తిరువనంతపురం: వయనాడులో ప్రకృతి విలయం దేశ ప్రజలు భయభ్రాంతులకు గురి చేసింది. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 275 మంది మృతిచెందారు. ఇక, ఈ ఘటనపై ముందుగానే కేరళను హెచ్చరించామని కేంద్రం చెబుతుండగా.. తమకు ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అమిత్ షా ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉందన్నారు.
కాగా, పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి వీణా జార్జ్ స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ..‘కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేంద్రం నుంచి తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు రాలేదు. కేంద్రం నుంచి వచ్చిన అన్ని సందేశాలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొండచరియలు విరిగిపడటంపై ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదు. కేవలం జిల్లా యంత్రాంగం ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చింది. దీని ఆధారంగా వయనాడ్ యంత్రాంగం నివారణ చర్యలను చేపట్టింది. అనేక మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది’ అని తెలిపారు.
#WATCH | On Union HM Amit Shah's statement, Kerala Health Minister Veena George says, "...It is quite unfortunate that such a statement has been made. The District Disaster Management Authority has all the data. There are landslide-prone areas everywhere in Kerala..." https://t.co/ZLDRzokgnt pic.twitter.com/R90zmWKBV2
— ANI (@ANI) August 1, 2024
ఇదిలా ఉండగా.. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేరళ విపత్తుపై అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్బంగా అమిత్ షా..‘కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించాం. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశాం. దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసి.. కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపింది. కానీ, కేరళ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సకాలంలో ప్రజలను తరలించలేదు. విజయన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఉంటే మరణాలు తప్పేవి. ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment