వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
హైదరాబాద్: బీఈడీ అభ్యర్థులకు డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడలకు లేఖ రాశారు. ఏపీలో బీఈడీ అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని వివరించారు. అందువల్ల బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో అర్హత కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఎన్సీటీఈ వారికి ఈ అవకాశం లేకుండా చేసిందన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్కు ఈ వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలో దాదాపు రెండు లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. వారి ఆశలమేరకు ఎన్సీటీఈ నిబంధనలను సవరించి ఈ వెసులుబాటు కల్పించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.