యజమాని పేరులోని మొదటి అక్షరం ఏ వర్గులోకి వస్తుందో అది స్వక్షేత్రంగా భావించాలి. ఆ వర్గులో సూచించిన దిశలు అనుకూలం.
అ నుంచి అం, అఃవరకు - ఆ వర్గు... వీరికి తూర్పు, పడమర, దక్షిణం అనుకూలం. ఉత్తర ద్వారం పడదు.
క, ఖ, గ, ఘ, జ్ఞ.. - క వర్గు... వీరికి దక్షిణం, పడమర అనుకూలం. మిగతావి సరిపడవు.
చ, ఛ, జ,ఝ,ఞ..-చ వర్గు..వీరికి తూర్పు, ఉత్తరం, పడమర అనుకూలం. దక్షి ణం సరిపడదు.
ట,ఠ,డ,ఢ, ణ ...-ట వర్గు...వీరికి తూర్పు, ఉత్తరం, పడమర అనుకూలం. దక్షిణం సరిపడదు.
త,థ, ద,ధ, న ...-త వర్గు..వీరికి తూర్పు, ఉత్తరం అనుకూలం. దక్షిణం, పడమర సరిపడదు.
ప,ఫ, బ, భ,మ...-ప వర్గు...వీరికి తూర్పు, ఉత్తర దిశలు అనుకూలం. పశ్చిమ, దక్షిణం సరిపడదు.
య,ర,ల,వ...-య వర్గు...వీరికి తూర్పు, పడమర, దక్షిణం అనుకూలం. ఉత్తరం సరిపడదు.
శ,ష,స,హ ...-శ వర్గు..వీరికి దక్షిణం, తూర్పుదిశలు అనుకూలం. ఉత్తరం, పడమర సరిపడదు.
చైత్ర,ై వెశాఖ,ఫాల్గుణ మాసాల్లో తూర్పు సింహద్వార గృహ నిర్మాణానికి అనుకూలం.
జ్యేష్ఠం, శ్రావణ మాసాలు తూర్పు, దక్షిమదిశ సింహద్వార నిర్మాణాలు అనుకూలం.
ఆశ్వయుజ, కార్తీకమాసాల్లో దక్షిణ, పడమర సింహద్వార గృహ నిర్మాణాలు అనుకూలం.
మార్గశిర, మాఘమాసాలు ఉత్తర, పడమర సింహద్వార గృహ నిర్మాణాలు అనుకూలం.
ఇంటి నిర్మాణానికి ముందుగా భూమిని ఎటువంటి కోణాలు లేకుండా సరిసమానంగా ఉండేటట్లు చూడాలి. దిశలు పెరుగుదల, తగ్గుదల లేకుండా చూసుకోవాలి. అయితే ఈశాన్యంలో కొంతవరకూ పెరుగుదల మంచిదే. ఆగ్నేయం పెరుగుదల కుటుంబంలోని మహిళలకు, నైరుతి పెరుగుదల యజమానికి, వాయువ్యం పెరుగుదల సంతానానికి మంచిది కాదు. అలాగే, ఈశాన్యంలో మరుగుదొడ్లు మంచిది కాదు. వంటగది ఆగ్నేయం, యజమాని పడకగది నైరుతి, పిల్లల పడకగది వాయువ్యంలో ఉండాలి. ఒక్కొక్కప్పుడు ఈశాన్యంలో పడకగది ఉన్నప్పుడు దానిని పిల్లలకు వినియోగించుకోవచ్చు. తూర్పు ఆగ్నేయం, దక్షిణ, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువ్యం వీధిపోట్లు మంచిది కాదు. సింహద్వారానికి ఎదురుగా గేటు పెట్టడం మంచిది. ఇక మెట్లు ఈశాన్యంలో మినహా మిగ తా దిశల్లో పెట్టుకోవచ్చు. మెట్ల కింద గదుల నిర్మాణం మంచిది కాదు.
(ఇవి ప్రాథమిక సూచనలు. వాస్తు నిపుణుల సలహాలతో ఇంటిని నిర్మించుకోవడం మంచిది)