సహజీవనం చేసి మొహం చాటేస్తున్నాడు | Junior artist lodges complaint against her boyfriend | Sakshi
Sakshi News home page

సహజీవనం చేసి మొహం చాటేస్తున్నాడు

Published Sat, Jun 21 2014 9:21 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

సహజీవనం చేసి మొహం చాటేస్తున్నాడు - Sakshi

సహజీవనం చేసి మొహం చాటేస్తున్నాడు

హైదరాబాద్: గతంలోనే రెండు పెళ్లిల్లు చేసుకొని  మరో యువతిని మభ్యపెట్టి రెండేళ్లుగా సహజీవనం కొనసాగించి ముఖం చాటేసిన వ్యక్తిపై బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు తెలిపిన మేరకు.. ఇంద్రనగర్‌లో నివసించే యువతి(22) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన నవీన్ (30) శ్రీకృష్ణానగర్‌లోని ఓ కంట్రీ సెంటర్‌లో పనిచేస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం సదరు యువతితో పరిచయం పెంచుకున్న నవీన్ తనకు పెళ్లి కాలేదని, ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు.

త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మించి రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి విషయం అడిగితే దాటేస్తువచ్చాడు. ఇటీవల గర్భం దాల్చిన యువతిని అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అయితే దానికి ఆమె ఒప్పుకోలేదు. తరువాత మొహం చాటేశాడు. తాను మోసపోయినట్లు గమనించిన యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నవీన్‌కు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్లు, ప్రస్తుతం రెండవ భార్యతో కలిసి ఉంటున్నట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement