హైదరాబాద్: బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమవడంతో రానున్న మూడు రోజులపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. 10వ తే దీ నుంచి వానలు తగ్గుముఖం పడతాయని వాతావరణశాఖ శాస్త్రవేత్త సీతారాం ‘సాక్షి’కి చెప్పారు. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు విశాఖపట్నంలోని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణకోస్తాలో పలుచోట్లకుమించి అతిభారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంపై ఒడిశా,పశ్చిమబెంగాల్ మీదుగా శుక్రవారం విస్తరించిన అల్పపీడనం శనివారం నాటికి మరింత బలపడిందని వివరించింది. ఫలితంగా పశ్చిమ దిశ నుంచి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 50కిలోమీటర్ల వేగంతో బలమైనగాలులు వీస్తాయని హెచ్చరించింది. అందువల్ల మత్స్యకారులు సమ్రుద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అయితే భారీ వర్షం ముప్పు ఎప్పటివరకు ఉంటుందో ప్రస్తుతం చెప్పలేమని పేర్కొంది.
మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
Published Sun, Sep 7 2014 12:45 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM
Advertisement