బెంగళూరు: రూ.6 కోట్ల అవినీతి కేసులో ముందస్తు బెయిల్ పొందిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్పకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కమలం పార్టీ కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపించారు. బాణసంచా పేల్చి హంగామా చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చలోక్తులు విసిరారు. దేశాన్ని ఉద్దరించిన వాళ్లకు కూడా ఇలాంటి స్వాగతం లభించదురా నాయనా? అని నవ్వుకుంటున్నారు. దేశం కోసం ధర్మం కోసం అంటే ఇదేనంటారా? అని సెటైర్లు వేశారు.
Celebration after MLA was given a bail after his son Prashanth Madal was caught red-handed by the Lokayukta police while accepting Rs 40 lakh bribe, The Lokayukta police also seized Rs 6 crore in cash during the searches his house.pic.twitter.com/WFSWPuE8RK
— Mohammed Zubair (@zoo_bear) March 7, 2023
కాగా.. విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్తా అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. ఆరోజే విరూపాక్షప్ప నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.6కోట్ల అక్రమ నగదు, ఆభరణాలు గుర్తించారు.
కుమారుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా విరూపాక్షప్ప మాత్రం ఇందులో తన ప్రమేయం లేదని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జంట్స్ లిమిటెడ్ ఛైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ తర్వాత ఈ కేసులో అరెస్టు నుుంచి రక్షణ కల్పించేలా కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ సందర్భంగానే పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.
చదవండి: 44 ఏళ్ల వ్యాపారవేత్తతో 26 ఏళ్ల యువకుడి రిలేషన్.. పెళ్లి కుదిరినా అందుకు ఒప్పుకోలేదని దారుణంగా..
Comments
Please login to add a commentAdd a comment