Severe depression
-
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, అమరావతి: నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఫలితంగా శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది. మిగిలిన చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది. ప్రస్తుతం ఆంధ్ర, యానాం దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని పేర్కొంది. శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్యానికి 420 కి.మీ, తమిళనాడులోని నాగపట్టణం దక్షిణ ఆగ్నేయానికి 600 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 690 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా కదిలి, ఆ తర్వాతి 48 గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా శ్రీలంక మీదుగా కొమోరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చదవండి: (నెరవేరిన సీఎం హామీ.. దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ స్కూటర్ మంజూరు) -
యజమాని సెలవు ఇవ్వలేదని..
* శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఉద్యోగి * అవంతీపురం ఇండియన్ పెట్రోల్ బంక్‌లో ఘటన మిర్యాలగూడ రూరల్ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతీపురంలో.. పెట్రోల్ బంక్ యజమాని సెలవు ఇవ్వలేదని, అందులో పనిచేస్తున్న ఉద్యోగి తీవ్ర మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్సై వి.సర్దార్ నాయక్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అవంతీపురం జంగాల కాలనీకి చెందిన శ్రీపాటి మస్తాన్ వలి (35) రెండేళ్లుగా స్థానిక ఇండియన్ పెట్రోల్ బంక్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల నుంచి విరామం లేకుండా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం మస్తాన్‌వలి పెదనాన్న ఎల్లయ్య దశదిన కర్మ ఉండడంతో యజమానిని సెలవు ఇవ్వమని కోరాడు. దీంతో యజమాని గురువారం ఒక్కరోజు పనిచేసి, శుక్రవారం సెలవు తీసుకోమని చెప్పాడు. దీంతో మస్తాన్‌వలి మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే బంకులోని పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. 108 వాహనంలో అతడిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. కాగా, కాలిన గాయాలతో.. వలీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
కొనే వారేరీ..!
సాక్షి, సిటీబ్యూరో : సంక్రాంతి అందరిలో ఆనందం నింపుతుండగా... రాజధానిలోని కూరగాయల రైతులు, వ్యాపారులకు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. సంక్రాంతి సంబరాలు సొంత ఊళ్లలో జరుపుకొనేందుకు జనం తరలి వెళ్లడంతో నగరం సగం ఖాళీ అయింది. ఆ ప్రభావం తొలుత కూరగాయల వ్యాపారంపై పడింది. గ్రేటర్లో 50 శాతం మేర కూరగాయల కొనుగోళ్లు పడిపోవడంతో మార్కెట్లో సరుకు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ప్రస్తుతం టమాటా స్థానికంగా ఇబ్బడి ముబ్బడిగా దిగుబడి వస్తోంది. దీన్ని ఏరోజుకారోజు అమ్ముకోవాల్సి రావడంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు ధర తగ్గించి మరీ తెగనమ్ముకొని వెనుదిరుగుతున్నారు. గత వారం హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.15 ధర పలికిన టమాటా ఆదివారం రూ.6లకు, రూ.35 ఉన్న పచ్చిమిర్చి రూ.20లకు దిగివచ్చింది. ఇదే సరుకు రైతుబజార్లో టమాటా రూ.9, రిటైల్‌గా రూ.10లకు, అలాగే మిర్చి రూ.25 ప్రకారం విక్రయించారు. హోల్‌సేల్ మార్కెట్లో సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని అమ్ముకోలేక కళ్లెదుటే వాడిపోతుండటంతో బావురుమంటున్నారు. గడచిన 4రోజుల నుంచి వ్యాపారం సగానికి సగం తగ్గడాన్ని గమనించిన పలువురు రిటైల్ వ్యాపారులు పెట్టిన పెట్టుబడిని రాబట్టుకొనేందుకు ధర తగ్గించి అమ్మేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కొనేవారే లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు. ఇక మిర్చి, వంకాయ, బెండ, దొండ, కాకర, బీర, చిక్కుడు, గోకర, దోస వంటివి 3-4 రోజులు నిల్వ ఉండే అవకాశం ఉన్నా... కొనేనాథుడు లేక మార్కెట్లలో గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. నగరంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వర్గాల వారు అధికంగా ఊళ్లకు వెళ్లడంతో హోటళ్లు, మెస్‌ల నిర్వాహకులు కూడా కూరగాయల కొనుగోళ్లు తగ్గించినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. -
బీఈ‘డీలా’..!
శ్రీకాకుళం: ఎంతో కాలంగా ఊరించి.. ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ బీఈడీ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా సైన్స్ అభ్యర్థుల పూర్తిగా డీలా పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొత్తం 719 పోస్టులు నోటిఫై చేయగా వాటిలో 375 ఎస్జీటీ, 93 పండిట్, 21 పీఈటీ, 230 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో బయోలాజికల్, ఫిజికల్ సైన్స్ పోస్టులు ఒక్కటీ లేవు. గత డీఎస్సీల్లోనూ సైన్స్ అభ్యర్థులకు అరకొర పోస్టులే కేటాయిం చారు. ఈసారి అవి కూడా లేకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఇప్పటికే అభ్యర్థులు వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకున్నా నిరుపయోగమేనంటున్నారు. మొదటి నుంచీ అదే తంతు టీడీపీ, ఆ ప్రభుత్వం డీఎస్సీకి సంబంధించి మొదటి నుంచీ గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. 2012 నుంచి డీఎస్సీ జరగలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి.. ఇప్పుడు తొమ్మిదివేల పైచి లుకు పోస్టులతో మినీ డీఎస్సీని ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీలను అర్హులను చేస్తామని చెప్పిన ప్రభుత్వం, కేంద్రం అభ్యంతరం చెబుతోందన్న సాకుతో దానికీ నీళ్లొదిలేసింది. జిల్లాలో 98 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి ప్రవేశపెట్టారు. మున్సిపల్ పాఠశాలలకు గత ప్రభుత్వం 1284 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసింది. మోడల్ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ డీఎస్సీలో నోటిఫై చేస్తే 500కుపైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం లభించేది. అలాగే అడహాక్ రూల్స్ ద్వారా ఎంఈవోలుగా పదోన్నతులు కల్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా మరో 527 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండేది. ఇలా ఖాళీలను భర్తీ చేయడం, కొత్త పోస్టులు మం జూరు చేయడం వంటివి చేస్తే డీఎస్సీలో 14 వేల పోస్టులను నోటిఫై చేసే అవకాశముండేది. బీఈడీలకు కూడా న్యాయం జరిగేది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పినట్లు 10,500 పోస్టులను కాకుండా వెయ్యికిపైగా పోస్టులను కుదించడం అభ్యర్థులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థన మేరకు అదనంగా 1252 మున్సిపల్ టీచర్ పోస్టులను నోటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం మరో జీవో జారీ చేసినా.. దీనివల్ల జిల్లా జరిగే మేలు స్వల్పమే. జిల్లాలో 15, 20 పోస్టులు మాత్రమే పెరుగుతాయి. జిల్లాల నుం చి రెండు రకాల వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటిలో తక్కువ పోస్టులు ఉన్న వివరాలతో డీఎస్సీని నోటిఫై చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. జిల్లాల స్థాయిలో రేషనలైజేషన్ జరపకుండానే జరిపినట్లు చెబుతోంది. విద్యాశాఖ రికార్డుల ప్రకారమే సుమారు 30వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. -
నిరాశ బడ్జెట్
కొత్త రాష్ట్రం... సరికొత్త బడ్జెట్... కోటి ఆశలతో ఎదురుచూసిన బడ్జెట్ కరీంనగర్ జిల్లా ప్రజలకు తీవ్ర నిరాశే మిగిల్చింది. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ జిల్లావాసే కావడంతో కరీంనగర్‌కు అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని ఆసక్తిగా ఎదురుచూసినప్పటికీ కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయకుండా ఉసూరుమనిపించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గత ఆగస్టు 5న జిల్లాకు ప్రకటించిన వరాల్లో ఏ ఒక్కటీ బడ్జెట్లో ప్రస్తావనకు నోచుకోలేదు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అభివృద్ధికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం ఆలయాల అభివృద్ధికి నిధుల ఊసే ఎత్తలేదు. గతంలో వేములవాడకు వచ్చిన కేసీఆర్ రాజన్న దేవాలయ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఈ బడ్జెట్లో ఆ ఊసే లేకపోవడం గమనార్హం.సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేయాల్సిందేనా! సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి రంగానికి బడ్జెట్లో నిరాశజనకమైన కేటాయింపులు చేశారు. మొత్తం 6,500 కోట్లు కేటాయించగా, అందులో కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు దక్కేది అంతంత మాత్రమే. మొత్తంగా జిల్లాకు రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు అందే అవకాశముంది. ఫలితంగా జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఎల్లంపల్లి, వరదకాలువ, మిడ్‌మానేరు ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతలు, తోటపల్లి, గండిపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్ల నిర్మాణాలకు నిధుల కొరత ఏర్పడింది. ఏడాదిన్నరలో మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగిన కేటాయింపులు బడ్జెట్లో చేయకపోవడం గమనార్హం. ఇక రాష్ర్టవ్యాప్తంగా చెరువుటటటటటటర్పాటుకూ నిధులు కేటాయించే అవకాశాలున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. నియోజకవర్గ అభివద్ధి నిధుల పెంపు జిల్లాలో ఒక్కరు మినహా మిగిలిన ఎమ్మెల్యేంతా అధికార పార్టీ వారే కావడంతో బడ్జెట్లో తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించాలంటూ ఇటీవల సీఎంకు పలు ప్రతిపాదనలు సమర్పించారు. బడ్జెట్లో దీనిపై స్పష్టత లేనప్పటికీ ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద రూ.1.50 కోట్లు విడుదల చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. దీంతో జిల్లా శాసనసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించిన నిధుల్లో జిల్లా వాటా ఎంత ఉంటుందనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. దీనిపై కచ్చితమైన వివరాలు చెప్పలేమంటున్న అధికారులు ఉజ్జాయింపుగా లెక్కలు కడుతున్నారు. వారి అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. పవర్‌లూం కార్మికుల తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని సిరిసిల్ల, ఇతర ప్రాంతాల్లో దాదాపు 30 వేల మందికిపైగా పవర్‌లూం కార్మికులున్నారు. వీరిలో కేవలం 1019 మంది 18 బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. దీంతో రుణమాఫీతో వీరికి మాత్రమే లబ్ధి జరనుంది. జిల్లాలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని అమలు చేయడానికి రూ.2500 కోట్లకుపైగా నిధులు ఖర్చవుతాయని ఇటీవల అధికారులు అంచనా వేశారు. ఈ బడ్జెట్లో రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్ పథకానికి రూ.2వేల కోట్లు కేటాయించారు. అందులో జిల్లా వాటా రూ.250 కోట్లకు దాటకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9వేల చెరువుల పునరుద్ధరణకు రూ.2వేల కోట్లు కేటాయించడంతో కరీంనగర్ జిల్లాకు రూ.300 కోట్లు వచ్చే అవకాశముంది. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ఆర్థిక మంత్రి బడ్జెట్లో పొందుపర్చిన రూ.50 కోట్లలో ఎక్కువగా లబ్ధి పొందేది కరీంనగర్ జిల్లానే. విత్తన అభివృ్ధకి అనువైన కేంద్రాలు, అనుకూలమైన వాతావరణం ఈ జిల్లాలోనే ఉండటమే ఇందుకు కారణం. పౌల్ట్రీ పరిశ్రమకు వ్యవ సాయ హోదా కల్పించడంతోపాటు కిలో 14 రూపాయలుగా ఉన్న మొక్కజొన్నలను పౌల్ట్రీ యజమానులకు సబ్సిడీపై రూ.10 చొప్పున అందించాలని నిర్ణయించడం వల్ల జిల్లాలోని వందలాది పౌల్ట్రీ యజమానులు లబ్ధి పొందే అవకాశముంది. రహదారుల అభివృ్ధకి బడ్జెట్లో రూ.4వేల కేటాయించిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని రోడ్ల విస్తరణకు దాదాపు రూ.500 కోట్లు నిధులు అందే అవకాశాలున్నట్లు ఆర్అండ్బీ అధికారులు అంచనా వేస్తున్నారు. గల్ఫ్ బాధితుల్లో కరీంనగర్ జిల్లా యువకులు ఎక్కువగా ఉన్నందున బడ్జెట్లో పొందుపర్చిన గల్ఫ్ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ వల్ల వారికి లబ్ధి చేకూరుతుంది. అయితే ప్రత్యేక ప్యాకేజీ కింద ఎన్ని నిధులు కేటాయిస్తారనే దానిపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడంతో దీనిపై స్పష్టత కొరవడింది. ఇవిగాకుండా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, కళ్యాణల క్ష్మీ, షాదీముబారక్, వదృు్ధలు, వికలాంగుల, వితంతవుల పెన్షన్ల పెంపువల్ల పెద్ద ఎత్తున లబ్ధి పొందే అవకాశాలున్నాయి. బడ్జెట్లో ప్రస్తావించిన వివిధ పథకాలకు, ప్రాజెక్టులకు దేనికి ఎన్ని నిధులు కేటాయించారనే అంశంపై స్పష్టత రావాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఈనెల 7న నిధులు కేటాయింపు వివరాలు వెల్లడవుతాయని పేర్కొంటున్నారు. -
అండమాన్‌లో తీవ్ర వాయుగుండం
ఉత్తర అండమాన్‌లోని లాంగ్ఐలండ్ సమీపంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. లాంగ్ ఐలండ్‌కు ఆగ్నేయదిశగా 80 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, రాగల 24 గంటల్లో తుఫానుగా మరే అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం అండమాన్ నికోబార్ దీవుల్లోని లాంగ్ ఐలండ్ సమీపంలోనే ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనించి రాగల మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను తీరం దాటుతున్నందున ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. -
మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్: బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమవడంతో రానున్న మూడు రోజులపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. 10వ తే దీ నుంచి వానలు తగ్గుముఖం పడతాయని వాతావరణశాఖ శాస్త్రవేత్త సీతారాం ‘సాక్షి’కి చెప్పారు. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు విశాఖపట్నంలోని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణకోస్తాలో పలుచోట్లకుమించి అతిభారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంపై ఒడిశా,పశ్చిమబెంగాల్ మీదుగా శుక్రవారం విస్తరించిన అల్పపీడనం శనివారం నాటికి మరింత బలపడిందని వివరించింది. ఫలితంగా పశ్చిమ దిశ నుంచి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 50కిలోమీటర్ల వేగంతో బలమైనగాలులు వీస్తాయని హెచ్చరించింది. అందువల్ల మత్స్యకారులు సమ్రుద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అయితే భారీ వర్షం ముప్పు ఎప్పటివరకు ఉంటుందో ప్రస్తుతం చెప్పలేమని పేర్కొంది.