కమల్‌పై నటి గౌతమి ఆరోపణలు | Gautami condemns contact with Kamal Haasan | Sakshi
Sakshi News home page

కమల్‌పై నటి గౌతమి ఆరోపణలు

Published Mon, Feb 26 2018 7:59 PM | Last Updated on Mon, Feb 26 2018 7:59 PM

Gautami condemns contact with Kamal Haasan  - Sakshi

సాక్షి, చెన్నై‌:  ప్రముఖ నటుడు కమలహాసన్‌ చెల్లించలేదని నటి గౌతమి ఆరోపణలు చేశారు. తనకు అందాల్సిన పారితోషికాన్ని ఆయన చెల్లించలేదని గౌతమి ఆరోపించారు. కమల్‌-గౌతమి కొంతకాలం సహజీవనం చేసి రెండేళ్ల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. కాగా కమల్‌ హాసన్‌ రాజకీయ ప్రవేశం చేసి ప్రత్యేక పార్టీ ప్రారంభించడంతో కమల్, గౌతమిలు కలిసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. దీన్ని నటి గౌతమి ఖండించారు.

దీనిపై ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ తామిరువురం కలిసి జీవిస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని తెలిపారు. 2016లో ఆయన నుంచి విడిపోయిన తర్వాత ఎలాంటి సంబంధాలు లేవన్నారు. తాను, తన కుమార్తె భద్రంగా జీవించాలనే ఉద్దేశానికి వచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆర్థిక భద్రత కోసం తగిన చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు. కమల్‌ రాజ్‌కమల్‌ సంస్థలో కాస్ట్యూమర్‌గా పని చేశానని, అలాగే ఆయన నటించిన విశ్వరూపం, దశావతారం చిత్రాలకు వివిధ పనులు చేపట్టినట్లు తెలిపారు.

అందుకు కమల్‌ చెల్లించాల్సిన పారితోషికం ఇంకా చెల్లించలేదని, దీన్ని అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పారితోషికం ఇవ్వనందున ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తాను, కమల్‌ విడిపోవడానికి ఆయన కుమార్తెలు శ్రుతి, అక్షర కారకులుగా చెప్పడం సరికాదని, ఇందులో వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇకపై అన్నింటినీ భరించి కలిసి జీవించడం కష్టమని, ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో బయటికి వచ్చానని, ఇక కలిసి జీవించేందుకు ఎటువంటి అవకాశాలు లేవని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement