
సాక్షి, అమరావతి: నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఫలితంగా శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది. మిగిలిన చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది. ప్రస్తుతం ఆంధ్ర, యానాం దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్యానికి 420 కి.మీ, తమిళనాడులోని నాగపట్టణం దక్షిణ ఆగ్నేయానికి 600 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 690 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా కదిలి, ఆ తర్వాతి 48 గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా శ్రీలంక మీదుగా కొమోరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
చదవండి: (నెరవేరిన సీఎం హామీ.. దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ స్కూటర్ మంజూరు)
Comments
Please login to add a commentAdd a comment