Southwest
-
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
-
నైరుతి రుతుపవనాల ఆలస్యానికి కారణం
-
తెలుగు రాష్ట్రాలకు చల్లని వార్త
-
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, అమరావతి: నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఫలితంగా శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది. మిగిలిన చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది. ప్రస్తుతం ఆంధ్ర, యానాం దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని పేర్కొంది. శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్యానికి 420 కి.మీ, తమిళనాడులోని నాగపట్టణం దక్షిణ ఆగ్నేయానికి 600 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 690 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా కదిలి, ఆ తర్వాతి 48 గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా శ్రీలంక మీదుగా కొమోరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చదవండి: (నెరవేరిన సీఎం హామీ.. దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ స్కూటర్ మంజూరు) -
నైరుతిపైనే ఆశలు
ఒంగోలు టూటౌన్ : జిల్లాను గత నాలుగేళ్లుగా కరువు వణికిస్తోంది. అడపా, దడపా చిరుజల్లులు మినహా సకాలంలో వానలు లేవు, వరదలు లేవు. దీంతో భూగర్భ జలాలు వందల అడుగుల కిందకి వెళ్లిపోయాయి. దీంతో వర్షాలు లేక భూమి అంతా బొగిలిపోయింది. మాగాణి పొలాలు బీటలు వారాయి. గత యేడాది వేసిన పంటల మొత్తం భానుడి ప్రతాపానికి ఎండిపోయింది. చేతికొచ్చే పంటలు సైతం మేతబీడుగా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. కోట్ల రూపాయల పెట్టుబడులు నేలపాలయ్యాయి. అరకొరగా చేతికొచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలేక నానా అవస్థలు రైతులు పడుతున్నారు. అప్పుల పాలవుతున్నారు. జిల్లా పరిస్థితిని గమనించిన సర్కార్ కరువు జిల్లాగా ప్రకటించింది. పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఇటీవల కేంద్రం బృందం వచ్చి పరిశీలించింది. జిల్లాలో ఎండిన చెరువులు, కుంటలు, బీటలు వారిన పొలాలు చూసి చలించిపోయింది. పంటనష్టం అంచనాల అనంతరం ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.125 కోట్లు అవసరమని జిల్లా అధికారులు కేంద్ర, రాష్ట్రాలకు సమాచారం పంపించడం జరిగింది. కరువు చూసి నోరెళ్లబెట్టిన కేంద్ర బృందం.. జిల్లా ఎంతటి కరువు భారిన పడిందో కేంద్ర బృందమే చూసి నివ్వెరపోయింది. అంతటి కరువు జిల్లాను కమ్మేసింది. ఇలాంటి పరిస్థితులలో మళ్లీ ఖరీఫ్ ప్రారంభమయ్యే సమయం వచ్చింది. ఏ పాలుపోని రైతులు మళ్లీ ఆకాశం వైపు చూడటం మొదలెట్టారు. చినుకు జాడ కోసం ఆశగా ఎదురు చూస్తుండటం నిత్యకృత్యమయింది. ఈ సారైనా నైరుతి రుతు పవనాలు కరుణించి వానలు పడతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. నైరుతిపైనే ఆశలు పెట్టుకున్నారు. ముందస్తు ప్రణాళికతో వ్యవశాయశాఖ.. నైరుతిపై ఆశతోనే వ్యవసాయశాఖ ఖరీఫ్ విత్తనాలు, ఎరువులను ముందస్తు ప్రణాళికతో సిద్ధం చేసింది. ఎప్పుడు వరుణుడు కరుణిస్తే అప్పుడు అన్నదాతకు విత్తనాలు సరఫరా చేయాలని సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం 6,500 క్వింటాళ్ల పచ్చి రొట్ట ఎరువులతో పాటు పెసర, మినుము, కందులు వంటి విత్తనాలు అలాట్ అయ్యాయి. పచ్చి రొట్ట ఎరువులలో జీలుగ 200 క్వింటాళ్ళు, జనుము 4 వేల క్వింటాళ్ళు, పిల్లిపెసర 500 క్వింటాళ్లు ఉన్నాయి. వీటిని రైతులకు 75 శాతం రాయితీపై రైతులకు ఖరీఫ్‌కు ముందు సరఫరా చేయనున్నారు. వీటితో పాటు కందులు 500 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుము 300 క్వింటాళ్లు, ఆముదం 100 క్వింటాళ్ళు, సజ్జ 63 క్వింటాళ్ళు, జొన్న 56 క్వింటాళ్లు, నువ్వులు 200 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 50 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. కందుల విత్తనాలను 33 శాతం రాయితీపై సరఫరా చేయనున్నారు. వీటితోపాటు లక్షా 72, 532 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేశారు. యూరియా 41, 638 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 28, 215 మెట్రిక్‌టన్నులు, ఎస్ఎస్పి 1, 029 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 50, 061 మెట్రిక్ టన్నులు, డీఏపీ 28, 215 మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచారు. ఇవిగాకుండా నవధాన్యాల కిట్లు కూడా మంజూరు అయ్యాయి. జిల్లాకు 10,500 కిట్లు.. జిల్లాకు మొత్తం మొత్తం 10,500 కిట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. ఒక్కొక్క ఫ్యాకెట్లో ఆరురకాల విత్తనాలు ఉంటాయి. ముఖ్యంగా కొర్ర, జనుము, కందులు ఇలా ఆరు రకాల విత్తనాలు కిట్ ద్వారా రైతులకు 75 శాతం రాయితీపై ఇస్తారు. ప్రస్తుతం జిల్లాకు కేటాయించిన ఈ విత్తనాలను జల్లాలోని 12 వ్యవసాయ డివిజన్లకు కేటాయించడం జరుగుతుంది. అక్కడ నుంచి మండల వ్యవసాయాధికారులకు కేటాయించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇలాంటి పరిస్థితులలో వర్షం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగుకు ముందు పచ్చి రొట్ట ఎరువుల పంటలు సాగుచేసుకునే పనిలో నిమగ్నమవుతారు. జూన్‌లో వ్యవసాయ పనులు ముమ్మరం అవుతాయి. -
గాలిలో 144 మంది.. పేలిన విమానం ఇంజన్!
ఫిలిడెల్ఫియా : గగనతలంలో అనూహ్యరీతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ అమెరికా విమానం ఇంజన్ మధ్యలో పేలిపోయింది. ఆ ఇంజన్ శకలం దూసుకొచ్చి.. విమానం కిటికీని ఢీకొట్టింది. దీంతో విమానానికి రంధ్రం ఏర్పడి.. ప్రయాణికుల్లో తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించింది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోగా, ఏడుగురు గాయపడ్డారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ చెందిన విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజన్ పేలిపోయింది. ఇంజన్ శకలం దూసుకొచ్చి కిటికీని ఢీకొట్టడంతో.. కిటికీ పక్కనే సీట్లో కూర్చున్న మహిళ తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. అయితే, పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి.. వెంటనే సమీపంలో ఉన్న ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో విమానాన్ని దింపడంతో పెనుప్రమాదం తప్పింది. పెద్దసంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. డల్లాస్ నుంచి 144 మంది ప్రయాణికులతో బయలుదేరిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 1380 ఫిలిడెల్ఫియాలో అత్యవసరంగా దిగింది. విమానం ఇంజన్ ఒక్కసారిగా పేలడం.. విమానానికి రంధ్రం పడటంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళలకు గురైయ్యారు. అతి కష్టం మీద విమాన సిబ్బంది ఆ రంధ్రాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా విమానంలోకి గ్యాస్ ప్రవేశించడంతో ఊపిరాడక ప్రయాణికులు తీవ్ర అవస్థపడ్డారు. వారికి అత్యవసరంగా సిబ్బంది ఆక్సీజన్ మాస్కులు అందించారు. ఈ ఘటనలో మృతిచెందిన మహిళను జెన్నిఫర్ రియోర్డాన్ గుర్తించారు. ఆమె బ్యాంకు ఉద్యోగి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా ప్రాణాలు కాపాడు దేవుడా.. అని ప్రార్థించాం గాలిలో ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. విమానం ఫిలడెల్ఫియా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేంతవరకు ప్రార్థనలు చేస్తూ.. భయాందోళనతో గడిపారు. ‘విమాన ప్రమాదం జరిగిన తరువాత మాకు గాలి ఆడలేదు. ఒక్కసారిగా ఆక్సిజన్ ముసుగులు తెరుచుకున్నాయి. మా ప్రాణాలు కాపాడు దేవుడా అని అందరం ప్రార్ధించాం’ అని న్యూయార్క్ ప్రయాణికుడొకరు తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలిసిన తరువాత తన భర్త చేతిని గట్టగా పట్టుకున్నానని, ఆ సమయంలో తన పిల్లల గుర్తుకు వచ్చారని, మళ్ళి వాళ్ళను తిరిగి చూడగలనా అన్న భయం కలిగిందని ఓ ప్రయాణికురాలు తెలిపారు. ప్రమాదంలో మరణిచిన రియోర్డాన్ న్యూ మెక్సికో విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్. ఆమె గతంలో సమాజ సంబంధాల రంగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2009 నుంచి సౌత్‌వెస్ట్ ఏయిర్ లైన్స్‌లో ఇలాంటి ప్రమాదం జరగటం మొదటిసారి అని సంస్థ సిబ్బంది తెలిపారు. విమానం 30,000 వేల అడుగులో ఉండగా ఇంజన్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించామని, ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో గ్యాస్ లీకైందని విమాన సిబ్బంది తెలిపారు. గ్యాస్ లీకైన వెంటనే విమానంలో ఆక్సిజన్ మాస్క్‌లు తెరుచుకున్నాయని, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదన్నారు. తరువాత ప్రయాణికులను సౌత్‌వెస్ట్ బోయింగ్ 737-700 విమానంలో ప్రయాణికులను లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌కు సురక్షితంగా తరలించామని సౌత్‌వెస్ట్ విమాన అధికారులు తెలిపారు. -
'రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దు'
హైదరాబాద్: తొలకరి వర్షాలను చూసి తొందరపడి విత్తనాలు వేయొద్దని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. గురువారం మంత్రి పోచారం ఖరీఫ్‌పై సమీక్ష నిర్వహించారు. అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రుతుపవనాలు పూర్తిగా విస్తరించాకే పనులు ప్రారంభించాలని పోచారం సూచించారు. -
ఆ భూకంపం ఎవరెస్టును జరిపేసింది
బీజింగ్: నేపాల్ వచ్చిన భూకంపం మాములు భూకంపం కాదని ఇప్పటికే అర్థమైనా అది ఎంత శక్తిమంతమైనదో ఈ విషయం తెలిస్తే ఇట్టే బోధపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును నేపాల్ భూకంపం ఏకంగా 1.2 సెంటీమీటర్లు జరిపినట్లు చైనాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. గత ఏప్రిల్ 28న నేపాల్ 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని కారణంగా దాదాపు పదివేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ భూకంపం సంభవించిన తర్వాత మౌంట్ ఎవరెస్టులో వచ్చిన మార్పులపై చైనాలోని జియోలాజికల్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఎవరెస్టు.. నైరుతి దిక్కుకు 1.2 సెంటీ మీటర్లు జరిగినట్లు తెలిసిందని పేర్కొంది. -
వాస్తు-శుభమస్తు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది. * కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులో ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పై అంతస్తులో ఉండడం మేలు. అది కూడా నైరుతీ దిశలోనే ఉండాలి. పెళ్లికాని పిల్లలకు మాత్రం పడక గది నైరుతి దిశలో ఉండకపోవడమే మంచిది. * పిల్లలకు పడక గది పశ్చిమ దిశలో ఉంటే మేలు. పెళ్లి కాని పిల్లలకు, ఇంటికి వచ్చే అతిథుల కోసం తూర్పు దిశగా ఉండే పడక గది అనువుగా ఉంటుంది. కొత్తగా పెళ్లయిన జంట మాత్రం ఈ దిశలోని పడక గదిని ఉపయోగించకపోవడం మంచిది. * ఈశాన్యం దేవతలకు స్థానం కాబట్టి.. ఏ పడక గది కూడా ఈ దిశలో ఉండకూడదు. * పడక గది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంటే.. అకార ణంగా దంపతుల మధ్య కీచులాటలు పెరుగుతాయి. అనవసర ఖర్చులూ అధికమవుతాయి. * నైరుతీ దిశలోనే గదిలో నైరుతీ మూలలో బరువైన వస్తువులు పెట్టాలి. మంచం విషయానికొస్తే పడక గదిలో మంచం దక్షిణం, పశ్చిమం లేదంటే నైరుతి దిశల్లో ఉండొచ్చు. * తూర్పు వైపు కాళ్లు పెట్టుకొని పడుకుంటే పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఐశ్యర్య వృద్ధికి అవకాశాలుంటాయి. అదే పశ్చిమం వైపు అయితే ప్రశాంతతో పాటు ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఉత్తర దిశలో అయితే సంపద వృద్ధికి అవకాశాలుంటాయి. ఒకవేళ దక్షిణ దిశవైపు కాళ్లు పెడితే మాత్రం చక్కటి నిద్రకు దూరమవుతారు. * పడక గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఉత్తర దిశకు తూర్పు వైపు ఉండాలి. చదువుకోవటం, రాసుకోవటం వంటివి పడక గదిలో పశ్చిమ దిశలో చేయాలి. తూర్పు వైపు కూడా ఇలాంటి పనులు చేసుకోవచ్చు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య అల్పపీడనం ఏర్పడింది. అదే ప్రాంతంలో సముద్రమట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కొనసాగుతోంది. మరోవైపు ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొంది. ఆదివారంనాటికి అల్పపీడనం మరింత బలపడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. -
అండమాన్‌లో నైరుతి రాగం
న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులతో పాటు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతాన్ని తాకాయని తెలిపింది. ఇవి మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలోని దక్షిణ, మధ్య ప్రాంతాలకు విస్తరించవచ్చని తెలిపింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరానికి చేరుకొంటాయని, అయితే ఈసారి నాలుగు రోజులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ప్రస్తుతం అండమాన్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయని విశాఖలోని వాతావరణనిఫుణులు వెల్లడించారు. మరోపక్క. చత్తీస్ఘడ్ నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడినట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం తె లిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు, ఉరుమలతో కూడి జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. ఇదిలాఉండగా, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే సూచనలు ఉండటంతో వ్యవసాయవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పిడుగుపాటుకు ఇద్దరి మృతి మెంటాడ / మడకశిర, న్యూస్‌లైన్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు పడి సోమవారం ఇద్దరు మృతి చెదారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొంపంగి గ్రామంలో తన పొలంలో పనిచేసుకుంటున్న ఎజ్జిపరపు సింహాచలం (40) అనే మహిళపై పిడుగు పడగా, ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతపురం జిల్లా మడకశిర మండలం గోవిందాపురం గొల్లహట్టి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మాలింగప్ప పిడుగుపాటుకు మరణించాడు. అతను గొర్రెలను కాాస్తుండగా వర్షం పడటంతో ఓ చింత చెట్టు కిందకు వచ్చాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో అతడితో పాటు రెండు మేకలు మృతి చెందాయి. విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎస్.కోట, వేపాడ, పార్వతీపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎస్.కోట మండలంలో పలుచోట్ల ఈదురుగాలలకు చెట్లు విరిగిపడ్డాయి.