గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాలు..గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంనకు చెందిన భవానీ(23) కాన్పు కోసం మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆరున్నర గంటలకు సాధారణ డెలివరీ అయింది. పురిటిలోనే బాబు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది తండ్రి చేతిలో బాబును పెట్టారు.
శవాన్ని ఇంటికి తీసుకెళ్లి పూడ్చి పెట్టండి అని తండ్రికి చెప్పారు. దీంతో తండ్రి జగన్నాధం శిశువును సొంతూరికి తీసుకెళ్లి పూడ్చుతుండగా బాబులో కదలిక కనపడింది. కొద్దిసేపటి తర్వాత ఏడవటం మొదలుపెట్టాడు. కాసింత ఆలస్యం చేసి ఉంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణంపోయేది. దీంతో జగన్నాధం కుటుంబసభ్యులు నిర్లక్ష్యానికి పాల్పడిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం
Published Tue, Sep 13 2016 5:07 AM | Last Updated on Wed, Oct 17 2018 3:53 PM
Advertisement
Advertisement