
బాబాజీ, జయమ్మ (ఫైల్), బాబాజీ ఇంటి ముందు చంటిబిడ్డతో మౌనపోరాటం చేస్తున్న జయమ్మ
సంబేపల్లె : వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండల పరిధిలోని రౌతుకుంట గ్రామం కొత్తపల్లెకు చెందిన ఇంజేటి జయమ్మ అదే గ్రామం వంగిమళ్లవాండ్లపల్లెకు చెందిన నాగూరి బాబాజీ ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. బాధితురాలి వివరాల మేరకు.. గత కొన్నేళ్లుగా బాబాజీ, జయమ్మలు కువైట్‌లో సహజీవనం చేస్తున్నారు. వీరికి 6 నెలల మగబిడ్డ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్వదేశానికి వచ్చిన బాబాజీ తనకు జయమ్మతో ఎలాంటి సంబంధం లేదంటున్నాడు.
దీంతో చేసేదేమీ లేక బాధితురాలు జయమ్మ బాబాజీ ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. దీంతో తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై ఎస్‌ఐ సయ్యద్‌హషంను వివరణకోరగా జయమ్మ ఫిర్యాదు మేరకు బాబాజీపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment