remmunaration
-
రెమ్యూనిరేషన్ పెంచేసిన నాని.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
-
నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు
SivaKarthikeyan Files Petition Against KE Gnanavel Raja: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కోర్టు మెట్లెక్కాడు. ప్రముఖ నిర్మాత కె. ఇ. జ్ఞానవేల్ రాజా తనకు రెమ్మ్యునరేషన్ ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తామని జూలై 6, 2018న ఒప్పందం చేసుకుని, రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపాడు. మూడేళ్లైనా రూ. 4 కోట్లు ఇవ్వలేదన్నాడు. ఇచ్చిన రూ. 11 కోట్లకు కూడా టీడీఎస్ కట్టలేదని, రూ. 91 లక్షలు టీడీఎస్ కింద కట్ అయ్యాయని పేర్కొన్నాడు. తన కేసు పరిష్కారమయ్యే వరకూ నిర్మాత జ్ఞాన్వేల్ రాజా తన తదుపరి సినిమాలైన 'రెబల్', 'చియాన్ 61', 'పాతు తాల'కు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని కోర్టును కోరాడు శివ కార్తికేయన్. అలాగే ఈ సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రిలీజ్ కోసం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకు, లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఎలాంటి హక్కులు బదిలీ చేయకుండా చూడాలని అభ్యర్థించాడు. ఈ కేసు మళ్లీ గురువారం విచారించనున్నారు. కాగా శివకార్తికేయన్.. రెమో, హీరో, వరుణ్ డాక్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల 'బీస్ట్' మూవీ నుంచి అదరగొట్టిన సూపర్ హిట్ సాంగ్ 'అరబిక్ కుతు'కు లిరిక్స్ అందించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లల్ 'అయాలాన్' విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి రవి కుమార్ దర్శకత్వం వహించారు. -
హాట్ టాపిక్‌గా రవితేజ తక్కువ రెమ్యునరేషన్.. ఎందుకంటే ?
చిన్న తరహా రోల్స్ చేస్తూ, ఎంతో కష్టపడి, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ. ఎంత ఎదిగినా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవలే 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా టీజర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ట్రెండింగ్‌లో దూసుకెళ్లిపోతోంది. అయితే ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు రవితేజ తక్కువ పారితోషికం తీసుకున్నాడని టాలీవుడ్ టాక్. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవితేజ రోజుకు రూ. 50 లక్షలు తీసుకున్నాడని సమాచారం. షూటింగ్ కోసం రవితేజ 20 నుంచి 25 వర్కింగ్ డేస్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రవితేజకు మొత్తంగా రూ. 10 నుంచి 12 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారట. అయితే రవితేజ సాధారణంగా తీసుకునే పారితోషికానికి తక్కువని టాక్. సాధారణంగా రవితేజ ఒక సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంకా 2 నుంచి 3 రోజుల సినిమా చిత్రీకరణ మిగిలి ఉందని తెలుస్తోంది. అలాగే ఈ మూవీని ఏప్రిల్ 15న విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. -
అల్లు అర్జున్‌కు పెరిగిన డిమాండ్.. 100 కోట్ల పారితోషికం ?
'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ మారిపోయింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో నార్త్‌లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా మారాడు. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ 'ది రూల్' సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బన్నీ తర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటా అని ఆసక్తి నెలకొంది. అయితే తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్‌కు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం అట్లీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు భోగట్టా. అయితే ఈ చర్చలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ లైకా ప్రొడక్షన్ బన్నీకి రూ. 100 కోట్ల పారితోషికం ఆఫర్ చేసి అల్లు అర్జున్ ఒప్పుకుంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నిలుస్తాడు. ప్రభాస్ కూడా తన సినిమాలకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా ఇలా ఉంటే అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతారలతో 'లయన్' సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్'తో పాటు వేణు శ్రీరామ్‌తో ఒక సినిమా, కొరటాల శివతో రివేంజ్ డ్రామా మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ఏఆర్ మురుగదాస్, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీనులతో కూడా సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
ప్రభాస్ తర్వాత స్థానంలో అల్లు అర్జున్.. దేనిలో అంటే ?
Allu Arjun High Remuneration For Lyca Productions Movie After Prabhas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ 'పుష్ప: ది రైజ్' సినిమా తర్వాత మరో మలుపు తిరిగింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో నార్త్‌లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. బాలీవుడ్లో రూ. 75 కోట్ల కలెక్షన్సు రాబట్టి హిందీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు పుష్ప రాజు. ముఖ్యంగా సినిమాలోని బన్నీ యాక్టింగ్‌కు విమర్శకులు, ప్రేక్షకలోకం ఫిదా అయింది. అల్లు అర్జున్ మొదటి చిత్రం గంగోత్రి తర్వాత ఇదే సుకుమార్ డైరెక్షన్లో ఆర్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. తర్వాత విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్న బన్నీ యాక్టింగ్, డ్యాన్సింగ్‌లో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. (చదవండి: హెల్మెట్‌తో 'పుష్ప'రాజ్.. పోలీసుల అవగాహన) వీటన్నింటితో పోలిస్తే పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్‌పై ఫోకస్ పెట్టనున్నాడు అల్లు అర్జున్. 'పుష్ప: ది రూల్' షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి ప్రారంభం కానుంది. దీని తర్వాత బన్నీ ఏం మూవీ చేస్తాడనేది హాట్ టాపిక్‌గా మారింది. పుష్పకు వచ్చిన క్రేజ్ చూసి పలువురు నిర్మాతలు బన్నీకి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నారట. అయితే పుష్ప తొలి భాగానికి అల్లు అర్జున్ రూ. 50 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ప్రముఖ దక్షిణాది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బన్నీతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఆ సినిమా కోసం బన్నీకి ఏకంగా రూ. 75 కోట్లు ఇచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు) ఇదే నిజమైతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకునే స్టార్‌గా అల్లు అర్జున్ రికార్డ్ కొట్టినట్టే. ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రాలకు ప్రభాస్ రూ. 100 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. టాలీవుడ్లో ప్రభాస్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకునే వారిలో ఇప్పటివరకు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, తర్వాత బన్నీ ఉండేవారు. ఇప్పుడు ఈ లైకా ప్రొడక్షన్స్‌తో సినిమా నిజమైతే ప్రభాస్ తర్వాతి స్థానం అల్లు అర్జున్‌దే అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా హలచల్ చేస్తోంది. (చదవండి: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్లో శ్రీవల్లి హుక్ స్టెప్పు) -
కమల్‌పై నటి గౌతమి ఆరోపణలు
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు కమలహాసన్ చెల్లించలేదని నటి గౌతమి ఆరోపణలు చేశారు. తనకు అందాల్సిన పారితోషికాన్ని ఆయన చెల్లించలేదని గౌతమి ఆరోపించారు. కమల్-గౌతమి కొంతకాలం సహజీవనం చేసి రెండేళ్ల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. కాగా కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం చేసి ప్రత్యేక పార్టీ ప్రారంభించడంతో కమల్, గౌతమిలు కలిసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. దీన్ని నటి గౌతమి ఖండించారు. దీనిపై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ తామిరువురం కలిసి జీవిస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని తెలిపారు. 2016లో ఆయన నుంచి విడిపోయిన తర్వాత ఎలాంటి సంబంధాలు లేవన్నారు. తాను, తన కుమార్తె భద్రంగా జీవించాలనే ఉద్దేశానికి వచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆర్థిక భద్రత కోసం తగిన చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు. కమల్ రాజ్‌కమల్ సంస్థలో కాస్ట్యూమర్‌గా పని చేశానని, అలాగే ఆయన నటించిన విశ్వరూపం, దశావతారం చిత్రాలకు వివిధ పనులు చేపట్టినట్లు తెలిపారు. అందుకు కమల్ చెల్లించాల్సిన పారితోషికం ఇంకా చెల్లించలేదని, దీన్ని అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పారితోషికం ఇవ్వనందున ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తాను, కమల్ విడిపోవడానికి ఆయన కుమార్తెలు శ్రుతి, అక్షర కారకులుగా చెప్పడం సరికాదని, ఇందులో వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇకపై అన్నింటినీ భరించి కలిసి జీవించడం కష్టమని, ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో బయటికి వచ్చానని, ఇక కలిసి జీవించేందుకు ఎటువంటి అవకాశాలు లేవని స్పష్టం చేశారు. -
4 సీ అడుగుతున్న నయన
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. అలాగని కాలం కలిసొచ్చింది కదా అని తనను వెతుక్కుంటూ వచ్చిన వారిని బెంబేలెత్తించడం మితి మీరిన చర్యే అవుతుంది. నయనతార గురించి పరిశ్రమలోని ఒక వర్గం అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తోంది. నయన మంచి నటే ఈ విషయంలో మరో మాటకు తావులేదు.ప్రస్తుతం ఈ అమ్మడు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఉన్నారు. ఇక హీరోయిన్గా మరో ఇన్నింగ్స్ ఉండే అవకాశం లేదు. అందుకే చేతనైనంతా ఇప్పుడే సంపాదించుకోవాలనే ధోరణి తనలో స్పష్టంగా కనిపిస్తోందనే భావన వ్యక్తం అవుతోంది. ఇటీవల నయనతార నటించిన నానుమ్ రౌడీదాన్, తనీఒరవన్, మాయ చిత్రాలు మంచి విజయాలను సాధించి ఆమె స్థాయిని మరింత పెంచాయన్నది నిజం. ముఖ్యంగా నయనతార ప్రధాన పాత్రలో నటించిన హారర్ కథా చిత్రం మాయ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం మలయాళంలో డబ్ అయి వంద రోజులు ప్రదర్శింపబడడం గమనార్హం. దీంతో మరిన్ని భారీ బడ్జెట్ హారర్ కథా చిత్రాల అవకాశాలు ఈ అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే నయనతార మాత్రం మంచి తరుణం మించిపోనీరాదంటూ పారితోషకం విషయంలో అధిక డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఆమె డిమాండ్ చేస్తున్నది ఎంతో తెలుసా? ఇప్పటికే ఈ సొగసరి రెండున్నర నుంచి మూడు కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నారని ప్రచారంలో ఉంది. తాజాగా దాన్ని మరో సీ(కోటి)కి పెంచేసిందని టాక్. ఇటీవల ఒక దర్శకుడు నయనతారతో ఒక హారర్ కథా చిత్రం చేయడానికి కాల్షీట్స్ అడిగారట. అందులో నటించడానికి పచ్చజెండా ఊపినా,ఆమె అడిగన పారితోషికానికి ఆ దర్శకుడికి ముచ్చెమటలు పోశాయట. ఇంతకీ నయనతార ఎంత అడిగిందనేగా మీ ఉత్సుకత.అక్షరాలా నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట.ఆమె పారితోషికంతో సంగం చిత్రం పూర్తి చేయవచ్చునని భావించిన ఆ దర్శకుడిప్పుడు నయనతారను అనుకున్న పాత్రలో నటి అంజలిని ఎంపిక చేసుకున్నారు. ఈ కేరళ భామ ఇలాగే పారితోషికం విషయంలో డిమాండ్ చేసుకుంటూ పోతే భవిష్యత్‌లో ఆమెకు ప్రత్యామ్నాయంగా అంజలి లాంటి నటీమణులు తయారవుతానే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.ప్రస్తుతం నయనతార తిరునాళ్, కాష్మోరా, ఇరుమగన్ చిత్రాల్లో నటిస్తున్నారు. శింబుతో నటిస్తున్న ఇదునమ్మఆళు చిత్రం ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుకుంటోంది.వీటితో పాటు వెంకటేశ్‌కు జంటగా ఒక తెలుగు చిత్రం చేస్తోంది.