gowtami
-
కమల్‌పై నటి గౌతమి ఆరోపణలు
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు కమలహాసన్ చెల్లించలేదని నటి గౌతమి ఆరోపణలు చేశారు. తనకు అందాల్సిన పారితోషికాన్ని ఆయన చెల్లించలేదని గౌతమి ఆరోపించారు. కమల్-గౌతమి కొంతకాలం సహజీవనం చేసి రెండేళ్ల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. కాగా కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం చేసి ప్రత్యేక పార్టీ ప్రారంభించడంతో కమల్, గౌతమిలు కలిసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. దీన్ని నటి గౌతమి ఖండించారు. దీనిపై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ తామిరువురం కలిసి జీవిస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని తెలిపారు. 2016లో ఆయన నుంచి విడిపోయిన తర్వాత ఎలాంటి సంబంధాలు లేవన్నారు. తాను, తన కుమార్తె భద్రంగా జీవించాలనే ఉద్దేశానికి వచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆర్థిక భద్రత కోసం తగిన చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు. కమల్ రాజ్‌కమల్ సంస్థలో కాస్ట్యూమర్‌గా పని చేశానని, అలాగే ఆయన నటించిన విశ్వరూపం, దశావతారం చిత్రాలకు వివిధ పనులు చేపట్టినట్లు తెలిపారు. అందుకు కమల్ చెల్లించాల్సిన పారితోషికం ఇంకా చెల్లించలేదని, దీన్ని అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పారితోషికం ఇవ్వనందున ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తాను, కమల్ విడిపోవడానికి ఆయన కుమార్తెలు శ్రుతి, అక్షర కారకులుగా చెప్పడం సరికాదని, ఇందులో వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇకపై అన్నింటినీ భరించి కలిసి జీవించడం కష్టమని, ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో బయటికి వచ్చానని, ఇక కలిసి జీవించేందుకు ఎటువంటి అవకాశాలు లేవని స్పష్టం చేశారు. -
గౌతమి తల్లిదండ్రులకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, చిత్తూరు : ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదల పట్ల, వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి కనికరం లేదని ఆయన మండిపడ్డారు. రేణిగుంట మండలం పరకాల గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి గౌతమి క్యాన్సర్ కారణంగా కంటి చూపు కోల్పోయింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిశారు. తమ బిడ్డ క్యాన్సర్ కారణంగా కంటి చూపు కోల్పోయిందని, ఎన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వైద్యం కోసం మధురై, చెన్నై తదితర ప్రాంతాల్లో రూ.5 లక్షలు ఖర్చు చేశామని, ఇక వైద్యం చేయించేందుకు తమకు స్థోమత లేదని ఆవేదన చెందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఇటువంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేసేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా చికిత్సకు ఆలస్యం చేస్తే మరో కంటికి కూడా చూపు పోయే ప్రమాదం ఉందని వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. గౌతమి తల్లిదండ్రుల ఆవేదనను సావధానంగా విన్నవైఎస్ జగన్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చిన్నారులకు కాంక్లీయర్ ఇన్ప్లాంటేషన్ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసేవారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి వ్యాధులకు వైద్యం అందించడం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తామని, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా చేయిస్తామని ఆయన జగన్ పేర్కొన్నారు. జననేత హామీతో గౌతమి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
అంతుచిక్కని ప్రశ్నలెన్నో..!
శ్రీగౌతమి మృతి కేసు దర్యాప్తులో అన్నీ అనుమానాలే స్టేట్మెంట్ కాపీపై సంతకం తనది కాదంటున్న పావని హత్యకేసుగా నమోదు చేయాలని పెరుగుతున్న డిమాండ్ నిర్భయ చట్టం దేవుడెరుగు.. కనీసం ఈవ్‌టీజింగ్ కేసైనా పెట్టని పోలీసులు నరసాపురం : నరసాపురం పట్టణానికి చెందిన దంగేటి శ్రీగౌతమి మృతి కేసుకు మసిపూసి మారేడుకాయ చేశారాఽ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత సజ్జా బుజ్జి కుటుంబానికి పూర్తిగా కొమ్ము కాసేందుకే కట్టుబడి ఉన్నారా.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని వారం రోజులుగా చెబుతూ వచ్చిన పోలీసులు రాష్ట్రస్థాయి నేతల వత్తిళ్లకు పూర్తిగా దోసోహమన్నారా.. అనే అనుమానాలకు అవుననే అనిపిస్తోంది. శ్రీగౌతమి మృతి కేసును ప్రమాదవశాత్తు జరిగిందేనని పోలీసులు ఇప్పటికే తేల్చేశారు. విశాఖకు చెందిన ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. శ్రీగౌతమి మృతి చెందిందని తెలిసిన రోజునుంచి ఇది ముమ్మాటికీ హత్యేనని.. ప్రమాదంలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డ పావని చెబుతూ వస్తోంది. తన అక్కకు టీడీపీ నేత బుజ్జితో వివాహం జరిగిందని, అతని మొదటి భార్య తన అక్కను బెదిరిస్తోందని ఆరోపిస్తోంది. పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. అక్క చనిపోయిందని తెలియక ముందునుంచీ మొదటి మూడు రోజులపాటు పావని తమను కారులో కొందరు వెంబడించారని, కారులోంచి తన చున్నీ పట్టుకుని లాగే ప్రయత్నం చేశారని చెబుతోంది. శ్రీగౌతమిని సజ్జా బుజ్జి రహస్య వివాహం చేసుకోవడం వంటి విషయాలు పక్కన పెడితే.. కనీసం ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినట్టు తేలినా దీనిపై పోలీసులు శ్రద్ధ పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిజానికి శ్రీగౌతమి కేసును నిర్భయ చట్టం కింద నమోదు చేయాలని పౌర హక్కులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ చట్టం కింద కేసు నమోదు చేయడం దేవుడెరుగు.. కనీసం ఈవ్‌టీజింగ్ సెక్షన్లు అయినా నమోదు చేయకపోవడం వెనుక కారణాలేమిటనేది అంతుబట్టడం లేదు. పోలీసులు కేవలం రెండు సెక్షన్లతో కేసు నమోదు చేసి ఊరుకున్నారు. దొరికిన నిందితులపైనా కనికరం ఎందుకు విశాఖకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఘటనకు కారకులుగా నిర్ధారించారు. ప్రమాదంలో శ్రీగౌతమి మృతికి కారణమైనందుకు 304 (ఎ), ఘటనలో పావని గాయాల పాలైనందుకు 338 ఽసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు కారులో తమను కొంతదూరం పాటు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారని పావని ఆరోపిస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పానంటోంది. మరికొన్ని సెక్షన్ల కిందఽ నిందితులపై కేసులు పెట్టే అవకాశం ఉన్నా పోలీసులు ఎందుకు ముందడుగు వేయలేదనేది మరో ప్రశ్న. ఎంత చెప్పినా సజ్జా బుజ్జి, అతని భార్యపై పేరును కేసులో ప్రస్తావించడం లేదని పావని వాపోతోంది. ఘటన జరిగిన రెండో రోజునే, ఇది ప్రమాదమని, ఇద్దరు నిందితులు అదుపులో ఉన్నారని పాలకొల్లు పోలీసులు చెప్పారు. 8 రోజుల దర్యాప్తు తరువాత కూడా వారినే చూపించారు. మరి నిందితుల వివరాలు తెలపడానికి ఇంత సమయం తీసుకుని పోలీసులు ఏంచేశారనేది ఇంకో ప్రశ్న స్టేట్మెంట్ కాపీని అనుకూలంగా మార్చుకున్నారా ప్రమాదం జరిగిన తరువాత పావని నుంచి తీసుకున్న స్టేట్మెంట్ కాపీ తారుమారైందనే ఆరోపణలూ వస్తున్నాయి. ఎఫ్ఐఆర్కు జతచేసిన స్టేట్మెంట్ కాపీపై సంతకం తనది కాదని పావని చెబుతోంది. తన సంతకం వేరే విధంగా ఉంటుందని స్పష్టం చేస్తోంది. అలాగే ఐక్య ఎమర్జెన్సీ ఆసుపత్రిలో పోలీసులు తన స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు.. తమను కారులో కొందరు వ్యక్తులు టీజ్ చేశారని, కావాలని వెంబడించి ఢీకొట్టారని చెప్పానని తెలిపింది. పోలీసులు తనకు ఇచ్చిన ఎఫ్ఐఆర్తో కూడిన స్టేట్మెంట్ కాపీలో ఈ వివరాలేమీ లేవనేది పావని కొత్తగా తెరమీదకు తెస్తున్న వాదన. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసేప్పుడు, సంబంధిత వ్యక్తుల బంధువుల సమక్షంలో చేస్తారు. సాక్షులుగా వారి సంతకాలు తీసుకుంటారు. తన వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు, వరుసకు తనకు సోదరుడైన కె.మణికంఠ అనే సంతకం పెట్టాడని పావని చెబుతోంది. పోలీసులు తనకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ప్రతిలో సాక్షి సంతకం లేదంటోంది. దీనినిబట్టి కావాలనే వేరే స్టేట్మెంట్ తయారు చేశారా? అనే అనుమానం కలుగుతోంది. ఘటన జరిగిన రోజు కారులో క్రికెట్ బ్యాట్లు, మందు బాటిళ్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో వీటికి సమాధానం లేదు. వైజాగ్ నుంచి మూడురోజుల క్రితమే నిందితులు బయలుదేరారిని చెప్తున్నారు. వారు ఎక్కడెక్కడ తిరిగారు అనే దానిపై కూడా స్పష్టత లేదు. మొత్తం ఘటనలో కీలకంగా ఉన్న సజ్జా బుజ్జి ప్రమాదం జరిగిన తరువాత ఆసుపత్రికి వచ్చాడు. శ్రీగౌతమి మృతి చెందిన తరువాత అదృశ్యమయ్యాడు. ఇలా అనేక సందేహాలు, అనుమానాలు వెంటాడుతున్నాయి. శ్రీగౌతమి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైతం కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా నివృత్తి చేయాలని పోలీసులకు సూచించారు. లేదంటే కేసు ఇంకా బలపడుతుందని, అనుమానాలు పెరుగుతాయని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. న్యాయ పోరాటం చేస్త కేసులో న్యాయం జరగటం లేదు. ఆ అక్క హత్యకు గురైంది. నేను చెప్పిన విషయాన్ని కూడా పట్టించుకోలేదు. నన్ను టీజ్ చేశారని చెప్పాను. స్టేట్మెంట్ కాపీపై సంతకం నాది కాదు. మా అన్నయ్య సాక్షి సంతకం పెట్టాడు. నాకు ఇచ్చిన కాపీలో అది లేదు. బుజ్జి, అతని భార్యపై న్యాయ పోరాటం చేస్తాను. కేసును మళ్లీ దర్యాప్తు చేయాలి. హత్యకేసుగా నమోదు చేయాలి. నా పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నాను. దంగేటి పావని, నరసాపురం -

ప్రేమించలేదని తుపాకీతో కాల్చేశాడు..
బెంగళూరు : బెంగళూరు వైట్‌ఫీల్డ్ ఏరియాలోని కాడ్‌గోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ఇంటర్ విద్యార్థినిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల సంఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా మరో విద్యార్థిని కూడా తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళితే ప్రగతి రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతున్న గౌతమి అదే కాలేజీ హాస్టల్లో ఉంటోంది. కాగా అదే కళాశాలలో ఆఫీస్ బాయి్ గా పని చేస్తున్న మహేష్ గత కొంతకాలంగా గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే ఆమె నిరాకరించటంతో అతడు కక్ష గట్టాడు. గత రాత్రి 11.30 గంటల సమయంలో మహేష్ ...హాస్టల్‌కు వెళ్లి గౌతమితో ప్రేమ విషయంలో వాగ్వివాదానికి దిగాడు. అయితే ఆమె నిరాకరించటంతో కోపం పట్టలేని అతడు సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉండే గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో గౌతమి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థిని శిరీష గాయపడింది. శిరీషను చికిత్స నిమిత్తం వైదేహీ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం పరారీలో ఉన్న మహేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలు గౌతమి స్వస్థలం అనంతపురం జిల్లా పావుగడ. ఆమె కుటుంబ సభ్యులకు కళాశాల యాజమాన్యం సమాచారం ఇచ్చింది. మరోవైపు శిరీష పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక హోం మంత్రి కేజే జార్జ్, సిటీ పోలీస్ చీఫ్ ఎంఎన్ రెడ్డి, సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.