Allu Arjun High Remuneration For Lyca Productions Movie After Prabhas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ 'పుష్ప: ది రైజ్' సినిమా తర్వాత మరో మలుపు తిరిగింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో నార్త్‌లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. బాలీవుడ్‌లో రూ. 75 కోట్ల కలెక్షన్సు రాబట్టి హిందీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు పుష్ప రాజు. ముఖ్యంగా సినిమాలోని బన్నీ యాక్టింగ్‌కు విమర్శకులు, ప్రేక్షకలోకం ఫిదా అయింది. అల్లు అర్జున్ మొదటి చిత్రం గంగోత్రి తర్వాత ఇదే సుకుమార్ డైరెక్షన్‌లో ఆర్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. తర్వాత విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్న బన్నీ యాక్టింగ్, డ‍్యాన్సింగ్‌లో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
(చదవండి: హెల్మెట్‌తో 'పుష్ప'రాజ్.. పోలీసుల అవగాహన)
వీటన్నింటితో పోలిస్తే పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్‌పై ఫోకస్ పెట్టనున్నాడు అల్లు అర్జున్. 'పుష్ప: ది రూల్' షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి ప్రారంభం కానుంది. దీని తర్వాత బన్నీ ఏం మూవీ చేస్తాడనేది హాట్ టాపిక్‌గా మారింది. పుష్పకు వచ్చిన క్రేజ్ చూసి పలువురు నిర్మాతలు బన్నీకి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నారట. అయితే పుష్ప తొలి భాగానికి అల్లు అర్జున్ రూ. 50 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ప్రముఖ దక్షిణాది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బన్నీతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఆ సినిమా కోసం బన్నీకి ఏకంగా రూ. 75 కోట్లు ఇచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
(చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు)
ఇదే నిజమైతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకునే స్టార్‌గా అల్లు అర్జున్ రికార్డ్ కొట్టినట్టే. ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రాలకు ప్రభాస్ రూ. 100 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. టాలీవుడ్‌లో ప్రభాస్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకునే వారిలో ఇప్పటివరకు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, తర్వాత బన్నీ ఉండేవారు. ఇప్పుడు ఈ లైకా ప్రొడక్షన్స్‌తో సినిమా నిజమైతే ప్రభాస్ తర్వాతి స్థానం అల్లు అర్జున్‌దే అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా హలచల్ చేస్తోంది.
(చదవండి: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్‌లో శ్రీవల్లి హుక్ స్టెప్పు)
Comments
Please login to add a commentAdd a comment