Certification observation
-
స్కూల్ అసిస్టెంట్ల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి
* 23 మంది అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు సైతం * ఎంపికైనట్టు గుర్తింపు * రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదన * అనుమతి వచ్చిన వెంటనే కొత్తవారి ఎంపిక శ్రీకాకుళం: జిల్లా నుంచి డీఎస్సీ-14లో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలుగా ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన స్థానిక ప్రభుత్వబాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. మాజీ సైనికుల కేటగిరీ నుంచి ఓ మహిళ ఎంపిక కాగా దానిని అధికారులు తిరస్కరించారు. మరో మహిళ తను ఈ ఉద్యోగం చేపట్టనని లిఖితపూరకంగా తెలియజేశారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారిలో 23 మంది ఎస్జీటీ స్థాయి పోస్టులకు కూడా ఎంపికైనట్లు అధికారులు గుర్తించారు. వారంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో చేరేందుకు సుముఖత తెలపడంతో లిఖితపూరకం హామీను తీసుకున్నారు. వీటన్నింటినీ రాష్ట్ర స్థాయికి నివేదించారు. అక్కడ పరిశీలన పూర్తయి అనుమతులు వచ్చిన వెంటనే ఎస్జీటీ పోస్టులకు కొత్త వారిని ఎంపిక చేస్తారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేసి అటుతరువాత నియామకాలు జరుపుతారు. ఈ నెలాఖరు నాటికి పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకివి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: బోధనాసుపత్రుల్లో సుమారు 324 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 22, 23 తేదీల్లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు 1:1 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు రావాలని ఈ-మెయిల్ సమాచారమిచ్చారు. కానీ అభ్యర్థుల్లో ఇప్పటికీ ఏ ధ్రువపత్రాలు తీసుకురావాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్యవిద్యాశాఖ వర్గాలు కింది ధ్రువపత్రాలు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించాయి. ♦ 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్ ♦ ఎస్ఎస్సీ, క్యాస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ♦ ఎంబీబీఎస్, పీజీ ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు ♦ భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు ♦ అంగవికలాంగులు అయితే పీహెచ్ సర్టిఫికెట్ ♦ ఎంబీబీఎస్ లేదా పీజీ అనంతరం ఏడాది ప్రభుత్వ సర్వీసు ఉన్న ధ్రువపత్రాలు ♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు సర్వీసు చేసినట్టు సర్టిఫికెట్ ♦ వివాహమయ్యాక ఇంటిపేరు మార్చుకున్న మహిళల ధ్రువపత్రం ♦ అంటే మ్యారేజీ సర్టిఫికెట్ గానీ, అఫిడవిట్ తదితర పత్రాలు జతచేయాలి