Lyca Prodcuctions Offeres 100 Crore to Allu Arjun for Atlee Movie - Sakshi
Sakshi News home page

Allu Arjun: అల్లు అర్జున్​కు పెరిగిన డిమాండ్​.. 100 కోట్ల పారితోషికం ?

Published Mon, Jan 24 2022 4:34 PM | Last Updated on Mon, Jan 24 2022 5:51 PM

Lyca Prodcuctions Offeres 100 Crore To Allu Arjun For Atlee Movie - Sakshi

'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకానిక్​ స్టార్​ అల్లు అర్జున్​ స్టార్ మారిపోయింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అ‍ల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ పుష్పతో నార్త్‌లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత డిమాండ్​ ఉన్న నటుడిగా మారాడు. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్​ 'ది రూల్'​ సినిమా షూటింగ్​ ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. 



ఈ క్రమంలో బన్నీ తర్వాతి ప్రాజెక్ట్స్​ ఏంటా అని ఆసక్తి నెలకొంది. అయితే తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో ప్లాన్​ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్​ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్​కు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్​ ఆఫర్​ చేసినట్లు సమాచారం. ఇందుకోసం అట్లీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు భోగట్టా. అయితే ఈ చర్చలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 



ఒకవేళ లైకా ప్రొడక్షన్​ బన్నీకి రూ. 100 కోట్ల పారితోషికం ఆఫర్​ చేసి అల్లు అర్జున్​ ఒప్పుకుంటే పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ సరసన నిలుస్తాడు. ప్రభాస్​ కూడా తన సినిమాలకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్​ తీసుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా ఇలా ఉంటే అట్లీ ప్రస్తుతం బాలీవుడ్​ బాద్​షా షారుఖ్​ ఖాన్​, నయనతారలతో 'లయన్'​ సినిమా షూటింగ్​ పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్​ 'పుష్ప: ది రూల్'​తో పాటు వేణు శ్రీరామ్​తో ఒక సినిమా​, కొరటాల శివతో రివేంజ్​ డ్రామా మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ఏఆర్​ మురుగదాస్​, ప్రశాంత్​ నీల్​, బోయపాటి శ్రీనులతో కూడా సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement