disaster areas
-
రేపు వయనాడ్‌కు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా..
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(శనివారం) వయనాడ్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని మోదీ. అనంతరం, బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలను కూడా సందర్శించనున్నారు.కాగా, కేరళలోని వయనాడ్‌లో సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు ప్రధాని మోదీ రేపు వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోదీ రేపు ఉదయం 11 గంటలకు కేరళలోని కన్నూరుకు చేరుకుంటారు. వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేస్తారు. అలాగే, మధ్యాహ్నం 12:15 గంటలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం, బాధితులను, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కలుస్తారు. ఇదే సమయంలో వయనాడ్‌లో జరుగుతున్న పునరావాస పనులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తారు. కాగా, బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని కూడా ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అక్కడ జరిగిన పరిణామం, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి అధికారులు వివరించనున్నారు. ఇదిలా ఉండగా.. వయనాడ్‌లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 400 మందికిపైగా ప్రజలు మృతిచెందగా.. మరో 200 మంది ఆచూకీ లభించలేదు. ఇక, గురువారంతో వయనాడ్‌లో సహాయక చర్యలు ముగిశాయి. భారత సైన్యం కూడా వయనాడ్ నుంచి వెళ్లిపోయింది. మరోవైపు.. వయనాడ్ విపత్తను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు మోదీ.. వయనాడ్‌కు వస్తున్న సందర్భంగా జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా? లేదా? అనే అంశంపై చర్చ నడుస్తోంది. -
వయనాడ్ విలయం.. 316కు చేరిన మరణాలు
Updates.. 👉వయనాడ్‌లో మెప్పాడీలోని రిలీఫ్ క్యాంపులో సీపీఎం, కాంగ్రెస్, ఐయూఎంఎల్‌కు చెందిన డీవైఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్, యూత్ లీగ్ వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.Volunteers from DYFI,SFI, Youth Congress , Youth league, etc.. --- youth organisations linked with CPI(M), Congress, IUML, cleaning the Meppadi school relief camp together.#Kerala #WayanadLandslide pic.twitter.com/LD16fDHFwj— Korah Abraham (@thekorahabraham) August 2, 2024 వయనాడ్‌లో మలయాళ మనోరమ ఒక రిలీఫ్ డ్రైవ్‌ను ప్రారంభించింది.బాధిత ప్రాంతాలకు 10 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సామాగ్రిని పంపింది.బేబీ మెమోరియల్ హాస్పిటల్ నుండి 20 మంది సభ్యుల వైద్య బృందాన్ని కూడా వయనాడ్ పంపారు.ఇక, వయనాడ్‌లో ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్‌తో పాటు భారత సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటోంది.సహయక చర్యలను సమన్వయం చేసేందుకు కోజికోడ్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ప్రస్తుతం వాయనాడ్ అంతటా 7,000 మందికి పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఉన్నారు.ఈ శిబిరాలు కొండచరియలు విరిగిపడటంతో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం, ప్రాథమిక అవసరాలు కల్పిస్తున్నాయి.కేరళ ప్రభుత్వం, స్థానిక వాలంటీర్లతో పాటు, బాధితులను రక్షించడం, వారికి మానసికంగా మద్దతు అందించడంపై దృష్టి సారిస్తోంది. Salute to Madras Engineering Group of Indian Army who completed the 190 ft long critical Bailey bridge #Wayanad in record 16 hrs .Bharat Mata ki Jai chants heard after the mamath task was completed. Bridge can carry weight of 24 tons & will help connect with worst-affected… pic.twitter.com/myv52i9GGD— Bavachan Varghese (@mumbaislifeline) August 2, 2024 విపత్తు బాధితుల కోసం ఐసీయూలు ఏర్పాటు..ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ కామెంట్స్..విపత్తు ప్రాంతాల నుండి రక్షించబడిన వారి కోసం ఐసీయూలో ఏర్పాటు చేస్తున్నాము. ఇంటెన్సివ్ కేర్ అందించడానికి వయనాడ్ ఆసుపత్రులలో ఐసీయూలు సిద్ధంగా ఉన్నాయి.మంజేరి మెడికల్ కాలేజ్, కోజికోడ్ మెడికల్ కాలేజీ సహా ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేశాం.ఇవి ఎయిర్ లిఫ్ట్ ద్వారా చేరుకోవచ్చు.ఇప్పటి వరకు 199 మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది.ఇది కాకుండా, 130 బాడీలకు డీఎన్ఏ నమూనాలను కూడా తీసుకున్నారు Wayanad landslide | ICUs are ready in Wayanad hospitals to provide intensive care to those rescued from the disaster areas. Hospitals including Manjeri Medical College and Kozhikode Medical College, which can be reached by airlift, have also been set up. So far, the post-mortem…— ANI (@ANI) August 2, 2024 👉వయనాడ్‌లో నలుగురిని కాపాడిన ఆర్మీ రెస్క్యూ టీమ్.👉పడవెట్టికన్నులో శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు బాధితులు.👉హెలికాప్టర్ సాయంతో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్👉నలుగురిని కాపాడిన భారత సైన్యం.👉డ్రోన్ రాడార్లతో మృత్యుంజయల కోసం ఆర్మీ అన్వేషణ. #WATCH | Kerala: Latest visuals of the Dog squad conducting search and rescue operations in Wayanad's Chooralmala. A landslide that occurred here on 30th July, claimed the lives of 308 people. pic.twitter.com/jWvqQDHWQh— ANI (@ANI) August 2, 2024 👉వయనాడ్ విపత్తులో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 316కు చేరుకుంది. #WATCH | Kerala: Search and rescue operations continue at landslide-affected Chooralmala in Wayanad.The current death toll stands at 308, as per Kerala Health Minister Veena George pic.twitter.com/CY0iOuPHf4— ANI (@ANI) August 2, 2024 👉 రెస్క్యూ టీమ్స్ ఇంకా చేరుకోలేదు: కేరళ గవర్నర్వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెల్లవారుజామున మొట్టమొదట కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి ఇప్పటికీ రెస్క్యూ టీమ్స్ చేరుకోలేదని ఆయన కామెంట్స్. కొండచరియలు విరిగిపడటంతో చలియార్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకొని.. పక్కనే ఉన్న ఓ గ్రామాన్ని ముంచేసిందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధంగా తుడిచి పెట్టుకుపోయిన గ్రామానికి ఇంకా రెస్క్యూ టీమ్స్ చేరుకోలేకపోవడం బాధాకరమని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తెలిపారు. ఆ గ్రామాన్ని చేరుకోవడానికి ఆర్మీ ఇంజినీరింగ్ విభాగం ఒక పోర్టబుల్ వంతెనను నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అది పూర్తయితేనే అక్కడికి రెస్క్యూ టీమ్స్ చేరుతాయి అని ఆయన చెప్పుకొచ్చారు. 👉కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 289కి చేరుకుంది. వయనాడ్‌లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, అక్కడ ఇంకా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.మరోవైపు.. వయానాడ్‌లో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి వైద్యులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. అక్కడి హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవ పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులను చూపిస్తోంది#wayanad disaster was the serious reminder. Not to obstruct natures pathways for human greed. Moreover I see many tipper lorries carrying raw materials towards #Kerala Kumily, Vagamon to build houses. Remember the fate of many families before you construct houses on ghat sections pic.twitter.com/h2LyWOLX3l— Harry Callahan (@Golti_Slayer) August 2, 2024👉ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నా. ఎన్నో మృతదేహాలకు పోస్టుమార్టం చేశాను. ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఓ శరీరం చూస్తే మొత్తం ఛిద్రమైంది. రెండో దాన్ని చూడలేకపోయా. అది ఏడాది చిన్నారిది. అటువంటి మృత దేహాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. అందులో అనేకం గుర్తించలేనంతగా ఉండటం కలచివేసింది. ఇక పోస్టుమార్టం చేయలేనని అనుకున్నా. ఆ ప్రాంగణం నుంచి బాధితుల సంరక్షణ కేంద్రానికి పారిపోదామనుకున్నా. కానీ ప్రత్యామ్నాయం లేదు. అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించాను’ అంటూ కన్నీరు పెటుకున్నారు. Scary Visual From Wayanad Kerala. #WayanadLandslide pic.twitter.com/WnE3rlVD3L— Iyarkai (@iyarkai_earth) July 30, 2024 From Wayanad the Western Ghat have been completely destroyed,common people have with various agencies talking rescue action at Wayanad landslide disaster.🥲🥲Please save peoples🙏🙏#WayanadLandslide#WayanadDisaster #KeralaRains pic.twitter.com/gflHy9Nvi0— Suman Meena (@SumanNaresh4) August 1, 2024 Our beautiful state under devastation Please pray for Wayanad safety 🙏Please Repost it and follow us for flood updates in kerala pic.twitter.com/ygO44ge4jB— Go Kerala (@Gokerala_) July 31, 2024 -
అమెరికా భూమికి పగుళ్లు!
అగ్రరాజ్యం అమెరికాకు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ నేలపై పుట్టుకొస్తున్న మైళ్ల కొద్దీ పొడవైన భారీ పగుళ్లు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పొంచి ఉన్న పెను ఉత్పాతాలకు ఇది బహుశా ముందస్తు సంకేతం మాత్రమే కావొచ్చన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింత భయం పుట్టిస్తున్నాయి. పర్యావరణంతో ఇష్టారాజ్యంగా చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో ఆ దేశానికిప్పుడు బాగా తెలిసొస్తోంది! అమెరికా అతి పెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ నేల నిట్టనిలువుగా చీలుతోంది. అది కూడా చిన్నాచితకా సైజులో కాదు! మైళ్ల పొడవునా, మీటర్ల వెడల్పులో పగుళ్లిస్తోంది. ఫిషర్స్గా పేర్కొనే ఈ చీలికలు దశాబ్దాలుగా భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్న తాలూకు దుష్పరిణామమేనని పర్యావరణవేత్తలు మాత్రమే గాక భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమంటూ ఇప్పుడు తీరిగ్గా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు! పగుళ్లు ఎక్కడెక్కడ? ► అరిజోనా, ఉతా, కాలిఫోరి్నయా రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ► ముఖ్యంగా అరిజోనాలో 2002 నుంచే ఈ తరహా పగుళ్లు వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న పగుళ్లు పరిమాణంలో గానీ, సంఖ్యలో గానీ ముందెన్నడూ చూడనివి కావడమే కలవరపరుస్తున్న అంశం. జాతీయ సంక్షోభమే: న్యూయార్క్ టైమ్స్ ఈ పగుళ్లు ఇప్పుడు జాతీయ సంక్షోభం స్థాయికి చేరాయని న్యూయార్క్ టైమ్స్ మీడియా గ్రూప్ పరిశోధక బృందం తేల్చడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సర్వే ఏం చెప్పిందంటే... ► అమెరికాలో 90 శాతానికి పైగా జల వనరులకు ప్రధాన ఆధారమైన జల ధారలు శరవేగంగా ఎండిపోతున్నాయి. ► ఎంతగా అంటే, అవి కోలుకోవడం, బతికి బట్ట కట్టడం ఇక దాదాపుగా అసాధ్యమే! ► సర్వే బృందం పరిశీలించిన సగానికి సగం చోట్ల భూగర్భ జల ధారలు గత 40 ఏళ్లలో చెప్పలేనంతగా చిక్కిపోయాయి. ► 40 శాతం ధారలైతే కేవలం గత పదేళ్లలో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. ► వాయవ్య అమెరికావ్యాప్తంగా అతి ప్రధాన మంచినీటి వనరుగా ఉంటూ వస్తున్న కొలరాడో నది కేవలం గత 20 ఏళ్లలో ఏకంగా 20 శాతానికి పైగా కుంచించుకుపోయింది. ► గ్లోబల్ వారి్మంగ్ తదితర పర్యావరణ సమస్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భూగర్భ జలమే ముఖ్య ఆధారం మనిషుల నీటి అవసరాలను తీర్చడంలో భూగర్భ జలం కీలకంగా మారింది. ఎంతగా అంటే... ► ప్రపంచ తాగునీటి అవసరాలూ సగం భూగర్భ జలంతోనే తీరుతున్నాయి. ► ఇక 40% సాగునీటి అవసరాలకు ఇదే ఆధారం. ► అయితే, అసలు సమస్య భూగర్భ జలాలను తోడేయడం కాదు. వెనుకా ముందూ చూసుకోకుండా విచ్చలవిడిగా తోడేయడమే అసలు సమస్య. అంత వేగంగా భూమిలోకి నీరు తిరిగి చేరడం లేదు. ఏం జరుగుతోంది? ► భూగర్భం నుంచి నీటిని విచ్చలవిడిగా తోడేయడం నేల కుంగిపోవడానికి దారితీస్తోంది. ► అదే చివరికిలా పగుళ్లుగా బయట పడుతోంది. ► ఫిషర్లుగా పిలిచే ఈ పగుళ్లు సాధారణంగా పర్వతాల మధ్య ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ► వీటితో ఇళ్లకు, రోడ్లకు, కాల్వలకు, డ్యాములకు తదితరాలకు నష్టం అంతా ఇంతా కాదు. ► చాలాసార్లు ఈ భారీ పగుళ్ల వల్ల ఊహించలేనంతగా ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చు. పశు సంపదకు కూడా నష్టం కలగవచ్చు. ఇవి ప్రాకృతికంగా జరుగుతున్న పరిణామాలు కావు. నూటికి నూరు శాతం మనుషుల తప్పిదాలే ఇందుకు కారణం’’ – జోసెఫ్ కుక్, పరిశోధకుడు, అరిజోనా జియాలాజికల్ సర్వే – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెక్సాస్‌పై మంచు దుప్పటి
డల్లాస్: అమెరికా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా టెక్సాస్ మంచు పంజా బారినపడి గజగజలాడుతోంది. తీవ్రంగా వీస్తున్న మంచు తుఫాను గాలుల ధాటికి టెక్సాస్‌లో పవర్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రం నుంచి పలు విమానాలను రద్దు చేశారు. డల్లాస్, హూస్టన్ నగరాలల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ల్లోకి పడిపోయాయి. హిమపాతం సమయంలో ఇతర ప్రమాదాలు నివారించేందుకు టెక్సాస్ విద్యుత్ శాఖ(ఎర్కాట్) పలు ప్రాంతాల్లో కరెంటు కోతలను ఆరంభించింది. ప్రజలు సురక్షితంగా ఉండడమే ప్రధానమని, ఈ సమయంలో విద్యుత్ వాడకం తగ్గించేందుకే కోతలు విధిస్తున్నామని తెలిపింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా ఉండేందుకే ఈ కోతలని తెలిపింది. కోతల కారణంగా దాదాపు 23 లక్షల మంది ప్రభావితమయ్యారని వెబ్సైట్లు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు నగరాల్లో కరెంటు కోతలు, ట్రాఫిక్ కష్టాలపై అధికారులు ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 254 కౌంటీలకు గవర్నర్ గ్రెగ్ అబాట్ డిజాస్టర్ డిక్లరేషన్ జారీ చేశారు. ఎక్కడికక్కడ నేషనల్ గార్డ్ యూనిట్లను సమాయత్తం చేశారు. టెక్సాస్‌లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు జోబైడెన్ ఆదివారం రాత్రి ప్రకటించారు. -
నాలుగు కాళ్ల రోబో వచ్చేసింది!
టోక్యో: కొత్త కొత్త రోబోల తయారీకి పెట్టింది పేరైన జపాన్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ నాలుగు కాళ్ల రోబోను తయారుచేశారు. వేగాన్నిబట్టి దానంతట అదే నడిచే పద్ధతిని మార్చుకోడం... అంటే అవసరమైతే రెండు కాళ్ల మీద కూడా నడవడం ఈ రోబో ప్రత్యేకతగా చెబుతున్నారు. విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం ఈ రోబోను ఉపయోగించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఇది కేవలం నడవడం, పరిగెత్తడమే కాకుండా కొండలు, గుట్టలు, గోడలు, కంచెల వంటివాటిని సులభంగా ఎక్కేస్తుందని వీటి తయారీదారులైన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ఇది కొంత ఇబ్బంది పడుతోందని, పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ప్రోగ్రామ్ ద్వారా నడిచే ఈ రోబోకు తుది మెరుగులు దిద్దాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతానికి వేగాన్ని అంచనా వేసుకుంటూ నడక స్టయిల్‌ను మార్చుకునే వరకు విజయవంతంగా ప్రయోగించారు. అయితే మిగతా పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించుకోవడం, అవసరమైన సహాయాన్ని చేసేలా దీన్ని తీర్చిదిద్దేందుకు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.