Government General Hospital Guntur
-
ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
-
ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసుల అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. కాగా, ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు జీజీహెచ్‌లోనే మూడు రోజుల పాటు అచ్చెన్నాయుడును విచారించారు. తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.(చదవండి : ఈఎస్ఐ స్కామ్‌లో ఆచితూచి అడుగులు) -
ఎలుకలు కొరికిన హామీలు
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నాడు పసికందును ఎలుకలు కొరికాయి. ఆ తల్లికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ఎలుకలే కొరికేశాయా?! జబ్బుతో ఉన్న పసికందును బతికించుకోవాలనే ఆశతో విజయవాడ నుంచి గుంటూరు జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగానికి తీసుకొస్తే అక్కడి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి బలయ్యాడు. బిడ్డను ఎలుకలు కొరుకుతున్నాయంటూ చెప్పినా పట్టించుకోకుండా పచ్చి బాలింతను అప్పుడు అవహేళన చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లు మంజూరు చేయమని కాళ్లరిగేలా తిరుగుతుంటే ఇప్పుడు హేళనగా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రెండుసార్లు కలిసి గోడు వెళ్లబోసుకున్నా ఫలితం శూన్యం. ముగిసిపోయిన అధ్యాయం అంటూ మంత్రులు, అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కనీసం బిడ్డ చనిపోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి శిక్ష అయినా పడుతుందంటే అదీ లేకుండా పోయింది. కోర్టులో పిటిషన్ వెనక్కు తీసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘‘బిడ్డ చనిపోయి మూడేళ్లు దాటుతున్నా ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదు.. అందుతుందనే ఆశా పోయిందంటూ.. ఎలుకల దాడిలో మృతిచెందిన పసికందు తల్లి చావలి లక్ష్మి ‘సాక్షి’ ఎదుట బోరున విలపిస్తూ తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఆమె పడుతున్న మనోవేదన ఆమె మాటల్లోనే..! గుంటూరు జీజీహెచ్‌లో శిశు శస్త్రచికిత్స విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న నా బిడ్డను 2015 ఆగస్టు 26వ తేదీన ఎలుకలు కొరుక్కుతిన్నాయి. అప్పటికి మూడు రోజుల ముందు ఎడమ చెయ్యి ఐదు వేళ్లు, కుడిచెయ్యి రెండు వేళ్లను ఎలుకలు కొరికి వేశాయి. మా బాబును మాకు ఇచ్చేయండి, ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళతామని బతిమలాడాను.. అయినా అక్కడి డాక్టర్లు పట్టించుకోలేదు. డాక్టర్ వెళ్లాక అక్కడి నర్సులు సైతం నన్ను హేళనగా మాట్లాడారే తప్ప, బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందని కనీస కనికరం చూపలేదు. తెల్లవారుజామున ఎలుకలు కొరికిన విషయం చెప్పినప్పటికీ మధ్యాహ్నం 2 గంట వరకు డాక్టర్లు రాలేదు. అప్పటికే నా బిడ్డ ప్రాణాలు విడిచాడు. చనిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ చేయడానికి వస్తారా.. అంటూ నేను వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఎవరూ సమాధానం చెప్పలేదు. అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, కలెక్టర్ కాంతిలాల్ దండే, మరికొందరు ఉన్నతాధికారులు నన్ను పిలిచి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియాతోపాటు ఉద్యోగం, ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు అయితే ఇచ్చారు కాని, ఇంత వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. ఉద్యోగం గానీ, ఇల్లు గానీ మంజూరు చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రితో గోడు వెళ్లబోసుకున్నా..! నా బిడ్డ చనిపోయిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ముఖ్యమంత్రిని కలిసి గోడు వెళ్ళబోసుకున్నా. జులై 23వ తేదీన సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి నా ఆవేదన.. నేను పడుతున్న ఇబ్బందుల గురించి వివరించి న్యాయం చేయాలంటూ వేడుకున్నా. పక్కనే ఉన్న అధికారులను పిలిచి రూ. 50 వేలు నగదు, ఇల్లు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశించడంతో న్యాయం జరుగుతుందని ఆశించా. అయితే సీఎం కార్యాలయంలోని అధికారులు నన్ను హేళనగా మాట్లాడారు. బియ్యం పెట్టగానే అన్నం అవుతుందా.. అన్నం ఉడకగానే కడుపు నిండుతుందా అంటూ సూటిపోటి మాటలు అన్నారు. అయినా భరించాను. 15 రోజుల తరువాత మరోసారి వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి దీనంగా విలపించాను. మీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదా అన్నారే తప్ప, అధికారులకు గట్టిగా చెప్పకుండానే వెళ్లిపోయారు. దీంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. రెండు వారాల క్రితం మరోసారి కలుద్దామని వెళితే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కలేదు. నా బిడ్డ చనిపోయి మూడేళ్లు దాటింది. అప్పటి నుంచి ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లు మంజూరు చేయమని ప్రాధేయపడుతూనే ఉన్నా. కేసు వెనక్కు తీసుకోమని బెదిరిస్తున్నారు ఎలుకల కొరికి నా బిడ్డ చనిపోయిన కేసులో నాకు ఇప్పటి వరకు సమన్లు రాలేదు. కేసు ఏమైందో కూడా తెలియని పరిస్థితి. కేసును పక్కదారి పట్టిస్తున్నారని, కేసులో మరికొందరి పాత్ర కూడా ఉందంటూ విజయవాడకు చెందిన ఓ న్యాయవాది ద్వారా కోర్టులో íపిటిషన్ వేయించాను. ఆ కేసు గురించి తెలుసుకునేందుకు గుంటూరు కోర్టుకు వెళ్లాను. అయితే అక్కడ నన్ను కలిసిన కొందరు కేసు వెనక్కు తీసుకోవాలంటూ బెదిరించారు. కేసు వెనక్కు తీసుకుంటే రూ. 2 లక్షలు ఇస్తామని, లేదంటే ఇబ్బందులు పడతావంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నా బిడ్డ బలయ్యాడనే విషయం దేశం మొత్తం తెలుసు. ఇలాంటి వారిని క్షమించి ఎలా వదిలేయాలి? అలా వదిలేస్తే నాలాంటి ఎందరో తల్లులకు కడుపు కోత తప్పదు. నాలా ఏ తల్లి బాధపడటానికి వీల్లేదు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’’ అని చెప్పారు చావలి లక్ష్మి.. హామీల పేరుతో మోసం చేశారు ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రభుత్వం, జీజీహెచ్ అధికారులపై అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, ప్రత్యక్ష ఆందోళనలకు దిగడంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు జీజీహెచ్‌కు వచ్చి మృతిచెందిన పసికందు తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగలతో చర్చించి అన్ని విధాలా ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రూ. 5 లక్షల నగదుతోపాటు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, సొంత ఇల్లు మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చి, గొడవ పెద్దది కాకుండా సద్దుమణిగేందుకు ప్రయత్నించారు. ఏదైనా దుర్ఘటన జరిగిన ప్రతిసారి నష్టపరిహారం పేరుతో ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి పరిస్థితి చక్కబడగానే పట్టించుకోకుండా వదిలేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. గతంలో జరిగిన అనేక ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పసికందు మృతిచెంది మూడేళ్లు దాటుతున్నా ఇచ్చిన హామీ ప్రకారం బాధితులకు ఇల్లు మంజూరు చేయకుండా తిప్పుకోవడమే కాకుండా అవహేళనగా మాట్లాడుతూ వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. – ఎన్.మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు -
మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లకు బ్రేక్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో 20 రోజులుగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరగటం లేదు. ఆపరేషన్ థియేటర్ కొరత వల్ల ఈ ఆపరేషన్లు నిలిపివేసినట్లు వైద్యులు చెబుతున్నారు. సుమారు 500 మంది రోగులు ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు చేయించుకుని సిద్ధంగా ఉన్నారు. కొంత మంది కీళ్ల బాధితులు తమ పేర్లు నమోదు చేయించుకుని ఆరు నెలలు గడిచినా తమకు ఆపరేషన్ చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. రెండేళ్లుగా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్స్ సమస్య ఉన్నా ఆస్పత్రి అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిడ్నీ, మోకీళ్ల మార్పిడికి ఒకటే థియేటర్! డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. సుమారు రూ.3 కోట్లతో నిర్మించిన ఈ థియేటర్స్‌లో రెండు ఆపరేషన్ థియేటర్స్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక ఆపరేషన్ థియేటర్లో న్యూరోసర్జరీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక ఆపరేషన్ థియేటర్లో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒకే ఆపరేషన్ థియేటర్లో కిడ్నీ, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయటంతో ఇన్ఫెక్షన్లు వస్తాయని కిడ్నీ ఆపరేషన్లు లేదా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిలిపివేస్తున్నారు. ఇలా 20 రోజులుగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిలిపివేయటంతో కీళ్ల నొప్పుల బాధితులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ నిధులు కోసం ఎదురుచూపులు... ప్రభుత్వం ఆపరేషన్లు చేసేందుకు జీజీహెచ్‌కు అదనంగా నిధులు మంజూరు చేయలేదు. దీంతో వైద్యులు ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు ప్రక్రియ కూడా నిలిపివేశారు. రాష్ట్రంలో ఉచితంగా గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన రోగులు సైతం గుంటూరుకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం గుంటూరుతోపాటుగా కర్నూలు, విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రులకు 2017 మే నెలలో నిధులు విడుదల చేసింది. కాని నేటి వరకు ఆ రెండు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు ప్రారంభం కాలేదు. వారికి కేటాయించిన నిధులను గుంటూరుకు జీజీహెచ్‌కు ప్రభుత్వం బదిలీ చేయటం ద్వారా పేద రోగులకు ఇబ్బంది లేకుండా గుంటూరు వైద్యులు ఆపరేషన్లు చేసే అవకాశం ఉంటుంది. సాక్షి కథనంతో ఆపరేషన్లు ప్రారంభం... జీజీహెచ్‌లో 2015 ఆగస్టులో ఎలుకల దాడిలో పసికందు మరణంతో ఆస్పత్రి ప్రతిష్ట మసకబారింది. ఆస్పత్రిపై పేదలకు నమ్మకం కల్పించేందుకు మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గుంటూరు జీజీహెచ్‌లో 2016 జనవరి 23న మోకీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. కేవలం ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందన్న పేరు తప్ప వైద్యులు, వైద్యపరికరాలన్ని ప్రైవేటు వైద్యులు సహకారంతో సమకూరాయి. దీనిపై ‘సాక్షి’ విమర్శనాత్మకంగా కథనాలు ప్రచురించడంతో ‘ తనకు జరిగిన ఆపరేషన్, కార్పొరేట్ వైద్యాన్ని ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు కూడా ఉచితంగా అందేలా చేస్తాను’ అంటూ డాక్టర్ కామినేని వాగ్దానం చేశారు. చాలా మంది పేద రోగులు ఆసుపత్రికి ఆపరేషన్ల కోసం క్యూ కడుతున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో సాక్షి వరుస కథనాలు ప్రచురితం చేయటంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి 2017 మే నెలలో రూ.65 లక్షల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ నిధులతో 26–7–2017 నుంచి సర్జరీలను నిర్వహిస్తున్నారు. ఉన్నతి ఫౌండేషన్‌తో ఉచితంగా ఆపరేషన్లు.... గుంటూరు బీఎంఆర్ మల్టీస్పెషాలిటీ హాస్పటల్స్ అధినేత, ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు. ఆపరేషన్లు చేయడంతోపాటుగా సుమారు రూ.20 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్లను సైతం జీజీహెచ్‌కు విరాళంగా ఇచ్చి 20 మందికి తన సొంత ఖర్చుతో ఆపరేషన్లు చేశారు. బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు. దాత వచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నా ప్రభుత్వం నిధులను మంజూరు చేయకుండా, ఆస్పత్రి అధికారులు ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేయకుండా జాప్యం చేస్తూ రోగులు ఇబ్బంది పడేలా చేయటం విమర్శలకు తావునిస్తుంది. కిడ్నీ ఆపరేషన్ల వల్ల నిలిపివేశాం గత 20 రోజులుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తూ ఉండటంతో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిలిపివేశాం. ఆస్పత్రిలో విజయవంతంగా 74 మందికి ఆపరేషన్లు చేశాం. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేసేందుకు నాట్కో ఫార్మా కంపెనీ వారు ముందుకొచ్చారు. ఆపరేషన్ థియేటర్ నిర్మాణం జరిగితే నిరంతరంగా ఆపరేషన్లు చేస్తాం. మోకీళ్లనొప్పుల బాధితులు 500 మంది తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆస్పత్రిలో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు బుధవారం, శనివారం చేస్తున్నాం. ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనంగా బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం.– డాక్టర్ గంటా వరప్రసాద్,ఆర్థోపెడిక్ వైద్య విభాగాధిపతి -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం!
సాక్షి, గుంటూరు/ గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఎం.జోషిబాబుకు ఈ నెల 12న జరిగిన ఓ ప్రమాదంలో కుడిచేయి నుజ్జునుజ్జయింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చేతి వేళ్లు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం సర్జికల్ ఆపరేషన్ థియేటర్ (ఎస్ఓటీ)లో శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే ఆపరేషన్ మధ్యలో ఉండగా హ్యాండ్ డ్రిల్ మిషన్ పనిచేయలేదు. దీంతో వెంటనే అతడిని ఆర్థోపెడిక్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. సరిగ్గా గత బుధవారం కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. పల్నాడు ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వెంకమ్మకు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ నెల 7న ఎస్ఓటీలో శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ మధ్యలో ఉన్న సమయంలో ఓటీ లైట్లు ఆరిపోయాయి. దీంతో వైద్యులు సెల్‌ఫోన్ లైట్ల మధ్య ఆపరేషన్ పూర్తి చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని ఎస్ఓటీలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు రోగులను, వారి కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం జీజీహెచ్‌లోని చిన్న పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న ఓ పసికందును ఎలుకలు కొరికి చంపిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జీజీహెచ్‌ను ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు హడావుడి చేశారు. ఆ తర్వాత షరామామూలే. జీజీహెచ్‌లో జరిగే ఆపరేషన్ల వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా ఆపరేషన్ థియేటర్లలో వైద్య పరికరాలు, వసతుల కల్పనను మాత్రం ఆస్పత్రి అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవేళ నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు నాణ్యత లేని వైద్య పరికరాలు సరఫరా చేస్తుండడంతో అవి ఆపరేషన్ల మధ్యలో మొరాయిస్తున్నాయి. థియేటర్లు లేక నిలిచిన ఆపరేషన్లు జీజీహెచ్‌లోని ఎస్ఓటీలలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ వైద్యులు ఆస్పత్రి అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి ఆపరేషన్లు నిలిపివేశారు. మూడు పర్యాయాలు ఆపరేషన్లు నిలిపివేయడంతో అధికారులు మరమ్మతుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. మరమ్మతులు పూర్తయినా సరిపడా వైద్య పరికరాలు లేకపోవడంతో తాజాగా బుధవారం శస్త్రచికిత్స నిలిచిపోయింది. ఎస్ఓటీలో ముఖ్యమైన వైద్య పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోందంటూ వైద్య సిబ్బంది వాపోతున్నారు. న్యూరోసర్జరీ వైద్య విభాగంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారికి తగ్గట్టుగా ఆపరేషన్ థియేటర్లు లేక పలుమార్లు ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి. ఆర్థోపెడిక్ వైద్య విభాగానికి ప్రత్యేకంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు థియేటర్ కేటాయించకపోవడం వల్ల ఏడాది పాటు ఆపరేషన్లు నిలిచిపోయాయి. అత్యంత ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకూ ప్రత్యేకంగా థియేటర్ కేటాయించకపోవడంతో ఆర్నెల్లుగా ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేక ఎంతోమంది పేదలు జీజీహెచ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జీజీహెచ్ ఎదుట ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లే జీజీహెచ్‌లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో ఆస్పత్రిలో ఎలుకలు చిన్నారిపై దాడి చేశాయని, పాములు కూడా వచ్చాయని ఆయన మండిపడ్డారు. సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద ముస్తఫా బైఠాయించిన నిరసన తెలిపారు. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు టార్చ్‌లైట్ వెలుగులో ఆపరేషన్లు చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎవరు తీశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా గత మూడు నెలలుగా సెల్‌ఫోన్, టార్చ్లైట్ల వెలుగులోనే వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం. -
మృత్యుఘోష
సాక్షి, గుంటూరు: వెంటిలేటర్‌పై ఉన్న పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.. బతికున్న పసికందు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారిస్తే స్మశానం వద్ద కదిలాడాడని కుటుంబ సభ్యులు వెనక్కు తెచ్చారు.. డబ్బు కోసం బిడ్డల్ని మార్చారంటూ ఆరోపణలు.. బాలింత చనిపోతే పది గంటల వరకూ చూడనేలేదు.. స్కానింగ్ కోసం వెళ్లిన గర్భిణిని పట్టించుకోకపోవడంతో గంటల కొద్దీ నిరీక్షించి స్కానింగ్ కేంద్రం వద్దే కిందపడిపోయి అక్కడే ప్రసవించింది. ఆ నెత్తుటి మరకలను గర్భిణి తల్లితోనే తుడిపించారు. బతికుండగానే స్ట్రెచర్‌తో సహా ఓ వృద్ధుడ్ని బయటకు గెంటేశారు. సూదిమందు డ్యూటీ తమది కాదంటే తమది కాదంటూ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఓ రోజంతా వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య సోదరికే సూది మందు ఇవ్వకుండా ఉంచిన విచిత్ర ఘటన.. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఇవన్నీ మారుమూల పీహెచ్సీలో కాదు.. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో జరుగుతున్న వరుస దారుణాలు.. ఇక్కడ నిత్యం 20 మందికిపైగా మృత్యువాత పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు క్లినిక్లకే అధిక సమయం అధికారికంగా 1177 పడకలు, అనధికారికంగా 1700కుపైగా పడకలతో అతి పెద్దదిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిస్థితి ఊరుగొప్ప.. పేరుదిబ్బలా తయారైంది. అత్యవసర వైద్యసేవలు పొందాలంటే రోగులకు కష్టంగా మారింది. ఫలితంగా ఈ ఆసుపత్రిలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు క్లినిక్లకే వారు అధిక సమయం కేటాయిస్తున్నారు. క్యాజువాల్టీ, ట్రామాకేర్, ఐసీయూ, ఇతర ఎమర్జెన్సీ, గైనిక్ వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్యసేవలందక మరణాలు పెరుగుతున్నాయి. కొందరు వైద్యాధికారుల తప్పిదాల కారణంగా ఆస్పత్రి మొత్తానికే చెడ్డ పేరు వస్తోంది. నాలుగు వేలకుపైగా అవుట్ పేషెంట్లు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి గుంటూరుతోపాటు చుట్టుపక్కల ఆరు జిల్లాల ప్రజలు వస్తారు. రోజుకు దాదాపు 3, 500 నుంచి 4,000 వరకు అవుట్ పేషెంట్లు ఉంటారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లోకి రోగులు, వారి వెంట సహాయకులు కలిపి మొత్తం రోజుకు 10 వేల మంది వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రి వైద్యుల సేవల తీరుపై భారీగా ఫిర్యాదులందుతున్నాయి. ఏ వార్డులోనూ సంబంధిత వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నతాధికారులు తనిఖీల పేరుతో వార్డులు తిరుగుతున్నా వైద్య సిబ్బంది వ్యవహారశైలిని మాత్రం గాడిలో పెట్టలేకపోతున్నారు. జీజీహెచ్‌లోని పలు వార్డుల్లో గుండెల్ని పిండేసే ఘటనలు రోజుకొకటి కనిపిస్తున్నాయి. పెరుగుతున్న మరణాల సంఖ్య జీజీహెచ్‌లో 2017 జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ తొమ్మిది నెలల్లో 5, 321 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్క చెబుతున్నాయి. ఇంకా ఇక్కడ సరైన వైద్యం అందక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో జరిగిన మరణాలు చాలానే ఉన్నాయి. అత్యవసర వార్డుల్లో చేరిన రోగులే సకాలంలో వైద్యసేవలు అందక ప్రాణాలొదులుతున్నట్లు తెలుస్తోంది. క్యాజువాల్టీ , ట్రామాకేర్, ఎక్యుట్మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీ), ఇంటెన్సివ్ మెడికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల మరణాల రేటు ఎక్కువగా నమోదవుతోంది. తీరుమార్చుకోని జీజీహెచ్ అధికారులు ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్సల తీరును నిత్యం పర్యవేక్షించాల్సిన రెసిడెంట్ మెడికల్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసే వైద్యులు ఎంత మంది ప్రైవేట్ ప్రాక్టీసులు చేస్తున్నారు, వారు ఆసుపత్రిలో ఉంటున్నారా.. మధ్యలోనే వెళ్తున్నారా అనే విషయాలపై ఇంటిలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం, ప్రభుత్వం కొందరిపైనే చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఒక్కోమారు రాత్రిళ్లు కనీసం ఇంజెక్షన్లు చేయడానికి కూడా సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. దీంతో అత్యవసర వార్డుల్లో మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పోస్టులు అనేక ఏళ్లుగా సీనియర్లను కాదని రాజకీయ ఒత్తిళ్లతో తమకు ఇష్టమొచ్చిన వారిని కూర్చోబెడుతున్నారు. దీంతో సీనియర్ వైద్యులెవరూ వీరి మాటలు లెక్క చేయడం లేదు. ఇన్‌ఛార్జిలు కావడంతో వీరు సైతం వైద్యులు, సిబ్బందిపై సీరియస్‌గా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో జీజీహెచ్‌లో మరణాల సంఖ్య తగ్గడం లేదు. -
మంటగలసిన మానవత్వం
బతికుండగానే బయటపడేసిన గుంటూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది - కాళ్లావేళ్లాపడ్డా కనికరించని వైనం - చనిపోయిన తర్వాత మహాప్రస్థానం వాహన ఏర్పాటుకు నిరాకరణ - చుట్టుపక్కల వారు నిలదీయడంతో చివరకు దిగొచ్చిన సిబ్బంది గుంటూరు ఈస్ట్: తన తండ్రి ప్రాణాలు కాపాడమంటూ ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆ కుమార్తెకు కన్నీళ్లే మిగిలాయి. ఆస్పత్రి సిబ్బంది నిరాదరణతో ఆమె కళ్ల ముందే ఆ తండ్రి ప్రాణాలొదిలాడు. కనీసం మృతదేహాన్ని తరలించేందుకు వాహనాన్ని కూడా ఇవ్వలేదు. ఈ హృదయ విదారక సంఘటన బుధవారం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ముళ్లమూరు మండలం రాజగోపాలరెడ్డినగర్కు చెందిన పంతా భోగిరెడ్డి(79) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన కుమార్తె ఎర్రమ్మ ఈ నెల 19న అతన్ని జీజీహెచ్‌లోని అత్యవసర విభాగంలో చేర్చింది. ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు బుధవారం మూడో వార్డుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె తండ్రిని తీసుకొని మూడో వార్డుకు వెళ్లగా.. అక్కడి సిబ్బంది వార్డులో చేర్చుకోకుండా వెనక్కి పంపించేశారు. తిరిగి అత్యవసర విభాగానికి రాగా.. అక్కడి వైద్యులు, సిబ్బంది పట్టించుకోవపోవడంతో తన తండ్రి ప్రాణాలు కాపాడాలంటూ ఎర్రమ్మ వారి కాళ్లావేళ్లా పడింది. కనీస మానవత్వం చూపని ఆ వైద్యులు, సిబ్బంది.. బతికుండగానే భోగిరెడ్డిని స్ట్రెచర్‌తో సహా బయటపడేశారు. కొంతసేపటికి భోగిరెడ్డి అందరి ఎదుటే విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలాడు. ముందే మృతి చెందినట్టు నమోదు.. ఎర్రమ్మ భోరున విలపిస్తూ కేకలు వేయడంతో.. వైద్యులు, సిబ్బంది హడావుడిగా వచ్చి భోగిరెడ్డి మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి రాకముందే అతను మృతి చెందినట్టుగా రికార్డుల్లో నమోదు చేసి మృతదేహాన్ని తిరిగి ఎర్రమ్మకు అప్పగించారు. కాగా, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తన వద్ద డబ్బుల్లేవని.. మహాప్రస్థానం వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆస్పత్రి అధికారులను ఎర్రమ్మ వేడుకుంది. కానీ వారు ఇందుకు అంగీకరించలేదు. ఎర్రమ్మ పడుతున్న బాధను చూసిన వారు అధికారులను నిలదీయడంతో ఎట్టకేలకు దిగొచ్చిన సిబ్బంది మహాప్రస్థానం వాహనంలో భోగిరెడ్డి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. -
ఆస్పత్రిలో మద్యం తాగుతూ..
గుంటూరు మెడికల్(గుంటూరు ఈస్ట్): గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో శుక్రవారం పట్టపగలు మహిళలు మద్యం తాగుతూ పట్టుబడ్డ సంఘటన కలకలం రేపింది. గుంటూరుకు చెందిన తోకల లక్ష్మి రక్తస్రావంతో బాధపడుతూ చికిత్స కోసం 22న ఆస్పత్రిలోని చేరింది. ఆమెను పరామర్శిచేందుకు శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పొత్తూరు అలివేలు, దేవనబోయిన అంకమ్మ, బొజ్జా యశోధ, గుంటూరుకు చెందిన వీరవల్లి హిమబిందు వచ్చారు. పరామర్శ అనంతరం వారు 107 వార్డు వద్ద భోజనం చేస్తూ మద్యం తాగడం ప్రారంభించారు. మత్తు ఎక్కాక గొడవ చేయడం ప్రారంభించడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపైనా దాడికి దిగారు. దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేశ్‌కు ఫిర్యాదు చేయటంతో ఆయన అవుట్‌పోస్ట్ పోలీసుల సాయంతో వారిని పట్టుకుని, మందలించి పంపించారు. -
జీజీహెచ్‌లో కొనసాగుతున్న ఆందోళన
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. జూనియర్ డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్టు చేయాలని వారు కొన్ని రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం విదితమే. అయితే, కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి ముందస్తు బెయిల్ కోసం గుంటూరు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకుంటున్నారు. -
కొనసాగుతున్న మెడికోల ఆందోళన
-
కొనసాగుతున్న మెడికోల ఆందోళన
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికోల నిరసనల పర్వం కొనసాగుతోంది. ప్రొఫెసర్ లక్ష్మీ వేధింపులు తాళలేక సంధ్యారాణి అనే ఓ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పటి వరకు ప్రొఫెసర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా.. ఈ రోజు కూడా ఆస్పత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళన నిర్వహించారు. ఘటన జరిగి ఆరు రోజులైనప్పటికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. -
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం
-
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
గుంటూరు : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. బతికున్న శిశువు చనిపోయిందంటూ వైద్యులు చెప్పిన సంఘటన మంగళవారం జీజీహెచ్‌లో చోటుచేసుకుంది. శిశువు మృతి చెందినట్లు చెప్పడటంతో తీసుకు వెళుతుండగా, బిడ్డలో కదలికలను తండ్రి గుర్తించాడు. ఈ విషయాన్ని అతడు వైద్యుల దృష్టికి తీసుకు వెళ్లడంతో చికిత్స నిమిత్తం శిశువును ఐసీయూకు తరలించారు. దీంతో బతికుండగానే చనిపోయినట్లు చెప్పిన వైద్యుల అలక్ష్యంపై శిశువు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ డీఎం అండ్ హెచ్‌వో, సూపరింటెండెంట్ కు ఫోన్ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జీజీహెచ్‌ను సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ జీజీహెచ్‌లో ఎలుకలు దాడి చేయగా శిశువు మృతిచెందిన విషయం తెలిసిందే. -
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం
గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాలు..గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంనకు చెందిన భవానీ(23) కాన్పు కోసం మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆరున్నర గంటలకు సాధారణ డెలివరీ అయింది. పురిటిలోనే బాబు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది తండ్రి చేతిలో బాబును పెట్టారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లి పూడ్చి పెట్టండి అని తండ్రికి చెప్పారు. దీంతో తండ్రి జగన్నాధం శిశువును సొంతూరికి తీసుకెళ్లి పూడ్చుతుండగా బాబులో కదలిక కనపడింది. కొద్దిసేపటి తర్వాత ఏడవటం మొదలుపెట్టాడు. కాసింత ఆలస్యం చేసి ఉంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణంపోయేది. దీంతో జగన్నాధం కుటుంబసభ్యులు నిర్లక్ష్యానికి పాల్పడిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. -
చరిత్ర సృష్టించారు
