కాంట్రాక్టు సర్విసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం
సుమారు 1,300 మందికి ఉపాధ్యాయులుగా లభించనున్న అవకాశం
సాక్షి, హైదరాబాద్: డీఎస్‌సీ–2008లో ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థులను ఉమ్మడి జిల్లాలవారీగా కాంట్రాక్టు సర్విసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 1,300 మంది అభ్యర్థులకు ఈ ఉత్తర్వులతో కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం లభించనుంది. డీ.ఎడ్ విద్యార్హతగల అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టుల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2009 జనవరి 29న జారీ చేసిన జీవో–28 కారణంగా ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థుల వివరాలను ప్రభుత్వం పాఠశాల విద్య డైరెక్టర్‌ను కోరింది.
ఈ మేరకు డీఎస్‌సీ–2008లో ఎఫెక్ట్ అయిన బీఈడీ అభ్యర్థుల వివరాలను ఉమ్మడి జిల్లాలవారీగా సేకరించి జాబితా రూపొందించినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్ ఫాంలను కూడా రూపొందించి www.rchooedu.tea nfana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటలో ఉంచినట్లు తెలిపారు. డీఎస్‌సీ–2008 బీఈడీ అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ నుంచి వెరిఫికేషన్ ఫాంలను డౌన్‌లోడ్ చేసుకొని వివరాలు నింపడంతోపాటు కాంట్రాక్టు సేవల్లో పనిచేయడానికి సమ్మతి తెలియజేస్తూ పూర్వ జిల్లా డీఈవోకు సమర్పించాలన్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 10 వరకు ఉమ్మడి జిల్లా డీఈవో వద్ద సరి్టఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఆ తరువాత దరఖాస్తులను అనుమతించబోరని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment