Southeast
-
USA: హెలెన్ విధ్వంసం
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, అమరావతి: నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఫలితంగా శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది. మిగిలిన చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది. ప్రస్తుతం ఆంధ్ర, యానాం దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని పేర్కొంది. శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్యానికి 420 కి.మీ, తమిళనాడులోని నాగపట్టణం దక్షిణ ఆగ్నేయానికి 600 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 690 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా కదిలి, ఆ తర్వాతి 48 గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా శ్రీలంక మీదుగా కొమోరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చదవండి: (నెరవేరిన సీఎం హామీ.. దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ స్కూటర్ మంజూరు) -
వాస్తు - వివరాలు
యజమాని పేరులోని మొదటి అక్షరం ఏ వర్గులోకి వస్తుందో అది స్వక్షేత్రంగా భావించాలి. ఆ వర్గులో సూచించిన దిశలు అనుకూలం. అ నుంచి అం, అఃవరకు - ఆ వర్గు... వీరికి తూర్పు, పడమర, దక్షిణం అనుకూలం. ఉత్తర ద్వారం పడదు. క, ఖ, గ, ఘ, జ్ఞ.. - క వర్గు... వీరికి దక్షిణం, పడమర అనుకూలం. మిగతావి సరిపడవు. చ, ఛ, జ,ఝ,ఞ..-చ వర్గు..వీరికి తూర్పు, ఉత్తరం, పడమర అనుకూలం. దక్షి ణం సరిపడదు. ట,ఠ,డ,ఢ, ణ ...-ట వర్గు...వీరికి తూర్పు, ఉత్తరం, పడమర అనుకూలం. దక్షిణం సరిపడదు. త,థ, ద,ధ, న ...-త వర్గు..వీరికి తూర్పు, ఉత్తరం అనుకూలం. దక్షిణం, పడమర సరిపడదు. ప,ఫ, బ, భ,మ...-ప వర్గు...వీరికి తూర్పు, ఉత్తర దిశలు అనుకూలం. పశ్చిమ, దక్షిణం సరిపడదు. య,ర,ల,వ...-య వర్గు...వీరికి తూర్పు, పడమర, దక్షిణం అనుకూలం. ఉత్తరం సరిపడదు. శ,ష,స,హ ...-శ వర్గు..వీరికి దక్షిణం, తూర్పుదిశలు అనుకూలం. ఉత్తరం, పడమర సరిపడదు. చైత్ర,ై వెశాఖ,ఫాల్గుణ మాసాల్లో తూర్పు సింహద్వార గృహ నిర్మాణానికి అనుకూలం. జ్యేష్ఠం, శ్రావణ మాసాలు తూర్పు, దక్షిమదిశ సింహద్వార నిర్మాణాలు అనుకూలం. ఆశ్వయుజ, కార్తీకమాసాల్లో దక్షిణ, పడమర సింహద్వార గృహ నిర్మాణాలు అనుకూలం. మార్గశిర, మాఘమాసాలు ఉత్తర, పడమర సింహద్వార గృహ నిర్మాణాలు అనుకూలం. ఇంటి నిర్మాణానికి ముందుగా భూమిని ఎటువంటి కోణాలు లేకుండా సరిసమానంగా ఉండేటట్లు చూడాలి. దిశలు పెరుగుదల, తగ్గుదల లేకుండా చూసుకోవాలి. అయితే ఈశాన్యంలో కొంతవరకూ పెరుగుదల మంచిదే. ఆగ్నేయం పెరుగుదల కుటుంబంలోని మహిళలకు, నైరుతి పెరుగుదల యజమానికి, వాయువ్యం పెరుగుదల సంతానానికి మంచిది కాదు. అలాగే, ఈశాన్యంలో మరుగుదొడ్లు మంచిది కాదు. వంటగది ఆగ్నేయం, యజమాని పడకగది నైరుతి, పిల్లల పడకగది వాయువ్యంలో ఉండాలి. ఒక్కొక్కప్పుడు ఈశాన్యంలో పడకగది ఉన్నప్పుడు దానిని పిల్లలకు వినియోగించుకోవచ్చు. తూర్పు ఆగ్నేయం, దక్షిణ, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువ్యం వీధిపోట్లు మంచిది కాదు. సింహద్వారానికి ఎదురుగా గేటు పెట్టడం మంచిది. ఇక మెట్లు ఈశాన్యంలో మినహా మిగ తా దిశల్లో పెట్టుకోవచ్చు. మెట్ల కింద గదుల నిర్మాణం మంచిది కాదు. (ఇవి ప్రాథమిక సూచనలు. వాస్తు నిపుణుల సలహాలతో ఇంటిని నిర్మించుకోవడం మంచిది)