డిష్యూం... డిష్యూం... | Ravi Teja Mass Jatara movie Update | Sakshi
Sakshi News home page

డిష్యూం... డిష్యూం...

Published Mon, Dec 23 2024 12:40 AM | Last Updated on Mon, Dec 23 2024 12:40 AM

Ravi Teja Mass Jatara movie Update

విలన్స్‌ బెండు తీస్తున్నాడు లక్ష్మణ్‌ భేరి. డిష్యూం... డిష్యూం అంటూ అదిరిపోయే ఫైట్‌ చేస్తున్నాడు. ఈ లక్ష్మణ్‌ భేరి ఎవరంటే... రవితేజ అన్న మాట. రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘మాస్‌ జాతర’లో ఆయన పాత్ర పేరు ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత రవితేజ, శ్రీలీల మళ్లీ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. 

ఈ చిత్రంలో ఎస్‌ఐ లక్ష్మణ్‌ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పృథ్వీ మాస్టర్‌ ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేస్తున్నారట. ఈ షెడ్యూల్‌ తర్వాత చిత్రయూనిట్‌ అరకు వెళ్లనుందని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement