నిరాశ బడ్జెట్ | Disappointing Budget | Sakshi
Sakshi News home page

నిరాశ బడ్జెట్

Published Thu, Nov 6 2014 4:13 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

నిరాశ బడ్జెట్ - Sakshi

నిరాశ బడ్జెట్

కొత్త రాష్ట్రం... సరికొత్త బడ్జెట్... కోటి ఆశలతో ఎదురుచూసిన బడ్జెట్ కరీంనగర్ జిల్లా ప్రజలకు తీవ్ర నిరాశే మిగిల్చింది. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ జిల్లావాసే కావడంతో కరీంనగర్‌కు అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని ఆసక్తిగా ఎదురుచూసినప్పటికీ కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయకుండా ఉసూరుమనిపించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గత ఆగస్టు 5న జిల్లాకు ప్రకటించిన వరాల్లో ఏ ఒక్కటీ బడ్జెట్‌లో ప్రస్తావనకు నోచుకోలేదు.

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం ఆలయాల అభివృద్ధికి నిధుల ఊసే ఎత్తలేదు. గతంలో వేములవాడకు వచ్చిన కేసీఆర్ రాజన్న దేవాలయ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఈ బడ్జెట్‌లో ఆ ఊసే లేకపోవడం గమనార్హం.సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేయాల్సిందేనా!
 

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
 రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి రంగానికి బడ్జెట్‌లో నిరాశజనకమైన కేటాయింపులు చేశారు. మొత్తం 6,500 కోట్లు కేటాయించగా, అందులో కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు దక్కేది అంతంత మాత్రమే. మొత్తంగా  జిల్లాకు రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు అందే అవకాశముంది. ఫలితంగా జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఎల్లంపల్లి, వరదకాలువ, మిడ్‌మానేరు ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతలు, తోటపల్లి, గండిపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్ల నిర్మాణాలకు నిధుల కొరత ఏర్పడింది.

ఏడాదిన్నరలో మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగిన కేటాయింపులు బడ్జెట్‌లో చేయకపోవడం గమనార్హం. ఇక రాష్ర్టవ్యాప్తంగా చెరువుటటటటటటర్పాటుకూ నిధులు కేటాయించే అవకాశాలున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

 నియోజకవర్గ అభివద్ధి నిధుల పెంపు
 జిల్లాలో ఒక్కరు మినహా మిగిలిన ఎమ్మెల్యేంతా అధికార పార్టీ వారే కావడంతో బడ్జెట్‌లో తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించాలంటూ ఇటీవల సీఎంకు పలు ప్రతిపాదనలు సమర్పించారు. బడ్జెట్‌లో దీనిపై స్పష్టత లేనప్పటికీ ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద రూ.1.50 కోట్లు విడుదల చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. దీంతో జిల్లా శాసనసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

      రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయించిన నిధుల్లో జిల్లా వాటా ఎంత ఉంటుందనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. దీనిపై కచ్చితమైన వివరాలు చెప్పలేమంటున్న అధికారులు ఉజ్జాయింపుగా లెక్కలు కడుతున్నారు. వారి అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.
     పవర్‌లూం కార్మికుల తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని సిరిసిల్ల, ఇతర ప్రాంతాల్లో దాదాపు 30 వేల మందికిపైగా పవర్‌లూం కార్మికులున్నారు. వీరిలో కేవలం 1019 మంది 18 బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. దీంతో రుణమాఫీతో వీరికి మాత్రమే లబ్ధి జరనుంది.

     జిల్లాలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని అమలు చేయడానికి రూ.2500 కోట్లకుపైగా నిధులు ఖర్చవుతాయని ఇటీవల అధికారులు అంచనా వేశారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్ పథకానికి రూ.2వేల కోట్లు కేటాయించారు. అందులో జిల్లా వాటా రూ.250 కోట్లకు దాటకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
     రాష్ట్రవ్యాప్తంగా 9వేల చెరువుల పునరుద్ధరణకు రూ.2వేల కోట్లు కేటాయించడంతో కరీంనగర్ జిల్లాకు రూ.300 కోట్లు వచ్చే అవకాశముంది.  

     తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో పొందుపర్చిన రూ.50 కోట్లలో ఎక్కువగా లబ్ధి పొందేది కరీంనగర్ జిల్లానే. విత్తన అభివృ్ధకి అనువైన కేంద్రాలు, అనుకూలమైన వాతావరణం ఈ జిల్లాలోనే ఉండటమే ఇందుకు కారణం.
     పౌల్ట్రీ పరిశ్రమకు వ్యవ సాయ హోదా కల్పించడంతోపాటు కిలో 14 రూపాయలుగా ఉన్న మొక్కజొన్నలను పౌల్ట్రీ యజమానులకు సబ్సిడీపై రూ.10 చొప్పున అందించాలని నిర్ణయించడం వల్ల జిల్లాలోని వందలాది పౌల్ట్రీ యజమానులు లబ్ధి పొందే అవకాశముంది.

     రహదారుల అభివృ్ధకి బడ్జెట్‌లో రూ.4వేల కేటాయించిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని రోడ్ల విస్తరణకు దాదాపు రూ.500 కోట్లు నిధులు అందే అవకాశాలున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు అంచనా వేస్తున్నారు.

     గల్ఫ్ బాధితుల్లో కరీంనగర్ జిల్లా యువకులు ఎక్కువగా ఉన్నందున బడ్జెట్‌లో పొందుపర్చిన గల్ఫ్ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ వల్ల వారికి లబ్ధి చేకూరుతుంది. అయితే ప్రత్యేక ప్యాకేజీ కింద ఎన్ని నిధులు కేటాయిస్తారనే దానిపై బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడంతో దీనిపై స్పష్టత కొరవడింది.

     ఇవిగాకుండా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, కళ్యాణల క్ష్మీ, షాదీముబారక్, వదృు్ధలు, వికలాంగుల, వితంతవుల పెన్షన్ల పెంపువల్ల పెద్ద ఎత్తున లబ్ధి పొందే అవకాశాలున్నాయి.

     బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ పథకాలకు, ప్రాజెక్టులకు దేనికి ఎన్ని నిధులు కేటాయించారనే అంశంపై స్పష్టత రావాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఈనెల 7న నిధులు కేటాయింపు వివరాలు వెల్లడవుతాయని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement