గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (పెద్దాసుపత్రి)లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట పెద్దాసుపత్రిలో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన నేపథ్యంలో అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. పార్టీ నేతలు మాజీ మంత్రి కొలుసు పార్ధసారథి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, డాక్టర్లు నన్నపనేని సుధ, జగన్మోహనరావులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.