living together
-
పెళ్లికి ముందే సహ జీవనం, సిటీకి తీసుకెళ్లి కాపురం పెడితే..
నోయిడా: వివాహేతర సంబంధాలు, సహజీవనం ఈరోజుల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ రెండింటి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడితే, సహజీవనం వంటి సంబంధాలు వారి జీవితాలను నట్టేట ముంచుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఏమాత్రం మార్పు లేదు. ఓ యువకుడి మోజులో పడి తను ప్రేమించిన వ్యక్తిని ఆ యువతి చేతులారా చంపుకున్న ఘటన నోయిడాలో కలకలం రేపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ముఖేష్ అనే 22 ఏళ్ల యువకుడు ఓ యువతిని ప్రేమించి కొన్ని సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. సొంత ఊరును సైతం వదిలి ఇద్దరూ నోయిడాలో కాపురం పెట్టారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోకపోయినప్పటికీ భార్యాభర్తల్లానే కలిసి జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట జీవితంలోకి అంకుష్ అనే యువకుడి రాకతో వీరి జీవితాలు తలకిందులయ్యాయి. తన ఇంటి పక్కన ఉండే అంకుష్‌తో ముఖేష్ భార్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంత కాలం వాళ్లిద్దరూ ముఖేష్ కళ్లుగప్పి వారి సంబంధాన్ని కొనసాగించారు. అయితే ఇటీవల ముఖేష్‌కు ఈ విషయం తెలియడంతో తాను పెళ్లి చేసుకోకపోయినప్పటికీ భార్యలా చూసుకుంటున్న తనను కాదని అంకుష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు. ఇంట్లో తమ ఇద్దరు పిల్లలున్న సంగతి కూడా మరచి ఇదేం పనంటూ ఆ యువతిని మందలించాడు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఈ విషయాన్ని తన ప్రియుడు అంకుష్‌కు చెప్పింది. అంతే కాక ముఖేష్ అడ్డు తొలగించుకోవాలని అంకుష్‌కి చెప్పడంతో ముఖేష్ హత్యకు ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా ముఖేష్‌పై లేని ప్రేమను నటించి అతడికి ఆమె మద్యం తాగించింది. మత్తులో తూలిపోయిన ముఖేష్ నిద్రలోకి జారుకోగానే ప్రియుడు అంకుష్‌కి ఫోన్ చేసింది. అంకుష్ ఆమె ఇంటికి రాగానే ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న ముఖేష్‌ను హతమార్చారు. ఇక మరుసటి రోజు తెల్లవారుజామున ముఖేష్ ఇంటి నుంచి పెద్దగా కేకలు విన్పించడంతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. దీనితో ఆ యువతి మొసలి కన్నీరు కార్చుతూ రాత్రి మద్యం తాగి మత్తులో నిద్రపోయిన ముఖేష్ ఉదయాన్నే ఇలా చనిపోయి కనిపించాడని నాటకమాడింది. పోలీసులతో కూడా ఇదే కట్టుకథను చెప్పి నమ్మించసాగింది. అయితే.. ఆ యువతి ప్రవర్తనపై పోలీసులకు అనుమానమొచ్చింది. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమ శైలిలో పోలీసులు విచారించడంతో ముఖేష్‌ను తన ప్రియుడు అంకుష్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. -
అడ్డుగా ఉందని చంపేశాడు
విశాఖ క్రైం: తల్లి వివాహేతర సంబంధం ఆ చిన్నారి పాలిట మృత్యుపాశమైంది. ప్రియుడి మోజులో పడి కన్నతల్లే కుమార్తె హత్యకు పరోక్షంగా కారణమైంది. తమ సహజీవనానికి అడ్డుగా ఉందన్న కోపంతో తల్లి ఇంట్లో లేని సమయంలో ప్రియుడు మూడేళ్ల పాపను దారుణంగా పిడిగుద్దులు గుద్ది చంపేశాడు. అనారోగ్యం కారణంగా పాప చనిపోయిందని తల్లి, చుట్టుపక్కల వారిని నమ్మించి శ్మశానానికి తీసుకెళ్లి ఖననం చేశాడు. పాప మరణంపై అనుమానం వచ్చిన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డీసీపీ ఐశ్వర్య రస్తోగి శనివారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. మారికవలస ప్రాంతంలో నివాసముంటున్న బొద్దాన రమేష్, వరలక్ష్మిలకు 2016లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప సింధూశ్రీ ఉంది. తీవ్ర మనస్పర్థలతో దంపతులు విడిపోగా.. కుమార్తెతో కలిసి వరలక్ష్మి మారికవలసలో ఉంటోంది. ఆమెకు బోరవానిపాలెంకు చెందిన బోర జగదీష్ రెడ్డితో 2020లో పరిచయమేర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. మారికవలసలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఓ ఇంట్లో వరలక్ష్మితో జగదీష్ సహజీవనం కొనసాగిస్తున్నాడు. అయితే తమ సంబంధానికి పాప అడ్డుగా ఉందని భావించిన జగదీష్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 1న వరలక్ష్మి బయటికెళ్లగా.. అదే అదనుగా జగదీష్ చిన్నారి ముఖం, ఛాతి, కడుపులో పిడిగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తల్లి వరలక్ష్మి ఇంటికి తిరిగిరాగా.. పాపకు బాగోలేదని నమ్మించే ప్రయత్నం చేశాడు. కేజీహెచ్ వరకు తీసుకెళ్లి అక్కడ హైడ్రామా నడిపాడు. ఆస్పత్రిలో ఆధార్ కార్డు లేకపోతే చికిత్స చేయరని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికొచ్చాక ఆమె చనిపోయిందని చెప్పాడు. అనారోగ్యం కారణంగానే కుమార్తె మృతిచెందిందని వరలక్ష్మిని నమ్మించాడు. దీంతో చిన్నారిని మారికవలస శ్మశానవాటికలో ఖననం చేశారు. మరుసటిరోజు వరలక్ష్మి భర్త రమేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడికి అనుమానమొచ్చి పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు పాప మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా చేయించారు. స్థానికులను విచారించగా.. వరలక్ష్మి, జగదీష్ ల వ్యవహారం బయటపడింది. జగదీష్‌ను తమదైన శైలిలో విచారించగా.. పాపను తనే హత్య చేసినట్టు అంగీకరించాడు. అతడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. -
పెళ్లయిన జంటల్లో ‘ఎల్ఏటీ’ ట్రెండ్
‘ఎల్ఏటీ’ అంటే లివింగ్ ఏ పార్ట్ టుగెదర్. భార్యాభర్తలు దూరదూరంగా ఉంటూ కలిసి ఉండడం. ఇప్పుడు ఇది పలు దేశాల్లో కొత్త ట్రెండ్‌గా మారింది. ఇంగ్లండ్‌లో 25 శాతం జంటలు, ముఖ్యంగా యవ్వనంలో ఉన్న జంటలు ఎక్కువగా వేర్వేరు ఇళ్లలో స్వతంత్రంగా ఉంటున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. అలా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటూ స్నేహితుల్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ కాపురాలు చేస్తున్నారట. దాని వల్ల వారి మధ్య మొహం మొత్తకుండా ఒకరి పట్ల ఒకరికి ఎప్పటికప్పుడు కొత్త ప్రేమ చిగురిస్తోందట! మరి అలాంటి జంటలు పిల్లలు పుడితే ఏం చేస్తాయో తెలియదు. భార్యా భర్తలు ఎప్పుడూ కలసి ఉండడం వల్ల ఒకరి అలవాట్లు ఒకరికి పడక, తరచూ గొడవ పడుతుండడం అందరికి తెల్సిందే. వారు విడి విడిగా ఉండడం వల్ల ఎవరి స్వతంత్య్రం వారికి ఉండడంతోపాటు ఎవరి ఉద్యోగాలు వారు సక్రమంగా చేసుకోగలుగుతున్నారట. అప్పుడప్పుడు ఒంటరితనం ఫీలనప్పుడు స్నేహితుల్లా కలుసుకోవడం చాలా, చాలా బాగుండడమే కాకుండా జీవితానికి కొత్త స్ఫూర్తినిస్తుందట. ‘యూనివర్శిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్’కు చెందిన ప్రొఫెసర్ సైమన్ డుంకన్ ఇలా విడి విడిగా ఉంటూ అప్పుడప్పుడు సహ జీవనం చేస్తున్న 50 జంటలను కలుసుకొని వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా ఈ అధ్యయనం జరిపారు. యువతీ యువకుల్లో ప్రతి ఒక్కరు తమకంటూ ఓ సొంత స్పేస్‌ను కోరుకుంటారని, అది లభించడం వల్ల వారి మనుసు కుదట పడడమే కాకుండా దూర, దూరంగా ఉన్న భాగస్వాముల పట్ల తరగని ప్రేమ పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. ఎవరికి వారు విడి విడిగా ఉంటున్నాం కదా! ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా పరస్పర విశ్వాసాలతో సంబంధాలను కొనసాగించడం ఇందులో మరో విశేషం. వేర్వేరుగా ఉంటున్న జంటల్లో 43 శాతం మంది 16 నుంచి 24 ఏళ్ల లోపువారు కాగా 45 శాతం మంది 25 నుంచి 54 ఏళ్ల లోపు వయస్సు వారు, కేవలం 11 శాతం మంది మాత్రమే 54 ఏళ్లు పైబడిన వారు ఉంటున్నారు. ఇలా విడి విడిగా ఉంటున్న జంటల్లో విడాకుల సమస్యే రావడం లేదట. అందుకని ఇంగ్లండ్ 2017 సంవత్సరంతో పోలిస్తే రెండేళ్లలో విడాకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందట. -
విద్యార్థినితో టీచర్ సహజీవనం.. పెళ్లి!
వై.రామవరం (రంపచోడవరం): పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు 8వ తరగతి చదివే బాలికను మోసం చేసి సహజీవనం చేశాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. తనకు తొలుత వివాహం జరిగినట్టు, ఇద్దర్నీ బాగా చూసుకుంటానని ఉపాధ్యాయుడు చిన్నబ్బాయి లిఖితపూర్వకంగా గ్రామ పెద్దలకు రాసిచ్చిన లేఖ, పెళ్లి ఫొటోలు వాట్సప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తుండటంతో కలకలం రేగింది. తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని దాలిపాడు గ్రామ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణను వివరణ కోరగా.. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు వారం రోజుల కిందట వచ్చి, తమ బిడ్డకు టీసీ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి తీసుకుపోయారన్నారు. అంతకుమించి తమకు ఏమీ తెలియదని చెప్పారు. ఉపాధ్యాయుడి వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
సహజీవనం; తలలు ఒకచోట.. శరీరాలు మరోచోట
చండీగఢ్ : వివాహిత, ఆమె ఇద్దరు కూతుళ్లను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజేశ్ అనే వ్యక్తి మాత్రం పారిపోయినట్లు తెలిపారు. వివరాలు... అస్సాంకు చెందిన ఓ వివాహిత తన భర్తతో విడిపోయింది. అనంతరం తన పెద్ద కుమార్తె(12)తో కలిసి హర్యానాలోని భివానీ జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో చెత్తతో వ్యాపారం చేసే రాజేశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులపాటు అతడితో సహజీవనం చేసిన సదరు మహిళ మూడేళ్ల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే వీరి వ్యవహారం రాజేశ్ కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెకు దూరంగా ఉండాలంటూ హెచ్చరించడంతో.. అతడు ఆమెను దూరంపెట్టాడు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని, తన కూతుళ్ల పోషణకు డబ్బు ఇవ్వాలంటూ అతడిని కోరింది. రాజేశ్ అందుకు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విసిగెత్తిన రాజేశ్ ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి సదరు మహిళను, ఆమె ఇద్దరు కూతుళ్లను డిసెంబరు 27న హత్య చేశాడు. అనంతరం వారి తలలు నరికి ఓ చోట పాతిపెట్టాడు. శరీరాలను నీళ్ల డ్రమ్‌లో ఉంచి మూత బిగించాడు. అయితే కొన్ని రోజులుగా పిల్లలిద్దరు కనిపించకపోవడంతో పొరిగింటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి శవాలను వెలికితీశారు. -
‘సహజీవన సంబంధం రేప్ కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: సహజీవనంలో ఉన్న పురుషుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తన భాగస్వామిని వివాహమాడని పక్షంలో వారి మధ్య భౌతిక సంబంధం రేప్‌తో సమానం కాదని సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. మహారాష్ట్రకు చెందిన నర్సు ఓ డాక్టర్‌పై పెట్టిన కేసును కొట్టివేస్తూ అత్యున్నత ధర్మాసనం పైవిధంగా స్పందించింది. భర్త చనిపోయిన తరువాత ఆ నర్సు..డాక్టర్‌తో ప్రేమలో పడిందని, కొన్నాళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారని తెలిసింది. ‘రేప్‌కు, పరస్పర అంగీకార శృంగారానికి చాలా తేడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫిర్యాదు వచ్చిన వ్యక్తి బాధితురాల్ని నిజంగానే వివాహం చేసుకోవాలనుకున్నాడా? లేదా అతనికి ఏదైనా దురుద్దేశం ఉందా? తన కోరికను తీర్చుకోవడానికి ఆమెకు తప్పుడు ప్రమాణం చేశాడా? అని పరిశీలించాలి. నిందితుడి మాయలో పడిపోవడం ద్వారా కాకుండా, అతనిపై ప్రేమ కారణంగా బాధితురాలు శృంగారంలో పాల్గొంటే అలాంటి సందర్భాల్లో వారి మధ్య సంబంధాన్ని రేప్‌గా పరిగణించలేం’అని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
‘మిమ్మల్ని నేనే చంపాలా.. మీరే చస్తారా’
కాళేశ్వరం(మంథని) : సహజీవనం చేస్తున్న ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి నదిలో బుధవారం జరిగింది. వారిలో పురుషుడు మృతిచెందగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన జంగా హరినాథ్(48) మొదటి భార్య మృతిచెందడంతో మల్హర్ మండలం కొయ్యూర్‌కు చెందిన శ్యామలతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే వారిద్దరు కలిసి ఉండడం ఇష్టం లేని శ్యామల చిన్న సోదరుడు పండ్ల రాము పలుమార్లు వారిపై దాడి చేశాడు. కలిసి ఉండొద్దని బెదిరించాడు. అయినా వారు కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అతడి వేధింపులు భరించలేక ఇద్దరు బుధవారం ఉదయం 7.30 గంటలకు కాళేశ్వరంలోని గోదావరి నదిలో వీఐపీ ఘాట్ వద్ద క్రిమిసంహారక మందు తాగారు. హరినాథ్ అక్కడికక్కడే మృతిచెందగా, శ్యామల అపస్మారక స్థితికి చేరింది. స్థానికులు గమనించి 108లో మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ‘మిమ్మల్ని నేనే చంపాలా.. మీరే చస్తారా’ అని రాజు బెదిరించడంతో తాము మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హరినాథ్ రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ సంఘటన స్థలంలో ఓ చేతి సంచిలో వారిద్దరి ఫొటోలతో కలిపి లభించింది. కాగా హరినాథ్ మొదటి భార్య కుమారుడు ప్రసన్నకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రామ్‌సింగ్ తెలిపారు. మృతుడు స్థానికంగా డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పలిమెల ఎస్సై నరేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్లో ఇలా.. శ్యామల చిన్న తమ్ముడు పండ్ల రాజు తరచు మా ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేశాడు. ఇద్దరిని కొట్టి దూరం చేశాడు. అయినా మేమిద్దరం ఒక్కటయ్యాం. చంపుతానని బెదిరించాడు. మీరే చావండి లేదా నేనే చంపుతా అని వేధించడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
కువైట్‌లో సహజీవనం.. స్వదేశంలో పోరాటం
సంబేపల్లె : వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండల పరిధిలోని రౌతుకుంట గ్రామం కొత్తపల్లెకు చెందిన ఇంజేటి జయమ్మ అదే గ్రామం వంగిమళ్లవాండ్లపల్లెకు చెందిన నాగూరి బాబాజీ ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. బాధితురాలి వివరాల మేరకు.. గత కొన్నేళ్లుగా బాబాజీ, జయమ్మలు కువైట్‌లో సహజీవనం చేస్తున్నారు. వీరికి 6 నెలల మగబిడ్డ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్వదేశానికి వచ్చిన బాబాజీ తనకు జయమ్మతో ఎలాంటి సంబంధం లేదంటున్నాడు. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు జయమ్మ బాబాజీ ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. దీంతో తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై ఎస్ఐ సయ్యద్హషంను వివరణకోరగా జయమ్మ ఫిర్యాదు మేరకు బాబాజీపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
కమల్‌పై నటి గౌతమి ఆరోపణలు
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు కమలహాసన్ చెల్లించలేదని నటి గౌతమి ఆరోపణలు చేశారు. తనకు అందాల్సిన పారితోషికాన్ని ఆయన చెల్లించలేదని గౌతమి ఆరోపించారు. కమల్-గౌతమి కొంతకాలం సహజీవనం చేసి రెండేళ్ల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. కాగా కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం చేసి ప్రత్యేక పార్టీ ప్రారంభించడంతో కమల్, గౌతమిలు కలిసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. దీన్ని నటి గౌతమి ఖండించారు. దీనిపై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ తామిరువురం కలిసి జీవిస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని తెలిపారు. 2016లో ఆయన నుంచి విడిపోయిన తర్వాత ఎలాంటి సంబంధాలు లేవన్నారు. తాను, తన కుమార్తె భద్రంగా జీవించాలనే ఉద్దేశానికి వచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆర్థిక భద్రత కోసం తగిన చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు. కమల్ రాజ్‌కమల్ సంస్థలో కాస్ట్యూమర్‌గా పని చేశానని, అలాగే ఆయన నటించిన విశ్వరూపం, దశావతారం చిత్రాలకు వివిధ పనులు చేపట్టినట్లు తెలిపారు. అందుకు కమల్ చెల్లించాల్సిన పారితోషికం ఇంకా చెల్లించలేదని, దీన్ని అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పారితోషికం ఇవ్వనందున ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తాను, కమల్ విడిపోవడానికి ఆయన కుమార్తెలు శ్రుతి, అక్షర కారకులుగా చెప్పడం సరికాదని, ఇందులో వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇకపై అన్నింటినీ భరించి కలిసి జీవించడం కష్టమని, ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో బయటికి వచ్చానని, ఇక కలిసి జీవించేందుకు ఎటువంటి అవకాశాలు లేవని స్పష్టం చేశారు. -
ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోరాదా?
బెంగళూరు: సమాజంలో ఇప్పటికే ఎన్నో సమస్యలతో జీవన పోరాటం చేస్తున్న తమను మరింత ఇబ్బందికి గురిచేసేలా తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవటం ప్రసార మాధ్యమాలకు తగదని ఎల్జీబీటీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అక్కాచెల్లెలి వరసయ్యే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారని బుధవారం టీవీ చానెళ్లలో పదేపదే చూపించడం, పత్రికల్లో ప్రచురించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. గురువారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పలు లింగమార్పిడి, స్వలింగ సంపర్కుల హక్కుల (ఎల్జీబీటీ) సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.... జరిగిన సంఘటనను వక్రీకరించి ప్రసారం చేశారని విమర్శించారు. ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్నారనే సంగతిని ప్రసారం చేసేవారు, దీనివల్ల వారి వ్యక్తిగత జీవితానికి ఎంత నష్టం వాటిల్లుతుందనేది ఆలోచించకపోవటం శోచనీయమని ఆక్షేపించారు. ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదా? తమ గురించి ఈ విధంగా ప్రచారం జరగటంతో సమాజంలో ఎన్నో అవమానాలను, బాధలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలిపారు. ఇద్దరు మహిళలు కలసి జీవించటం అనేది పెద్ద నేరం, ప్రపంచంలో ఎక్కడా జరుగలేదన్న విధంగా చేయటం విడ్డూరంగా ఉందన్నారు. వివాహమనేది వారి వ్యక్తిగత విషయమనే సంగతనేది మరువరాదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాము ఏమిటో చెప్పుకోవటానికి తమకు మాత్రమే హక్కు ఉంది, తాము ఫలానా అని ఇతరులు ప్రచారం చేయటం తప్పు అవుతుంది అని చెప్పారు. సమాజంలో తాము కూడా గౌరవంగా జీవించడానికి దోహదపడిన మీడియా తొలిసారిగా ఇబ్బందికి గురిచేసేలా వ్యవహరించిందని అన్నారు. ఆ ఇద్దరు మహిళల సంగతిని పోలీసులు మీడియాకు తెలియజేయటం కూడా సరైన విధానం కాదని వారు ఖాకీలనూ తప్పుబట్టారు. అక్క చెల్లెళ్ల ప్రేమపెళ్లి.. సహజీవనం -
భార్యాభర్తల్లా ఉంటాం ప్లీజ్.. పోలీసులు అవాక్కు
మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధుర పోలీసులకు ఒక వింత సమస్య ఎదురైంది. తామిద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని దంపతుల్లాగా కలిసుంటామని అందుకు తమకు సహాయం చేయాలంటూ ఒక పెళ్లై భర్తతో విడిపోయిన యువతి, మరో విద్యార్థిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమ కోరిక నెరవేర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో అప్పటికే వారిద్దరి విన్నపానికి ససేమిరా అంటూ చివాట్లు పెడుతున్న తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. మధురలోని రెండు పక్కపక్క గ్రామాలకు చెందిన వీరు ఒకే కులానికి చెందినవారు. తాము చాలా రోజులగా ప్రేమించుకుంటున్నామని, ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి తనను బాగా కొడుతున్నారని మీరా(పేరు మార్చాం) అనే ఆమె చెప్పింది. ఎలాగైనా తాము పెళ్లి చేసుకుంటామని, అందుకు తమకు సహాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. తల్లిదండ్రులు మాత్రం అందుకు నిరాకరించారు. దీంతో ఈ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలని ఆ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. -
సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం
-
సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎల్విన్‌పేటలో గతరాత్రి దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో హత్యాయత్నం చేశాడో వ్యక్తి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్విన్‌పేటకు చెందిన ధనలక్ష్మి, చంద్రశేఖర్‌లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ధనలక్ష్మిపై అతను అనుమానం పెంచుకున్నాడు. సోమవారం ఉదయం సైకిల్‌పై వస్తున్న ధనలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె శరీరంపై 17 చోట్ల కత్తితో పొడిచాడు. ఆసమయంలో ఆమె సోదరి కూడా వెంట ఉండడంతో ధనలక్ష్మిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కాగా ధనలక్ష్మి వేరే వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ చనువుగా ఉంటుందనే అక్కసుతోనే చంద్రశేఖర్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితునిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
కలిసుంటామని కోర్టుకెళ్లారు
కేకే.నగర్: సహజీవనానికి అనుమతివ్వాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఇద్దరు యువతులు మంగళవారం తమిళనాడులోని మదురై జిల్లా కోర్టును ఆశ్రయించారు. బెంగళూరు వివేక్నగర్కు చెందిన వరుణ్ అలియాస్ వినోనికా(22), ఇదే ప్రాంతానికి చెందిన మాలిని (19) ఇద్దరూ అదే ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు. వినోనికా చిన్నతనం నుంచి తనను పురుషుడిగా భావించుకుని పెరిగింది. గత ఏడాది వినోనికా, మాలిని మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు వ్యతిరేకత తెలిపారు. దీంతో ఇద్దరూ నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. వేలాంకన్నికి చేరిన ఈ ఇరువురు గది తీసుకుని సహజీవనం చేశారు. ఇది తెలుసుకున్న వారి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి వచ్చి వారిని ఇళ్లకు తీసుకోని వెళ్లారు. ఈ క్రమంలో ఒక రోజు అకస్మాతుగా బెంగళూరు రైల్వేస్టేషన్ లో ఇటీవల కలుసుకున్నారు. ఆ సమయంలో ఎలాంటి సమస్య ఎదురైనా తాము చివరి వరకు కలిసి ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అక్కడి నుంచి చెన్నైకు వచ్చారు. చెన్నైలో తాము కలసి జీవించడానికి తగిన సౌకర్యాలు లేవని అనుకున్న ఇద్దరూ మధురైకు చేరుకున్నారు. మధురైలోని హిజ్రా భారతి కన్నమ్మ గురించి తెలుసుకుని ఆమెను ఆశ్రయించారు. తాము ఇద్దరూ సహజీవనం సాగించడానికి సహాయం చేయమని భారతి కన్నమ్మను కోరారు. ఆమె మంగళవారం మధురై జిల్లా న్యాయమూర్తి వద్దకు సమస్యను తీసుకొచ్చారు. -
హోంమంత్రి ఆదేశాలు : అత్తింట్లోకి సుజాత
హైదరాబాద్: మూడు రోజులుగా అత్తింటి ముందు న్యాయం కోసం దీక్ష చేపట్టిన సుజాత హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదేశాలతో ఎట్టకేలకు అత్తింట్లోకి అడుగు పెట్టింది. ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీలో నివసించే బీజేపీ నేత ఎస్పీ.శ్రీను కొడుకు అశోక్ 2004లో నవనిర్మాణ్నగర్ బస్తీకి చెందిన సుజాతను ప్రేమ పేరుతో కొద్ది రోజులు సహజీవనం చేసి పెద్దలకు తెలియకుండా పెళ్ళి చేసుకున్నాడు. (చదవండి : ‘అరేయ్..ఒరేయ్ అంటోంది’.. అందుకే.. ) వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. ఇటీవల అశోక్ మరో వివాహం చేసుకోవడానికి పథకం వేసుకొని సుజాతను దూరం పెట్టాడు. దీంతో ఆమె రోడ్డున పడింది. న్యాయం కోసం అత్తింటి ముందే టెంటు వేసుకొని దీక్ష చేపట్టింది. హోం మంత్రిని కలవగా ఆమెను అత్తింట్లోకి పంపించాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం ఉదయం స్థానిక మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, బస్తీ సంక్షేమ సంఘాల మద్దతుతో అత్తింటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఖాళీగా ఉన్న గదిలోకి వెళ్లింది. -
‘అరేయ్..ఒరేయ్ అంటోంది’.. అందుకే..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత మరో పెళ్లి చేసుకునేందుకు తనను వదిలేశాడని, తనకు న్యాయం చేయాలనిదీక్ష చేపట్టిన బాధితురాలు సుజాత శనివారం కూడా అత్తింటి ముందు బైఠాయించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... ఫిలింనగర్ కు చెందిన సుజాత, భగత్ సింగ్ కాలనీకి చెందిన బీజేపీ నేత ఎస్పీ శ్రీను కుమారుడు అశోక్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆకాష్ (9), ప్రదీప్ (1) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం అశోక్ భార్యను ఇంట్లోనుంచి వెళ్లగొట్టాడు. దీంతో ఆమె మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడుతోంది. గతంలో కూడా ఒకసారి అశోక్ ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టగా అత్తింటివారు న్యాయం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వారిచ్చిన హామీ నెరవేరకపోవడంతో రెండువారాల క్రితం పోలీస్ స్టేషన్లో బైఠాయించగా మళ్లీ వంచించారు. దీంతో శుక్రవారం సుజాత తమ ఇద్దరు పిల్లలుతో కలిసి అత్తింటి ముందు నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన ఆమెను భర్త అశోక్ అడ్డుకుని కొట్టి బయటకు తోసేయడంతో గాయపడింది. పోలీసులు అశోక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని బాధితురాలు హెచ్చరించింది. 2004లో తనను అశోక్ పెళ్ళి చేసుకున్నాడని ఇద్దరు పిల్లలు పుట్టారని ఇటీవలనే మరో పెళ్ళి చేసుకోవడానికి తనను దూరం చేస్తూ అత్తమామలతో కలిసి వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపింది. తనను రోడ్డు పాలు చేశారంటూ మూడు నెలలుగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని ఆమె పేర్కొంది. తాము పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా...తాను సుజాతతో సహజీవనం చేశానని, పెళ్ళి చేసుకోలేదని నిందితుడు అశోక్ వెల్లడించారు. పదేళ్లు జైలుకైనా వెళ్తాను కాని ఆమెను పెళ్ళి మాత్రం చేసుకోనని తెలిపాడు. తాను శంషాబాద్‌లో సుజాతకు ఒక ప్లాట్ కూడా కొనిచ్చానని అశోక్ వెల్లడించాడు. రెండో కొడుకు తన వల్లే పుట్టిన మాట వాస్తవమేనని పెద్దల సమక్షంలో ఒప్పుకోవడం కూడా జరిగిందన్నాడు. తాను తల్లిదండ్రులతో మాట్లాడితే సూజత ఓర్వడం లేదని, ‘ఒరేయ్... అరేయ్..’ అని సంబోధిస్తూ తనకు విలువనివ్వడం లేదని అందుకే విరక్తి కలిగిందని అశోక్ చెప్పాడు. -
ముఫ్పై ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కారు!
రాంచీ: కలిసి జీవిస్తూ దాదాపు ముఫ్పై ఏళ్ల తర్వాత 21 జంటలు పెళ్లి పీటలెక్కిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కుంతిలో చోటుచేసుకుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నీలకంఠ సింగ్ ముండా తన నియోజకవర్గంలోని గిరిజన జాతుల్లో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న జంటలను గుర్తించి.. నిమిత్ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో వారికి జీవిన విధానాల మీద అవగాహన కల్పించి పెళ్లిళ్లు చేసుకునేలా అంగీకరింపజేశారు. ‘ముండా’ గిరిజన తెగలకు చెందిన వీరు ఆర్థికంగా బాగా వెనుకబడిన వారు కావడంతో వారికి ఆర్థిక సాయం కూడా స్వచ్ఛంద సంస్థే చేసింది. నిమిత్ ఫౌండర్-డైరెక్టర్ నిఖిత సిన్హా మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత కోసం ముఖియా ఇండక్షన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా నాగ్ అనే వ్యక్తి పెళ్లిళ్ల కోసం ఆర్థికంగా సాయం కోరారని తెలిపారు. ప్రపంచబ్యాంకు సహకారంతోనే గ్రామంలో పరిశుభ్రతకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
రూ. 30 వేలకు భార్య తాకట్టు.. ఆపై స్నేహితుడి హత్య!
స్నేహితుడి నుంచి రూ. 30 వేలు అప్పు తీసుకుని, దానికి బదులుగా తన భార్యను తాకట్టు పెట్టేశాడో పెద్దమనిషి. అయితే, ఆమెను విడిచిపెట్టాలంటే మరింత అదనపు సొమ్ము కావాలని స్నేహితుడు డిమాండ్ చేయడంతో.. అతడిని చంపేశాడు. మహ్మద్ గులామ్ (35) అనే వ్యక్తి శవం రెండు వారాల క్రితం పోలీసులకు దొరికింది. ఆ కేసును ఛేదించే క్రమంలో ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. బిహార్‌లోని అరియా జిల్లాకు చెందిన గులామ్ గత రెండున్నరేళ్లుగా యమునానగర్‌లో ఉంటున్నాడు. జనవరిలోఅతడు తన స్నేహితుడు సబీర్ అలీకి రూ. 30వేలు అప్పుగా ఇచ్చాడు. అతడు కూడా బిహార్ నుంచి వలస వచ్చినవాడే. అతడు ఓ టిఫిన్ సెంటర్ నడుపుతూ కాంట్రాక్టర్లకు కూలీలను సరఫరా చేస్తుంటాడు. గులాం పత్తి ప్రాసెసింగ్ వ్యాపారం చేస్తుంటాడు. సబీర్ భార్య సల్మా చేతి వంట తింటూ ఉండేవాడు. అయితే మొన్న జనవరిలో సబీర్ తన భార్య సల్మాను గులాం వద్ద తాకట్టు పెట్టి రూ. 30వేలు అప్పు తీసుకున్నాడు. దాంతో గులాం ఆమెను యమునానగర్ సమీపంలోని జగధారి నగరంలో గల తన ఇంటికి తీసుకెళ్లాడు. మార్చిలో సల్మా, గులాం కలిసి బిహార్ వెళ్లి, తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు తిరిగారు. సెప్టెంబర్‌లో మళ్లీ పత్తి సీజన్ మొదలవడంతో ఇద్దరూ యమునానగర్ తిరిగొచ్చారు. వాళ్లిద్దరూ అక్టోబర్ నెలాఖరు వరకు కూడా సహజీవనంలోనే ఉన్నారు. తర్వాత ఉన్నట్టుండి గులాం దారుణ హత్యకు గురై కనిపించాడు. తాను రూ.30 వేలు చెల్లించినా, సల్మాను విడిచిపెట్టాలంటే మరో రూ. 20 వేలు వడ్డీగా ఇవ్వాల్సిందేనని గులాం చెప్పాడని, సరేనని ఆ మొత్తం కూడా ఇచ్చినా తన భార్యను వదల్లేదని.. దాంతో తాను, తన భార్య కలిసి గులాంను చంపేశామని సాబిర్ పోలీసులకు తెలిపాడు. ఈ హత్యలో వాళ్లకు మరికొందరు స్నేహితులు కూడా సహకరించారు. అందరినీ పోలీసులు అరెస్టు చేశారు. -
కూతురితో సహజీవనం చేస్తున్నాడని..
కాకినాడ : కూతురుతో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై...ఆమె తండ్రి దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. వివరాలు కాకినాడకు చెందిన పెండ్యాల రవిశంకర్(38) విద్యుత్ నగర్లో భార్య దేవితో కలసి ఉంటున్నాడు. ఇతడు వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా పిఠాపురానికి చెందిన దుర్గా భవానీ అనే మరో మహిళతో పదేళ్లగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఈరోజు ఉదయం దుర్గా భవానీ తండ్రి నాగేశ్వరరావు పిఠాపురం నుంచి కూతురు ఇంటికి వచ్చాడు. అప్పుడే దుర్గ ఇంటికి వచ్చిన రవిశంకర్‌పై నాగేశ్వరరావు కత్తితో దాడి చేసి హతమర్చాడు. అడ్డు వచ్చిన కుమార్తెపై కూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. నాగేశ్వరరావు ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
సహజీవనం చేస్తున్న యువతి ఆత్మహత్య
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న యువకుడితో గొడవపడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వివరాలు... మణిపూర్‌కు చెందిన యషోకి(25) బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని సిటీ సెంటర్ మాల్లోని ఓపీఎం స్పాలో బ్యూటీషియన్. నందినగర్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటున్న ఈమె కొంతకాలంగా మణిపూర్‌కి చెందిన యోర్జాట్ అనే యువకుడిని ప్రేమించి సహజీవనం చేస్తోంది. ప్రతిరోజూ రాత్రి 12.30కి విధులకు ముగించుకొని ఇంటికి వచ్చేది. ఆమె వచ్చేసరికి యోర్జాట్ వంట చేసిపెట్టేవాడు. అయితే, మంగళవారం రాత్రి యోర్జాట్ వంట చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో తిని ఖాళీగా కూర్చొనే నీవు కనీసం వంటకూడా చేయవా? అంటూ ఆమె అతడిని నిలదీయడంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం గదిలో ఒంటరిగా ఉన్న యషోకి కిటికీ ఊచలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. -
సహజీవనాన్ని పెళ్లిగానే భావిస్తాం: సుప్రీం
ఇద్దరు పెళ్లికాని వాళ్లు కలిసుండి.. కలిసి కాపురం చేస్తుంటే వాళ్లను పెళ్లయినవాళ్లు గానే భావిస్తామని, సహజీవన భాగస్వామి మరణించిన తర్వాత వాళ్ల ఆస్తికి సదరు మహిళ వారసురాలు అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ అలా కాదు.. ఆస్తి ఇవ్వకూడదనుకుంటే, వాళ్లిద్దరికీ చట్టబద్ధంగా పెళ్లికాలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ మగవాడి తరఫు పార్టీమీదే ఉంటుందని స్పష్టం చేసింది. ఎక్కువ కాలం పాటు ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి నివసిస్తుంటే దాన్ని పెళ్లిగానే చట్టం భావిస్తుందని జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక రూలింగ్‌లో తెలిపింది. 2010 నుంచి కూడా సుప్రీంకోర్టు సహజీవనం చేస్తున్న జంటలను భార్యాభర్తలుగానే పరిగణిస్తూ వారికి అనుకూలంగానే రూలింగులు ఇస్తోంది. ఇంతకీ ఈ రూలింగ్ ఏ సందర్భంలో వచ్చిందో తెలుసా.. తమ తాత గురించి కొందరు మనవలు, మనవరాళ్లు కలిసి వేసిన కేసు ఇంతపని చేసింది. తమ మామ్మ చనిపోయినప్పటినుంచి.. అంటే గత 20 ఏళ్లుగా తాత వేరే మహిళతో కలిసి ఉంటున్నారని, కానీ వాళ్లు పెళ్లి చేసుకోలేదని మనవలు తెలిపారు. ఇటీవల తాత మరణించగా.. ఆయన ఆస్తికి ఆమె వారసురాలు కారన్నది వీళ్ల వాదన. తామిద్దరికీ పెళ్లయినట్లు సదరు మహిళ నిరూపించుకోలేకపోయినా.. కోర్టు మాత్రం ఆమెకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. -
ప్రేమ.. సహజీవనం.. మరో యువతితో పెళ్లి
-
ప్రేమ.. సహజీవనం.. మరో యువతితో పెళ్లి
ఖమ్మం : ఓ యువతిని ప్రేమించాడు.. ఇద్దరూ సహ జీవనం చేశాడు. గర్భవతి అయిన ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి యువకుడు మొహం చాటేశాడు. దాంతో ఆ యువతి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకోడానికి తనకు కొంత సమయం కావాలని అతగాడు కోరాడు. తర్వాత పత్తా లేకుండా పోయాడు. మరోవైపు ఓ యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. సమాచారం అందుకున్న ప్రియురాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన ప్రవీణ్ కుమార్.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ సమయంలో ఖమ్మానికి చెందిన ఓ యువతితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారి, సహజీవనానికి దారి తీసింది. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. కానీ ఆమెతో పెళ్లికి ప్రవీణ్ కుమార్ సాకులు చెపుతూ కాలయాపన చేయటంతో బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతనిపై కేసు నమోదైంది. దాంతో అతడు వివాహానికి కొంత సమయం కావాలని కోరి, అనంతరం మణుగూరుకు మకాం మార్చాడు. తర్వాత మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు, బంధువులు శనివారం పెళ్లి వేదిక వద్దకు చేరుకుని ప్రవీణ్ కుమార్‌పై చేయి చేసుకున్నారు. అమ్మాయి, అబ్బాయి వైపు బంధువులంతా జుట్లు జుట్లు పట్టుకుని తెగ కొట్టుకున్నారు. -
సహజీవనం చేశాడు... సజీవ దహనం చేశాడు
తెనాలి: అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమై ఇద్దరు సజీవ దహనమైన సంఘటన గురువారం అర్థరాత్రి గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గండికోట మణికంఠ అనే వ్యక్తి స్థానికంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం రాత్రి ఒక్కసారిగా ఇంటి నుంచి మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా చిన్నారి, మహిళ మృతదేహాలను గుర్తించారు. మణికంఠే వారిద్దరినీ హత్య చేసి ఇంటికి నిప్పంటించి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎస్పీ, సీఐలు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
58 ఏళ్ల సహజీవనం తర్వాత ...
విజయనగరం: విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వృద్ధ జంటకు కల్యాణం జరిగింది. 73 ఏళ్ల వరుడు, 67 ఏళ్ల వధువు సిగ్గులొలుకుతూ పెళ్లిపీటలు ఎక్కారు. విజయనగరం జిల్లా కురుపాంకు చెందిన రామస్వామి, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టానికి చెందిన పోలమ్మ సుమారు 58 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలు. వారి పిల్లలకు పిల్లలు కూడా పుట్టారు. కాలం సాఫీగా గడుస్తున్నప్పటికీ పెళ్ళి జరగలేదనే నిరాశ వీరిని వెంటాడుతోంది. వీరి ఆవేదనను గ్రహించిన మనుమలు, మనువరాళ్లు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దాంతో బుధవారం వెంకన్న సన్నిధిలో కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడుమ పెళ్లి జరిపించారు. వేంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞ ప్రకారమే తమకు వివాహం జరిగిందని ఆ వృద్ధ దంపతులు వెల్లడించారు. -
సహజీవనం చేసి మొహం చాటేస్తున్నాడు
హైదరాబాద్: గతంలోనే రెండు పెళ్లిల్లు చేసుకొని మరో యువతిని మభ్యపెట్టి రెండేళ్లుగా సహజీవనం కొనసాగించి ముఖం చాటేసిన వ్యక్తిపై బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఇంద్రనగర్‌లో నివసించే యువతి(22) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన నవీన్ (30) శ్రీకృష్ణానగర్‌లోని ఓ కంట్రీ సెంటర్లో పనిచేస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం సదరు యువతితో పరిచయం పెంచుకున్న నవీన్ తనకు పెళ్లి కాలేదని, ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మించి రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి విషయం అడిగితే దాటేస్తువచ్చాడు. ఇటీవల గర్భం దాల్చిన యువతిని అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అయితే దానికి ఆమె ఒప్పుకోలేదు. తరువాత మొహం చాటేశాడు. తాను మోసపోయినట్లు గమనించిన యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నవీన్‌కు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్లు, ప్రస్తుతం రెండవ భార్యతో కలిసి ఉంటున్నట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.