శ్రీకాకుళం: ఎంతో కాలంగా ఊరించి.. ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ బీఈడీ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా సైన్స్ అభ్యర్థుల పూర్తిగా డీలా పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొత్తం 719 పోస్టులు నోటిఫై చేయగా వాటిలో 375 ఎస్జీటీ, 93 పండిట్, 21 పీఈటీ, 230 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో బయోలాజికల్, ఫిజికల్ సైన్స్ పోస్టులు ఒక్కటీ లేవు. గత డీఎస్సీల్లోనూ సైన్స్ అభ్యర్థులకు అరకొర పోస్టులే కేటాయిం చారు. ఈసారి అవి కూడా లేకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో
ఇప్పటికే అభ్యర్థులు వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకున్నా నిరుపయోగమేనంటున్నారు.
మొదటి నుంచీ అదే తంతు టీడీపీ, ఆ ప్రభుత్వం డీఎస్సీకి సంబంధించి మొదటి నుంచీ గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. 2012 నుంచి డీఎస్సీ జరగలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి.. ఇప్పుడు తొమ్మిదివేల పైచి లుకు పోస్టులతో మినీ డీఎస్సీని ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీలను అర్హులను చేస్తామని చెప్పిన ప్రభుత్వం, కేంద్రం అభ్యంతరం చెబుతోందన్న సాకుతో దానికీ నీళ్లొదిలేసింది.
జిల్లాలో 98 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి ప్రవేశపెట్టారు. మున్సిపల్ పాఠశాలలకు గత ప్రభుత్వం 1284 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసింది. మోడల్ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్‌స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ డీఎస్సీలో నోటిఫై చేస్తే 500కుపైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం లభించేది. అలాగే అడహాక్ రూల్స్ ద్వారా ఎంఈవోలుగా పదోన్నతులు కల్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా మరో 527 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండేది. ఇలా ఖాళీలను భర్తీ చేయడం, కొత్త పోస్టులు మం జూరు చేయడం వంటివి చేస్తే డీఎస్సీలో 14 వేల పోస్టులను నోటిఫై చేసే అవకాశముండేది.
బీఈడీలకు కూడా న్యాయం జరిగేది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పినట్లు 10,500 పోస్టులను కాకుండా వెయ్యికిపైగా పోస్టులను కుదించడం అభ్యర్థులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థన మేరకు అదనంగా 1252 మున్సిపల్ టీచర్ పోస్టులను నోటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం మరో జీవో జారీ చేసినా.. దీనివల్ల జిల్లా జరిగే మేలు స్వల్పమే. జిల్లాలో 15, 20 పోస్టులు మాత్రమే పెరుగుతాయి.
జిల్లాల నుం చి రెండు రకాల వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటిలో తక్కువ పోస్టులు ఉన్న వివరాలతో డీఎస్సీని నోటిఫై చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. జిల్లాల స్థాయిలో రేషనలైజేషన్ జరపకుండానే జరిపినట్లు చెబుతోంది. విద్యాశాఖ రికార్డుల ప్రకారమే సుమారు 30వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది.
బీఈ‘డీలా’..!
Published Sat, Nov 22 2014 4:26 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement
Advertisement