అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకివి తప్పనిసరి | main importance of certificates to assistant professor post | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకివి తప్పనిసరి

Published Mon, Jul 20 2015 1:57 AM | Last Updated on Tue, Aug 21 2018 3:45 PM

main importance of certificates to assistant professor post

సాక్షి, హైదరాబాద్: బోధనాసుపత్రుల్లో సుమారు 324 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 22, 23 తేదీల్లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు 1:1 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు రావాలని ఈ-మెయిల్ సమాచారమిచ్చారు. కానీ అభ్యర్థుల్లో ఇప్పటికీ ఏ ధ్రువపత్రాలు తీసుకురావాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్యవిద్యాశాఖ వర్గాలు కింది ధ్రువపత్రాలు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించాయి.
     
♦  4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్
♦  ఎస్‌ఎస్‌సీ, క్యాస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు
♦  ఎంబీబీఎస్, పీజీ ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు
♦  భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు
♦  అంగవికలాంగులు అయితే పీహెచ్ సర్టిఫికెట్
♦  ఎంబీబీఎస్ లేదా పీజీ అనంతరం ఏడాది ప్రభుత్వ సర్వీసు ఉన్న ధ్రువపత్రాలు
♦  ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు సర్వీసు చేసినట్టు సర్టిఫికెట్
♦  వివాహమయ్యాక ఇంటిపేరు మార్చుకున్న మహిళల ధ్రువపత్రం
♦  అంటే మ్యారేజీ సర్టిఫికెట్ గానీ, అఫిడవిట్ తదితర పత్రాలు జతచేయాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement