స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో అడుగు పెట్టకముందే సినీ ఇండస్ట్రీలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. భాజపా తరఫున ఎంపీగా గెలిచిన స్మృతి ఇరానీ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆమె బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే సీరియల్‌లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఇండస్ట్రీలో రాణించారు. బుల్లితెర నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును వరసగా ఐదు సార్లు అందుకుని చరిత్ర సృష్టించింది.
(ఇది చదవండి: ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. దేవుడు చూస్తాడట!)
అయితే తాజాగా క్యుంకీ.. సాస్ భీ కభీ బహు థీ సీరియల్ సహానటి అపరా మెహతా ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్మృతి ఇరానీ తన పిల్లలు జోర్, జోయిష్ పుట్టే సమయంలో ఒకరోజు ముందు కూడా షూటింగ్స్‌లో పాల్గొన్నారని మెహతా వెల్లడించారు. అయితే ఈ సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని ఆమె పంచుకున్నారు.
అపరా మెహతా మాట్లాడుతూ.. ' స్మృతికి తన కుమారుడు జోర్ పుట్టే ముందు రోజు వరకు మాతో షూటింగ్‌లో ఉంది. డెలివరీ తర్వాత నాల్గవ రోజే షూట్ చేయడానికి తిరిగి వచ్చింది. రెండోసారి ఆమె కుమార్తె జోయిష్ జన్మించినప్పుడు కూడా అదే పని చేసింది. అయితే ఒకసారి ఆమెకు గర్భస్రావం జరిగినట్లు నాతో చెప్పింది. ఈ విషయాన్ని క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ టీమ్‌కు చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజే షూటింగ్‌లో పాల్గొందని.' తెలిపింది. టీవీ పరిశ్రమలో పనిచేయడం చాలా కష్టమని.. అయితే దీనికి ఏ ఒక్క వ్యక్తిని నిందించలేమని పేర్కొంది. ఈ పరిశ్రమలో నిబద్ధత, అంకితభావం అవసరమని వెల్లడించింది. కాగా.. ఈ సీరియల్‌లో మెయిన్ లీడ్ తులసి విరానీ పాత్రను స్మృతి ఇరానీ పోషించగా.. సవితా మన్సుఖ్ విరానీ పాత్రలో అపరా మెహతా కనిపించింది.
(ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్‌పై నటుడి ప్రశంసలు!)
Comments
Please login to add a commentAdd a comment