గుండెమార్పిడిలో గుంటూరు జీజీహెచ్ వైద్యుల రికార్డు బ్రెయిన్‌డెడ్ వ్యక్తి గుండె మరొకరికి అమరిక పేద కుటుంబంలో వెలుగులు నింపిన వైద్యులు రూ.30 లక్షల వ్యయమయ్యే ఆపరేషన్ ఉచితంగా.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శస్త్రచికిత్స ఉద్విగ్న క్షణాల నడుమ విజయవంతం .. గుండెమార్పిడిలో మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా జీజీహెచ్‌కు గుర్తింపు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే కృషి ఫలితమేనంటూ అభినందనలు మొన్న జాయింట్ రీ ప్లేస్మెంట్.. నిన్న కిడ్నీ మార్పిడి.. నేడు గుండె మార్పిడితో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి చరిత్ర సృష్టించింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే లభించే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను జీజీహెచ్‌లో పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండెమార్పిడి చేసిన మొట్టమొదటి ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు నిలిచింది. డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో శుక్రవారం జీజీహెచ్‌లో గుండెమార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. గుంటూరు మెడికల్ : సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్, ప్రముఖ గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే సుమారు రూ.30 లక్షలు ఖరీదుచేసే గుండె మార్పిడి ఆపరేషన్‌ను గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలుకు ఉచితంగా చేశారు. ప్రభుత్వం గుండెమార్పిడి ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ గోఖలేకు అనుమతులు ఇచ్చినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. దీంతో దాతల సహాయంతో సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా గుండెమార్పిడి ఆపరేషన్ జరిగింది. జీజీహెచ్‌లో సహృదయ ట్రస్టు 2015 మార్చి 18 నుంచి గుండె ఆపరేషన్లు నిర్వహిస్తోంది. సుమారు 200 వరకు గుండె ఆపరేషన్లు ట్రస్టు ఆధ్వర్యంలో జరిగాయి. మొట్టమొదటి గుండెమార్పిడి సర్జన్ గోఖలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్లు చేసిన వ్యక్తిగా డాక్టర్ గోఖలే పేరు రికార్డుల్లో ఉంది. సుమారు పదివేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు చేయగా, 22 వరకూ గుండెమార్పిడి ఆపరేషన్లు చేశారు. 2015లో ఉగాది పురస్కారం, 2016లో పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. అవరోధాలు అధిగమించి.. జీజీహెచ్‌లో డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలో సహృదయ ట్రస్టు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2015 జనవరి నుంచే గుండె మార్పిడి ఆపరేషన్ చేసేందుకు పలువురు రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి సిద్ధం చేసుకున్నారు. సుమారు పదిమంది వరకూ గుండెమార్పిడి ఆపరేషన్ రోగులకు పరీక్షలు పూర్తయ్యాయి. బ్రెయిన్‌డెడ్ కేసు నుంచి గుండెను సేకరించి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గుండె రోగులకు అమర్చేందుకు రెండుసార్లు ప్రయత్నాలు చేశారు. జీజీహెచ్‌కు వచ్చిన బ్రెయిన్ డెడ్ కేసును నిర్ధారణ చేసేందుకు వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఆ రెండు కేసులూ చనిపోయాయి. వైద్యుల మధ్య సహకారలోపం వల్లే రెండు నెలల క్రితం నుంచి గుండెమార్పిడి ఆపరేషన్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలోనే బ్రెయిన్‌డెడ్ కేసు నుంచి గుండెను తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఆ ఇంట ఆనందం పునర్జన్మనిచ్చారు నా భర్త ఉప్పు ఏడుకొండలుకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి వైద్యులు, డాక్టర్ గోఖలే పునర్జన్మనిచ్చారు. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న నా భర్తకు నగరంలోని పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలని, అందుకోసం రూ.30 లక్షల వరకూ ఖర్చవుతుందని ప్రైవేట్ వైద్యులు చెప్పారు. ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని పోషించేందుకు జీతం సరిపోకపోవడంతో నేను కూడా ఇళ్లల్లో పనులు చేస్తూ ఆయనకు చేదోడువాదోడుగా ఉంటున్నాను. అనారోగ్యంతో ఏడాదిగా డ్రైవర్ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ పోషణే కష్టంగా మారింది. అంతమొత్తంలో డబ్బు ఖర్చు పెట్టలేక నా భర్తపై ఆశలు వదిలేసుకున్నాను. నా భర్త ఓ డాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో ఆయన సూచన మేరకు ఆరు నెలల క్రితం జీజీహెచ్‌కు వచ్చాం. డాక్టర్ గోఖలే ఆరునెలలుగా మాకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ గుండెమార్పిడి ఆపరేషన్ చేస్తామని భరోసా ఇచ్చారు. గుండెకోసం ఇన్ని రోజులు వేచి ఉన్నాం. ఈ శుక్రవారం జీవితంలో నాకు మరిచిపోలేని రోజు. జీజీహెచ్ వైద్యులకు, డాక్టర్ గోఖలేకు రుణపడి ఉంటాను. - ఓర్ప (ఉప్పు ఏడుకొండలు భార్య) ఇద్దరూ ఏడుకొండలే.. ఇద్దరూ డ్రైవర్లే.. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు (44) ఈనెల 13న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈనెల 19వ తేదీన మంగళగిరి ఎన్నారై వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. ఆయన భార్య నాగమణి అవయవదానం చేసేందుకు ముందుకు రావడంతో గుంటూరు స్వర్ణభారతి నగర్ సీబ్లాక్ మూడో వీధికి చెందిన ఉప్పు ఏడుకొండలుకు విజయవంతంగా గుండె అమర్చారు. గుండెదానం చేసినవారు, గుండెను స్వీకరించిన వారు ఇద్దరి పేర్లు ఏడుకొండలు కాగా, ఇద్దరూ డ్రైవర్లే కావడం మరో విశేషం. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఆపరేషన్ జరిగింది. డాక్టర్ గోఖలేతో పాటు సర్జన్లు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, మత్తు వైద్య నిపుణుడు సుధాకర్, డాక్టర్ భరద్వాజ్, డాక్టర్ షరీఫ్, డాక్టర్ అనూష ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. - గుంటూరు మెడికల్ ఓ ఇంట అంతులేని విషాదం.. మరో ఇంట అవధుల్లేని ఆనందం.. ఓ కంట విషాదాశ్రు ప్రవాహం.. మరో కంట ఆనంద బాష్ప జలపాతం.. హృదయంలో అటు ఉద్వేగం.. ఇటు ఉత్తేజం.. అర్థంతరంగా ముగిసిన ఓ జీవన పయనం ఆరిపోతున్న ఆరు దీపాలను వెలిగించింది. ఈ ప్రాణదానంతో ఆగిపోతున్న ఓ గుండె ఊపిరిపోసుకుని పేద కుటుంబానికి చిరుదివ్వె అయ్యింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై మంగళగిరి ఎన్నారైలో చికిత్స పొందుతున్న విజయవాడకు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు గుండెను గుంటూరు జీజీహెచ్‌లో మరణానికి చేరువైన ఉప్పు ఏడుకొండలుకు అమర్చి ప్రాణదానం చేశారు. ఇద్దరు ఏడుకొండలు మధ్య సాగిన ఈ గుండెమార్పిడి శస్త్రచికిత్సను ఊపిరి తెగే ఉద్రిక్త క్షణాల మధ్య గుంటూరు జీజీహెచ్ వైద్యులు శుక్రవారం విజయవంతంగా పూర్తిచేశారు. -
జీజీహెచ్‌లో తొలి గుండెమార్పిడి ఆపరేషన్ సక్సెస్
గుంటూరు: నవ్యాంధ్రప్రదేశ్‌లో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు దేశంలోని నాలుగు ప్రభుత్వాస్పత్రుల్లో ఈ తరహా శస్త్రచికిత్సలు జరుగుతుండగా.. ఐదో ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినప్పటికీ దాతల సహకారం, సొంత ఖర్చులతో ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే శుక్రవారం గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు గుండె మార్పిడి శస్త్రచికిత్స ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు ముగించారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, భరద్వాజ్, శ్రీనివాస్, షరీఫ్, అనూష పాల్గొన్నారు. గుండెను సేకరించిన వైనం.. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు(44) ఈ నెల 13న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 19న ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో గుంటూరు నగర శివారులోని స్వర్ణభారతినగర్‌కు చెందిన ఉప్పు ఏడుకొండలు జీజీహెచ్‌లో ఆరు నెలలుగా గుండె జబ్బుతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. గుండె పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో గుండె మార్పిడి చేయాలని డాక్టర్ గోఖలే నిర్ణయించారు. గుండె దాతల కోసం ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన ఇమడాబత్తుని ఏడుకొండలు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అవడంతో గుండెను గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఉప్పు ఏడుకొండలుకు అమర్చాలని నిర్ణయించారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్ అయిన ఇమడాబత్తుని ఏడుకొండలుకు శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకూ శస్త్రచికిత్స చేసి గుండెను సేకరించారు. గుండె తరలింపునకు ప్రత్యేక అనుమతులు గుండెను ఎలాంటి ఇబ్బందులు లేకుండా 15 నిమిషాల్లో గుంటూరు జీజీహెచ్‌కు తరలించేందుకు సహకరించాలంటూ వైద్యులు గుంటూరు ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కోరారు. స్పందించిన ఆయన శుక్రవారం ఉదయం నుంచి మంగళగిరి- గుంటూరు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే విజయవాడ - చెన్నై జాతీయ రహదారి ఉదయం 11 గంటల నుంచి ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. సరిగ్గా 11.04 గంటలకు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి బయలుదేరి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు జీజీహెచ్‌కు కేవలం 14 నిముషాల్లో గుండెను తీసుకొచ్చారు. ఆంబులెన్సులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన థర్మాకోల్ ఐస్‌బాక్స్‌లో గుండెను భద్రపరిచారు. గుండెను సురక్షితంగా చేర్చడంలో అర్బన్ ఏఎస్పీలు భాస్కరరావు, సుబ్బరాయుడు, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసులు, ఈస్ట్ డీఎస్పీ సంతోష్, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ గురుస్వామి, సీఐలు వెంకన్న చౌదరి, సురేష్‌బాబు, వేమారెడ్డి సుమారు వంద మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పసికందు గడ్డలో మరో బిడ్డ
* గడ్డలో తల తప్ప మిగిలిన అవయవాలు * అసంపూర్తిగా ఏర్పడిన రెండో శిశువు * గుంటూరు జీజీహెచ్‌లో శస్త్రచికిత్స గుంటూరు మెడికల్: మలవిసర్జన మార్గం వద్ద గడ్డ ఉన్న పసికందుకు ఆపరేషన్ చేయగా అందులో మరో బిడ్డ కనిపించడంతో వైద్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. తల మినహా మిగతా శరీర అవయవాలన్నీ గడ్డలో కనిపించాయి. తల్లి గర్భంలో కవలలు రూపుదిద్దుకునే సమయంలో అసౌకర్యం వల్ల రెండో శిశువు ఏర్పడకుండా అసంపూర్తిగా నిలిచిపోయినట్లు వైద్యులు గుర్తించారు. పసికందు మలవిసర్జన మార్గం వద్దనున్న గడ్డను తొలగించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన రాధా, నాగులు దంపతులకు తొలి సంతానంగా మార్చి 30న మగశిశువు జన్మించాడు. పుట్టిన శిశువు మలవిసర్జన మార్గం వద్ద దాదాపు 1.2 కిలోల బరువు గడ్డ (ట్యూమర్) ఉంది. దీంతో బిడ్డను గుంటూరు జీజీహెచ్‌కు అదేరోజు తీసుకొచ్చారు. జీజీహెచ్ వైద్యులు సాధారణ గడ్డగా భావించి ఈ నెల 2వ తేదీన శస్త్రచికిత్స చేశారు. గడ్డకు మత్తు ఇచ్చి తొలగించే ప్రయత్నం చేయగా లోపల పూర్తిగా ఏర్పడని చెయ్యి కనిపించింది. దాంతోపాటు కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె, పేగులు, ఇతర శరీర అవయవాలన్నీ గడ్డలో ఉన్నాయి. తల తప్ప ఇతర అవయవాలన్నీ గడ్డలో ఉండడంతో వైద్యులు ‘ఇన్‌కంప్లీట్ కన్జాయింటనల్’గా నిర్ధారించారు. తల్లి గర్భంలో కవలలు ఏర్పడే సమయంలో అసౌకర్యం కలగడంతో ఒక శిశువు మాత్రమే పూర్తిగా రూపుదిద్దుకుని రెండో శిశువు అసంపూర్తిగా ఏర్పడినట్లు పిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ చందా భాస్కరరావు గురువారం చెప్పారు. సుమారు 3 గంటలపాటు శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించి పసికందు ప్రాణాలను నిలిపామని పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ చందా భాస్కరరావుతోపాటు డాక్టర్లు జయపాల్, కె.నరసింహారావు, జాకీర్ పాల్గొన్నారు. ఆహార నాళం ఏర్పడని శిశువు ప్రాణాలు కాపాడారు కేవలం కిలోన్నర బరువు ఉండి, ఊపిరితిత్తుల సమస్యతో ఆహార నాళం ఏర్పడకుండా ప్రాణాపాయ స్థితిలో తమ వద్దకు వచ్చిన ఆడ శిశువు ప్రాణాలను కాపాడినట్లు డాక్టర్ చందా భాస్కరరావు చెప్పారు. తల్లి గర్భంలో పిండం ఎదిగే సమయంలో మూడు, నాలుగు వారాల మధ్య కాలంలో ఆహార నాళాలు, ఊపిరితిత్తులు ఏర్పడతాయన్నారు. ఇవి ఏర్పడే సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే ఊపిరితిత్తులు, ఆహార నాళం విడిపోకుండా అతుక్కుని పుట్టిన శిశువుకు ప్రాణాపాయం కలుగుతుందన్నారు. సకాలంలో శస్త్రచికిత్స చేస్తే పసికందు ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. -
గుంటూరు జీజీహెచ్‌లోని ప్రసూతి వార్డులో చోరీ
గుంటూరు : గుంటూరు జీజీహెచ్ ప్రసూతి వార్డులోని ఫ్యాన్లను ఆగంతకులు చోరీ చేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది బుధవారం ఉదయం గుర్తించారు. ఆ విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారులకు తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా ప్రసూతి వార్డులోని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. -
విద్యుత్ షాక్‌తో పసికందు మృతి
► మరో నలుగురికి తీవ్రగాయాలు ► ఒకరి పరిస్థితి విషమం బీకేపాలెం(కాకుమాను): విద్యుత్ షార్ట్ సర్క్వూట్ సంభవించి ఏడు నెలల పసికందు మృతి చెందిన సంఘటన మండలంలోని బీకేపాలెంలో మంగళవారం వేకువజామున సుమారు మూడుగంటల సమయంలో జరిగింది. బీకేపాలెం వీఆర్వో సుధారాణి తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన జంగా చంద్రపాల్ కూతురు హెమీమా అన్నప్రాసన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతని అక్క అరుణ తన ఇద్దరు పిల్లలతో సహా హాజరైంది. ఎప్పటిలానే ఇంటి పనులు ముగించుకుని సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం సుమారు 3 గంటలకు ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో చిన్నారి హెమీమా, అరుణ, ఆమె కుమారుడు, సుబ్బారావు, కుమార్తె ప్రియాంక, చంద్రపాల్ తల్లి కుమారిలకు తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ పసికందు హెమీమా మృతి చెందింది. అరుణ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. -
ఎందుకీ వివక్ష..?
పేదల పెద్దాస్పత్రిపై ప్రభుత్వం శీతకన్నుస్టాఫ్ నర్సుల నియామకంలో తీవ్ర పక్షపాతం పడకలు ఎక్కువ.. నర్సింగ్ స్టాఫ్ తక్కువజీజీహెచ్తో పోల్చితే నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రుల్లోనే అధికం తాజాగా విడుదల చేసిన కాంట్రాక్ట్ పోస్టుల్లోనూ అన్యాయం పట్టించుకోని అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు నేతల తీరును తప్పుపడుతున్న జిల్లా ప్రజలు సాక్షి, గుంటూరు : కోస్తాంధ్రలో ఆరు జిల్లాలకు ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిపై ప్రభుత్వం, వైద్య విద్య ఉన్నతాధికారులు వివక్ష చూపుతున్నారు. పడ కల సంఖ్యకు తగినంతగా స్టాఫ్ నర్సుల నియామకం లేకపోవడంతో వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో పేదల పెద్దాస్పత్రిగా పేరు గాంచిన జీజీహెచ్‌కు అన్యాయం జరుగుతోంది. ఘన చరిత్ర కలిగిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రి జీజీహెచ్ 1954లో ప్రారంభమైంది. అప్పట్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు, రోగులకు అనుగుణంగా 183 మంది స్టాఫ్‌నర్సులను నియమించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 1177 పడకలు అధికారికంగా ఉండగా, అనధికారికంగా మరో 800 వరకు ఉన్నాయి. నిబంధనల ప్రకారం జీజీహెచ్‌కు కనీసం మరో 400 మంది పైగా స్టాఫ్‌నర్సులను నియమించాల్సి ఉండగా ఉన్నతాధికారులు తీవ్ర వివక్ష చూపుతున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో ప్రస్తుతం 200 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, దీనికి తగ్గట్లుగా నర్సింగ్ స్టాఫ్, వైద్య పరికరాలు, వసతులు లేవని పలుమార్లు తనిఖీలు నిర్వహించిన ఎంసీఐ అధికారులకు సూచించినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ఆ హామీలకు ఐదు నెలలు.. జీజీహెచ్‌లో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో మంత్రులతోపాటు, సాక్షాత్తు ముఖ్యమంత్రి జీజీహెచ్‌లో మూడు గంటల పాటు పలు వార్డులు పరిశీలించారు. ఆస్పత్రి సమస్యలు తీరుస్తామంటూ హామీలు గుప్పించారు. ఐదు నెలలు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం గానీ, కొత్త పరికరాలు గానీ మంజూరు కాలేదు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అనేక మంది రోగులను మెరుగైన వైద్య సేవల నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కి తరలిస్తుంటారు. జీజీహెచ్‌తో పోలిస్తే ఒంగోలు రిమ్స్, నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగం పడకలు కూడా లేవు. స్టాఫ్‌నర్సుల సంఖ్య మాత్రం అధికంగా ఉండటం గమనార్హం. తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన కాంట్రాక్టు స్టాఫ్‌నర్సుల పోస్టుల్లో కేవలం 160 మందిని మాత్రమే జీజీహెచ్‌కు కేటాయించారు. కాంట్రాక్టు పోస్టుల్లోనూ అన్యాయం.. నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 500 పడకలకు 190 మంది స్టాఫ్‌నర్సులు ఉన్నారు. తాజాగా మంజూరు చేసిన కాంట్రాక్టు పోస్టుల్లో సైతం ఈ ఆసుపత్రికి 362 మందిని కేటాయించడం గమనార్హం. అంటే గుంటూరు జీజీహెచ్ కంటే పది మంది పర్మనెంట్ స్టాఫ్‌నర్సులు అధికంగా ఉన్నప్పటికీ కాంట్రాక్టు న ర్సులనూ 200 మందిని అదనంగా ఇచ్చారు. ఇక ఒంగోలు రిమ్స్‌లో 550 పడకలకు 234 మంది పర్మనెంట్ స్టాఫ్‌నర్సులు ఉన్నారు. అంటే జీజీహెచ్‌లో ఉన్న పడకల కంటే సగం కూడాలేని రిమ్స్‌కు 50 మంది స్టాఫ్‌నర్సులు అదనంగా ఉండటం విశేషం. ప్రజాప్రతినిధులవి ప్రగల్బాలే.. రాజధాని ప్రాంతాన్ని, గుంటూరు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రగల్బాలు పలికే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జీజీహెచ్ విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడిగా పర్యటించడం హామీలు గుప్పించడం మినహా ప్రయోజనం కనిపించండం లేదు. నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు తమ జిల్లాకు 362 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను తెప్పించుకోగా, ఇక్కడి వారు కేవలం 160 మందిని మాత్రమే తెచ్చుకోగలిగారు. అర్హత లేని సిబ్బందిని అందల మెక్కించడంలో ఉపయోగపడిన వీరి అధికారం ఆసుపత్రి అభివృద్ధికి ఎందుకు ఉపయోగించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా నేతలు జీజీహెచ్అభివృద్ధిపై దృష్టి సారించాలని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఆస్పత్రి పడకలు స్టాఫ్‌నర్సుల సంఖ్య గుంటూరు జీజీహెచ్ 1177 183 నెల్లూరు ప్రభుత్వాస్పత్రి 500 190 ఒంగోలు రిమ్స్ 550 234 -
డబ్బుల కోసం పురిటి బిడ్డను మార్చేశారు!
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) ఓ వివాదంతో మరోసారి వార్తల్లో కెక్కింది. అప్పుడే పుట్టిన తమ బాబును మార్చేశారంటూ ఓ తల్లి తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ ఘటన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే, ఆమె చేతికి మాత్రం అమ్మాయిని ఇచ్చారు. దీంతో ఆ తల్లి ఆందోళనకు గురై కుటుంబసభ్యులతో కలసి ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ఈ విషయమై సంప్రదించగా... వారికి పుట్టింది పాప అని.. అయితే పొరపాటున ఆస్పత్రి నర్స్ అబ్బాయి అని చెప్పడంతో వివాదం చెలరేగిందని వివరణ ఇచ్చుకున్నారు. నేడు ఒకే ఒక్క కాన్పు జరిగిందని.. పసివాళ్ల మార్పు జరిగే అవకాశాలే లేవని ఆస్పత్రి వర్గాలు తమపై వస్తోన్న ఆరోపణల్ని కొట్టిపారేశాయి. కానీ.. ఆస్పత్రిలోనే ఎదో గందరగోళం జరిగిందని బాధిత కుటుంబం ఆందోళన చేపట్టడంతో ఆస్పత్రి వర్గాలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. డబ్బులు ఇవ్వనందుకు తమ బిడ్డను మార్చివేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఆస్పిత్రి సిబ్బంది అడిగితే తాము డబ్బులు ఇవ్వని కారణంగానే బాబుని మార్చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. -
వివాదాస్పదంగా మారిన మంత్రిగారి ఆర్భాటం
-
జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదా?
-
మంత్రిగారికి జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదా?
మంత్రి కామినేని శ్రీనివాస్ కీళ్ల మార్పిడి ఆపరేషన్ తీరిది కార్పొరేట్ వైద్యులతో శస్త్రచికిత్స ఆపరేషన్ అయ్యాక వైద్య పరికరాలు మాయం మండిపడుతున్న వైద్యులు, రోగులు ‘జీజీహెచ్‌పై నమ్మకం కలిగించేందుకే మంత్రిఆపరేషన్ ఇక్కడ చేయించుకున్నారట. అయితే, ఆయనకు జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదు. అందుకే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వైద్యులను పిలిపించుకుని మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య పరికరాలు సైతం కార్పొరేట్ వైద్యశాలల నుంచి తెప్పించుకుని ఆపరేషన్ అయిపోగానే తిరిగి పంపించేశారు. ఆర్ధోపెడిక్ విభాగంలో ఆపరేషన్ థియేటర్‌ను సిద్ధం చేయకుండా గుండె జబ్బుల విభాగంలోని సీటీఎస్ శస్త్రచికిత్స విభాగంలో మంత్రికి ఆపరేషన్ నిర్వహించారు.’ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కీళ్లమార్పిడి శస్త్రచికిత్స అనంతరం శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో వినిపించిన గుసగుసలివీ.. గుంటూరు : గత ఏడాది జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగంలో ఓ పసికందు ఎలుకల దాడిలో మృతిచెందిన సంఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇక్కడి వైద్యుల పనితీరు మెరుగుపరిచి, కనీసం వైద్య పరికరాలు, వసతులు కల్పించి జీజీహెచ్‌కు వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాత్రి నిద్రలు, ఆసుపత్రిలో స్వయంగా శస్త్రచికిత్స చేయించుకోవడం వంటి వాటితో ప్రజల్లో నమ్మకం కలిగిస్తానంటూ ప్రకటనలు చేశారు. అయితే, శుక్రవారం మంత్రి కామినేని కుడికాలుకు జీజీహెచ్‌లో కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ ఆపరేషన్‌ను కేర్ ఆస్పత్రి వైద్యుడు బీఎన్ ప్రసాద్, గుంటూరు సాయిభాస్కర్ ఆసుపత్రి వైద్యుడు బూసిరెడ్డి నరేంద్రరెడ్డి నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మంత్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారో అది తీవ్ర విమర్శల పాలవుతోంది. మంత్రి మెప్పు కోసమే.. మంత్రికి ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసి జీజీహెచ్‌కు కీళ్ల మార్పిడి ఆపరేషన్ కోసం ఎవరైనా వస్తే చేసేందుకు వైద్యులు లేరు. ఆపరేషన్ థియేటర్ లేదు. వైద్య పరికరాలు, సరైన వసతులు ఇక్కడ కనిపించవు. కానీ, మంత్రిగారి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి సున్నాలు, మరమ్మతులు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా ఐసీయూ బెడ్ కొనుగోలు చేశారు. ప్రైవేటు వైద్యశాలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద వేలకొద్దీ కీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నప్పటికీ జీజీహెచ్‌లో ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు కనీస ప్రయత్నం జరగకపోవడం శోచనీయం. అంతా ఆర్భాటమే.. 2002లోనే జీజీహెచ్‌లో అప్పటి వైద్యులు మోకాళ్లచిప్ప మార్పిడి ఆపరేషన్ కంటే కష్టమైన తొంటి మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పద్నాలుగేళ్లుగా ఆపరేషన్లు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు సరైన వైద్య సేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రే ఆర్భాటాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై జీజీహెచ్ వైద్యులు, ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి ఆపరేషన్ చేయించుకున్న తీరు చూస్తుంటే ఆసుపత్రి కేవలం గదులు అద్దెకు ఇచ్చేందుకు మాత్రమే పనికొస్తుందనే అపోహ కలుగుతోందని వైద్య నిపుణులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. -
గుంటూరు జీజీహెచ్‌లో మళ్లీ పాము
హడలిపోయిన రోగులు, వైద్యసిబ్బంది గుంటూరు మెడికల్: ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు కొరికి శిశువు మరణించినా.. బాలింతల వార్డులో పంది కొక్కులు తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనం ఉండడం లేదు. తాజాగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో గురువారం మళ్లీ పాము ప్రత్యక్షం అవడంతో వైద్య సిబ్బంది, రోగులు హడలెత్తిపోయారు. ఆర్థోపెడిక్ వైద్యవిభాగంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్ నర్సు అన్నపూర్ణ బాత్రూమ్కు వెళ్లేందుకు తలుపు తెరవగా లోపల పాము కనిపించింది. ఆమె శానిటేషన్ సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు బాత్రూము గదిలో ఉన్న పామును చంపి బయటపడేశారు. ఆగస్టులో ఇదే వార్డులోని ఆపరేషన్ థియేటర్లో పాము కనిపించింది. ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన ఘటన కూడా ఆగస్టులోనే జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్న ఎస్-1 వార్డులోనే మంగళవారం(డిసెంబరు 29వ తేదీ) కట్లపాము ప్రత్యక్షం అయింది. ఆసుపత్రి సిబ్బంది సమాచారాన్ని సూపరింటెండెంట్‌కు తెలియజేసి గోప్యంగా ఉంచారు. -
నా తప్పేంటి?
అమ్మ... కడుపు చించుకుంటే పుట్టాన్నేను! అమ్మకు... కడుపుకోత మిగిల్చి వెళ్లాన్నేను! అమ్మకింత పెద్ద శిక్షేంటి? నాన్నకింత తీరని శోకమేంటి? చెత్తకుండీలో పడేసినా బతికి ఉండేవాడినేమో! ఐసీయూలో పెట్టి చంపేశారు!! అమ్మ ఇచ్చే స్తన్యం అమ్మ చేయించే స్నానం అమ్మ పొత్తిళ్లు అమ్మ లాలిపాట... ఏవీ నాకు దక్కకుండానే ఐసీయూ నన్ను కొరికేసింది! నాన్న పెట్టే ముద్దులు నాన్న పట్టే రథాలు నాన్న పుణికే బుగ్గలు నాన్న పడే సంబరాలు... ఏవీ నాకు లేకుండానే ఐసీయూ నన్ను కాటికి పంపింది! గర్భంలా కాపాడుతుందనుకుంటే... ఐసీయూ నాకు ఆగర్భశత్రువైంది! ఇలా పుట్టాను. అలా చనిపోయాను. నాదొకటే ప్రశ్న! నేను చేసిన తప్పేంటి? మా అమ్మానాన్నలు చేసిన పాపమేంటి? నాదే ఇంకొక ప్రశ్న! నన్ను చంపింది ఆకలిగొన్న ఎలుకలా? అలక్ష్యాల పందికొక్కులా? బ్రహ్మ కడిగిన పాదమూ...! బ్రహ్మ సృష్టికర్త అతని సృష్టే ఈ చిన్నారి పాదాలు కడుపులో తన్నినప్పుడు తల్లి పులకిస్తుంది. గుండెల మీద తన్నినప్పుడు తండ్రి పరవశిస్తాడు. బుడిబుడి అడుగులు వేసినప్పుడు కృష్ణపాదాలను తలచుకుంటాం. ముద్దాడాల్సిన ఈ పాదాలు రక్తపు ముద్దలుగా మారాయి. మనకు రక్తం ఉడకదా? ప్రతి తల్లికీ... నెత్తుటి కన్నీరు కారదా? మురికిని పెంచారు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 1170 పడకలు ఉన్నాయి. వీళ్లకు కనీసం వేయి మంది అటెండర్స్ ఉంటారు. వీళ్లు గాక రోజూ 2500 మంది ఔట్ పేషెంట్స్ వస్తుంటారు. వీరందరూ తెచ్చే ఆహార పదార్థాలు వాటి వ్యర్థాలు రోజూ గుట్టలుగా పోగవుతుంటాయి. దీని కోసం 300 మంది పారిశుద్ధ్య సిబ్బంది పని చేయాలి. కానీ సగం మంది కూడా పని చేయడం లేదు. అందువల్ల ఎలుకలు పెరిగాయి. అవి వేల సంఖ్యలో ఉన్నాయి. వైద్యులు తక్కువయ్యారు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి సిబ్బందిని మంజూరు చేయడం లేదు. 15 మంది ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7 అసోసియేట్ ప్రొఫెసర్లు, 22 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయి. వాటినీ నింపలేదు. 400 మంది నర్సులు ఉండాలి. కానీ 200 మంది కూడా లేరు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు వరకూ ఓపి. కానీ డాకర్లు ఒకటి రెండు గంటలు కూడా చూడరు. క్లాసులు చెప్పుకుంటూ ప్రయివేటు ప్రాక్టీసు చేసుకుంటూ ఉంటారు. నర్సులు కంటికి కనిపించరు. ఈ దేశంలో ప్రాణం ఖరీదు చాలా తక్కువ. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో డెడ్ చీప్. ఈ లోపాలన్నింటికీ రోగులు ప్రాణాలను ఫీజుల కింద చెల్లిస్తుంటారు. జవాబుదారీ లేదు: కొంతకాలంగా జీజీహెచ్‌కు రెగ్యులర్ సూపరింటెండెంట్ ఉండడం లేదు. అధికార పార్టీ నాయకులు నియమించిన వారే ఇన్చార్జి సూపరింటెండెంట్లుగా చలామణి అవుతున్నారు. ఆసుపత్రిలో పనిచేసే అనేక వైద్యుల కంటే వీరు జూనియర్లు కావడంతో వీరి మాటను ఎవరూ ఖాతరు చేయడం లేదు. దీనికితోడు సమస్యలపై వీరికి సరైన అవగాహన ఉండటం లేదు. చిత్తశుద్ధితో బాధ్యతలనూ నిర్వర్తించడం లేదు. పాత కట్టడాల పాపం: జీజీహెచ్‌లో పారిశుద్ధ్యం మొదటినుంచీ అధ్వాన్నమే. బ్రిటిష్ కాలంలో నిర్మించిన కట్టడాలు బాగానే ఉన్నప్పటికీ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉండటంతో ఎలుకలు, పాములుకు నిలయంగా మారిపోయింది ఆసుపత్రి. లంచాల పీడ: ఆస్పత్రిలో రోజూ వారి చెత్తతో పాటు ప్రతిరోజూ ప్రసవాల వల్ల, శస్త్ర చికిత్సల వల్ల కనీసం 300 కిలోల జీవ వ్యర్థాలు పోగవుతాయి. వీటిని శుభ్రపరచడానికి కాంట్రాక్టర్‌కు నెలకు 21 లక్షల రూపాయలను కేటాయించారు. కాంట్రాక్ట్ ప్రకారం సరిగ్గా వ్యర్థాలను తీస్తున్నాడా, లేదా గమనించి అధికారులు బిల్లులు శాంక్షన్ చేయాలి. కాని లంచాల కారణంగా పని సరిగ్గా జరగకపోయినా బిల్లులు శాంక్షన్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కనుక చెత్త పెరిగిపోయింది. పాలకులు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను పదవి చేపట్టాక దాదాపు 20 సార్లు గుంటూరుకు వచ్చి వెళ్లారు. కాని ఒక్కసారి కూడా జి.జి.హెచ్‌ను సందర్శించలేదు. సందర్శించి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. పసిపిల్లాడిని ఎలుకలు కొరికి చంపిన ఘటన తర్వాత కూడా ఆయన రాలేదు. వచ్చిన నాయకులు కంటితుడుపు మాటలే మాట్లాడారు. ఉత్తుత్తి సస్పెన్షన్లు చేశారు. సిబ్బందిలో తాము తప్పు చేస్తే శిక్ష ఉంటుందనే భయం రాలేదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేసిన గొడవ వల్లే ఈ మాత్రమైనా స్పందన వచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. వైద్యం చేయించుకుంటారా? గుంటూరు జిల్లాలో ప్రముఖులైన నేతలు ఎందరో ఉన్నారు. వారి వైద్యం అంతా కుటుంబ సభ్యుల వైద్యం అంతా ప్రయివేటు ఆస్పత్రుల్లో, లేదంటే హైదరాబాదులోని ఖరీదైన ఆస్పత్రుల్లో జరుగుతుంది. పెద్ద పెద్ద ప్రభుత్వాధికారులు కూడా వైద్యం కోసం ఈ వైపు రారు. వస్తే వారికి పేదల బాధలు తెలిసేవి. వచ్చే పేదల గోడు అర్థమయ్యేది. ‘ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లోనే చదివించాలి’ అంటూ అలహాబాద్ హైకోర్ట్ పేర్కొన్న మాటలు (దిగువన ఉన్న ‘మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్‌కు పంపండి’ బాక్స్ చూడండి) అమలైతే ప్రభుత్వ బడుల్లో ఎంతో మార్పు వస్తుంది. అలాగే, ప్రభుత్వ సిబ్బంది అంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలి అనే నిబంధన పెడితే తప్ప ఈ ఆస్పత్రుల్లో మార్పు రాదేమో. ఏం శిక్ష పడింది? ఎలుకల దాడిలో శిశువు మరణించిన సంఘటనకు బాధ్యులను చేస్తూ ప్రభుత్వం జీజీహెచ్ సూపరింటెండెంట్, పిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతులపై బదిలీ వేటు, సీఎస్ఆర్ఎంఓ, శానిటరీ ఇన్స్పెక్టర్, హెడ్‌నర్సు, స్టాఫ్‌నర్సులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రకటన చేసింది. అయితే ఇంత వరకు ఎటువంటి ఉత్తర్వులూ జారీ కాలేదు. అధికారులు, నర్సులు హాయిగా విధుల్లో కొనసాగుతున్నారు. సంఘటనకు బాధ్యులు ఎవరో ఇంత వరకు ప్రభుత్వం తేల్చలేకపోయింది. రాలే పసిమొగ్గలు... గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి నిత్యం పల్లెల నుంచి చుట్టుపక్కల పట్టణాల నుంచి పేదలు మధ్యతరగతి వారు వస్తుంటారు. ముఖ్యంగా నవజాత శిశువులు కాని, చిన్న పిల్లలు కాని రోజుకు 30 మంది ఇన్ పేషెంట్స్‌గా చేరుతుంటారు. కాని వీరిలో ఊపిరి పోసుకుని తిరిగివెళ్లేవారి సంఖ్య ఆశాజనకంగా లేదు. ఈ జూలైలో 367 మంది నవజాత శిశులు ఇన్‌పేషెంట్స్‌గా చేరితే 117 మంది చనిపోయారు. చిన్నపిల్లల ఐసియూలో 78 మంది చేరితే 32 మంది చనిపోయారు. ఆగస్టులో 224 మంది నవజాత శిశువులకు 78 మంది చనిపోయారు. చిన్నపిల్లల్లో 58 మంది చేరితే 10 మంది చనిపోయారు. జనవరి నుంచి ఆగస్టు వరకు లెక్కలు తీస్తే 913 మంది శిశు/చిన్నారుల మరణాలు అంటే ముప్పై శాతం మరణాలు నమోదయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో రావడం ఒక కారణమైనా పూర్తి స్థాయి వైద్యం అందించే పరికరాలు, వైద్యులు లేకపోవడం మరో ప్రధాన కారణం. -
మళ్లీ పాము కలకలం..
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి పాము కలకలం సృష్టించింది. దీంతో జిల్లా కలెక్టర్ మంగళవారం అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి జిల్లాల్లోని 52 శాఖల అధికారులు హాజరయ్యారు. సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్రచికిత్స గదిలోకి పాము చొరబడింది. దీంతో సిబ్బంది ఆ పామును చంపేసి ఎవరికీ తెలియకుండా కాల్చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కాంతీలాల్‌దండే మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యగా మారిన పాములు, ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానంపై అన్ని శాఖల అధికారుల నుంచి సూచనలు తీసుకోనున్నట్టు తెలిసింది. -
మొన్న ఎలుక..నేడు పాము
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్ విభాగంలోని 105వ నంబరు గదిలో శుక్రవారం పాము కలకలం రేపింది. గతనెల 26న పసికందు ఎలుకల దాడిలో చనిపోవడంతో ఎలుకలు పట్టేందుకు ఏర్పాటు చేసిన జెల్లి ప్యాడ్‌కు శుక్రవారం ఉదయం పాము పిల్ల అతుక్కుని ఉంది. దాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీనివాసులుకు సమాచారం తెలియజేశారు. తక్షణమే పాములు పట్టేవారిని పిలిపించి పాములు ఉన్నాయేమోనని పరిశీలించాలని ఆదేశాలు జారీచేశారు. సాయంత్రం వట్టిచెరుకూరుకు చెందిన పాములు పట్టే వ్యక్తి కోటయ్య రేడియాలజి విభాగంలో (105వ నంబరు గదిలో) వచ్చి పాములు ఉన్నాయో లేవో పరిశీలించారు. - గుంటూరు మెడికల్ -
అధ్వానం... అగమ్యగోచరం
-
మంత్రిగారు సిగ్గుతో తల దించుకున్నారట..!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ఆరోగ్యశాఖ మంత్రి సిగ్గుతో తలదించుకున్నారట. ప్రభుత్వ ఆస్పత్రిలో పసి పిల్లలతో పాటు ఎలుకలు కూడా ఉన్నందుకు.. అందులో ఒక ఎలుక సరదాగా ఓ పసికందును కొరికినందుకు.. ఆ పసికందు చనిపోయినందుకు.. మంత్రిగారు సిగ్గుతో తలదించుకున్నారట. ఇది నిన్న ఉదయం మాట. ఆస్పత్రిలో మంత్రిగారి, అధికారుల హడావుడి.. బిలబిలలాడుతూ తిరిగేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించేశారు. విచారణ కమిటీ కూడా వేశారు. నర్సుల సస్పెన్షన్ .. సూపరింటెండెంట్, మరో వైద్యుడి బదిలీ జరిగిపోయింది. అక్కడితో ప్రభుత్వం బాధ్యత తీరిపోయింది. పసికందు ప్రాణాల వెల సస్పెన్షన్, బదిలీ .. అంతే ఇంకేమీ లేదు. విచారణ కమిటీ ఏం చెప్పింది.. ఎలుకలు ఏవో సరదాగా కొరికాయి.. కానీ పసికందు చావుకు అవి కారణం కాదు. పుట్టుకతోనే లోపాలున్న ఆ శిశువుకు వారం రోజులుగా వైద్యం అందుతోందట. వెంటిలేటర్‌పైన పసికందును ఉంచామని కూడా చెప్పారు. అసలు సమస్య ఇక్కడే.. వెంటిలేటర్ పై చికిత్స.. అంటే ఐసీయూ ట్రీట్ మెంట్.. ఐసీయూలో ఎలుకలు.. ఇదేదో జనరల్ వార్డులో జరిగిన ఘటన కాదు.. ఆశతో ఆస్పత్రికి వచ్చిన పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సింగపూర్ చేస్తాం.. జపాన్‌లాగా మార్చేస్తాం.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గం.. ఈ మధ్య ప్రభుత్వ పెద్దలు పదే పదే వల్లె వేస్తున్న స్లోగన్స్ కదా! ఇదే ఘటన సింగపూర్లోనో, జపాన్లోనో జరిగితే ఏమయ్యేది? వార్డు బాయ్ నుంచి ప్రభుత్వ నేతల వరకు బోనులో నిలబడాల్సి వచ్చేది. కటకటాలు లెక్కించక తప్పేది కాదు.. భారీ నష్ట పరిహారం సరేసరి... మనం మసిపూసి మారేడు కాయ చేయడంలో గోల్డ్ మెడలిస్టులం కదా! పసికందు మరణానికి మాది బాధ్యత కాదు.. అలా పుట్టడమే వాడి తప్పు అనేంతటి నివేదిక తయారు. ఒక్క క్షణం నిజమే అనుకుందాం.. మరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల సంగతేమిటి మంత్రిగారూ? ఇది కూడా పసికందు చేసుకున్న పాపమేనా.. తనతోపాటు ఎలుకల్ని కూడా తెచ్చుకున్నాడా! సరదాగా ఆడుకోవడానికి. ఆ సరదాగా తీర్చుకుంటుండగా సరదాగా ఎలుక ఒకసారి కాదు.. రెండుసార్లు కొరికింది! మరి అదే నిజమైతే సస్పెన్షన్లు బదిలీలు ఎందుకో.. పసికందు ప్రాణం పోయిన తర్వాత.. ఎలుకలు పట్టేవాళ్లని పిలిపించారట. వాళ్లు కొద్దిగా కష్టపడి ఓ 50 ఎలుకల్ని పట్టుకున్నారట. ఇంకొద్దిగా శ్రమిస్తే బొరియల్లో దాక్కున్న ఎలుకలు కూడా దొరుకుతాయి కూడా. సరే.. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకల్ని పట్టుకొని పసికందులు సరదాగా ఆడుకోకుండా కట్టడి చేశారు ప్రభుత్వ పెద్దలు.. మరి మిగతా ఆస్పత్రుల మాటేమిటో.. ఎలుకలకి ప్రభుత్వ ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న పసికూనలంటే పక్షపాతం.. అక్కడే సరదాగా ఆడుకుంటాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల జోలికి వెళ్లకుండా.. ఎలుకల పక్షపాతం నశించాలి అని గొడవ చేయాలేమో. ఎలుకలే కాదు.. పందికొక్కులు, పందులు, కుక్కలలాంటివి కూడా మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరదాగా ఆడుకుంటాయి. అప్పుడప్పుడు నోట కరుచుకుని బయటకు తీసుకుపోయి సరదాగా ఆడుకుంటాయి. పిల్లులు కూడా తమ హాజరు వేయించుకుంటాయి. దోమలు సహజీవనమే చేస్తాయి. విరిగిపోయిన మంచాలు, కనిపించని పరుపులు, ఊగిపోయే సీలింగ్ ఫ్యాన్లు, పెచ్చులూడే పై కప్పులు, దొరకని మందులు, అందుబాటులో లేని వైద్యసిబ్బంది.. ప్రభుత్వ ఆస్పత్రుల గురించి ఎప్పుడు రాసినా అందుబాటులో ఉండే పదాలు.. అక్షర సత్యాలు. ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉండదు.. మెరుగైన వైద్యం.. అబ్బే కనుచూపు మేరలో కనపడదు.. తెల్లకోట్లు, తెల్లగౌన్లు మెరుపులా మెరిసి మాయమవుతాయి. సెలైన్ స్టాండ్ బదులు నిలువునా నిలబడ్డ మనిషి దర్శనమిస్తాడు. ఆపరేషన్ జరగాలంటే కనీసం 3 నెలలు ఆగాలి. ఈలోపు ఆ మనిషి బతికుంటే పీక్కు తినడానికి ఎలుకలు, పందికొక్కులు రెడీ. ఒక్కో బెడ్‌ను పంచుకునే ఇద్దరు ముగ్గురు బాలింతలు.. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే ఆస్పత్రి గచ్చపై పొర్లుదండాలు పెడుతూ పడుకోవాల్సిందే. అయినా వైద్య రంగానికి మనం వేలకోట్లు కేటాయిస్తూనే ఉంటాం. ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో తెలియదు. హాస్పిటల్లో మాత్రం ఎలుకలు తిరుగుతూనే ఉంటాయి. పసికందుల్ని కొరుక్కు తింటూనే ఉంటాయి. పల్లె నిద్ర, హాస్టల్ నిద్రల్లాగ ఈమధ్య హాస్పిటల్ నిద్ర ... ఇలా నిద్రపోయిన ప్రముఖుల దరిదాపుల్లోకి ఎలుకలు మాత్రం రావు. బహుశా ముందురోజే ఎలుకల్ని బంధించేసి ఉంటారు. పదుల సంఖ్యలో ఎలుకల్ని బంధించి పట్టుకెళ్తున్న దృశ్యం నిజంగానే సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. రేప్పొద్దున్న ఎలుకలు పట్టే కాంట్రాక్టు ప్రకటన వెలువడినా ఆశ్యర్యపడాల్సిన పనిలేదు. ఆ కాంట్రాక్టు కూడా అస్మదీయులకే వెళ్తుందనేది వేరే విషయం. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు కావాల్సింది ఎలుకలు పట్టేవారు. లేకపోతే మంత్రిగారు మరోసారి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. -
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో భారీగా ఎలుకల పట్టివేత
-
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో భారీగా ఎలుకల పట్టివేత
ఐసీయూలో చికిత్స పొందుతున్న పసికందును ఎలుకలు కొరకడంతో మరణించిన ఘటన దేశ విదేశాలలో కూడా సంచలనం కలిగించింది. పలు అంతర్జాతీయ పత్రికలు కూడా ఈ విషయం గురించిన కథనాన్ని ప్రచురించాయి. జాతీయ మీడియా కూడా దీనిపై దుమ్మెత్తిపోసింది. దీంతో అధికారులలో ఎట్టకేలకు చలనం వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎలుకలు పట్టేవాళ్లను పిలిపించారు. మొత్తం పదిమందితో కూడిన ఓ బృందం ఆస్పత్రికి చేరుకుని, తమదైన పద్ధతిలో బోనులు, ఎరలు ఏర్పాటుచేసింది. దాంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 వరకు ఎలుకలు పట్టుబడ్డాయి. వాళ్లు పట్టుకున్న ఎలుకలను చూసి.. అసలు ఇది గుంటూరు ప్రభుత్వాస్పత్రేనా.. మరేదైనానా అని అంతా విస్తుపోయారు. ప్రస్తుతం ఆస్పత్రి మొత్తాన్ని శుభ్రం చేయించే పనిలో అధికారులు పడ్డారు. -
ఎలుకలు కొరికాయి కానీ..
శిశువు మృతికి అవే కారణం కాదు * ప్రభుత్వానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ నివేదిక * నివేదికలో విభిన్న అంశాలు * పుట్టుకతోనే శిశువుకు అసాధారణ లోపం ఉంది * రెండు సార్లు మాత్రం ఎలుకలు కొరికాయి సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శిశువుపై దాడి అభియోగం నుంచి ‘ఎలుకలను’ తప్పించే ప్రయత్నం జరిగింది. ఆస్పత్రిలో ఎలుకల సంచారం తీవ్రంగా ఉన్నప్పటికీ అవి కొరికిన కారణంగానే హృదయవిదారకరీతిలో శిశువు మృతిచెందలేదని చెప్పడానికి అధికారులు, ప్రభుత్వ పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. ఆస్పత్రిలో చేరినప్పుడే శిశువు అనేక సమస్యలతో బాధపడుతున్నాడని పేర్కొంటూ నివేదిక సమర్పించారు. మరణానికి ఎలుక లు కొరకడమే కారణం కాకపోవచ్చంటూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఆ శిశువు ఈనెల 17వ తేదీన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరాడని, కన్జెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే అసాధారణ లోపం)తో ఉన్న ఆ శిశువును 18వ తేదీన సర్జరీ వార్డుకు తరలించారని నివేదికలో పేర్కొన్నారు. 20వ తేదీన శస్త్రచికిత్సకు సిద్ధం చేశారని, ఆ శిశువు పరిస్థితి అప్పటికే ప్రమాదకరంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నాడని నివేదికలో పేర్కొన్నారు. ఈనెల 23న శిశువు ఎడమచేతికి ఎలుకలు గాయం చేశాయని, ఈ విషయాన్ని ఇన్చార్జి ప్రొఫెసర్ డా.భాస్కరరావుకు సమాచారమిచ్చినట్టు కూడా నివేదికలో పొందుపరిచారు. అనంతరం వార్డును శుభ్రపరిచామని, అయినా ఈనెల 26 తెల్లవారుజామున 4-5గంటల మధ్యలో ఎలుకలు తిరిగి శిశువు ఛాతీపై దాడిచేశాయని పేర్కొన్నారు. ఈ రకంగా ఓవైపు ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు కన్జెనిటల్ అనామిలీస్‌తో వచ్చిన ఈ బిడ్డ మృతికి ఎలుకలే కారణం కాకపోయి ఉండొచ్చని నివేదించారు. బుధవారం సాయంత్రం అంటే 26 వ తేదీ రాత్రి బిడ్డ మృతి చెందిన తర్వాత మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ తదితరులు ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఎలుకల కథ కంచికి చేరేలా ఈ నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవడం, వివిధ మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం, దీన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిన తరుణంలో ఘటన తీవ్రతను, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలంటూ నాయకులు ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్ఎంవో తదితర కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వార్డులో మరో 20 మంది చిన్నారులు ఉన్నా ఎవరినీ ఎలుకలు కొరకలేదని, అందువల్ల ఈ శిశువు కూడా ఎలుక కొరికిన కారణంగా మృతి చెంది ఉండకపోవచ్చని నివేదికలో పొందుపరిచారు. మరోవైపు శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందే తమ బిడ్డ మృతికి కారణమని గొడవ చేశారని కూడా అందులో ప్రస్తావించారు. సూపరింటెండెంట్ అందించిన నివేదిక మేరకు పీడియాట్రిక్ వార్డు డ్యూటీలో ఉన్న సిబ్బంది ⇒ డా.సీహెచ్ భాస్కర్ రావు, ప్రొఫెసర్, ఇన్చార్జి హెచ్ఓడీ ⇒ డా.ఎన్‌జైపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ⇒ సీహెచ్ విజయలక్ష్మి, హెడ్నర్స్ ⇒ ఎం.ఉషా జ్యోతి, స్టాఫ్‌నర్స్ ⇒ వి.విజయ నిర్మల, స్టాఫ్‌నర్స్ ⇒ జి.జయజ్యోతి కుమారి, స్టాఫ్‌నర్స్ -
శిశువు మృతికి ఎలుకలే కారణం కాదు!
పుట్టుకతోనే అసాధారణ లోపం ఉంది ఎలుకల వల్లే మృతిచెందారని అనుకోవడం లేదు 23వ తేదీన ఎడమ చేతికి ఎలుకలు కొరికిన గాట్లు గుర్తింపు 26వ తేదీన తిరిగి ఎలుకలు ఛాతీపై దాడిచేసినట్టు వెల్లడి ప్రభుత్వానికి గుంటూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ నివేదిక సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికి మృతి చెందిన శిశువు కేసు నుంచి బయటపడేందుకు ఇటు వైద్యసిబ్బంది, అటు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా.వేణుగోపాల్‌రావు ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ఈనెల 17వ తేదీన విజయవాడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. కన్జెనిటల్ అనామిలీస్ (పుట్టుకతో వచ్చే అసాధారణ లోపం)తో చేరిన ఈ శిశువును 18వ తేదీన సర్జరీ వార్డుకు తరలించామని, 20వ తేదీన శస్త్ర చికిత్సకు సిద్ధం చేశామని, వెంటిలేటర్‌పై ఉన్న ఆ శిశువు పరిస్థితి అప్పటికే ప్రమాదకరంగా ఉందని పేర్కొన్నారు. ఈనెల 23న శిశువు ఎడమ చేతికి ఎలుకల గాటు పడి ఉందని, ఈ విషయాన్ని ఇన్చార్జీ, ప్రొఫెసర్ డా.భాస్కర్‌రావుకు సమాచారమిచ్చామని కూడా నివేదికలో పొందుపరిచారు. అనంతరం వార్డును శుభ్రపరిచామని, అయినా దురదృష్టవశాత్తు ఈనెల 26వ తేదీ తెల్లవారుజామున 4-5గంటల మధ్యలో ఎలుకలు తిరిగి శిశువు ఛాతిపై దాడిచేశాయని పేర్కొన్నారు. ఓవైపు ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు కన్జెనిటల్ అనామిలీస్‌తో వచ్చిన ఈ బిడ్డ మృతికి ఎలుకల గాట్లే కాకపోయి ఉండచ్చునని తెలిపారు. బుధవారం సాయంత్రం అంటే 26వ తేదీ రాత్రి బిడ్డ మృతి చెంది తీవ్రంగా వివాదంగా మారడం, అనంతరం మంత్రులు కామినేని శ్రీనివాస్, పి. నారాయణ తదితరులు ఆస్పత్రిని సందర్శించిన తర్వాత ఎలుకల కథ కంచికి చేరేలా నివేదిక మార్చినట్టు స్పష్టమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవడం, వివిధ మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం, దీన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిన తరుణంలో నివేదికను బలహీనపరిచేలా చేసేటట్టు నాయకులే ఒత్తిడి తెచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే తెలివిగా ఆర్ఎంఓ తదితర కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వార్డులో మరో 20 మంది చిన్నారులు ఉన్నా ఎవరికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని, ఈ శిశువు కూడా ఎలుక కారణంగా మృతి చెంది ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందే మృతికి కారణమని గొడవ చేశారని వెల్లడించారు. బాక్స్ పీడియాట్రిక్ వార్డు డ్యూటీలో ఉన్న సిబ్బంది వీరే.. డా.సీహెచ్ భాస్కర్ రావు, ప్రొఫెసర్, ఇన్చార్జీ హెచ్ఓడీ డా.ఎన్‌జైపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సీహెచ్ విజయలక్ష్మి, హెడ్నర్స్ ఎం.ఉషా జ్యోతి, స్టాఫ్‌నర్స్ వి.విజయ నిర్మల, స్టాఫ్‌నర్స్ జి.జయజ్యోతి కుమారి. -
శిశువు కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
హైదరాబాద్ : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కొరటంతో మృతి చెందిన మృతి చెందిన శిశువు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. శుక్రవారం ఆయన విజయవాడ వెళ్లనున్నారు. మరోవైపు విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, ఎంపీ గల్లా జయదేవ్ ఇవాళ ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వస్పత్రి దుస్థితిని వివరించేందుకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, వంగవీటి రాధా, మేరుగ నాగార్జునను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా విజయవాడ కృష్ణలంక కు చెందిన చావలి నాగ, లక్ష్మి దంపతులకు ఈ నెల 17న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండో సంతానంగా మగబిడ్డ జన్మించాడు. శిశువుకు మూత్రసంచి, మూత్రనాళాలు బయటకు రావడంతో మెరుగైన వైద్యసేవల నిమిత్తం ఈ నెల 18న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని శిశు శస్త్ర చికిత్సా విభాగానికి తరలించారు. వైద్యులు ఈ నెల 20న శిశువుకు ఆపరేషన్ నిర్వహించి ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ దశలోనే శిశువుపై ఈ నెల 24న ఎలుకలు దాడిచేసి కుడి చేయితోపాటు కాలి వేళ్లను కొరికివేశాయి. తీవ్ర ఆందోళనకు గురైన తల్లి లక్ష్మి వైద్యులు, ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలా బుధవారం తెల్లవారుజామున 4గంటల వేళ రెండోసారి ఎలుకలు పసికందుపై దాడిచేసి ఛాతీ, ఎడమ కణిత, బుగ్గ భాగాలతోపాటు చేతివేళ్లు, కాలివేళ్లు కొరుక్కుతిన్నాయి. తీవ్ర రక్తస్రావం కావడం గమనించిన లక్ష్మి కదలలేని స్థితిలోనూ కేకలు వేస్తూ ఎలుకలను తోలే ప్రయత్నం చేసింది. వైద్యులుగానీ, సిబ్బందిగానీ స్పందించలేదు. పది గంటలపాటు చికిత్స చేసేందుకు వైద్యులెవరూ అక్కడకు రాకపోవడంతో మృత్యువుతో పోరాడిన శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. -
హాఫ్ సెంచరీ చేసేశారు..!
గుంటూరు మెడికల్: గుండెజబ్బుతో బాధపడుతూ ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న 50 మంది పేదలకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి వైద్యులు బైపాస్ సర్జరీలు చేసి మళ్లీ ప్రాణం పోశారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన ఘనత దక్కించుకున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి వైద్యులు ఆగస్టు 4న భారీస్థాయిలో సంబరాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మార్చి 18వ తేదీన చేసిన తొలి ఓపెన్‌హార్ట్ ఆపరేషన్ మొదలుకుని ఈనెల 27వ తేదీన చేసిన 50 వ సర్జరీ వరకు అన్నీ విజయవంతం అయ్యాయి. ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పిపిపి) విధానంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా మొట్టమొదటిసారిగా గుంటూరులో ఓపెన్‌హార్ట్ సర్జరీలు ప్రారంభించింది. ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆస్పత్రుల్లో అమలు చే సే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రధాన భూమిక డాక్టర్ గోఖలేదే... జీజీహెచ్‌లో బైపాస్ సర్జరీలు ప్రారంభం అవడానికి కీలకమైన వ్యక్తి డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణగోఖలే. గుంటూరు వైద్య కళాశాలలో చదివిన డాక్టర్ గోఖలే తాను చదువుకున్న కళాశాలకు ఏదైనా తన వంతుగా చేయాలనే సదాశయంతో తానే స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యంను కలిసి జీజీహెచ్‌లో ఆపరేషన్లు చేసేందుకు అవకాశం ఇవ్వాలని అడిగారు. ప్రభుత్వం డాక్టర్ గోఖలేతో పీపీపీ విధానంలో పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. రూ.2.50 లక్షలు అయ్యే ఆపరేషన్ ఉచితంగా... ప్రైవేటు ఆస్పత్రులలో సుమారు రెండున్నర లక్షల వ్యయం అయ్యే ఓపెన్‌హార్ట్ సర్జరీలను జీజీహెచ్‌లో ఎన్టీఆర్ ఆరోగ్యసేవ పథకం ద్వారా ఉచితంగానే చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు లేనివారికి సైతం ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల కాగానే ఆపరేషన్లు చేస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు తెలిపారు. భవిష్యత్తులో గుండెమార్పిడి ఆపరేషన్లు ప్రారంభించి రాష్ట్రంలోనే నంబర్‌వన్ టీచింగ్ హాస్పటల్‌గా జీజీహెచ్‌ను తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకివి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: బోధనాసుపత్రుల్లో సుమారు 324 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 22, 23 తేదీల్లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు 1:1 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు రావాలని ఈ-మెయిల్ సమాచారమిచ్చారు. కానీ అభ్యర్థుల్లో ఇప్పటికీ ఏ ధ్రువపత్రాలు తీసుకురావాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్యవిద్యాశాఖ వర్గాలు కింది ధ్రువపత్రాలు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించాయి. ♦ 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్ ♦ ఎస్ఎస్సీ, క్యాస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ♦ ఎంబీబీఎస్, పీజీ ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు ♦ భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు ♦ అంగవికలాంగులు అయితే పీహెచ్ సర్టిఫికెట్ ♦ ఎంబీబీఎస్ లేదా పీజీ అనంతరం ఏడాది ప్రభుత్వ సర్వీసు ఉన్న ధ్రువపత్రాలు ♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు సర్వీసు చేసినట్టు సర్టిఫికెట్ ♦ వివాహమయ్యాక ఇంటిపేరు మార్చుకున్న మహిళల ధ్రువపత్రం ♦ అంటే మ్యారేజీ సర్టిఫికెట్ గానీ, అఫిడవిట్ తదితర పత్రాలు జతచేయాలి -
స్కానింగ్ గది వద్దే ప్రసవించిన గర్భిణి
గుంటూరు జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం ఫలితం గుంటూరు: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా వేగంగా చికిత్స అందించడంలో వారు చూపిన నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ స్కానింగ్ గది వద్దే కటిక నేలపై ప్రసవించింది. ప్రసవ వేదనతో ఆమె పెట్టిన కేకలు వైద్యుల చెవికెక్కలేదు. పైగా, ప్రసవం అనంతరం నేలపై ఉన్న రక్తాన్ని ఆ మహిళ తల్లి చేతే కడిగించారు. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లో జరిగింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దోమవరపు లావణ్య కాన్పు కోసం సోమవారం ప్రసూతి విభాగంలో చేరింది. పురుటి నొప్పులు రావటంతో స్కానింగ్ చేయించుకు రమ్మని గైనిక్ వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటి అండ్ ట్రామా సెంటర్లోని అల్ట్రా సౌండ్ స్కానింగ్ గది వద్దకు రాత్రి 8.50 గంటలకు తీసుకెళ్లారు. గంటకు పైగా ఉన్నా ఎవరూ రాలేదు. ఈలోగా లావణ్యకు నొప్పులు ఎక్కువయ్యాయి. తట్టుకోలేక రాత్రి 9.50 గంటల సమయంలో ఆమె స్కానింగ్ గది ముందే కూలబడిపోయింది. ఆమె ప్రసవ వేదనను చూసిన కొందరు మహిళలు చీరలు అడ్డుగా పెట్టారు. మరికొందరు ఆమెకు సపర్యలు చేశారు. లావణ్య కటిక నేలపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. -
పెద్దాసుపత్రిలో సమస్యల కొలువు
♦ గుండె ఆపరేషన్లు చేసేందుకు ఆటంకాలు ♦ నీరు, విద్యుత్ సరఫరాలో సమస్యలు ♦ విధులకు డుమ్మా కొడుతున్న వైద్య సిబ్బంది గుంటూరు మెడికల్ : రాష్ట్ర విభజన అనంతరం 1177 పడకలతో ఏపీలోనే అతిపెద్ద పేదల ఆసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు రూ. 33 కోట్లతో నిర్మించిన డాక్టర్ పొదిలి ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ, ట్రామా కేర్ సెంటర్లో విద్యుత్, నీటి సమస్యలు తరచూగా తలెత్తుతుండటంతో గుండె ఆపరేషన్లకు సైతం ఆటంకాలు ఏర్పడుతున్నాయి. నూతనంగా నిర్మించిన పొదిలి ప్రసాద్ భవనానినికి విద్యుత్ సరఫరా లేని సమయాల్లో జనరేటర్ ద్వార పవర్‌ను పంపిణీ చేసేందుకు 320 కేవీ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. అయితే కరెంటు లేని సమయాల్లో ప్రస్తుతం ఉన్న జనరేటర్ ద్వార ఉత్పిత్తి అవుతున్న విద్యుత్ సరిపోవడం లేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వం పీపీపీ విధానంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా జీజీహెచ్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీలు ప్రారంభించింది. గత మూడు వారాలుగా ఆపరేషన్లు జరుగుతున్నాయి. అయితే ఆపరేషన్లకు కరెంటు లేని సమయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జనరేటర్ సామర్ధ్యం సరిపోకపోవడమే దీనికి కారణం. అదనంగా మరో 320 కేవీ జనరేటర్‌ను ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో మిలీనియం బ్లాక్‌లో విద్యుత్ సరఫరా ఇచ్చే అవకాశం జరుగుతుంది. లేని పక్షంలో కేవలం అత్యవసరంగా కొన్ని ఆపరేషన్ థియేటర్లకు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతుంది. మొట్టమొదటి సారిగా మూడు వారాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రారంభించిన సమయంలో మంచినీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కొంత అంతరాయం తలెత్తింది. వేసవికి ముందుగానే మిలీనియం బ్లాక్ ప్రారంభానికి ముందుగానే ఆసుపత్రిలో నీటి సరఫరా గురించి ప్రణాళికలు రూపొందించాల్సిన అధికారులు విఫలమవడంతో నేడు సమస్య ఉత్పన్నమవుతుంది. రెండు నెలల క్రితం కార్పొరేషన్ నుంచి నూతనంగా నీటి సరఫరా లైనును మిలీనియం బ్లాక్ కోసం ఏర్పాటు చేశారు. నేటి వరకు పైపులైనులు ఏర్పాటు చేసినా నీటి సరఫరా మాత్రం వాటి ద్వార జరుగకపోవడంతో ఓపెన్ హార్ట్ సర్జరీల సమయంలో వైద్య సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. అత్యవసర వైద్య సేవల విభాగంలో వైద్యులు నిర్ణీత పనివేళల్లో అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఫలితంగా పేదలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఓపీ వేళల్లో కూడా కొద్దిపాటి సిబ్బంది మాత్రమే విధులకు హాజరవుతుండగా మిగతా వారు ఆసుపత్రికి వచ్చి సొంత కార్యకలాపాలపై మక్కువ చూపిస్తున్నారు. మిలీనియం బ్లాక్‌లో అదనంగా పడకలు ఉన్నప్పటికీ వాటికి సరిపడ వైద్య సిబ్బందిని, వైద్యులను ప్రభుత్వం కేటాయించకపోవడంతో నూతన భవనంలో అరకొర వైద్యసేవలే లభిస్తున్నాయి. ప్రతి మూడు నెలలకొకసారి కలెక్టర్ అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటి సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన పనులను ప్రజాప్రతినిధుల సమక్షంలో మంజూరు చేస్తారు. జీజీహెచ్‌లో సుమారు ఏడాదిన్నరగా ఆసుపత్రి అభివృద్ధి కమిటి సమావేశం జరుగకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. జీజీహెచ్‌కు వచ్చే పేదరోగులకు దాహార్తిని తీర్చేందుకు, మినరల్ వాటర్ ఉచితంగా అందించేందుకు ఏడాది క్రితం ప్రజాప్రతినిధులు తమ సొంతనిధులను ఆసుపత్రికి కేటాయించారు. నేటి వరకు మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు గురించి ఆసుపత్రి అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావినిస్తుంది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ జీజీహెచ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై స్పందించి పరిష్కరించాలని పలువురు రోగులు కోరుతున్నారు. -
కాలభైరవుల కన్నెర్ర!
గుంటూరు పెద్దాసుపత్రికి రోజుకు 70 మందికి పైకా కుక్కకాటు బాధితుల రాక పిచ్చికుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులు వ్యాక్సిన్ వేసినా మృతి చెందిన మాచర్లకు చెందిన ఐదేళ్ల చిన్నారి పుష్పలత మూఢనమ్మకాలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న ప్రజలు గ్రామాలు, పట్టణాల్లో శునకాల బెడదను పట్టించుకోని అధికారులు గుంటూరు : జిల్లాలో కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా గుంటూరు, మాచర్ల, తెనాలి వంటి ప్రాంతాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)కి నిత్యం 70 మందికి పైగా కుక్కకాటు బాధితులు చికిత్స నిమిత్తం రావటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మాచర్ల, తెనాలి ప్రాంతాల్లో పిచ్చికుక్క కాటుకు గురైన అనేక మంది చిన్నారులు జీజీహెచ్‌లోని శిశు వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు కావడం ఎత్తు తక్కువగా ఉండటంతో కంటిపై, బుగ్గలపై, చెవులపై కుక్కలు కరవడంతో వైరస్ మెదడుకు త్వరగా చేరే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పది రోజుల క్రితం మాచర్ల పట్టణం 3వ వార్డుకు చెందిన పుష్పలత అనే ఐదేళ్ల చిన్నారిని పిచ్చికుక్క కరవడంతో జీజీహెచ్‌కి తరలించారు. వైద్యులు ఇమ్యునోగ్లోబిన్ వ్యాక్సిన్ వేశారు. మరో డోసు కోసం మళ్లీ రమ్మని చెప్పడంతో ఇంటికి వెళ్లిన చిన్నారి పిచ్చి కుక్కమాదిరిగా ప్రవర్తిస్తుండటంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు మళ్లీ జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే జ్వరాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే చిన్నారి మృతి చెందింది. కుక్క కరచిన వెంటనే గాయాన్ని నీటితో శుభ్రం చేసి వ్యాక్సిన్‌కు తీసుకురావాలని వైద్యులు తెలిపారు. కుక్కకాటుకు గురై జీజీహెచ్‌లో చికిత్స పొందిన బాధితుల సంఖ్య నవంబరు నెలలో 1564, డిసెంబర్లో 1774, జనవరిలో ఇప్పటి వరకు 1420గా తేలింది. ఒక్క జీజీహెచ్‌లోనే ఇంత మంది చికిత్స పొందారంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఎంత మంది ఉంటారో ఊహించుకోవచ్చు. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడద తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు ... కుక్కకాటుకు గురైన వెంటనే గాయాన్ని సబ్బు నీటితో పలుమార్లు శుభ్రం చేయాలి. అయితే ప్రజలు మాత్రం కుక్క కరిచిన వారికి నీళ్లు తగలకూడదనే మూఢ నమ్మకంతో పసరుకట్లు కట్టడం వంటివి చేయడంతో వైరస్ వేగంగా శరీరంలోకి వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రపరిచి ప్రథమ చికిత్స చేయించి వైద్యులను సంప్రదిస్తే వ్యాక్సిన్ల ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ డోసులను డాక్టర్లు చెప్పిన సమయానికి వేయించుకోవాలని, ఆలస్యం చేస్తే వైరస్ మెదడుకు పాకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ముఖంపై కుక్క కరిచిన వారు వేగంగా ఆసుపత్రికి చేరుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని లేని పక్షంలో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. -
పన్ను పీకేస్తారు
గుంటూరు మెడికల్ : దంత వైద్యంలో ఆధునిక చికిత్సా విధానాలు ఎన్నో వస్తున్నా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఆ ఛాయలే కనిపించడంలేదు. చికిత్స కోసం వస్తున్న రోగులకు కేవలం ప్రాథమిక వైద్యసేవలే అందుతున్నారుు. తగినంత మంది వైద్యులు, సిబ్బంది ఉన్నప్పటికీ పళ్లు పీకటం మినహా మరే వైద్యసేవలనూ అందించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్ దంత వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. వీరికి తోడుగా ఇద్దరు డెంటల్ టెక్నీషియన్లు ఉన్నారు. అరుునా రోగులకు సరైన వైద్య సేవలు అందటం లేదు. సాధారణంగా పన్ను నొప్పితో వచ్చేవారికి చాలా రకాలుగా వాటిని నయం చేసే విధానాలు వచ్చేశారుు. ముఖ్యంగా రూట్‌కెనాల్ ట్రీట్మెంట్, పళ్లమధ్య ఏర్పడిన ఖాళీలను సిమెంట్‌తో పూరించడం, ప్రమాదాల్లో విరిగిన పళ్లకు క్యాప్వేసి కవర్ చేయడం, కృత్రిమ పళ్లసెట్ అమర్చడం వంటివి చేయొచ్చు. ఆ తరహా చికిత్సలు ఇక్కడ మచ్చుకైనా కానరావు. ఎత్తు పళ్లు, వంకర పళ్లను సరిచేసేందుకు క్లిప్‌లు పెట్టడం వంటి విధానాలే లేవు. ఆరోగ్యశ్రీ నిధులు దండిగా ఉన్నా.... ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జీజీహెచ్‌కు కోట్లాది రూపాయలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా అధిక ఆదాయం సంపాదించే ఆస్పత్రుల్లో జీజీహెచ్ మొదటి మూడు స్థానాల్లో ఉంటోంది. ఇంతటి ఆదాయం వస్తున్నప్పటికీ దంత వైద్యవిభాగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన అధికారులకు లేకపోవటం విస్మయం కలిగిస్తోంది. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆధునిక వైద్యసేవలను అందిస్తుండగా జీజీహెచ్‌లో మాత్రం నామమాత్ర సేవలు అందిస్తున్నారు. సిబ్బంది, సౌకర్యాలు చాలటం లేదు: దంతవైద్యవిభాగంలో అరకొర వైద్యసేవలపై విభాగాధిపతి డాక్టర్ పార్వతి వద్ద ప్రస్తావించగా వైద్య సిబ్బంది సరిపోవటం లేదని చెప్పారు. దంతాల చికిత్సకు అవసరమైన మెటీరియల్ సకాలంలో పంపిణీ చేయటం లేదని తెలిపారు. వైద్యం చేసే సమయంలో సరిపడా నీటి సరఫరా జరగటం లేదని పేర్కొన్నారు. మెడికో లీగల్ కేసులకు ఆపరేషన్లు, పంటి నొప్పిని తగ్గించే చికిత్సలు చేస్తున్నామని వివరించారు. -
మాతా,శిశు మరణాల తగ్గింపే లక్ష్యం
ఆరోగ్య కేంద్రాలకు నిధుల పెంపు ‘సాక్షి’తో డీఎంహెచ్ఓ డాక్టర్ నాగ మల్లేశ్వరి గుంటూరు మెడికల్ జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సురక్షితమైన ప్రసవాలు జరిగేలా చూసి మాతా, శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా ైవె ద్యులు, వైద్య సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రావిపాటి నాగమల్లేశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రస్తుతం కాన్పులు జరుగుతున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, తెనాలి జిల్లా ఆస్పత్రి, మూడు ఏరియా ఆస్పత్రులు, 16 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలూ పనిచేసే 32 ఆస్పత్రులలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది వివరాలు, వైద్య పరికరాలు, వైద్య సౌకర్యాల వివరాలన్నీ సేకరించి, మెరుగైన వైద్యసేవలందించడానికి నివేదిక రూపొందించామన్నారు. సురక్షితమైన కాన్పులు జరిగేలా వినుకొండ, గురజాల ఆస్పత్రుల స్థాయిని పెంపుదల చేశామని, వాటి అభివృద్ధి కోసం రూ.25 లక్షలు ప్రభుత్వం విడుదల చేసినట్టు చెప్పారు. పీహెచ్‌సీలకు జాతీయగ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులను ఇకనుంచి ఏడాదికి రూ.2.50లక్షలు ఇస్తామని వెల్లడించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏజ్, బ్లడ్‌గ్రూప్, బ్లడ్ షుగర్, యూరిన్ పరీక్షలు, గర్భ నిర్ధారణ పరీక్షలను తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు. ల్యాట్ టెక్నీషియన్లు లేని ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. గ్రామాలకు 104 వాహనాలు వెళ్లిన సమయంలో ఆరోగ్య కేంద్రాల్లో చేసే వ్యాధి నిర్ధారణ పరీక్షలన్నీ వాహనంలో ఉండే ల్యాబ్ టెక్నీషియన్లు చేస్తారని తెలిపారు. గర్భిణులకు చేసే అన్ని పరీక్షలను వారికి ఇచ్చే మాతా,శిశు సంరక్షణ కార్డులో తప్పనిసరిగా న మోదు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు డాక్టర్ నాగమల్లేశ్వరి చెప్పారు. గర్భవతిగా నిర్ధారణ జరిగిన వారి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. గర్భిణులకు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించే పారితోషికాలను చెల్లించేందుకు వారి ఆధార్ వివరాలను అనుసంధానం చేయాలని తెలిపారు. -
‘నర్సింగ్'పై నిర్లక్ష్యం
గుంటూరు మెడికల్ జిల్లాలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలోని ప్రభుత్వ నర్సింగ్ పాఠశాలతో పాటు, 26 ప్రైవేటు నర్సింగ్ పాఠశాలలు, 18 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ(జిఎన్ఎమ్)కోర్సు, బిఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉన్నాయి. ఒక్కో కళాశాల, పాఠశాలలో 45 నుంచి 60 వరకు సీట్లు ఉన్నాయి. మూడన్నరేళ్లు, నాలుగున్నరేళ్ల వ్యవధిగల ఈ కోర్సుల్లో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఉండాల్సిన సౌకర్యాలు లేవన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, డిఎంహెచ్ఓ అధికారులకు తనిఖీలు చేసే అధికారం ఉంది. అలా వెళ్లిన అధికారులు తాయిలాలు అందుకుంటూ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడంతో వసతి లేమి కారణంగా విద్యార్థులకు అగచాట్లు తప్పటం లేదు. కోర్సు పూర్తి కాగానే ఆరునెలల పాటు ప్రాక్టికల్ నాలెడ్జి పెంపొందించుకోవటం కోసం ఇంటర్నీ చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల ఇంటర్నీ చేయకుండానే విద్యార్థులను ఇళ్లకు పంపివేస్తున్నారు. {పాక్టికల్ అనుభవం అంతంత మాత్రంగా ఉండడం, కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాల్లో చేరుతుండటంతో నర్సింగ్ విద్యలో నాణ్యత లోపిస్తుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. నిబంధనల ప్రకారం సదుపాయాలు ఇలా ..... టీచింగ్ బ్లాక్‌లో లెక్చర్ హాల్, నర్సింగ్ ఫౌండేషన్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఫ్రీ క్లీనికల్ సైన్స్‌ల్యాబ్, మల్టీపర్పస్ హాల్,లైబ్రరీ, గైనిక్ అండ్ పీడియాట్రిక్ ల్యాబ్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సి పాల్ ఫ్యాకల్టీలకు ప్రత్యేక గదులు ఉండాలి. అన్ని విభాగాలను 23,720 స్క్వేర్ ఫీట్ ఏరియాలో నిర్మించాలి. హాస్టల్ ప్రాంగణంలో విజిటర్స్ రూమ్, రీడింగ్ రూమ్, రిక్రియేషన్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్ అండ్ స్టోర్, విద్యార్థులు ఉండే గదులు ఇలా అన్ని విభాగాలను 30,750 స్క్వేర్ ఫీట్ ఏరియాలో నిర్మించాలి. {పొఫెసర్ అర్హత కల్గిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అసోసి యేట్ ప్రొఫెసర్ అర్హత కల్గిన రీడర్స్, ఇద్దరు లెక్చరర్లు, 19 మంది ట్యూటర్లు విధుల్లో ఉండాలి. టీచర్, స్టూడెంట్ రేషియో 1ః10గా ఉండాలి. {పిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు నర్సింగ్‌లో మాస్టర్డిగ్రీతో పాటు పదేళ్ల అనుభవం, రీడర్‌కు ఏడేళ్లు, లెక్చరర్‌కు మూడేళ్లు, ట్యూటర్కు ఏడాది అనుభవం ఉండాలి. నిబంధనలు తూచ్....... జిల్లాలోని నర్సింగ్ పాఠశాలలు, కళాశాలల్లో నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలను అమలు చేస్తున్న వాటి సంఖ్య చాలా తక్కువ. భవనాలు కూడా సరిపడ లేని పాఠశాలలు, అద్దె భవనాల్లో ఉన్న పాఠశాలలు చాలా ఉన్నాయి. ఇక బోధన సిబ్బంది అర్హతలు అంతంత మాత్రమే ఉన్న వారిని విధుల్లో ఉంచుతున్నట్లు వినికిడి. జీజీహెచ్‌లోని నర్సింగ్ కళాశాల, పాఠశాలలో పనిచేస్తున్న పలువురు బోధనా సిబ్బంది పేర్లు ప్రైవేటు నర్సింగ్ పాఠశాలలు, నర్సింగ్ కళాశాలల్లో కూడా ఉంటున్నాయి. ఒకే నర్సింగ్ ట్యూటర్ రెండు చోట్ల ఎలా బోధన చేస్తున్నారో తనిఖీ చేసే అధికారులకే తెలియాలి. విద్యార్థినుల భోజన సదుపాయాలు గురించి, వారి బాధల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. -
రాత్రి వేళ రాకండి
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ : వ్యాధి తీవ్రతను తట్టుకోలేక గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)కి వచ్చే పేదలకు వైద్యసేవలు సకాలంలో అందడం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాత్రివేళల్లో వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రాత్రి వేళల్లో సాధారణంగా రోడ్డు ప్రమాద కేసులు, గుండెపోటుకు గురైన బాధితులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు, విషప్రభావానికి గురైన కేసులు ఎక్కువగా వస్తుంటాయి. డ్యూటీ డాక్టర్లు విధులకు డుమ్మా కొడుతుండడంతో.. పీజీ వైద్యులే వివిధ రకాల వ్యాధుల నిర్థారణ పరీక్షల పేరుతో తెల్లవార్లూ అత్యవసర వైద్యసేవల విభాగంలోనే రోగులను ఉంచుతున్నారు. రోగులు ఆస్పత్రిలో ఉండి కూ డా వైద్యులు విధుల్లో లేకపోవడంతో బాధను భరిస్తూ దేవుడిపై భారం వేసి జాగారం చేయాల్సివస్తోంది. రెండు రోజులు గడిచినా కొన్ని అత్యవసర కేసులు కూడా క్యాజువాలిటీలోనే గడుపుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పగటి వేళా అత్తెసరు వైద్యమే... నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు వైద్యులు తమసేవలను అందించాల్సివుంటుంది. ఉదయం 9 గంటలకు ఓపీకి రావాల్సిన డాక్టర్లు 10 గంటలు దాటినా రావడం లేదు. కొందరు వైద్యులతే ఏకంగా ఓపీ విభాగాలకు హాజరుకాకుండానే గడిపేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండాల్సిన వైద్యవిభాగాలు మధ్యాహ్నం 12.30 గంటలకే మూతపడుతున్నాయి. ఓపీలో కొందరు వైద్యులు రోగులకు వైద్యం అందించకుండా వైద్యవిద్యార్థులకు బోధన చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం చేయాల్సిన బోధనను ఉదయం ఓపీ సమయంలోనే చేసి మధ్యాహ్నం నుంచి సొంత క్లినిక్‌లకు జారుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తీరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి హాజరుపట్టీలో సంతకాలు చేసి మరీ వెళుతున్నారు. వైద్యసిబ్బందిలో విధులపై నానాటికి చిత్తశుద్ధి లోపిస్తుండడంతో ఆస్పత్రికి వచ్చే పేదరోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పర్యవేక్షణ ఉండడం లేదు.. పేదలకు వైద్యసేవలు అందుతున్నదీ లేనిదీ పర్యవేక్షించాల్సిన వైద్యాధికారులు పట్టించుకోకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది. రోగులకు వైద్యసేవలు సకాలంలో అందేలా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ తగు చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు. వైద్యసేవలకు ఆటంకం లేకుండా చూస్తాం.. క్యాజువాలిటీలో రోగులకు సకాలంలో వైద్యం అందేలా సంబంధిత విభాగాల అధిపతులను రెస్పాన్బుల్పర్సన్గా నియమిస్తామని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ తెలిపారు. రోగులకు వైద్యసేవలకు ఆటంకం లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఆరోగ్యానికి సెల్లు చీటి
సెల్లో హలో అంటూ పలకరిస్తున్నారా.. హాయ్ అంటూ సంక్షిప్త సందేశం పంపిస్తున్నారా? అంతవరకు అయితే ఫరవాలేదు. అదేపనిగా సెల్‌ఫోన్ వాడితే అనర్ధాలే అంటున్నారు వైద్య నిపుణులు. సెల్ఫోన్ల వలన ఎంత మేలు జరుగుతుందో.. అంతకు మించిన కీడు ఉందని హెచ్చరిస్తున్నారు. మనిషి నిత్యం వెంటపెట్టుకుని తిరిగే సెల్‌ఫోన్ బాక్టీరియాకు అడ్డాగా మారుతోందంటున్నారు. దీని ద్వారా మనకు తెలియకుండానే చర్మ వ్యాధులు, కేన్సర్, మతిమరుపు, మెదడు, చెవికి సంబంధించిన వ్యాధులు సోకుతున్నాయని చెబుతున్నారు. - న్యూస్‌లైన్, గుంటూరు మెడికల్ సె ల్‌ఫోన్ మన జీవితంలో నిత్యావసరంగా మారింది. ఒకప్పుడు దూరప్రాంతాల్లో ఉండేవారితో మాట్లాడేందుకే దీన్ని వినియోగించేవాళ్లం. ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం, సెల్ఫోన్లో వివిధ రకాల ఫీచర్లు పెరిగిపోయాయి. దీంతో జేబులో ఉండి ఎప్పుడో రింగ్ అయ్యే ఫోన్ ప్రస్తుతం చేతుల్లోకి వచ్చింది. చాటింగ్ చేస్తూనో, గూగుల్‌లో సెర్చ్ చేస్తూనో, మ్యూజిక్ వింటూనో.. నిత్యం ఎంతోమంది ఫోన్‌తో గడిపేస్తున్నారు. ఇందులో పల్లె, పట్నం అనే తేడా లేదు.. సెల్‌ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి నెలకొంది. ఆయితే సెల్‌ఫోన్ వినియోగంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. స్ట్రెప్టోకొకి, స్టాఫిలోకొకి, ఈకోలి అనే బాక్టీరియా, కాంటాక్ట్ డెర్మటిటీస్ అనే స్కిన్ అలర్జీ వ్యాపించే అవకాశాలున్నట్టు హెచ్చరిస్తున్నారు. టచ్ స్క్రీన్, కీప్యాడ్లపై సూక్ష్మ జీవులు టచ్ స్క్రీన్ సెల్ఫోన్లు, కీప్యాడ్ల వల్ల కూడా ఎన్నో రకాల సూక్ష్మజీవులు వ్యాపిస్తున్నారుు. అవన్నీ కూడా చేతి వేళ్లపైకి, బుగ్గలపైకి చేరే అవకాశం ఉంటుంది. తద్వారా వివిధ రకాల చర్మ సమస్యలు తలెత్తవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. బుగ్గలపై, చెవుల వద్ద బొబ్బర్లు రావడానికి ఈ మొబైల్‌ఫోన్లే కారణమని హెచ్చరిస్తున్నారు. మరీముఖ్యంగా సెల్ఫోన్లు అధికంగా చెవి వద్ద పెట్టుకొని గంటల తరబడి మాట్లాడేవారికి వినికిడి మందగించడం, మెదడుకు సంబంధించిన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఎలక్ట్రో మాగ్నటిక్ వేవ్స్(ఏఈడబ్ల్యూ) ద్వారా శరీర కణజాలం వేడెక్కే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా చర్మంలోని ప్రొటీన్ల నిర్మాణ క్రమం మారిపోయే అవకాశం ఉందని ఇటీవల కాలంలో ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఎస్ఎంఎస్ల ద్వారా ఇన్ఫోమేనియా వ్యాధి సెల్‌ఫోన్ వినియోగదారుల్లో ఎక్కువమంది కుర్రకారే. వీరంతా అవసరానికి మించి ఫోన్ వినియోగిస్తూ.. రోజంతా అదేపనిగా ఎస్ఎంఎస్లు పంపిస్తూ కాలం గడుపుతున్నారు. దీనివల్ల ‘ఇన్ఫోమేనియా’ అనే వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే ఇంటర్నెట్లో ఈ-మెయిల్స్ అదే పనిగా చూడడమూ ఓ అలవాటుగా మారింది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ ఇన్ఫోమేనియా వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అధిక రేడియేషన్... సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ లేని సమయంలో సరిగా వినిపించి వినిపించకుండా ఉండే సమయాల్లో అధిక రేడియేషన్ విడుదల అవుతుంది. ఎక్కువగా అండర్‌గ్రౌండ్స్‌లో, లిఫ్టుల్లో ఉన్న సమయాల్లో ఫోన్ మాట్లాడితే అధిక రేడియేషన్ బయటకు వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఫోన్‌వాడకుండా ఉండటం చాలా ఉత్తమం. ప్రస్తుతం సెల్ఫోన్అధిక సమయం వినియోగించేవారికి ఇప్పటికిప్పుడే దాని ప్రభావం కనిపించదు. ఫోన్వాడకం పదిహేనేళ్లు దాటాక సెల్ రేడియేషన్ ప్రభావం తెలుస్తుంది. సెల్రేడియేషన్కు గురయ్యేవారిలో తలతిరగటం, చెవిలో శబ్ధాలు, మెదడులో కణితులు ఏర్పటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నారుల్లో, గర్భిణుల్లో కూడా రేడియేషన్ వల్ల దుష్పరిమాణాలు కలుగుతాయి. షుగర్, బీపీ, గుండెపోటుకు సెల్‌రేడియేషన్ కూడా కారణమే. రేడియేషన్‌ను నివారించేందుకు ‘రేడియేషన్ ప్రివెంటివ్ చిప్‌లు’ సెల్‌ఫోన్‌కు అమర్చాలి. విటమిన్ ‘ఇ’ తో కూడిన మాయిశ్చరైజర్‌ను యాంటీయాక్సిడెంట్స్తో కూడిన ఎమోలియెంట్స్‌ను ఉపయోగించాలి. అవి చర్మానికి తేమను అందించడంతోపాటుముడతలు రాకుండా చేస్తాయి. రోజూ రెండు మూడుసార్లు చేతులను, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. గంటల తరబడి మొబైల్‌ను వినియోగించకూడదు. - డాక్టర్ ఎం.ఆదినారాయణరావు, రేడియాలజిస్ట్ పలు రకాల చర్మవ్యాధులు మొబైల్ ఫోన్‌కు ఉండే నికెల్ కోటింగ్ వల్ల కొన్ని రకాల బాక్టీరియాలు వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో కొందరు ఈ తరహా చర్మవ్యాధులతో బాధపడుతున్నారని స్కిన్ స్పెషలిస్టులు చెప్పారు. నునుపైన బుగ్గలపై నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు సోకే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ మచ్చలపై దురద వంటి లక్షణాలు ఉంటాయి. మొబైల్‌ను ఎక్కువగా వినియోగించే వ్యక్తుల్లో ఈ తరహా చర్మ సమస్యలు వ్యాపిస్తున్నాయని వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. క్యాన్సర్ వచ్చే అవకాశం.. సెల్‌ఫోన్‌ను విపరీతంగా వినియోగించటం వల్ల అధికంగా రేడియేషన్ విడుదలై క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సెల్లు రేడియేషన్ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నటిక్ఫీల్డును వెలువరిస్తాయి. ఇది క్యాన్సర్ కారకం అని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చి ఆన్ క్యాన్సర్ అనే సంస్థ సర్వే చేసి వెల్లడించింది. టచ్‌స్క్రీన్, కీప్యాడ్ వల్ల కంటికికనిపించని బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. - డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, క్యాన్సర్ వైద్య నిపుణులు -
పేరుకే పెద్దాసుపత్రి.. పరికరాలు లేక కుస్తీ
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్: కోస్తాంధ్రాలో పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్)లోని రేడియాలజీ వైద్య విభాగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపకపోవటంతో అక్కడ నిత్యం సమస్యలు తాండవిస్తూనే ఉన్నాయి. పురాతన కాలం నాటి వైద్య పరికరాలు, కాలపరిమితి దాటిన వైద్య పరికరాలే నేటికీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అవి తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది.త్వరలో ఆస్పత్రిలో భారత వైద్య మండలి(ఎంసీఐ) తనిఖీలు చేయనుంది. ఈ నేపథ్యంలో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో లేకపోవటంతో ఎంసీఐ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందనే భయాందోళనలో ఆస్పత్రి అధికారులు ఆందోళన చెందుతున్నారు. రేడియాలజీ కీలకమే... ఆస్పత్రిలోని రేడియాలజీ వైద్య విభాగంలో పలురకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఎక్సరే, ఆల్ట్రాసౌండ్, సిటిస్కాన్ తదితర పరీక్షలు కూడా ఈ విభాగంలోనే నిర్వహిస్తున్నారు. నరాల వ్యాధుల వారికి, మెదడు సంబంధిత వ్యాధిగ్రస్తులకు, రోడ్డు ప్రమాద భాధితులకు, గర్భిణిలకు, కిడ్నీ వ్యాధులున్నవారికి, ఇతర జబ్బులున్న వారికి రేడియాలజీలో పరీక్షలు చేసిన పిదప మాత్రమే వైద్యం ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న ఎక్సరే మెషిన్లు నాలుగు పనిచేయకపోవటంతో మూలనపడేశారు. కొత్తవాటిని కొనుగోలు చేసేందుకు ఆస్పత్రి అధికారులు పలుమార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపినా స్పందన లేదు. ప్రస్తుతం మూడు మెషిన్లు మాత్రమే పనిచేస్తుండటంతో అధికంగా వస్తున్న పేద రోగులకు సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగటం లేదు. సిటిస్కాన్ మెషిన్‌కూడా తరచూ మరమ్మతులకు గురువుతుంది. ఆస్పత్రిలో ఇది ఏర్పాటుచేసి 12 సంవత్సరాలు పూర్తయింది. వాస్తవానికి దీని కాలపరిమితి 10 ఏళ్లు మాత్రమే. ఇక ఎంఆర్ఐ మెషిన్‌ను నేటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. సుమారు 60 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పెద్దాసుపత్రిలో రేడియాలజీ వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందించాలంటే తప్పనిసరిగా అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరికరాలను ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సి ఉంది. వివరణ... వైద్య పరికరాలు తరచూ మరమ్మతులకు గురవుతున్న విషయాన్ని ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు రేడియాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ పార్వతీశ్వరరావు తెలిపారు. నూతన వైద్య పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, ఆ ప్రక్రియ పూర్తికాగానే పరికరాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. -
విజయమ్మ దీక్ష భగ్నంలో పోలీసుల దాష్టీకం
* గుంటూరు ప్రభుత్వాస్పత్రికి విజయమ్మ తరలింపు * దీక్షా వేదికపై రణరంగం సృష్టించిన పోలీసులు * అడ్డుపడిన నేతల్ని, కార్యకర్తల్ని దీక్షా వేదికపై నుంచి విసిరేసిన వైనం * ఆపై విజయమ్మను అంబులెన్స్‌లో కాకుండా పోలీస్ జీపులో ఎక్కించే యత్నం * జీజీహెచ్ ఆసుపత్రిలో రెండంతస్తుల మెట్లు ఎక్కించి దింపి ఇబ్బంది పెట్టిన పోలీసులు.. నీరసంతో పడిపోయిన విజయమ్మ * ఆపై ఆసుపత్రి ఆవరణలోనే బైఠాయింపు * ఐసీయూలో చేర్చినా వైద్యానికి నిరాకరణ... దీక్ష కొనసాగింపు * జగన్ ఫోన్ చేసి కోరడంతో దీక్ష విరమణ సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఐదు రోజులపాటు, వంద గంటలకు పైగా చేపట్టిన అకుంఠిత ఆమరణ నిరాహార దీక్షను వ్యూహాత్మకంగా భగ్నం చేసిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆమెను గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే సమర దీక్ష వేదికపై విజయమ్మను అరెస్టు చేసే సమయంలో కార్యకర్తలు, నేతలపై విరుచుకుపడడం, పైకిలేవలేని స్థితిలో నీరసించిన ఆమెను బలవంతంగా నెట్టుకుంటూ.. తోసుకుంటూ వేదికపై నుంచి దింపడం, అంబులెన్స్‌లో కాకుండా పోలీస్ సుమోలో ఎక్కించడం, ఆసుపత్రిలో రెండంతస్తుల మెట్లు ఎక్కించి, దించి ఇబ్బందిపెట్టడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుతో విజయమ్మ ఒక దశలో స్పృహ తప్పిపడిపోయారు కూడా. తెలుగుజాతి ప్రజల ఆరాధ్య దైవంగా భావిస్తున్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, ఒక రాష్ట్ర పార్టీకి గౌరవ అధ్యక్షురాలు, ఒక ఎంపీకి తల్లి, ఎమ్మెల్యే అయిన విజయమ్మను నేరస్తురాలిని అదుపులోకి తీసుకున్న విధంగా పోలీసులు వ్యవహరించడంపై వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పక్కా ప్లాన్‌తో పోలీసులు.. దీక్ష భగ్నం చేసేందుకు ఆది నుంచీ పోలీసులు పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు. ఎవరికీ అనుమానం రాకుండా దీక్షను భగ్నం చేసేది లేదని శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి పార్టీ నేతలకు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వైద్యులు హెల్త్ బులెటిన్ల వివరాలను కనీసం బయటకు చెప్పనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీక్షకు విఘాతం కల్గించనీయబోమని వైఎస్సార్ సీపీ శ్రేణుల్ని తప్పుదోవ పట్టించిన పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు శిబిరంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున గుమికూడిన పార్టీ శ్రేణుల్లో కలిసిపోయి మఫ్టీ పోలీసులు నెమ్మదిగా వేదికపైకి చేరుకున్నారు. తర్వాత యూనిఫామ్ దుస్తుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన పోలీసులకు పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వేదికపై ఉన్న విజయమ్మ వద్దకు పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించినా కొద్ది సేపు నేతలు అడ్డుకున్నారు. ఈ సమయంలో వైఎస్సార్ సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించి వేదికపై నుంచి ఎత్తి కింద పడేశారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురైంది. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను చెల్లా చెదురు చేశారు. అడ్డువచ్చిన వారిని మోచేతులతో కుళ్లబొడిచారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులోని మహిళలు కొందరు వేదికపైకి చేరుకుని తమకు సహకరించాల్సిందిగా విజయమ్మను కోరారు. పక్కనే ఉన్న వై.వి.సుబ్బారెడ్డి, శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మలు దీక్ష భగ్నం చేస్తే ఊరుకునేది లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సమన్యాయం చేస్తామని కేంద్రం ప్రకటించే వరకు తాను దీక్ష విరమించేది లేదని విజయమ్మ స్పష్టం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ విజయమ్మను ఓఎస్డీ వెలిశల రత్నతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు మహిళా బలగాలు వేదికపై నుంచి తీసుకుపోయారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న విజయమ్మ ఆరోగ్యం విషమంగా ఉన్నా పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారి నిరంకుశ వైఖరిపై పార్టీ నేతలతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో కాకుండా సుమోలో.. విజయమ్మను పోలీసు ఎస్కార్టు జీపులో ఎక్కించేందుకు ఖాకీలు ప్రయత్నించారు. కనీసం అంబులెన్స్ కూడా తేకుండా, పోలీస్ జీప్‌లో ఎక్కించడం చూసి పార్టీ నేతలు అడ్డుకున్నారు. హైడ్రామాను నడిపించిన పోలీసులు చివరకు పోలీస్ డీఎస్పీ సుమోలో ఎక్కించారు. అడ్డుపడిన వారిపై ర్యాపిడ్ యాక్షన్ బలగాలు లాఠీచార్జి చేశారు. విజయమ్మను ఎక్కించిన పోలీసు వాహనాన్ని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వంగవీటి రాధాలతో పాటు కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిని లాగిపారేసిన పోలీసులు ముందుకు కదిలారు. తమ వాహనాలు మంగళగిరి వైపు వెళ్తున్నట్లుగా పార్టీ నేతలను తప్పుదోవ పట్టించి కొత్తపేట మీదుగా జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో తీవ్ర నిర్లక్ష్యం.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్)లో సైతం పోలీసులు విజయమ్మను అవమానించేలా వ్యవహరించారు. నేరుగా క్యాజువాల్టీ ముందు సుమోను ఆపగా, ఆమెను లోపలికి తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ లేదని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. కనీసం, వీల్‌చైర్ కూడా లేకపోగా.. కారులోనుంచి విజయమ్మను కిందికి దింపి ఆరుబయట రోడ్డుపై నిలబెట్టారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఐసీయూలోకి తరలించాలని, క్యాజువాల్టీలో పడకల్లేవని వైద్యులు చెప్పడంతో అక్కడ్నుంచి రెండో అంతస్తు వరకు నడిపించుకుని వెళ్లారు. ఐసీయూలో పరీక్షలు చేసేందుకు పరికరాలు, టెక్నీషియన్ సిబ్బంది లేరని పోలీసులు మళ్లీ ఆమెను బలవంతంగా కిందికి తెచ్చారు. క్యాజువాల్టీలో కనీసం బీపీ చూసే మెషీన్ లేదనగా.. ఏం చేయాలనే విషయంపై పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. అప్పటికే సమయం తెల్లవారుజామున 2.30 గంటలైంది. విజయమ్మ నీరసంతో కింద పడిపోయారు. కాసేపటికి తేరుకుని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. అప్పటికే అక్కడికి చేరిన పార్టీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తల నినాదాలతో ఆస్పత్రి మార్మోగింది. రాపిడ్యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీల్ని ఝళిపించాయి. అరగంటకు పైగా బైఠాయింపు.. దాదాపు అర్ధగంటకు పైగా విజయమ్మ ఇక్కడ బైఠాయించారు. చివరికి ఐసీయూలోనికే తీసుకెళ్తామంటూ పోలీసులు మరోమారు ఆమెను బలవంతంగా నెట్టుకుంటూ రెండు అంతస్తులు ఎక్కించారు. అప్పటికప్పుడు క్యాజువాల్టీ డ్యూటీలో ఉన్న వైద్యుడ్ని పిలిపించి బీపీ పరీక్షలు చేయించారు. తర్వాత ఐసీయూకి తరలించారు. ఐసీయూలో విజయమ్మకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నించినా, విజయమ్మ తాను దీక్ష విరమించేది లేదని, సమన్యాయంపై ప్రకటన వచ్చేంతవరకు దీక్ష కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఆరోగ్యం క్షీణిస్తుందని, సహకరించాలని వైద్యులు కోరినప్పటికీ వినలేదు. విజయమ్మను జీజీహెచ్‌కు తీసుకెళ్ళారనే వార్త తెల్లవారుజామున దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న జీజీహెచ్‌కు తరలివచ్చారు. ధర్నా, నిరసనలు చేపట్టారు. జగన్ సూచనతో దీక్ష విరమణ.. విజయమ్మను శనివారం ఉదయం కార్డియాలజీ విభాగంలోని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ బలగాలు జీజీహెచ్ మొత్తం అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యకర్తలు జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారుల అనుమతితో జైలులోని ఫోన్‌బూత్ నుంచి తన తల్లి విజయమ్మకు ఫోన్ చేసి మాట్లాడారు. దీక్ష విరమించాల్సిందిగా కోరారు. అప్పుడు ఆమె దీక్ష విరమించడంతో వైద్యులు ఆమెకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. విజయమ్మ మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేటు అంబులెన్స్‌లో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడ్నుంచి హైదరాబాద్ బయలుదేరారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్న ఎమ్మెల్యేలు.. విజయమ్మ సమర దీక్షను భగ్నం చేయాలన్న తాపత్రయంలో ఆమె పట్ల పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరుపై శాసనసభ స్పీకర్ మనోహర్‌కు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నారు. విజయమ్మను దీక్షా స్థలి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించేటప్పుడు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా కనీసం అంబులెన్స్ సమకూర్చకుండా ఒక సాధారణ వాహనంలో తీసుకెళ్లడంపై ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పార్టీ శాసనసభా పక్ష నేత అయిన విజయమ్మను ప్రభుత్వాసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డుకు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆమెకున్న హక్కులకు భంగం కలిగించారని సోమవారం ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.