23 మంది కార్మికులను రక్షించిన వాయుసేన | indian air force rescued 23 in medak district floods | Sakshi
Sakshi News home page

23 మంది కార్మికులను రక్షించిన వాయుసేన

Published Sun, Sep 25 2016 10:15 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

indian air force rescued 23 in medak district floods

పాపన్నపేట(మెదక్): మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాల్సన్‌పల్లి శివారులో వరదలో చిక్కుకుపోయిన 23 మంది కార్మికులను ఆదివారం ఉదయం భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. శనివారం మధ్యప్రదేశ్, ఒడిశాకు చెందిన 23 మంది కార్మికులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు.

వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ బృందాలు శనివారం వాతవరణం అనుకూలించకపోవడంతో ఆదివారం ఉదయం వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement