గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి పాము కలకలం సృష్టించింది.
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి పాము కలకలం సృష్టించింది. దీంతో జిల్లా కలెక్టర్ మంగళవారం అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి జిల్లాల్లోని 52 శాఖల అధికారులు హాజరయ్యారు. సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్రచికిత్స గదిలోకి పాము చొరబడింది. దీంతో సిబ్బంది ఆ పామును చంపేసి ఎవరికీ తెలియకుండా కాల్చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కాంతీలాల్‌దండే మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యగా మారిన పాములు, ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానంపై అన్ని శాఖల అధికారుల నుంచి సూచనలు తీసుకోనున్నట్టు తెలిసింది.