కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, రాజకీయవేత్తగా, అందరికీ సుపరిచితురాలే. 2014లో మోదీ కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ నిలిచారు. తొలుత టెలివిజన్ నటి అయిన స్మృతి అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అమె మోడల్ రంగంలో కూడా రానించారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి)
తాజాగ ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టీవి సీరియల్స్‌లలో పనిచేస్తున్న రోజుల్ని గుర్తుచేసుకున్నారు. నటిగా తను కెరీర్ ప్రారంభించిన రోజుల్లో తన వద్ద సరిగ్గా డబ్బుల్లేవు. షూటింగ్‌ల ద్వారా వచ్చే డబ్బు సరిపోయేది కాదు. కనీసం బ్యాంక్ ఖాతాలో రూ.30 వేలు కూడా ఉండేవి కాదని గుర్తు చేసుకుంది. తనకు పెళ్లైన కొత్తలో బ్యాంక్ నుంచి రూ.25 లక్షలు లోన్ తీసుకుని ఒక ఇంటిని కొనుగోలు చేశామని తెలిపారు. కానీ ఆ సమయంలో ఇంటికి సంబంధించిన ఈఎంఐ చెల్లించడం చాలా కష్టంగా అనిపించేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు.
అలాంటి సమయంలో ఓరోజు తన వద్దకు కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక భారీ ఆఫర్ ఇచ్చారని ఇలా తెలిపింది. 'పాన్ మసాలా యాడ్‌లో పనిచేయమని, అందుకోసం రూ.కోట్లలో డబ్బులు ఇస్తామని భారీ ఆఫర్ చేశారు. కాకపోతే ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించాను. దీంతో నా స్నేహితులు.. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా..? అంత డబ్బు ఇస్తామంటే ఎందుకని కాదంటున్నావు' అని అని స్మృతి ఇరానీ తెలిపారు.
(ఇదీ చదవండి: నయనతార రిచ్ లైఫ్.. సొంతంగా విమానంతో పాటు ఇవన్నీ కూడా)
ఆ సమయంలో సీరియల్ ద్వారా ప్రేక్షకులందరూ తనను తమ కుటుంబ సభ్యురాలిగా భావించారని ఇరానీ తెలిపారు. దీంతో పాన్ మసాలా లాంటి యాడ్స్‌లో నటిస్తే వాళ్లు ఎలా తీసుకుంటారోననే ఆలోచన రావడంతో నో చెప్పానని ఆమె తెలిపారు. అంతే కాకుండా చిన్నపిల్లలు కూడా ఈ యాడ్స్ చూసే ప్రమాదం ఉండటంతో పాన్ మసాలా, అల్కహాల్ కంపెనీలకు చెందిన యాడ్స్‌కు దూరంగా ఉంటూ వచ్చానని స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment