అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకివి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: బోధనాసుపత్రుల్లో సుమారు 324 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 22, 23 తేదీల్లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు 1:1 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు రావాలని ఈ-మెయిల్ సమాచారమిచ్చారు. కానీ అభ్యర్థుల్లో ఇప్పటికీ ఏ ధ్రువపత్రాలు తీసుకురావాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్యవిద్యాశాఖ వర్గాలు కింది ధ్రువపత్రాలు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించాయి.
♦ 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్
♦ ఎస్ఎస్సీ, క్యాస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు
♦ ఎంబీబీఎస్, పీజీ ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు
♦ భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు
♦ అంగవికలాంగులు అయితే పీహెచ్ సర్టిఫికెట్
♦ ఎంబీబీఎస్ లేదా పీజీ అనంతరం ఏడాది ప్రభుత్వ సర్వీసు ఉన్న ధ్రువపత్రాలు
♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు సర్వీసు చేసినట్టు సర్టిఫికెట్
♦ వివాహమయ్యాక ఇంటిపేరు మార్చుకున్న మహిళల ధ్రువపత్రం
♦ అంటే మ్యారేజీ సర్టిఫికెట్ గానీ, అఫిడవిట్ తదితర పత్రాలు జతచేయాలి