long island
-
సెప్టెంబర్‌లో అమెరికాకు మోదీ
న్యూయార్క్: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్ నగర పరిధిలోని లాంగ్ ద్వీపంలో భారతీయ అమెరికన్లనుద్దేశించి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 16వేల సీటింగ్ సామర్థ్యమున్న నసావూ కొలీసియం ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 22వ తేదీన మోదీ ప్రసంగించనున్నారు. న్యూయార్క్‌లో ఐరాస ప్రధాన కార్యాలయంలో సర్వ ప్రతినిధి సభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్తున్నారు. భారతీయ అమెరికన్లతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. 2014లో తొలిసారిగా ఆయన ప్రధాని అయ్యాక ఐరాసలో వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో వేలాది మంది భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. దానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మళ్లీ భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
అమెరికాలో నర్సుకు తొలి టీకా
న్యూయార్క్: అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లో ఉన్న లాంగ్ ఐలాండ్ జ్యుయిష్ మెడికల్ సెంటర్ ఐసీయూలో నర్సుగా పని చేస్తున్న సాండ్రా లిండ్సేకు తొలి వ్యాక్సిన్ డోసు ఇచ్చారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కావడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫైజర్–బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ డోసును సాండ్రా లిండ్సేకు ఇచ్చారు. కరోనా నుంచి త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. అమెరికా చరిత్రలో బాధాకరమైన సమయం ముగిసిపోవడానికి ఇదొక ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, పూర్తి రక్షణ ఇస్తుందని ప్రజల్లో విశ్వాసం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. చీకటిలో వెలుగు రేఖ కనిపించినప్పటికీ ప్రజలు కరోనా నియంత్రణ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సాండ్రా సూచించారు. మాస్కులు ధరించాలని కోరారు. కరోనా టీకా తీసుకునేలా ఇతరులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కావడం పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ‘అమెరికాకు శుభాకాంక్షలు, ప్రపంచానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. న్యూయార్క్ గవర్నర్ మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ఆయుధం వ్యాక్సిన్ అని చెప్పారు. పుస్తకంలోని చివరి అధ్యాయం ఇప్పుడు మొదలైందని పేర్కొన్నారు. తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ తెలిపారు. -
అండమాన్‌లో తీవ్ర వాయుగుండం
ఉత్తర అండమాన్‌లోని లాంగ్ఐలండ్ సమీపంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. లాంగ్ ఐలండ్‌కు ఆగ్నేయదిశగా 80 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, రాగల 24 గంటల్లో తుఫానుగా మరే అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం అండమాన్ నికోబార్ దీవుల్లోని లాంగ్ ఐలండ్ సమీపంలోనే ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనించి రాగల మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను తీరం దాటుతున్నందున ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. -
స్విమ్మింగ్ పూల్ లో పడి ఎన్నారై మహిళ మృతి
న్యూయార్క్: ప్రవాస భారతీయ మహిళ ఒకరు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలు రాజకుమారి మోత్వానీ(55)గా గుర్తించారు. ఈతకొలను(స్విమ్మింగ్ పూల్)లో పడి ఆమె మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లాంగ్ ఐలాండ్ లోని ఓ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను ఆదివారం ఉదయం శుభ్రం చేస్తుండగా రాజకుమారి మృతదేహం బయటపడింది. అంతకుముందు రాత్రి ఆ ఇంట్లో పుట్టినరోజు పార్టీ జరిగినట్టు సల్ఫోక్క్ పోలీసులు తెలిపారు. బర్త్ డే పార్టీకి ఆమె గెస్ట్‌గా వచ్చినట్టు గుర్తించారు. రాజకుమారి మృతదేహాన్ని సల్ఫోక్క్ కౌంటీ మెడికల్ అధికారి కార్యాలయానికి తరలించారు. అయితే రాజకుమారి మృతి వెనుక కుట్ర కోణం ఏదీ కనబడలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె మృతికి సంబంధిన వివరాలు తెలిస్తే చెప్పాలని స్థానికులను పోలీసులు కోరారు.