చిన్న తరహా రోల్స్ చేస్తూ, ఎంతో కష్టపడి, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ. ఎంత ఎదిగినా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవలే 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా టీజర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ట్రెండింగ్‌లో దూసుకెళ్లిపోతోంది. అయితే ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు రవితేజ తక్కువ పారితోషికం తీసుకున్నాడని టాలీవుడ్ టాక్.
శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవితేజ రోజుకు రూ. 50 లక్షలు తీసుకున్నాడని సమాచారం. షూటింగ్ కోసం రవితేజ 20 నుంచి 25 వర్కింగ్ డేస్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రవితేజకు మొత్తంగా రూ. 10 నుంచి 12 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారట. అయితే రవితేజ సాధారణంగా తీసుకునే పారితోషికానికి తక్కువని టాక్. సాధారణంగా రవితేజ ఒక సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంకా 2 నుంచి 3 రోజుల సినిమా చిత్రీకరణ మిగిలి ఉందని తెలుస్తోంది. అలాగే ఈ మూవీని ఏప్రిల్ 15న విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది.
Ravi Teja Remuneration: ఆ డ్యూటీ కోసం రెమ్యునరేషన్ తక్కువ తీసుకున్న రవితేజ !
Published Wed, Mar 2 2022 8:56 PM | Last Updated on Thu, Mar 3 2022 8:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment