BEd candidates
-
డీఎస్సీ–2008 బీఈడీ అభ్యర్థులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2008లో ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థులను ఉమ్మడి జిల్లాలవారీగా కాంట్రాక్టు సర్విసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 1,300 మంది అభ్యర్థులకు ఈ ఉత్తర్వులతో కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం లభించనుంది. డీ.ఎడ్ విద్యార్హతగల అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2009 జనవరి 29న జారీ చేసిన జీవో–28 కారణంగా ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థుల వివరాలను ప్రభుత్వం పాఠశాల విద్య డైరెక్టర్‌ను కోరింది.ఈ మేరకు డీఎస్సీ–2008లో ఎఫెక్ట్ అయిన బీఈడీ అభ్యర్థుల వివరాలను ఉమ్మడి జిల్లాలవారీగా సేకరించి జాబితా రూపొందించినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్ ఫాంలను కూడా రూపొందించి www.rchooedu.tea nfana.gov.in వెబ్సైట్లో అందుబాటలో ఉంచినట్లు తెలిపారు. డీఎస్సీ–2008 బీఈడీ అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి వెరిఫికేషన్ ఫాంలను డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపడంతోపాటు కాంట్రాక్టు సేవల్లో పనిచేయడానికి సమ్మతి తెలియజేస్తూ పూర్వ జిల్లా డీఈవోకు సమర్పించాలన్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 10 వరకు ఉమ్మడి జిల్లా డీఈవో వద్ద సరి్టఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఆ తరువాత దరఖాస్తులను అనుమతించబోరని స్పష్టం చేశారు. -
చిక్కులు.. సందేహాలు
శ్రీకాకుళం: ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పూర్తిచేస్తుందా? లేక ప్రకటనలతో సరిపుచ్చుతుందా? అని బీఎడ్ అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరులోనే డీఎస్సీ నోటిఫికేషన్ అని ప్రకటించినా ఇప్పటివరకు దానికి సంబంధించి కార్యాచరణ మాత్రం ఖరారు కాలేదు. డీఎస్సీకి అర్హత పరీక్షగా భావించే టెట్ విషయంలో రోజుకో సవరణ జీఓ విడుదల చేస్తూ ప్రభుత్వం అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేస్తోంది. జనవరి 12న విడుదల చేసిన జీవోతో బీఎడ్ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. గతంలో ఇలా గతంలో టెట్ పరీక్షలకు సంబంధించి తెలుగు పండిట్, హిందీ పండిట్ అభ్యర్థులకు టెట్ పేపరు–2 నిర్వహించేవారు. టీపీటీ, హెచ్‌పీటీ అభ్యర్థులు సాంఘికశాస్త్రం, గణితం సబ్జెక్టును ఎంచుకుని పరీక్ష రాసేవారు ఏదో ఒకటి ఎంచుకుని 60 మార్కులకు ఆయా సబ్జెక్టుల్లో సన్నద్ధమయ్యేవారు. గత ఏడాది జనవరిలో హిందీ భాష పండితులు.. టెట్ పరీక్ష పేపరు–2లో హిందీకి సంబంధించిన కంటెంట్‌ను 60 మార్కులకు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా పట్టించుకోని ప్రభుత్వం.. టెట్ ప్రకటన విడుదల చేసిన నెల రోజుల తర్వాత కొత్త జీవో విడుదల చేసింది. దీంతో కొత్త తల నొప్పులు మొదలయ్యాయి. సాధారణంగా బీఎడ్ అభ్యర్థులు మెథడాలజీలో మొదటి సబ్జెక్టుగా సైన్సు, సోషల్, గణితాన్ని ఎన్నుకుని రెండో మెథడాలజీగా తెలుగు గానీ ఇంగ్లిషునుగానీ ఎంచుకుంటారు. ఇలా ఎంచుకుని బీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు ఎంఏ తెలుగు లేదా ఇంగ్లిషు చేస్తే వారు డీఎస్సీలో తమ సబ్జెక్టుతోపాటు భాష పండిత పరీక్ష రాసుకునేందుకు అర్హులవుతారు. గతంలో టెట్ పేపరు–2కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డీఎస్సీలో పండిట్స్ పరీక్ష కూడా రాసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.కానీ ప్రస్తుతం అలా పండిట్ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు పేపరు–2 నుంచి పేపరు–3కి మారాలని సూచించింది. తెలుగు పండిట్స్‌కు దరఖాస్తు చేసుకున్న పీజీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ వారి మెథడాలజీని బట్టి సాంఘిక, బయాలజీ, ఫిజికల్ సైన్సు, గణితం పరీక్షలకు అర్హులవుతారు. రెండింటినీ రాయాలంటే.. సాధారణంగా చాలా మంది అభ్యర్థులు తమ మెథడాలజీ ప్రకారమే టెట్‌కు సన్నద్ధం అవుతారు. వీరికి అర్హత ఉంటే పండిత పరీక్ష కూడా రాసుకునేందుకు టెట్ మార్కులనే పరిగణనలోకి తీసుకునేవారు. ప్రస్తుతం భాష పండిత పరీక్ష రాయాలంటే పేపరు–3 రాయాలని జీఓ విడుదల చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వం పేపరు–2 నుంచి పేపరు–3కి మారేందుకు అవకాశం కల్పించింది. తిరిగి పేపరు–2 రాయాలంటే మరోమారు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఉందా లేక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతోపాటు ఆయా పరీక్షలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాల్సిందే. ఒకవేళ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నా ఇప్పటికే గడువు ముగిసింది. ప్రభుత్వం ఒకే ఫీజుతో స్కూల్ అసిస్టెంట్, భాష పండిత పరీక్ష రాసుకునేలా అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం పేపరు–3కి ఎటువంటి సిలబస్ ఉంటుందో అనే విషయాన్ని పేర్కొనలేదు. ఒకవేళ సిలబస్ పెంచితే ఎలా సన్నద్ధమవ్వాలనే వారికి ప్రశ్నార్థకంగా మారింది. -
సెల్‌టవరెక్కిన బీఈడీ అభ్యర్థులు
బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ ప్రభుత్వం తెప్పదాట దోరణి అవలంభిస్తోందంటూ ధ్వజం అనంతపురం క్రైం : బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న సెల్‌టవర్‌ను ఎక్కడం కలకలం రేపింది. సుమారు రెండు గంటల పాటు టవర్ నుంచి దిగకుండా పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. వివరాల్లోకి వెళ్తే...బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పిస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడేమో తెప్పదాట దోరణి అవలంభిస్తోందంటూ బీఈడీ అభ్యర్థులు ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, బీఈడీ అభ్యర్థి నరసింహులు ఉదయం 11 గంటల సమయంలో సెల్ టవర్ ఎక్కారు. సమాచారం అందుకున్న డీఎస్పీ మల్లికార్జున వర్మ, టూటౌన్ సీఐ శుభకుమార్, పలువురు ఎస్ఐలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టవర్‌పైకి ఎక్కిన వారిని కిందకు దింపే ప్రయత్నం చేశారు. లాభం లేకపోయింది. టూటౌన్ ఎస్ఐ హమీద్‌ఖాన్ సెల్‌టవర్ ఎక్కాడు. ఆందోళనకారుల వద్దకు వాటర్ బాటిల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పైకి వస్తే కిందకు దూకేస్తామంటూ నరసింహులు హెచ్చరించడంతో ఎస్ఐ వెనక్కు తగ్గారు. టవర్ కింద రోడ్డుపై ఏఐఎస్ఎఫ్ నాయకులు బీఈడీ అభ్యర్థుల సమాఖ్య నాయకులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్‌కు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు డీఎస్సీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కనీసం కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. తామంతా ఓట్లు వేసింటేనే గద్దెనెక్కారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. డీఎస్పీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తర్వాత ఆందోళనకారులను మంత్రితో మాట్లాడించారు. కాసేపటికి విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి ఇద్దరూ సెల్ కాన్ఫరెన్స్‌లో ఉంటూ అభ్యర్థులతో మాట్లాడారు. డీఎస్సీ నోటిఫకేషన్ రద్దు చేయడం వీలుకాదని, తర్వాత డీఎస్సీలో బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం సెల్‌టవర్ నుంచి యువకులు కిందకు దిగారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోహర్, కుళ్లాయప్ప, అలి, కుళ్లాయిస్వామిగౌడ్, బీఈడీ అభ్యర్థుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు హనుమన్న, హనుమంతు, ప్రసాద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఈడీలకు ఎస్జీటీ అవకాశం కల్పించండి: వైఎస్ జగన్
హైదరాబాద్: బీఈడీ అభ్యర్థులకు డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడలకు లేఖ రాశారు. ఏపీలో బీఈడీ అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని వివరించారు. అందువల్ల బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో అర్హత కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్సీటీఈ వారికి ఈ అవకాశం లేకుండా చేసిందన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు ఈ వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలో దాదాపు రెండు లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. వారి ఆశలమేరకు ఎన్సీటీఈ నిబంధనలను సవరించి ఈ వెసులుబాటు కల్పించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
బీఈ‘డీలా’..!
శ్రీకాకుళం: ఎంతో కాలంగా ఊరించి.. ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ బీఈడీ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా సైన్స్ అభ్యర్థుల పూర్తిగా డీలా పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొత్తం 719 పోస్టులు నోటిఫై చేయగా వాటిలో 375 ఎస్జీటీ, 93 పండిట్, 21 పీఈటీ, 230 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో బయోలాజికల్, ఫిజికల్ సైన్స్ పోస్టులు ఒక్కటీ లేవు. గత డీఎస్సీల్లోనూ సైన్స్ అభ్యర్థులకు అరకొర పోస్టులే కేటాయిం చారు. ఈసారి అవి కూడా లేకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఇప్పటికే అభ్యర్థులు వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకున్నా నిరుపయోగమేనంటున్నారు. మొదటి నుంచీ అదే తంతు టీడీపీ, ఆ ప్రభుత్వం డీఎస్సీకి సంబంధించి మొదటి నుంచీ గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. 2012 నుంచి డీఎస్సీ జరగలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి.. ఇప్పుడు తొమ్మిదివేల పైచి లుకు పోస్టులతో మినీ డీఎస్సీని ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీలను అర్హులను చేస్తామని చెప్పిన ప్రభుత్వం, కేంద్రం అభ్యంతరం చెబుతోందన్న సాకుతో దానికీ నీళ్లొదిలేసింది. జిల్లాలో 98 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి ప్రవేశపెట్టారు. మున్సిపల్ పాఠశాలలకు గత ప్రభుత్వం 1284 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసింది. మోడల్ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ డీఎస్సీలో నోటిఫై చేస్తే 500కుపైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం లభించేది. అలాగే అడహాక్ రూల్స్ ద్వారా ఎంఈవోలుగా పదోన్నతులు కల్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా మరో 527 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండేది. ఇలా ఖాళీలను భర్తీ చేయడం, కొత్త పోస్టులు మం జూరు చేయడం వంటివి చేస్తే డీఎస్సీలో 14 వేల పోస్టులను నోటిఫై చేసే అవకాశముండేది. బీఈడీలకు కూడా న్యాయం జరిగేది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పినట్లు 10,500 పోస్టులను కాకుండా వెయ్యికిపైగా పోస్టులను కుదించడం అభ్యర్థులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థన మేరకు అదనంగా 1252 మున్సిపల్ టీచర్ పోస్టులను నోటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం మరో జీవో జారీ చేసినా.. దీనివల్ల జిల్లా జరిగే మేలు స్వల్పమే. జిల్లాలో 15, 20 పోస్టులు మాత్రమే పెరుగుతాయి. జిల్లాల నుం చి రెండు రకాల వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటిలో తక్కువ పోస్టులు ఉన్న వివరాలతో డీఎస్సీని నోటిఫై చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. జిల్లాల స్థాయిలో రేషనలైజేషన్ జరపకుండానే జరిపినట్లు చెబుతోంది. విద్యాశాఖ రికార్డుల ప్రకారమే సుమారు 30వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. -
బీఈడీలకు షాక్
ఏలూరు సిటీ :ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపిన ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు షాకిచ్చింది. పోస్టుల భర్తీకి సంబంధించి టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌గా నామకర ణం చేసింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు, నిబంధనలతో కూడిన జీవో-38 జారీ చేసింది. భారీగా పోస్టులు భర్తీ చేస్తారని గంపెడాశతో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రిక్తహస్తం చూపింది. మరోవైపు బీఈడీ అభ్యర్థుల ఆశలను ఆవిరిచేస్తూ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల్లో కేవలం డీఈడీ అభ్యర్థులకే అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పరీక్ష రాసిన అభ్యర్థులూ మరోసారి టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాయాల్సి ఉంది. అయితే ఈ రెండింటిలో దేనికి ఎక్కువ మార్కులు వస్తే దానిని పరిగణనలోకి తీసుకోనుండటం కాస్త ఊరటనిస్తోంది. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల సంగతి అటుంచితే.. డీఎస్సీలో 601 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో పోస్టులు తక్కువగా ఉండటంతో పోటీ తారస్థాయికి చేరుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభు త్వ నిర్ణయం డీఈడీ చేసిన వారికి వరంగా మారగా, బీఈడీ అభ్యర్థులకు మాత్రం శాపంగా పరిణమించింది. ఉత్తీర్ణతలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60మార్కులు సాధిస్తే గానీ క్వాలిఫై అయ్యే అవకాశాలు లేవు. జిల్లాలో పోస్టులు ఇలా జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మైదాన ప్రాంతం (ప్లెయిన్ ఏరియా)లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), లాంగ్వేజ్ పండిట్ (ఎల్పీ), ఎస్జీటీ కలిపి మొత్తం 563 పోస్టులు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక ఎల్పీ, 36 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో గణితం-17, బయోలాజికల్ సైన్స్-22, సోషల్ స్టడీస్-50, ఇంగ్లిష్-6, తెలుగు-19, హిందీ-4, ఉర్దూ-1, సంస్కృతం-3 పోస్టులు ఉన్నాయి. భాషా పండిట్ తెలుగు-25, భాషా పండిట్ హిందీ-43, భాషా పండిట్ సంస్కృతం-15 పోస్టులు ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఎస్జీటీ 358, ఏజెన్సీలో 36 వరకు ఉన్నాయి. అన్యాయం చేశారు ఎస్జీటీ పోస్టుల్లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామం టూ ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం చివరకు నీరుగార్చింది. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో సబ్జెక్టుల వారీగా పోస్టులైనా పెంచుతారని ఆశించి నా.. అదీలేదు. దీంతో బీఈడీ అభ్యర్థులు తీవ్ర ఆసంతృప్తికి లోనవుతున్నారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 123 ఉంటే ఈ పోస్టులకు పోటీపడే వారి సంఖ్య భారీగా ఉంది. జిల్లాలో బీఈడీ అభ్యర్థులు సుమారు 30 వేల వరకు ఉంటారని అంచనా. వీరంతా డీఎస్సీ పరీక్షకు హాజరైతే ఒక్కో పోస్టుకు సుమారు 250 మంది అభ్యర్థులు పోటీపడే పరిస్థితి నెలకొంటుంది. పీఈటీ పోస్టు ఒక్కటీ లేదు జిల్లాలో పీఈటీ పోస్టు ఒక్కటీ లేకపోవటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ-12లోనూ అన్యాయం జరగడంతో ఆవేదనకు గురైన పీఈటీలు ఈసారైనా అవకాశం వస్తుందని ఎదురుచూశారు. సర్కారు మరోసారి మొండిచేయి చూపడంతో డీలాపడ్డారు. జిల్లాలో 12 వరకు పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అధికారులు కావాలనే ఈ పోస్టులను డీఎస్సీ ప్రతిపాదిత జాబితాలో చూపించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరాశపరిచారు డీఎస్సీ ప్రకటిస్తారని ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వ ప్రకటన నిరాశ కలిగించింది. ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీలకు అవకాశం కల్పిస్తామని నమ్మించిన సర్కారు సరైన ప్రయత్నాలు చేయకుండా చేతులెత్తేసింది. బీఈడీ అభ్యర్థులు వేలల్లో ఉంటే పోస్టులు చాలా తక్కువగా ఉండటం దారుణం. - జి.పద్మమోహన, బీఈడీ అభ్యర్థి పోటీ పెరిగిపోతుంది జిల్లా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 123 పోస్టులు ఉంటే అభ్యర్థులు సుమారు 30వేల మంది ఉన్నారు. కనీసం రోస్టర్ ఆధారంగా అయినా పోస్టులు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. స్కూల్స్‌లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంటే పోస్టులు మాత్రం భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కావాలంటే టీచర్లు ఉండాలి కదా. - జి.సత్యవాణి, బీఈడీ అభ్యర్థి -
కొత్తపేరు.. కొత్త కష్టాలు
* తాజాగా టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ * మోగిన డీఎస్సీ గంట * బీఈడీ అభ్యర్థులకు నిరాశ * జిల్లాలో తీవ్రమైన పోటీ నెల్లూరు(విద్య): ఎన్నికలకు ముందు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని పదేపదే వాగ్దానం చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్షలను వాయిదావేస్తూ వచ్చింది. ఊరించి.. చివరకు బుధవారం పేరుమార్చి టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌గా విధి విధానాలను ప్రకటించింది. ఎట్టకేలకు ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు మంత్రి గంటా మోగించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ఒప్పుకోలేదని ఎస్జీటీలకు డీఈడీ అభ్యర్థులే అర్హులని స్పష్టం చేసింది. గతంలో ఏపీ టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులు సైతం మళ్లీ పరీక్ష రాయాలని నిబంధన విధించింది. 2015 మే తొమ్మిదిన ఎస్జీటీ, 10న ఎల్పీ, పీఈటీ, 11న స్కూల్ అసిస్టెంట్లకు టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. దీర్ఘకాలికంగా ఎదురుచూసిన అభ్యర్థుల్లో నోటిఫికేషన్ వెలువడుతోందన్న ఆనందం కంటే నిరాశే ఎక్కువైంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి కూడా అర్హత కల్పిస్తామని నాన్చుతూ వచ్చిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేయడం వారి పాలిట శాపంగా మారింది. వయో పరిమితిని 40ఏళ్లకు పెంచారు. 2012లో డీఎస్సీని నిర్వహించారు. ఏపీ టెట్‌లో అర్హత సాధించి మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి మరికొంతమందికి నెలకొంది. ఉమ్మడి పరీక్షల్లో వచ్చిన మార్కులు, గతంలో జరిగిన టెట్మార్కులకు సంబంధించి ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే అందుకు అనుగుణంగా 20 శాతం వెయిటేజీని ఇస్తామని నిర్ణయించారు. దీంతో అభ్యర్థులు కొత్తగా కుస్తీ పట్టాల్సి వస్తోంది. బీఈడీ అభ్యర్థుల సిలబస్ విసృ్తతంగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెట్, డీఎస్సీ సిలబస్ కలిపి ఒకే పరీక్షలో రాయాల్సి రావడం ఇందుకు నిదర్శనం. రెండేళ్ల నుంచి సిలబస్‌పై ఉన్న సందేహాలపై పూర్తిస్పష్టత రావాల్సి ఉంది. పోస్టుల్లోనూ నిరాశే జిల్లాలో 416 పోస్టులు భర్తీచేయాల్సి ఉంది. ఎస్జీటీలు 307, స్కూల్ అసిస్టెంట్లు 57, లాంగ్వేజ్ పండితులు 42, పీఈటీలు 10 పోస్టులు ఉన్నాయి. 416 పోస్టులకు వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీపడనున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లలో విపరీతమైన పోటీ నెలకొననుంది. బట్టీ విధానం పనికిరాదు ఉమ్మడి పరీక్షా విధానంలో బట్టీ విధానం పనికిరాదు. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. చైల్డ్ డెవలప్మెంట్ అంట్ పెడగాని మెథడాలజీలతో పాటు ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ, ప్రణాళిక అవసరం. కనకరాజు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పరిపూర్ణ అవగాహన అవసరం ప్రతి సబ్జెక్ట్‌పై అవగాహన అవసరం. అకాడమీ పుస్తకాలు చదవడం ముఖ్యం. పోటీ తీవ్రతకు భయపడకుండా ప్రణాళికతో చదవాలి. వెంకటేశ్వర్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సంతోషంగా ఉంది.. ఇప్పటికైనా టీచర్ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ వెలువడటం సంతోషంగా ఉంది. ఎస్జీటీ పోస్టులకు ఆరోగ్యకరమైన పోటీ ఉంది. కష్టపడి చదివితే ఉద్యోగం సాధించవచ్చు. సిలబస్‌పై స్పష్టత రావాల్సి ఉంది. డీఎడ్ అభ్యర్థులకు మాత్రమే ఎస్జీటీ పోస్ట్‌లను కేటాయించడం హర్షణీయం. పుష్పలత ఆనందం లేకుండా పోయింది నోటిఫికేషన్ ఇచ్చారన్న ఆనందం లేదు. ఇన్ని సంవత్సరాలు ఎదురుచూశాం. గతంలో టెట్‌లో అత్యధిక మార్కులు సాధించాను. మళ్లీ ఇప్పుడు రాయాల్సి వస్తోంది. అన్ని సబ్జెక్ట్‌లను మళ్లీ చదవాలంటే కష్ట సాధ్యం. ఈ ఏడాదికి మామూలు విధానాన్నే అమలు చేసుంటే బావుండేది. మొత్తంమీద మరో విద్యా సంవత్సరం కోల్పోయాం. -మహేశ్వర్ -
బీఈడీలకునిరాశే
ఒంగోలు వన్‌టౌన్: సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీ విషయంలో బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి మొండిచేయి చూపారు. దీంతో జిల్లాలో 10వేల మందికి పైగా బీఈడీ అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఈడీ/టి.టి.సి. విద్యార్హతలున్న వారిని అర్హులుగా గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన గత రెండు డీఎస్సీలో సెకండరీ గ్రేడు పోస్టులను కేవలం డి.ఇ.డి. అభ్యర్థులకే కేటాయించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు బీఈడీ అభ్యర్థులకు కూడా సెకండరీ గ్రేడు పోస్టులకు అర్హులుగా ప్రకటిస్తామని ఎస్.జి.టి.పోస్టుల్లో బీఈడీలను నియమిస్తామని వాగ్ధానం చేశారు. బీఈడీలకు ఎస్.జి.టి. పోస్టులకు అనుమతించాలని కోరుతూ ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ’(ఎన్‌సిటిఇ)కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఎస్జిటి పోస్టులకు డీఈడీలను మాత్రమే అనుమతించాలని బీఈడీలను అనుమతించరాదని కేంద్రం నుంచి రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలందాయి. దీంతో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో సెకండరీ గ్రేడు పోస్టులకు డీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులుగా ప్రకటించింది. దీంతో అర్హత లభిస్తుందని గంపెడాశతో ఎదురుచూసిన బీఈడీలకు తీవ్ర నిరాశే మిగిలింది. 839 పోస్టులు మాత్రమే భర్తీ జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి ఎట్టకేలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి గత మూడు నెలలుగా రకరకాల ప్రకటనలతో నిరుద్యోగ టీచర్లను అయోమయానికి గురిచేసిన ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భర్తీ సంఖ్యను గణనీయంగా తగ్గించింది. జిల్లాలో కేవలం 839 టీచర్ పోస్టులను మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రెండింటినీ కలిసి ఒకే పరీక్షగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనే టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన నిరుద్యోగ ఉపాధ్యాయులు తాజా నోటిఫికేషన్లో ఉపాధ్యాయ పోస్టుల పరీక్షతోపాటు టెట్ పరీక్ష కూడా మళ్ళీ రాయాల్సి ఉంది. అయితే ఈ ఏడాదే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంలోనే కాలహరణం చేసింది. దీంతో 2014-15 విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేనట్లే. తాజాగా జారీ చేయనున్న నోటిఫికేషన్లో ఎంపికయ్యే ఉపాధ్యాయులకు 2015-16 విద్యాసంవత్సరంలోనే నియామకపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అర్హత మార్కులివే... ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి నిర్వహించే డీఎస్సీ, టెట్ ఉమ్మడి రాతపరీక్షలో సెకండరీ గ్రేడ్ పోస్టులకు ఎస్జిటి, పీఈటీ పోస్టులకు 180 మార్కులకు, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉద్యోగ నియమకాలకు ఓసీ అభ్యర్థులకు కనీసం 60 శాతానిపైగా, బీసీలకు 50 శాతంపైగా, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతంపైగా మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానం ప్రకారం అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వీరికి మాత్రమే ఉద్యోగాల అర్హులుగా పరిగణించి ఎలిజిబులిటీ సర్టిఫికేట్లు జారీ చేస్తారు. జిల్లాలో 839 పోస్టులు తాజాగా ప్రకటించే డీఎస్సీ నోటిఫికేషన్లో జిల్లాలో మొత్తం 839 పోస్టులను ప్రకటించనున్నారు. -
బీఈడీ అభ్యర్థులకు షాక్
రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో బీఈడీ అభ్యర్థులు ఉంటే 200 లోపే పోస్ట్‌లు కేటాయించింది. తక్కువ సంఖ్యలో ఉండే డీఈడీ అభ్యర్థులకు ఎక్కువ పోస్ట్‌లు కేటాయిస్తూ ఆదేశాలిచ్చింది. విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు ఊహించని రీతిలో గట్టి షాక్ ఇచ్చింది. ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో బీఈడీ అభ్యర్థులు ఉంటే 200 లోపే పోస్ట్‌లు కేటాయించింది. ఇదే క్రమంలో తక్కువ సంఖ్యలో ఉండే డీఈడీ అభ్యర్థులకు ఎక్కువ పోస్ట్‌లు కేటాయించి గందరగోళానికి తెరతీసింది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి వేల రూపాయలు వెచ్చించి బీఈడీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పరిమిత సంఖ్యలో పోస్ట్‌లు కేటాయించటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ పోస్ట్‌లు భర్తీ చేస్తామని పదేపదే ఎన్నికల ముందు ప్రకటించిన టీడీపీ అధికార పగ్గాలు చేపట్టాక మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో బీఈడీ అభ్యర్థులు సుమారుగా 15 వేల మందిపైగా ఉండగా కేవలం 320 పోస్ట్‌లతో సరిపెట్టింది. టెట్ కమ్ టీఆర్టీగా పేరు మార్పు... రాష్ట్ర ప్రభుత్వం బుధవారం డీఎస్సీ పేరు మార్చి టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌గా విధి విధానాలను ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని ఎస్జీటీలకు డీఈడీ అభ్యర్థులే అర్హులని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో 2 లక్షల 30 వేల మంది బీఈడీ అభ్యర్థులు ఉండగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లు కేవలం 1,800 ప్రకటించింది. తక్కువ సంఖ్యలో 30 వేల మంది ఉన్న డీఈడీ అభ్యర్థులకు మాత్రం ఏడు వేల పోస్ట్‌లు కేటాయించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల బృందం నోటిఫికేషన్ విడుదల క్రమంలో రెండు రోజుల కిత్రం మంత్రి గంటా శ్రీనివాస్‌ను కలిసి 10 వేల 600 పోస్ట్‌లు కేటాయించాలని విజ్ఞప్తి కూడా చేసింది. గతంలో ఏపీ టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులు సైతం మళ్లీ పరీక్ష రాయాలని నిబంధన విధించింది. మే తొమ్మిదిన ఎస్జీటీ, 10న ఎల్పీ, పీఈటీ, 11న స్కూల్ అసిస్టెంట్ లకు ఉమ్మడిగా అర్హత పరీక్షలు నిర్వహించనుంది. దీర్ఘకాలంగా ఎదురుచూసిన అభ్యర్థుల్లో నోటిఫికేషన్ వెలువడుతోందన్న ఆనందం కంటే నిరాశే ఎక్కువైంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీకి అర్హత కల్పిస్తామని నానుస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేయడం వారి పాలిట శాపంగా మారింది. మరోపక్క అభ్యర్థుల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచారు. గతంలో 2012లో డీఎస్సీని నిర్వహించారు. రెండేళ్ల తర్వాత ఒక ఏడాది వయో పరిమితిని పెంచారు. అర్హత సాధించిన అభ్యర్థులు కొంతమంది వయోపరిమితి కారణంగా ఉద్యోగం కోల్పోతున్నారు. ఏపీ టెట్‌లో అర్హత సాధించి మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి మరికొంతమందికి నెలకొంది. ఉమ్మడి పరీక్షల్లో వచ్చిన మార్కులు, గతంలో జరిగిన టెట్ మార్కు ల్లో ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే అందుకు అనుగుణంగా 20 శాతం వెయిటేజీని ఇస్తామని నిర్ణయించారు. దీంతో అభ్యర్థులు కొత్తగా కుస్తీ పట్టాల్సి వస్తోంది. బీఈడీ అభ్యర్థుల సిలబస్ విస్తృతంగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 320 పోస్ట్‌లను ప్రకటించారు. వీటిలో 213 ఎస్జీటీ పోస్ట్‌లు కాగా, 107 స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లు ఉన్నాయి. వీటిలో ఫిజికల్ సైన్స్ కేవలం రెండు పోస్ట్‌లే ఉన్నాయి. ఇంగ్లీష్ 8 పోస్ట్‌లు, సోషల్ 39 పోస్ట్‌లు, తెలుగు 29 పోస్ట్‌లు ఉన్నాయి. -
‘బీఈడీ’ల ఆశలపై నీళ్లు
విజయనగరం అర్బన్ : ఓట్ల కోసం టీడీపీ ఇచ్చిన బూటకపు హామీలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. రుణమాఫీ వ్యవహారాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం వల్ల రైతులు భారీ స్థాయిలో వడ్డీ భారం మోయనున్నారు. పొదుపు మహిళల రణాలు మాఫీ కాకపోవడం వల్ల భారీవడ్డీని భ రించాల్సి వస్తోంది. మోసపోయిన వారి జాబితా లో ఇప్పుడు బీఈడీ నిరుద్యోగులు వం తు వచ్చింది. ఆరుమాసాల ఆలస్యంగా గురువారం విడుదల చేసిన డీఎస్సీ-2014 షెడ్యూల్లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులుగా ప్రకటించారు. దీంతో బీఈడీ అభ్యర్థుల ఆశలు నీరుగారిపోయాయి. జాతీయ వృత్తి విద్యా మండలి (ఎన్సీఈఆర్టీ) నిబంధనల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హత కోల్పోయిన బీఈడీ అభ్యర్థుల ఓట్లుకోసం ఎన్నికల్లో గాలాం వేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీఈడీలకు ఎస్జీటీ పోస్టుల ఎంపికలో అర్హతని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఎన్నిక మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ప్రభుత్వం విడుదల చేయబోతున్న డీఎస్సీ నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టుకు పోటీపడేందుకు తమకూ అవకాశం దక్కుతుందని ఆశతో ఎదురు చూసిన బీఈడీ పట్టభద్రులకు ఇప్పుడు నిరాశే ఎదురయింది. గత డీఎస్సీ మాదిరిగానే ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ మాత్రమే అర్హులని తాజాగా షెడ్యూల్లో తేల్చిచెప్పారు. ఎన్సీఈఆర్టీ నిబంధనలను కనీసం తెలుసుకోకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పాదయాత్రలో ఎస్జీటీలుగా అకాశం కల్పిస్తామని బీఈడీలకు హామీ ఇచ్చి... తర్వాత దానిని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది బీఈడీ నిరుద్యోగులు ఉండడంతో వీరందర్నీ ఓట్లు కోణంలో చూసిన చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రావడంతో తమ కిచ్చిన హామీ చంద్రబాబు నెరవేరుస్తారని బీఈడీ అభ్యర్థులు ఆశపడ్డారు. ఆరుమాసాలుగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా అప్పులు చేసి వేల రూపాయలు ఫీజులుకట్టి శిక్షణ తీసుకున్నారు. జిల్లాలో ఎస్జీటీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న బీఈడీ అభ్యర్థులు 15 వేల మంది ఉంటారని అంచనా. తాజాగా విడుదల చేసిన డీఎస్సీ-2014 షెడ్యూల్లో ప్రకటించిన జిల్లా ఖాళీలలోని 384 పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 249, పీఈటీలు-03, పండిట్స్-31 మినహాయిస్తే కేవలం 101 పోస్టులు మాత్రమే బీఈడీ అర్హతగల స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులున్నాయి. వాటిలో కొన్ని సబ్జెక్టుల పోస్టులు సింగిల్ నంబర్లో ఉన్నాయి. దీంతో ఈ షెడ్యూల్లో తమకు దగా జరిగిందని బీఈడీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ పంపిన ఖాళీ పోస్టులు 435 డీఎస్సీ-2014 నోటిఫికేషన్ కోసం జిల్లా నుంచి విద్యాశాఖ పంపిన ఖాళీ పోస్టులు 435 వరకు ఉన్నాయి. కేటగిరి వారీగా వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు 283. వీటిలో మైదాన ప్రాంతానికి 218, ఏజెన్సీ ప్రాంతానికి 65 పోస్టులున్నాయి. మిగిలిన 152 స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో సబ్జెక్టుల వారీగా మైదాన ప్రాంతం పోస్టులలో లెక్కలు-17, ఫిజికల్ సైన్స్-08, సోషల్ స్టడీస్-51, ఇంగ్లిష్-07, తెలుగు-17 ఉన్నాయి. భాషాపండిత (ఎల్పీ) పోస్టులు హిందీ-14, తెలుగు-21, ఒడియా-02, సంస్కృతం-01, పీఈటీలు-07 ఉన్నాయి. ఏజన్సీ ప్రాంతంలో స్కూల్ అసిస్టెంట్ టీచర్లు ఇంగ్లిష్-02, లెక్కలు-01, ఎల్పీ పోస్టులు-04 (బ్లాక్‌లాగ్) ఉన్నట్లు డీఈఓ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అయితే ప్రభుత్వం గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కేవలం 362 పోస్టులు మాత్రమే ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఖాళీలను కూడా కుదించి భర్తీ చేస్తున్నట్లు తేలింది.