బయో ఆంధ్ర సదస్సు ప్రారంభించనున్న స్మృతి ఇరానీ | Central Minister Smriti irani to be chief guest at 'Bio Andhra 2014' meeting | Sakshi
Sakshi News home page

బయో ఆంధ్ర సదస్సు ప్రారంభించనున్న స్మృతి ఇరానీ

Published Fri, Sep 19 2014 12:39 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

Central Minister Smriti irani to be chief guest at 'Bio Andhra 2014' meeting

కాకినాడ: బయో ఆంధ్ర -2014 సదస్సు కాకినాడ జేఎన్టీయూలో వచ్చే నెల 16వ తేదీన కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఆ యూనివర్శిటీ వైస్ చాన్స్లర్ తులసీ రామ్దాస్ వెల్లడించారు. శుక్రవారం కాకినాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఈ సదస్సు 18వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. వ్యవసాయం, రొయ్యలు, చేపల రంగాల్లో ఆధునిక సాగు పద్దతుల్ని తెలియజేసేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు వెయ్యి మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులు, చేపలు, రోయ్యల సాగుదారులతోపాటు విద్యార్థులు హాజరవుతారని రామ్ దాస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement