వయనాడ్‌ విలయం.. 316కు చేరిన మరణాలు | Rescue Operations Continue In Kerala Wayanad Live Updates | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలు..

Published Fri, Aug 2 2024 7:26 AM | Last Updated on Fri, Aug 2 2024 1:57 PM

Rescue Operations Continue In Kerala Wayanad Live Updates

Updates..

 👉వయనాడ్‌లో మెప్పాడీలోని రిలీఫ్‌ క్యాంపులో సీపీఎం, కాంగ్రెస్‌, ఐయూఎంఎల్‌కు చెందిన డీవైఎఫ్‌ఐ, యూత్‌ కాంగ్రెస్‌, యూత్‌ లీగ్‌ వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

 

  • వయనాడ్‌లో మలయాళ మనోరమ ఒక రిలీఫ్ డ్రైవ్‌ను ప్రారంభించింది.
  • బాధిత ప్రాంతాలకు 10 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సామాగ్రిని పంపింది.
  • బేబీ మెమోరియల్ హాస్పిటల్ నుండి 20 మంది సభ్యుల వైద్య బృందాన్ని కూడా వయనాడ్‌ పంపారు.
  • ఇక, వయనాడ్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, కోస్ట్ గార్డ్‌తో పాటు భారత సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటోంది.
  • సహయక చర్యలను సమన్వయం చేసేందుకు కోజికోడ్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
  • ప్రస్తుతం వాయనాడ్ అంతటా 7,000 మందికి పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఉన్నారు.
  • ఈ శిబిరాలు కొండచరియలు విరిగిపడటంతో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం, ప్రాథమిక అవసరాలు కల్పిస్తున్నాయి.
  • కేరళ ప్రభుత్వం, స్థానిక వాలంటీర్లతో పాటు, బాధితులను రక్షించడం, వారికి మానసికంగా మద్దతు అందించడంపై దృష్టి సారిస్తోంది.

 

 

విపత్తు బాధితుల కోసం ఐసీయూలు ఏర్పాటు..

  • ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ కామెంట్స్‌..
  • విపత్తు ప్రాంతాల నుండి రక్షించబడిన వారి కోసం ఐసీయూలో ఏర్పాటు చేస్తున్నాము.  
  • ఇంటెన్సివ్ కేర్ అందించడానికి వయనాడ్ ఆసుపత్రులలో ఐసీయూలు సిద్ధంగా ఉన్నాయి.
  • మంజేరి మెడికల్ కాలేజ్, కోజికోడ్ మెడికల్ కాలేజీ సహా ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేశాం.
  • ఇవి ఎయిర్ లిఫ్ట్ ద్వారా చేరుకోవచ్చు.
  • ఇప్పటి వరకు 199 మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది.
  • ఇది కాకుండా, 130 బాడీలకు డీఎన్‌ఏ నమూనాలను కూడా తీసుకున్నారు 

 

 

 👉వయనాడ్‌లో నలుగురిని కాపాడిన ఆర్మీ రెస్క్యూ టీమ్‌.

👉పడవెట్టికన్నులో శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు బాధితులు.

👉హెలికాప్టర్‌ సాయంతో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌

👉నలుగురిని కాపాడిన భారత సైన్యం.

👉డ్రోన్‌ రాడార్లతో మృత్యుంజయల కోసం ఆర్మీ అన్వేషణ. 
 

 

 

👉వయనాడ్‌ విపత్తులో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 316కు చేరుకుంది. 

 

 👉 రెస్క్యూ టీమ్స్ ఇంకా చేరుకోలేదు: కేరళ గవర్నర్
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెల్లవారుజామున మొట్టమొదట కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి ఇప్పటికీ రెస్క్యూ టీమ్స్ చేరుకోలేదని ఆయన కామెంట్స్‌. కొండచరియలు విరిగిపడటంతో చలియార్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకొని.. పక్కనే ఉన్న ఓ గ్రామాన్ని ముంచేసిందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధంగా తుడిచి పెట్టుకుపోయిన గ్రామానికి ఇంకా రెస్క్యూ టీమ్స్ చేరుకోలేకపోవడం బాధాకరమని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తెలిపారు. ఆ గ్రామాన్ని చేరుకోవడానికి ఆర్మీ ఇంజినీరింగ్ విభాగం ఒక పోర్టబుల్ వంతెనను నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అది పూర్తయితేనే అక్కడికి రెస్క్యూ టీమ్స్ చేరుతాయి అని ఆయన చెప్పుకొచ్చారు. 

 

👉కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 289కి చేరుకుంది. వయనాడ్‌లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, అక్కడ ఇంకా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

మరోవైపు.. వయానాడ్‌లో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి వైద్యులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. అక్కడి హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవ పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులను చూపిస్తోంది

👉ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నా. ఎన్నో మృతదేహాలకు పోస్టుమార్టం చేశాను. ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఓ శరీరం చూస్తే మొత్తం ఛిద్రమైంది. రెండో దాన్ని చూడలేకపోయా. అది ఏడాది చిన్నారిది. అటువంటి మృత దేహాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. అందులో అనేకం గుర్తించలేనంతగా ఉండటం కలచివేసింది. ఇక పోస్టుమార్టం చేయలేనని అనుకున్నా. ఆ ప్రాంగణం నుంచి బాధితుల సంరక్షణ కేంద్రానికి పారిపోదామనుకున్నా. కానీ ప్రత్యామ్నాయం లేదు. అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించాను’ అంటూ కన్నీరు పెటుకున్నారు.

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement