుడీషియల్‌ సభ్యురాలు పుష్ప సత్యనారాయణ, నిపుణుల సభ్యుడు సత్యగోపాల్‌ ధర్మాసనం మంగళవారం కేరళ ప్రమాద ఘటనపై ఆవేదన వ్యక్తం చేసింది. దీనిని సుమోటోగా విచారించనున్నట్లు తెలిపింది. త్వరలో ఈ కేసును జాబితాలో చేర్చాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. 

ముందే పసిగట్టలేమా?
కొండచరియలు విరిగి పడటం ముందే గుర్తించవచ్చు. ఇలాంటి ఘటనలు జరగడానికి ముందు.. ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతటవే బిగుసుకుపోవడం, నేలలో గోడల్లో పగుళ్లు రావడం, గోడలు కదలటం, స్తంభాలు, వృక్షాలు పక్కకు వరగడం, కొండల నుంచి కొద్ది కొద్దిగా మట్టి రాలటం, శిలలు పడటం వంటివి సహజ సూచికలని నిపుణులు అంటున్నారు. వయనాడ్‌ ప్రమాదం నేపథ్యంలో.. కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని ముందే పసిగట్టి హెచ్చరించే వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు, నిపుణులు మంగళవారం సూచించారు. అయితే.. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అనుకున్నంత సులువుకాదని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మాజీ కార్యదర్శి మాధవన్‌ రాజీవన్‌ అంటున్నారు.

సముద్రం వేడెక్కి..
మానవ తప్పిదాలే దైవభూమి కష్టాలకు కారణమనే చర్చ జరుగుతుండగా.. వయనాడ్‌ విషాదానికి అరేబియా సముద్రం వేడెక్కడమూ ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్ర ఉష్ణోగ్రత దట్టమైన మేఘ వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తోందని, ఈ కారణంగా కేరళలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షాలు పడి కొండచరియలు విరిగిపడే అవకాశాలు పెరుగుతున్నాయంటున్నారు. 

ప్రాణాలు చేతపట్టుకుని. .

వయనాడ్‌ విలయంలో వెల్లువెత్తిన బురద ప్రవాహంలో చిక్కిన ఓ వృద్ధుడు గంటల కొద్దీ ఒక పెద్ద బండరాయిని ఆధారంగా పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. స్థానికులు అతని ఆర్తనాదాలు విని కూడా వరద ప్రవాహ తీవ్రత కారణంగా ఏమీ చేయలేకపోయారు. దాంతో వృద్ధుడు జోరు వానలో, వరద ప్రవాహం నడుమ గంటల పాటు బండరాయి చాటునే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చివరికి సహాయక బృందాలు చాలాసేపు శ్రమించి ఆయన్ను కాపాడాయి. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి.

ఎటు చూసినా.. 
విలయనాడ్‌ బాధిత గ్రామాల ప్రజల ఆర్తనాదాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తమవారి కోసం వారు పడే ఆరాటం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున అక్కడ కొండచరియలు విరిగిపడి బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు. వారు తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని విలపించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫోన్‌ సంభాషణలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి.

పెనువిషాదం
సోమవారం అర్ధరాత్రి దాటాక ఆ ప్రాంతమంతటా భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వెల్లువెత్తిన బురద, ప్రవాహం ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. గ్రామాలతో పాటు సహాయ శిబిరాలు కూడా బురద ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఎటుచూసినా అంతులేని బురదే కప్పేసింది. దాంతో గాఢ నిద్రలో ఉన్న వందలాది మంది తప్పించుకునే అవకాశం కూడా లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. 

మెప్పాడి ప్రాంతంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండ ప్రాంతమంతా తడిసీ తడిసీ వదులుగా మారిపోయింది. అర్ధరాత్రి వేళ కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముందక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజా తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement