రాసలీలల కేసు: ‘నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంటికి రా’ | Ramesh Jarkiholi Indecent Video Family Files Complaint And Her Life in Danger | Sakshi
Sakshi News home page

రాసలీలల కేసు: ‘నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంటికి రా’

Published Wed, Mar 17 2021 1:24 PM | Last Updated on Wed, Mar 17 2021 4:27 PM

Ramesh Jarkiholi Indecent Video Family Files Complaint And Her Life in Danger - Sakshi

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్‌ జార్కిహోళి రాసలీలల వీడియో కలకలం సృష్టించింది. ఉద్యోగం ఇప్పిస్తానని జార్కిహోళి తనను మోసగించాడని సదరు యువతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక వీడియో వెలుగులోకి వచ్చిన నాటి నుంచి సదరు యువతి అజ్ఞాతంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెని అపహరించారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు మంగళవారం బెలగావి ఏపీఎంసీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 363, 368, 343, 346, 354, 506ల కింద కేసు నమోదు చేశారు.

అంతేకాక యువతి తల్లిదండ్రులు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీనిలో వారు తమ కుమార్తె ప్రమాదంలో ఉందని.. ఆమె ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో బయటకు వచ్చిన నాటి నుంచి తమ కుమార్తెను చూడలేదని తెలిపారు. యువతి తండ్రి బెలగావిలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇక చివరి సారి తన కుమార్తెతో మాట్లాడిన సంభాషణను కూడా వెల్లడించారు. ‘‘టీవీలో ఆ వీడియో ప్రసారం కాగానే నేను నా కుమార్తెకి కాల్‌ చేశాను. 
యువతి తండ్రి:  టీవీలో ఓ వీడియో వస్తుంది.. దానిలో ఉన్న యువతి చూడటానికి అచ్చం నీలానే ఉంది.
యువతి: వీడియో గురించి నాకు ఏం తెలియదు. అందులో ఉన్నది నేను కాదు.. అది ఫేక్‌ వీడియో అయి ఉండొచ్చు. నేను ఏ తప్పు   చేయలేదు.
యువతి తండ్రి:   నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంటికి రా.
యువతి: రాలేను.

అని చెప్పి కాల్‌ కట్‌ చేసింది. ఆ తర్వాత ఓ సారి ‘‘నేను క్షేమంగానే ఉన్నాను.. నన్ను కాంటాక్ట్‌ చేయడానికి ప్రయత్నించకండి’’ అంటూ మెసేజ్‌ చేసింది. అదే తనతో చివరి సంభాషణ. ఆ తర్వాత తన మొబైల్‌ కూడా స్విచ్ఛాఫ్‌ అయ్యింది. ఆ తర్వాత టీవీలో మరో వీడియో చూశాం. దానిలో నా కుమార్తె తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. దాంతో మేం బెల్గాంలో మిస్పింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చాం’’ అని తెలిపారు. 

రక్షణ కోరిన యువతి
గత వారం యువతి తన ప్రాణాలకు ప్రమాదం ఉందని.. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వీడియో స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది. ఇదే వీడియోలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ‘‘వీడియో ప్రసారం కావడంతో నా పరువు పోయింది. జనాలు మా ఇంటికి వచ్చి నా గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మా అమ్మనాన్న రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశారు.. నేను 3,4 సార్లు సూసైడ్‌ అటెంప్ట్‌ చేశాను’’ అని వీడియోలో పేర్కొంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పోలీసులు ఈ కేసును దర్యాప్తును ముమ్మరం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement