ఉత్తర అండమాన్లోని లాంగ్ఐలండ్ సమీపంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. లాంగ్ ఐలండ్కు ఆగ్నేయదిశగా 80 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, రాగల 24 గంటల్లో తుఫానుగా మరే అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం అండమాన్ నికోబార్ దీవుల్లోని లాంగ్ ఐలండ్ సమీపంలోనే ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది.
తీరం దాటిన తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనించి రాగల మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను తీరం దాటుతున్నందున ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
అండమాన్లో తీవ్ర వాయుగుండం
Published Wed, Oct 8 2014 7:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
Advertisement