* 23 మంది అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు సైతం
* ఎంపికైనట్టు గుర్తింపు
* రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదన
* అనుమతి వచ్చిన వెంటనే కొత్తవారి ఎంపిక
శ్రీకాకుళం: జిల్లా నుంచి డీఎస్సీ-14లో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలుగా ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన స్థానిక ప్రభుత్వబాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. మాజీ సైనికుల కేటగిరీ నుంచి ఓ మహిళ ఎంపిక కాగా దానిని అధికారులు తిరస్కరించారు.
మరో మహిళ తను ఈ ఉద్యోగం చేపట్టనని లిఖితపూరకంగా తెలియజేశారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారిలో 23 మంది ఎస్‌జీటీ స్థాయి పోస్టులకు కూడా ఎంపికైనట్లు అధికారులు గుర్తించారు. వారంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో చేరేందుకు సుముఖత తెలపడంతో లిఖితపూరకం హామీను తీసుకున్నారు. వీటన్నింటినీ రాష్ట్ర స్థాయికి నివేదించారు. అక్కడ పరిశీలన పూర్తయి అనుమతులు వచ్చిన వెంటనే ఎస్జీటీ పోస్టులకు కొత్త వారిని ఎంపిక చేస్తారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేసి అటుతరువాత నియామకాలు జరుపుతారు. ఈ నెలాఖరు నాటికి పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
స్కూల్ అసిస్టెంట్ల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి
Published Sat, May 21 2016 1:17 AM | Last Updated on Sat, Sep 15 2018 5:09 PM
Advertisement
Advertisement