miscarriage
-
పాపం.. ఇక అదృష్టం లేదేమో.. ఐదోసారి నటికి హార్ట్ బ్రేకింగ్!
ఈ సమాజంలో ఏ మహిళకైనా ఒక్కసారైనా అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. అందుకోసమే పిల్లల కోసం తెగ ఆరాటపడుతుంటారు. కానీ గర్భధారణలో వచ్చే ఇబ్బందుల వల్ల చాలామంది ఐవీఎఫ్, సరోగసీ పద్ధతుల ద్వారా పిల్లలను కనేందుకు యత్నిస్తుంటారు. ప్రస్తుత సరోగసీ అనే పద్ధతి చాలా వరకు సాధారణ ప్రక్రియగా మారిపోయింది.అయితే ప్రముఖ బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంభావన సేత్ సైతం పిల్లల కోసం తెగ ఆరాటపడుతోంది. అందుకే ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్)ను ఆశ్రయించారు. ఇప్పటికే నాలుగుసార్లు ఐవీఎఫ్ ప్రక్రియ ఫెయిల్ అయినప్పటికీ మరోసారి ప్రయత్నించారు బాలీవుడ్ నటి. అయితే ఐదోసారి కూడా ఆమెకు నిరాశే మిగిలింది.ప్రెగ్నెన్సీ ధరించిన మొదటి త్రైమాసికంలోనే గర్భస్రావం అయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది సంభావన. తన భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాధను వ్యక్తం చేసింది. తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 12 వారాల ఇలా జరిగిందని బోరున ఏడ్చేసింది. నటి భర్త అవినాష్ ద్వివేది సైతం తాము గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటే.. ఇలా జరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని ప్రకటిస్తూ సంభవనా ఎమోషనలైంది. మా బిడ్డను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. మూడు నెలల్లో 65 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చిందని నటి తెలిపింది. కానీ చాలా ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుందని నాకు తెలియదు.. ఇది తలచుకుంటే చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ప్రతిరోజూ 2-3 సార్లు ఇంజెక్షన్స్ ఇచ్చేవారని.. మేము మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని ఆమె భర్త అవినాశ్ బాధపడ్డారు.కాగా..గతంలోనూ ఈ జంట ఐవీఎఫ్‌కు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇది ఐదోసారి కావడంతో వారిని తీవ్ర మనో వేదనకు గురి చేసింది. గతంలో ఐవీఎఫ్ ఆధునిక పద్ధతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడినట్లు నటి వివరించింది. అంతేకాకుండా ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సతమతమవుతున్నట్లు తెలిపింది.. తన బాధను అభిమానులతో పంచుకుంటూ కంటతడి పెట్టుకుంది. -
మొదటిసారి ప్రెగ్నెన్సీ.. స్టార్ హీరో భార్యకు అలాంటి అనుభవం!
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో కబీర్ సింగ్, జెర్సీ, పద్మావత్, బ్లడీ డాడీ లాంటి చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన దేవా చిత్రంతో ప్రేక్షకుల ముంందుకు రానున్నారు. అయితే తన సినిమాలతో బిజీగా ఉండగానే.. తన ప్రియురాలు మిరా రాజ్‌పుత్‌ను 2015లో షాహిద్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన భార్య మీరా రాజ్‌పుత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు మొదటిసారి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో దాదాపు గర్భస్రావం అయినంత పనైందని.. ఏ నిమిషంలోనైనా బిడ్డను కోల్పోవచ్చని చెప్పారని వెల్లడించింది. అయితే వైద్యులు తనకు వెంటనే సోనోగ్రఫీ చికిత్స అందించారని ఆమె పేర్కొంది.దీంతో మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నానని.. లేకపోతే గర్భస్రావం జరిగి ఉండేదని తెలిపింది. ఈ విషయంలో తన భర్త షాహిద్ కపూర్ పూర్తిగా సహకరించాడని వివరించింది. తమ ఇంటినే ఆస్పత్రిగా మార్చేశాడని మీరా తన భర్తపై ప్రశంసలు కురిపించింది. కాగా.. షాహిద్ కపూర్‌తో వివాహమైన ఏడాది తర్వాత 2016లో మిషా అనే కూతురు జన్మించింది. ఈ జంట 2018లో తమ రెండో బిడ్డ జైన్‌ను స్వాగతించారు. -
గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి
స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో అడుగు పెట్టకముందే సినీ ఇండస్ట్రీలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. భాజపా తరఫున ఎంపీగా గెలిచిన స్మృతి ఇరానీ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆమె బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే సీరియల్లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఇండస్ట్రీలో రాణించారు. బుల్లితెర నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును వరసగా ఐదు సార్లు అందుకుని చరిత్ర సృష్టించింది. (ఇది చదవండి: ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. దేవుడు చూస్తాడట!) అయితే తాజాగా క్యుంకీ.. సాస్ భీ కభీ బహు థీ సీరియల్ సహానటి అపరా మెహతా ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్మృతి ఇరానీ తన పిల్లలు జోర్, జోయిష్ పుట్టే సమయంలో ఒకరోజు ముందు కూడా షూటింగ్స్‌లో పాల్గొన్నారని మెహతా వెల్లడించారు. అయితే ఈ సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. అపరా మెహతా మాట్లాడుతూ.. ' స్మృతికి తన కుమారుడు జోర్ పుట్టే ముందు రోజు వరకు మాతో షూటింగ్లో ఉంది. డెలివరీ తర్వాత నాల్గవ రోజే షూట్ చేయడానికి తిరిగి వచ్చింది. రెండోసారి ఆమె కుమార్తె జోయిష్ జన్మించినప్పుడు కూడా అదే పని చేసింది. అయితే ఒకసారి ఆమెకు గర్భస్రావం జరిగినట్లు నాతో చెప్పింది. ఈ విషయాన్ని క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ టీమ్‌కు చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజే షూటింగ్లో పాల్గొందని.' తెలిపింది. టీవీ పరిశ్రమలో పనిచేయడం చాలా కష్టమని.. అయితే దీనికి ఏ ఒక్క వ్యక్తిని నిందించలేమని పేర్కొంది. ఈ పరిశ్రమలో నిబద్ధత, అంకితభావం అవసరమని వెల్లడించింది. కాగా.. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ తులసి విరానీ పాత్రను స్మృతి ఇరానీ పోషించగా.. సవితా మన్సుఖ్ విరానీ పాత్రలో అపరా మెహతా కనిపించింది. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) -
తీవ్ర రక్తస్రావం, ప్రాణానికే ప్రమాదమన్నారు: సీరియల్ నటి
బుల్లితెర నటి గౌరీ రాజ్ ఉన్నట్లుండి సీరియల్స్ మానేసింది. ప్రేమ ఎంత మధురంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన గౌరీ బెస్ట్ విలన్‌గా అవార్డు సైతం అందుకుంది. మల్లి సీరియల్ ద్వారా కూడా తగినంత గుర్తింపు సంపాదించుకుంది. కానీ సడన్‌గా యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసింది. కొంతకాలంగా ఆమె ఏ సీరియల్లోనూ కనిపించడం లేదు. అందుకు గల కారణాన్ని తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది నటి. తీవ్ర రక్తస్రావం.. ప్రెగ్నెన్సీ అని తెలీక.. గౌరీ రాజ్ మాట్లాడుతూ.. 'ఒక నటిగా సీరియల్స్, సినిమాలు చేయాలని నా కోరిక. కానీ సడన్‌గా యాక్టింగ్ ఎందుకు మానేశాననేది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో నేను నెల తప్పాను. కానీ నేను ప్రెగ్నెంట్ అన్న విషయం నాకూ తెలియదు. అప్పుడు సీరియల్లో చాలా ఫైటింగ్ సీన్లలో నటించాను. ఆ తర్వాత నాకు 20-25 రోజులపాటు తీవ్ర రక్తస్రావం జరిగింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. ప్రెగ్నెన్సీ అని తెలియక లైట్ తీసుకున్నాను. కడుపు నొప్పి ఉన్నప్పటికీ షూటింగ్లో పాల్గొనేదాన్ని. సడన్‌గా ఐసీయూకు తీసుకెళ్లారు ఓసారి నొప్పి ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళ్లాను. అప్పటికే చాలా ఆలస్యం చేశాను. స్కానింగ్‌లో నేను గర్భం దాల్చానని చెప్పారు. తల్లి కాబోతున్నానని సంతోషపడ్డాను. తర్వాతి రోజు నేను రెడీ అయి షూటింగ్‌కు వెళ్తుంటే నా భర్త నన్ను ఆపేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నాకు టెస్టులు, స్కానింగ్ చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పటికే డాక్టర్ నా ఫ్యామిలీతో మాట్లాడారు. వీళ్లంతా డల్‌గా ఉన్నారు. కానీ నాకు ఏదీ చెప్పలేదు. ఇంతలో ఐసీయూకు తీసుకెళ్లారు. ఏం జరుగుతోందని నిలదీశాను. సర్జరీ వల్ల నిలబడలేకపోయా.. దానికి డాక్టర్స్.. లోపల ఉన్న శిశువు బ్లాస్ట్ అయింది. శరీరమంతా ముక్కలు ముక్కలుగా ఛిద్రమైపోయింది. అది తీయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అన్నారు. సర్జరీతో పాటు లాపరోస్కోపీ చేశారు. ఇలా ప్రెగ్నెన్సీ పోవడం రెండోసారి. నరకం అనుభవించాను. అయినా ఆ డిప్రెషన్ నుంచి బయటపడి మళ్లీ నా పనిపై ధ్యాస పెట్టాను. కానీ సర్జరీ వల్ల ఎక్కువసేపు నిలబడలేకపోయాను. అందుకే కొంతకాలానికే రెండు సీరియల్స్ మానేశాను. ఆ సమయంలో ఉత్తమ విలన్‌గా అవార్డు వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎంతమంది పిల్లలని అడుగుతున్నారు.. అయితే ఒక్క సీరియల్ మాత్రం చేస్తూ పోయాను. కానీ ఇక్కడ కూడా మూడో ప్రెగ్నెన్సీ పోయింది. అది ముందుగానే గుర్తించగలిగాం కాబట్టి ఇంజక్షన్‌తోనే బయటకు వెళ్లిపోయింది. డాక్టర్ ఈసారైనా విశ్రాంతి తీసుకోమని హెచ్చరించాడు. ఇప్పుడు ఏ సీరియల్ కూడా చేయడం లేదు అయితే మూడుసార్లు ఇలా జరగడం, ఇంజక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడంతో కొంత లావైపోయాను. నాకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు? నాకు ముగ్గురు పిల్లలు.. ఆ ముగ్గురు దేవుడి దగ్గరే ఉన్నారు' అంటూ ఏడ్చేసింది గౌరీ రాజ్. చదవండి: భగవంత్ కేసరి రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? -
పిండం ఎదుగుదల ఎలా ఉంది?
న్యూఢిల్లీ: వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో ఆమె గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల ఎలా ఉందో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆ మహిళ ప్రసవానంతర మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటోందని గర్భాన్ని మోయడానికి ఆమె సిద్ధంగా లేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్ని çపరిగణనలోకి తీసుకుంది. మానసిక సమస్యలకు ఆ మహిళ తీసుకుంటున్న మందులు ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ఏమైనా హాని చేస్తాయో పూర్తిగా పరీక్షలు చేసి వివరంగా కోర్టుకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ శారీరక, మానసిక స్థితి ఎలా ఉందో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ‘‘ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లయిన ఆ మహిళ ప్రసవానంతరం వచ్చే మానసిక సమస్యలతో బాధపడుతోందని పరీక్షల్లో తేలితే ప్రత్యామ్నాయంగా మరేౖవైనా మందులు ఇవ్వొచ్చా పరిశీలించాలి’’ అని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యులకి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. -
'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. బాజీఘర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ హిందీతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లోనూ నటించింది. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె సుఖీ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. (ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్) అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిల్పా శెట్టి తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్ చిత్ర నిర్మాత అయిన తన తల్లి సునందశెట్టి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మా అమ్మకు నేను కడుపులో ఉండగా.. గర్భస్రావం అవుతుందని వైద్యులు చెప్పారని శిల్పాశెట్టి వెల్లడించారు. ఈ విషయాన్ని అమ్మ తనకు చెప్పిందని తెలిపింది. శిల్పా మాట్లాడుతూ.. 'మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. తాను నన్ను కోల్పోతుందని వైద్యులు చెప్పారట. తాను గర్భంలో ఉన్నప్పుజే అమ్మ పరిస్థితి చాలా కష్టంగా ఉన్నందున అబార్షన్ చేయాలని వైద్యులు సూచించారట. ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మిస్ క్యారేజ్ అవుతుందని అమ్మ భయపడింది. తరచుగా అలా జరగడంతో అబార్షన్ తప్పదనుకున్నారు. కానీ నేను పుట్టాను. ఇది ఒక విధంగా నాకు పునర్జన్మే. అందుకే నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక కారణంతో పుట్టానని అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో జీవితంలో ప్రేరణ ఇచ్చే మేసేజ్‌లు చేస్తుంటా. లైఫ్ అనేది ఎవరికీ కూడా అంతా ఈజీ కాదు. " అంటూ చెప్పుకొచ్చింది. సుఖీ చిత్రం ద్వారా సోనాల్ జోషి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అమిత్ సాధ్, కుషా కపిల, పావ్లీన్ గుజ్రాల్, దిల్నాజ్ ఇరానీ, చైతన్య చౌదరి, జ్యోతి కపూర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మలు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. (ఇది చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!) -
బాలీవుడ్ నటుడి సోదరికి అబార్షన్.. దేవుడెంత పని చేశాడు!
అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఎవరికి ఉండదు. అందులోనూ గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ కడుపులోని పాపాయి ఎప్పుడు ఈ భూమి మీదకు వస్తుందా? అని వేయి కలలు కంటూ ఉంటారు. బాలీవుడ్ నటుడు షోయబ్ ఇబ్రహీం సోదరి, ఇన్ఫ్లూయెన్సర్ సబా కూడా అలానే కలలు కంది. గర్భవతి అయినప్పటి నుంచి పుట్టబోయే బిడ్డపై గంపెడాశలు పెట్టుకుది. కానీ ఆమె కలలు కల్లలయ్యాయి. కడుపులోనే బిడ్డ మరణించింది. దీంతో ఆమెకు అబార్షన్ చేయక తప్పలేదు. ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సబా-సన్నీ దంపతులు తాజాగా మిస్క్యారేజ్ అయిన విషయాన్ని వెల్లడించారు. ముందు నుంచీ బిడ్డ గుండె సరిగా కొట్టుకోవడం లేదని చెప్పిన వైద్యులు ఆమెకు బెడ్ రెస్ట్ తీసుకోవమని చెప్పారు. తాజాగా స్కానింగ్‌కు వెళ్లినప్పుడు పరీక్షించగా శిశువు గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని తెలిపారు. ఆమెకు అబార్షన్ చేశారు. దీనిపై సబా మాట్లాడుతూ.. 'ఈ బాధను ఎలా దిగమింగుకోవాలో తెలియడం లేదు. సన్నీ మనసుకెంత కష్టంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. ఆ భగవంతుడు ఇలా జరగాలని ఉందని రాసిపెట్టాడు. దానికి మేమేం చేయగలం? కానీ అబార్షన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లినప్పుడు చాలా భయమేసింది' అని చెప్పుకొచ్చింది. అటు సన్నీ మాట్లాడుతూ.. 'ఒకవేళ నేను ఆపరేషన్ అయ్యాక తిరిగి రాకపోతే ఏం చేస్తావు? అని సబా అడిగింది. ఆ మాట విని చాలా బాధేసింది. తను మానసికంగా చాలా భయపడింది' అని పేర్కొన్నాడు. కాగా సబా- సన్నీ గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. చదవండి: రాజకీయాల్లోకి రీఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేశ్ -
దారుణం: డీజే సౌండ్ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..
డీజే సౌండ్‌ని తగ్గించమన్నందకు కోపంతో గర్భిణి అని చూడకుండా కాల్పుల జరిపారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయ్యింది. ఈ ఘటన ఢిల్లీలోని సిరాస్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..హరీష్ అనే వ్యక్తి కొడుకుకి కువాన్ పూజ అనే వేడుక ఉంది. ఆ ఫంక్షన్ కోసం అని డీజే పెట్టారు చాలా బిగ్గరగా పెట్టడంతో ఆ వీధిలోనే ఉండే రంజు అనే 30 ఏళ్ల మహిళ సౌండ్ తగ్గించమని హరీష్‌ని కోరింది. అంతే హరీష్ తన స్నేహితుడు అమిత్ నుంచి తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో తుపాకీ నేరుగా మెడ మీదకు దూసుకపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. దీంతో ఆమె బంధువులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మెడపై తుపాకీ గుండు తగలడంతో బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోవడం కుదరదని వైద్యులు చెప్పారు. దీంతో ఈ ఘటన జరిగినప్పుడూ ఉన్న పత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించి పోలీసలు కేసు నమోదు చేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా బాధితురాలికి గర్భస్రావం అయినట్లు వెల్లడించారు. కాగా, నిందితులు హరీష్ డెలివరీ బాయ్‌గానూ, అమిత్ మొబైల్ రిపేరు షాపు పని చేస్తాడని పోలీసులు తెలిపారు. (చదవండి: గుండెపోటులకు కరోనానే కారణమా! ఆరోగ్యమంత్రి ఏం చెప్పారంటే..) -
పోలీసుల నిర్వాకం.. గర్భిణి ఖైదీకి గర్భస్రావం, పరిహారంగా రూ. 3 కోట్లు
Pregnant Inmate Suffered Miscarriage As Cops Stopped At Starbucks: అమెరికాలో ఆరెంజ్ కౌంటీ జైలులో ఉన్న మహిళా ఖైదీకి పోలీసుల నిర్లక్ష్యం కారణంగా గర్భస్రావం అయ్యింది. దీంతో కోర్టు బాధిత మహిళకు పరిహారంగా రూ. 3 కోట్లు చెల్లించమని జైలు అధికారులను ఆదేశించింది. వాస్తవానికి 2016లో సదరు మహిళా ఖైదీ 28 ఏళ్ల సాండ్రా క్వినోన్స్కి కొన్ని షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైంది. ఐతే ఆమె ఆ బెయిల్ నియమాలను ఉల్లంఘించడంతో జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. అదే సమయంలో ఆమె గర్భవతి. ఐతే ఆమెకు ఒక రోజు ఉమ్మనీరు లీకవ్వడంతో తన పరిస్థితి బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్లండని పోలీసులను వేడుకుంది. కానీ పోలీసులు ఆమె పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా గర్భవతి అని కనికరం లేకుండా ... ఇంతటి ఎమర్జెన్సీ టైంలో ఒక కాఫీ హోటల్ వద్ద కారుని చాలాసేపు ఆపేశారు. కనీసం అంబులెన్స్‌కి కూడా కాల్ చేయలేదు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా... ఆమె తన బిడ్డను కోల్పోవలసి వచ్చింది. దీంతో సదరు మహిళా ఖైదీ తనకు న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కింది. బాధితురాలి తరుఫు న్యాయవాది నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె పట్ల పోలీసులు కావాలనే ఉదాసీనతగా వ్యహరించారని కోర్టుకి తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్‌కి కాల్ చేయలేదని రెండు గంటల ఆలస్యం కారణంగా అత్యంత విలువైన మాతృత్వపు భాగ్యాన్ని పొందలేకపోయిందని చెప్పారు. దీంతో కోర్టు జైలు సూపర్వైజర్స్ని బాధిత ఖైదీ క్వినోన్స్‌కు సుమారు రూ. 3 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. దీనికి జైలు సూపర్ వైజర్లు అంగీరించారు గానీ అందుకు సదరు బాధితురాలు కూడా అంగీకరిస్తేనే ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఖరారు అవుతుందని కూడా స్పష్టం చేసింది. తొలుత సదరు మహిళా ఖైదీ పిటీషన్ని అక్టోబర్ 2020లో ఫెడరల్ కోర్టు కొట్టేసింది, కానీ అప్పీల్ కోర్టు గతేడాది ఈ కేసును తిరిగి పునరుద్ధరించి ఈ తీర్పును వెల్లడించింది. (చదవండి: పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి... 937 మంది మృతి) -
9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..
Actress Sharon Stone Reveals She Lost 9 Childrens By Miscarriage: సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు 'అమ్మ' అని పిలుచుకోవాలని తహతహలాడతారు. పిల్లల కోసం ఎంతో ప్రయత్నిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించక అమ్మ అనే మాధుర్యాన్ని పొందలేని మహిళల బాధ వర్ణణాతీతం. మరి అలాంటిది గర్భస్రావం వల్ల ఏకంగా తొమ్మిది సార్లు పిల్లలను కోల్పోతే. ఇక వారి ఆవేదన గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి బాధను అనుభవించింది 64 ఏళ్ల ఒకప్పటి స్టార్ హీరోయిన్ షరాన్ స్టోన్. ఈ అమెరికన్ నటి షరాన్ స్టోన్ 'బేసిక్ ఇన్స్టింక్ట్' సినిమా సిరీస్ ద్వారా అత్యధిక పాపులారిటీని సంపాదించుకుంది. తాజాగా తాను 9 మంది పిల్లలను కోల్పోవడం గురించి తెలిపింది. 'నేను గర్భస్రావం వల్ల తొమ్మిది మంది పిల్లలను కోల్పోయాను. ఇదేం చిన్న విషయం కాదు. శారీరకంగా, మానసికంగా నేను అనుభవించాను. మహిళలుగా మాకు ఈ నష్టం గురించి మాట్లాడేందుకు పదాలు లేవు. ఒకరకమైన ఓటమి భావనతో ఒంటరిగా, రహస్యంగా భరించాల్సిన విషయం. కానీ దీనికి బదులు కాస్తా సానుభూతి, ప్రేమ, కనికరం అవసరం.' అని తెలిపింది. (చదవండి: నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) షరాన్ స్టోన్ తన మొదటి గర్భస్రావం గురించి 'అలా జరిగినందుకు నేను ఎంతో సిగ్గుపడ్డాను. ఎంతో అవమానకరంగా అనిపించింది. దాని గురించి ఎలా చెప్పాలో నా నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. నిజానికి నా ఆరోగ్యం పట్ల గర్వంగా ఉంటాను. ఎందుకంటే నేను ప్రతిరోజూ వ్యాయామం చేస్తాను. కానీ నాకు తెలిసినంత వరకు పునురుత్పత్తి కోసం అది అంతగా సహాయపడలేదనుకుంటా.' అని పేర్కొంది. (చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?) -
త్వరలో పెళ్లి.. అంతలోనే బ్యాడ్‌న్యూస్ చెప్పిన పాప్ సింగర్
Pop Singer Britney Spears Shares Heartbreaking Note: త్వరలోనే శుభవార్త చెబుతుందనుకున్న పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల తాను తల్లి కాబోతున్నట్లు బ్రిట్నీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగిపోయారు. కానీ, అంతలోనే బిడ్డను కొల్పోయానంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ భావోద్యేగ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘మేం మా బిడ్డను కోల్పోయాం. మా జీవితంలో విషాదంలో నెలకొంది. ఇది తల్లిదండ్రులగా మాకు ఎంతో కఠిన సమయం. చదవండి: సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్ మెడల్! రిలేషల్లో ఒక అడుగకు ముందుకేళ్లి కుటుంబాన్ని విస్తరించుకోవాలని ఎన్నో కలలు కన్నాం. మా తొలి బిడ్డను ఈ లోకానికి పరిచయం చేయాలని ఎంతో ఆత్రుతుగా ఎదురు చూశాం. కానీ అంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. నాకు గర్భస్రావం జరిగింది. ఈ కఠిన సమయంలో మాకు సపోర్టు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే మా ప్రైవసిని కూడా గౌరవిస్తారని కోరుకుంటున్నాం’ అంటూ ఆమె పోస్ట్ షేర్ చేసింది. కాగా బ్రిట్నీ ఇటీవల తన ప్రెగ్నెన్సీ ప్రకటిస్తూ త్వరలోనే తన ఫియాన్సీ సామిని పెళ్లి చేసుకోబుతున్నట్లు ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: కరాటే కల్యాణితో పెట్టుకున్నాడు, బిగ్‌బాస్ ఛాన్స్ పట్టేశాడు! View this post on Instagram A post shared by Britney Spears (@britneyspears) -
Hyderabad: కోర్టు అనుమతితో మైనర్ బాలికకు గర్భస్రావం
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన బాలిక.. తన భవిష్యత్ నిమిత్తం గర్భస్రావానికి ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. మానవతా దృక్పథంతో స్పందించిన న్యాయస్థానం సదరు బాలిక గర్భస్రావానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడి (25)కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వీరిని వదిలేసి అతను నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీలో తన దూరపు బంధువుతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 8 వ తరగతి చదువుతున్న ఆమె కూతురిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. బాలిక తల్లి ఈ విషయాన్ని కనిపెట్టి కూతురితో కలిసి వెస్ట్‌జోన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించింది. రెండు వారాల క్రితం పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక మైనర్ కావడం, గర్భం కూడా దాల్చడంతో భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని తల్లిదండ్రులతో కలిసి ఆశ్రయించింది. నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఆ బాలిక గర్భస్రావానికి అనుమతినిస్తూ నిలోఫర్ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం వైద్యులు మైనర్ బాలికకు గర్భస్రావం చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (Hyderabad: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్) -
చిన్న అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష
అంకారా: మన వల్ల ఎలాంటి తప్పు జరగకపోయినా సరే శిక్ష అనుభవించాల్సి వస్తే చాలా బాధగా ఉంటుంది. అలాంటిది వేరేవారి నిర్లక్ష్యం కారణంగా.. చిన్న అక్షర దోషం ఫలితంగా కోర్టు ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తే.. అది కూడా ఓ రాజకీయ నాయకుడి భార్యకు ఈ పరిస్థితి తలెత్తితే.. పీకల దాకా కోపం వస్తుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు టర్కీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య. ఆమె తప్పు ఏం లేకపోయినా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమెకు ఏకంగా రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఆ వివరాలు.. (చదవండి: సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?) టర్కీకి చెందిన టీచర్, రాజకీయ నాయకుడి భార్య బసక్ డెమిర్టాస్ అనే మహిళ 2015లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. అనారోగ్యం ఫలితంగా డెమిర్టాస్‌కు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఐదు రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే డెమిర్టాస్ ఆస్పత్రిలో చేరింది 2015, డిసెంబర్ 11న కాగా.. ఆస్పత్రి సిబ్బంది డిసెంబర్ 14 అని రిపోర్టులో తప్పుగా టైప్ చేశారు. ఇది గమనించని డెమిర్టాస్.. వైద్యులు సూచించిన మేరకు ఐదు రోజులు సెలవు తీసుకుంది. ఇక పెయిడ్ లీవ్ అప్లై చేస్తూ.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును అందులో సబ్మిట్ చేసింది. అయితే దానిలో డెమిర్టాస్ డిసెంబర్ 14న ఆస్పత్రిలో చేర్చినట్లు ఉంది. ఈ క్రమంలో ఆమె తప్పుడు రిపోర్టులు సబ్మిట్ చేసి.. మోసం చేసిందనే ఆరోపణలపై డెమిర్టాస్ మీద పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోర్టు 2018లో డెమిర్టాస్‌కు, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్‌కి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను) ఈ సందర్భంగా డెమిర్టాస్ న్యాయవాదులు మాట్లాడుతూ.. ‘‘ఆసుపత్రి రికార్డు పుస్తకంలో డెమిర్టాస్ డిసెంబర్ 11న ఆస్పత్రిలో చేరినట్లు ఉంది. అక్షర దోషం వల్లే ఈ తప్పు జరిగిందని కోర్టుకు తెలిపాము. ఈ క్రమంలో కోర్టు ఆస్పత్రి రికార్డు బుక్‌ను సాక్ష్యంగా చూడకుండానే శిక్ష విధించింది. ఇది కేవలం రాజకీయ కుట్రే’’ అని పేర్కొన్నారు. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ‘‘ఒక సైంటిఫిక్ ఫైల్‌కు సంబంధించి చిన్న క్లరికల్ తప్పిదం వల్ల కోర్టు డెమిర్టాస్, డాక్టర్‌కి కలిపి ఐదు సంవత్సరాల శిక్ష విధించింది. ఇది చిన్న తప్పిదం కాదు. భయంకరమైన రాజకీయ కుట్ర’’ అని టర్కీపార్లమెంట్ రిపోర్టర్ నాచో సాంచెజ్ అమోర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: మహిళను తోసేసిన ఎమ్మెల్యే.. గర్భస్రావం -
కొంప ముంచిన వైద్యురాలి నిర్లక్ష్యం..
సాక్షి, మిర్యాలగూడ అర్బన్: వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే అబార్షన్ అయ్యిందని ఆరోపిస్తూ గర్భిణి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. వేములపల్లి మండల కేంద్రానికి చెందిన బచ్చలకూరి శ్రీకాంత్ తన భార్య విజయకు వివాహం అయిన 10 ఏళ్లకు కాన్పు అందడంతో అప్పటినుంచి పట్టణంలోని చర్చిరోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా, శనివారం ఉదయం విజయకు కడుపులో నొప్పిగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యురాలు ఇంజక్షన్ ఇచ్చింది. అనంతరం విజయ ఇంటికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత తిరిగి నొప్పి ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ పరీక్షించేందుకు చాంబర్లోకి తీసుకెళ్లగానే ఒక్కసారిగా నొప్పి ఎక్కువై ప్రసవం అయ్యింది. మగశిశువు జన్మించి చనిపోయాడు. దీంతో తీవ్ర రక్త స్రావం అయిన విజయకు చికిత్స అందించారు. కాగా వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రోగి వైద్యురాలితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. -
గర్భంలోనే చావుకేక!
అనంతపురం సాయినగర్ మూడో క్రాస్‌లోని సాయిరత్న ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ మాధవి రూ.30 వేలకు కక్కుర్తి పడి గత నెల 12న ఆస్పత్రిలో పని చేసే ముగ్గురు సిబ్బందితో ఓ బాలికకు అబార్షన్ చేయించింది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ విస్మరించినా.. పోలీసు శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. బాలికకు అబార్షన్ చేసినందుకు ఆస్పత్రి ఎండీ, నలుగురు స్టాఫ్ నర్సులు, స్వీపర్‌ను రిమాండ్‌కు పంపింది. స్పందించాల్సిన ఆరోగ్యశాఖ ఇంత వరకూ ‘సాయిరత్న’ వైపు తొంగి చూడలేదు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నా ఆరోగ్యశాఖ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. గతేడాది ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రేయ ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా ఓ అబార్షన్ జరిగితే.. ఆరోగ్యశాఖాధికారులు తూతూమత్రంగా తనిఖీలు చేసి వదిలేశారు. చివరకు బాధితులు ముందుకు రాలేదని ఆ విషయాన్ని మరుగున పడేశారు. కంటి తుడుపు చర్యగా అల్ట్రాసౌండ్ స్కాన్ స్విచ్‌బోర్డులను సీజ్ చేశారు. సాక్షి, అనంతపురం హాస్పిటల్: సమాజంలో వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కొందరు మాత్రం ఆ వృత్తికే మచ్చ తెస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చట్టాలను సైతం అతిక్రమిస్తున్నారు. ముఖ్యంగా అబార్షన్ల విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఎందరికో గర్భ శోకాన్ని మిగులుస్తున్నారు. ఎప్పటికప్పుడు కట్టడి చేయాల్సిన ఆరోగ్యశాఖ మాత్రం అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబార్షన్ ఏ పరిస్థితుల్లో చేయవచ్చంటే.. ► గర్భంలో శిశువు బుద్ధిమాంద్యం, తక్కువ బరువు, వివిధ రకాల రుగ్మతలతో ఉన్నప్పుడు, తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అబార్షన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ► సుశిక్షితులైన స్త్రీవైద్య నిపుణులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ► అబార్షన్లు చేయడానికి సదరు ఆస్పత్రికి మెడికల్ టర్మినేషన్ యాక్ట్ 1,971 లీగల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ► గర్భం దాల్చి 12 వారాలు అయిన తర్వాత ఒక గైనకాలజిస్టుతో పరీక్షలు చేయించుకుని తీవ్రమై ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తిస్తే సదరు వైద్యురాలి అనుమతి (ఎంటీపీ అర్హత ఉండి)తో అబార్షన్ చేయవచ్చు. ► గర్భం దాల్చి 12 నుంచి 20 వారాలు అయినప్పుడు ఇద్దరు గైనకాలజిస్టుల అనుమతితో అబార్షన్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో అబార్షన్లు గర్భంలోని శిశువు, తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా వివిధ కారణాలతో కొందరు అబార్షన్లు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది మహిళలు తమకు ఇష్టం లేకపోయినా కుటుంబీకులు, బంధువుల ఒత్తిడితో అబార్షన్లు చేయించుకుని గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు. ఈ అబార్షన్ల తతంగంలో ప్రైవేట్ ఆస్పత్రులే కీలకంగా మారాయి. ఆయా ఆస్పత్రులకు గర్భిణులను తీసుకువచ్చే విషయంలో వివిధ క్లినిక్‌లు, ఆస్పత్రుల్లో(ప్రైవేట్) పనిచేసే స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలు, ఆర్ఎంపీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముందుగానే ఓ రేట్ మాట్లాడుకుని ప్రైవేటు ఆస్పత్రులకు కేస్లు పంపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా రెఫర్ చేయడం ద్వారా సదరు ఏఎన్ఎం, స్టాఫ్‌నర్సు, ఆర్ఎంపీకి కమీషన్ వస్తుండగా.. గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ల తంతు ముగిసిపోతోంది. వెన్నుదన్నుగా ఓ అధికారి ప్రైవేట్ అక్రమ అబార్షన్ దందాకు ఆరోగ్యశాఖలోని ఓ అధికారి వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సాయిరత్న ఆస్పత్రిలో అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదించాలని వైద్యఆరోగ్యశాఖ అధికారి ఆదేశించినా.. సదరు అధికారి ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసిపడేశారు. అందువల్లే సదరు ఆస్పత్రిపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నిర్వాహకులు ఆస్పత్రిలో అడ్మిషన్లు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల స్కాన్ సెంటర్ల సీజ్ వ్యవహారంలో సదరు అధికారి కీలకంగా వ్యవహరించి స్కాన్ సెంటర్ల నిర్వాహకులు బయటపడేలా సాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆరోగ్యశాఖ పాత్ర ఏంటి? ఎక్కడైనా అబార్షన్ జగడం, లింగ నిర్ధారణ, తల్లి, బిడ్డలో ఎవరు చనిపోయినా క్షణాల్లో ఆరోగ్యశాఖాధికారులు అక్కడికి చేరుకుని సంబంధిత ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలి. వాస్తవంగా సాయిరత్న ఆస్పత్రికి మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ అనుమతి లేదు. గర్భవతులకు ఏదైనా అనారోగ్య సమస్యలున్నప్పుడు ఆరోగ్యశాఖ అనుమతితో అబార్షన్ చేస్తారు. ఇటువంటి నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఆరోగ్యశాఖకు ఉంది. ఆస్పత్రిని సీజ్ చేయడంతో పాటు సంబంధిత నిర్వాహకులకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ వర్గాలంటున్నాయి. కానీ ఇక్కడ అలాంటి చర్యలేవీ తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మహిళను తోసేసిన ఎమ్మెల్యే.. గర్భస్రావం
బెంగళూరు: ఎమ్మెల్యే, అతడి అనుచరులు దాడి చేయడంతో తనకు అబార్షన్ అయ్యిందంటూ ఓ మహిళా నాయకురాలు సొంత పార్టి ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేసింది. బాధితురాలిని స్థానిక బీజేపీ నాయకురాలు, మహాలింగాపూర్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ చాందిని నాయక్‌గా గుర్తించారు. గత నెల 9న ఈ దారుణం చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక గత నెల 9న మహాలింగాపూర్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్‌కి సంబంధించి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి తన మద్దతుదారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. చాందిని నాయక్ ఓటు వేయడానకి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గర్భవతి అయిన చాందిని నాయక్ కింద పడిపోయింది. దాంతో ఆమెకు గర్భస్రావం అయినట్లుగా తెలిసింది. దీనిపై చాందిని నాయక్, ఆమె భర్త నగేష్ నాయక్.. మరో బీజేపీ లీడర్ సాయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సిద్దూ సవధి మీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాందిని నాయక్ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే రౌడీయిజం చేశారు. నన్ను కిందపడేశారు. ప్రజాప్రతినిధి అయ్యుండి.. ఓ మహిళ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం ఏంటి?.. ఇలాంటి నాయకులు ఉంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడతారు.. ప్రధాని ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ నినాదాలు చేస్తారు.. ఎమ్మెల్యేలు మాత్రం మహిళలు పట్ల ఇలా దారుణంగా ప్రవర్తిస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే సవధి స్పందించారు. చాందిని నాయక్ తనపై చేసినవన్ని తప్పుడు ఆరోపణలు అంటూ ఖండించారు. ‘‘చాందిని నాయక్‌కు సంబంధించిన ఆస్పత్రి రికార్డులు సేకరించాను. ఆమెకు 6 సంవత్సరాల క్రితం ట్యూబెక్టమీ అయ్యిందని తెలిసింది. ఒక రోజులో నేను ఈ నివేదికను మీడియాకు విడుదల చేస్తాను” అన్నారు. ఆమె కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని.. ఆమెకు ఎలాంటి గర్భస్రావం జరగలేదని ఆసుపత్రి అధికారులు తనకు తెలియజేశారని సవధి తెలిపారు. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను) కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బ్రిజేష్ కలప్ప ఈ వివాదంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు., “బీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి గర్భవతి అయిన కౌన్సిలర్ చాందిని నాయక్ మీద దాడి చేసిన వీడియోలను మేం టీవీ చూసి చాలా భయపడ్డాము. ఎమ్మెల్యే క్రూరత్వం వల్ల ఆమెకు గర్భస్రావం అయ్యింది. బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలదా?!” అంటూ సవాలు చేశారు. -
నువ్వు బాగున్నావు కదా?
‘ఆర్యూ ఓకే’ అనే భావం భర్త చూపుల్లో మేఘన్‌కు కనిపించింది! హాస్పిటల్ బెడ్‌పైన ఉంది మేఘన్. భర్త అలా చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. గుండె పగిలి ఒక్కసారిగా ఏడ్చేసింది. మాతృత్వం! ఆ భావనలోనే అమృతం దాగుంది. దేవుడు స్త్రీకిచ్చిన వరం మాతృత్వం అని అంటుంటారు. అందుకే ఎన్నిసార్లు తల్లయినా, మళ్లీ మరో బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ అమ్మదనాన్ని స్త్రీ కొత్తగా కోరుకుంటుంది. గర్భంలో అప్పుడే ప్రాణం పోసుకుంటున్న జీవిని కంటికి రెప్పలా కాచుకుంటుంది. అయిన వారందరికీ చెప్పుకొని మురిసిపోతుంది. పుట్టబోయే బిడ్డని అందనంత ఎత్తులో చూడాలని కలలు కంటుంది. కానీ.. ఆ కలలు అర్ధంతరంగా కల్లలైపోతే! రేపో మాపో పుడుతుందనుకున్న నలుసు కడుపులోనే కరిగి, అందని లోకాలకు వెళ్లిపోతే! ఆ బాధను భరించడం ఏ తల్లికీ తరం కాదు. ఆ తల్లి కన్నీటిని తుడవడం ఏ ఒక్కరికీ వశం కాదు. 2020 జూలై. అప్పుడే రోజు మొదలవుతోంది. గర్భంతో ఉన్న మేఘన్ మార్కెల్ తన మొదటి కొడుకు డైపర్ మార్చుతోంది. అకస్మాత్తుగా తెలీని నిస్సత్తువ ఏదో ఆవరించినట్లు ఆమె శరీరమంతా తిమ్మిర్లు మొదలయ్యాయి. చేతుల్లో ఒక బిడ్డ, కడుపులో మరో బిడ్డ. చేతుల్లోని ఏడాది బిడ్డను ఉన్నఫళంగా వదిలేయలేదు. వదిలేయకుంటే తనలో ప్రాణం పోసుకుంటున్న మరో బిడ్డపై ఆ క్షణాన పడుతున్న ఒత్తిడి ఏమిటో తెలుసుకోలేదు. మనసేదో కీడు శంకిస్తోంది. ఏమిటది? ఆలోచించే లోపే తనకు తెలీకుండానే చేతుల్లో ఉన్న బాబుతో సహా కింద పడిపోయింది. కళ్లు తెరిచి చూసేసరికి ఆసుపత్రి పడకపై ఉంది! పక్కన భర్త హ్యారీ ఓదార్పుగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కళ్లు తెరిచాక, ‘నువ్వు బాగున్నావ్ కదా?!’ అనే భావం అతడి చూపుల్లో ఆమెకు కనిపించింది. ఆమె చెయ్యి విడువకుండా, దుఃఖాన్ని దిగమింగుకొని, కడుపులోని జీవం కడుపులోనే పోయిందని చెప్పలేకపోతున్నాడు. కడుపు కోతంటే కేవలం తల్లిది మాత్రమే కాదు తండ్రిది కూడా. విషయం ఆమె గ్రహించింది! ఒక్కసారిగా ఆమె గుండె పగిలి పోయింది. తట్టుకోలేక పోయింది. భోరున ఏడ్చేసింది. ∙∙ ప్రిన్స్ హ్యారీని ప్రేమించి, పెళ్లాడి బ్రిటన్ రాజవంశంలోకి అడుగుపెట్టిన మేఘన్ మార్కెల్‌ను ఈ చేదు ఘటన ఒక్కసారిగా తలకిందులు చేసింది. భర్త హ్యారీ, ముద్దులొలికే తమ చిన్నారి కుమారుడు ఆర్చీ మాత్రమే లోకంగా జీవిస్తూ వస్తోంది ఆమె ఇంతవరకూ. ‘మొదటి బిడ్డను పుట్టగానే నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించానో.. రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపుగా బాధపడ్డాను’ అని తాజాగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు రాసిన వ్యాసంతో ఆమె తన వ్యధను దిగమింగుకోలేకపోయారు. బ్రిటన్ రాజవంశానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి ఇలా వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడం.. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మీడియాతో పంచుకోవడం ఇదే ప్రథమం కాకపోవచ్చు. కానీ ఎంతో ఆవేదనా భరితంగా ‘ది లాసెస్ వియ్ షేర్’ అనే ఆ వ్యాసం కొనసాగింది. కొద్దికాలం క్రితమే బ్రిటన్ రాజప్రాసాదాన్ని వీడిన ఈ దంపతులు ప్రస్తుతం లాస్ ఏజెలిస్లో ఉంటున్నారు. తన వ్యాసంలోనే ఇంకో మాట కూడా రాశారు మేఘన్. గత ఏడాది ప్రిన్స్ హ్యారీ, తను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్టు.. ‘ఆర్యూ ఓకే’ అని మేఘన్‌ను అడిగారట. అది మామూలు ప్రశ్నే అయినా అలాంటి పలకరింపు ప్రతి మహిⶠకూ అవసరం అని మేఘన్ అన్నారు. బహుశా తనను వద్దనుకున్న రాజప్రాసాద బాంధవ్యాలను తలచుకుని అలా రాసి ఉండవచ్చు. ఏమైనా భర్త తన పక్కన ఉన్నాడు. ‘ఆర్యూ ఓకే’ అని అతడు తనని అడుగుతున్నట్లే ఉంది ఆమెకు ప్రతి క్షణం. – జ్యోతి అలిశెట్టి, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం -
కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను
లండన్: అమ్మవ్వడంలో ఉండే ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిస్తేనే తమ జీవితానికి ఓ అర్థం అని భావించే ఆడవారు కొకొల్లలు. బిడ్డను కనడం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో.. అలానే కడుపులోని ప్రాణి బయటకు రాకముందే కన్నుమూస్తే.. ఆ బాధ వర్ణణాతీతం. అనుభవించడం తప్ప మాటల్లో చెప్పడం కష్టం. ఈ క్రమంలో డచెస్ ఆఫ్ ససెక్స్, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సంచలన విషయాలు వెల్లడించారు. రెండవ సారి గర్భవతి అయ్యాక తనకు అబార్షన్ అయ్యిందని.. పుట్టకముందే ఓ బిడ్డను పొగొట్టుకున్నానని తెలిపారు. బ్రిటన్ రాజవంశానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి ఇలా తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడం.. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మీడియాతో మాట్లాడటం ఇదే ప్రథమం. దాంతో ప్రస్తుతం మేఘన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. (చదవండి: ‘ప్రపంచం మొత్తం మీద నా మీదే ఎక్కువ ట్రోలింగ్’) మేఘన్ మార్కెల్ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లడించారు. విషాదం గురించి మాట్లాడుతూ.. ‘మొదటి బిడ్డను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించాను రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపు బాధపడ్డాను. బిడ్డను కొల్పోవడం అంటే భరించలేని బాధను మోయడం. ఎందరో అనుభవిస్తారు.. కొందరు మాత్రమే బయటకు వెల్లడిస్తారు. గుండెని పిండే ఈ వార్త నాకు తెలిసినప్పడు నేను ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాను.. నా భర్త నా పక్కనే ఉన్నాడు. కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను. ఆ తర్వాత నేను, నా భర్త నాలానే అబార్షన్ అయ్యి బిడ్డను కోల్పోయిన కొందరిని కలుసుకున్నాము. బాధలో తేడా లేదు. కానీ వీరిలో కొందరు తమకు జరిగిన నష్టం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడ్డారు. ఒంటరిగా బాధను భరించారు’ అని తెలిపారు. ఇక ఈ ఆర్టికల్‌లో మేఘన్ అనేక సన్నిహిత వివరాలను వెల్లడించారు. మేఘన్, హ్యారీ దంపతులకు కుమారుడు ఆర్చీ ఉన్నారు. (చదవండి: అభద్రతకు గురైన మేఘన్ మార్కెల్) బ్రిటీష్ రాజకుటుంబంలోని సీనియర్ సభ్యుల వ్యవహార శైలికి భిన్నంగా మేఘన్ వ్యక్తిగత వివరాలు తెలిపారు. ఇక 68 ఏళ్ల పాలనాకాలంలో క్వీన్ ఎలిజబెత్ ఎన్నడు ఏ మీడియా సమావేశంలో కూడా తన వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయలేదు. ఇక హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియం, అతడి భార్య కేట్ ఇప్పటి వరకు ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. ప్రతిసారీ పుట్టిన బిడ్డతో కలిసి దంపతులు మీడియాకు ఫోజులిచ్చేవారు. విలియం-కేట్ దంపతులు కూడా తమ వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. -
15వ ఏట అత్యాచారం.. నటి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ హాలివుడ్ తార డెమీ మోర్ పేరు వినగానే ‘ఇండీసెంట్ ప్రపోజల్’ పేరు గుర్తుకు రాక తప్పదు. అదురు బెదురు లేకుండా రొమాంటిక్ చిత్రాల్లో నటించిన డెమీ మోర్ జీవితం కూడా ‘ఇండీసెంట్’గానే నడిచింది. ప్రస్తుతం 56 ఏళ్ల ఆమెపై 15వ ఏటనే అత్యాచారం జరిగిందట. అప్పుడు ఆమె లాస్ ఏంజెలిస్‌లోని ఫెయిర్ ఫాక్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారట. 2004లో తన బాయ్‌ఫ్రెండ్ ఆష్టన్ కుచర్‌తో ప్రేమాయణంలో గర్భవతి అయిందట. కడుపులోని బిడ్డకు ఆరు నెలలు నిండగానే గర్భస్రావం అయిందట. దాంతో ఆమె మద్యానికి, డ్రగ్స్‌కు మరోసారి అలవాటు పడిందట. 2005లో భాయ్ ఫ్రెండ్ ఆష్టన్ కుచర్ను పెళ్లి చేసుకొని వైద్య చికిత్సల ద్వారా తల్లి అయ్యేందుకు ప్రయత్నించిందట. అయినా లాభం లేకపోవడంతో ఆ ప్రయత్నాలను విరమించిందట. డెమీ మోర్‌కు 42 ఏళ్లు ఉన్నప్పుడు (2003లో) తనకంటే 15 ఏళ్లు చిన్నవాడయిన ఆష్టన్ కుచర్‌తో డేటింగ్ మొదలు పెట్టారట. అప్పుడే ఆమె గర్భవతి అయ్యారు. పుట్టబోయే పాపకు ‘చాప్లిన్ రే’ అని కూడా పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. 2004లో గర్భస్రావం అయ్యాక 2005లో ఆమె కుచర్ను పెళ్లి చేసుకున్నారట. మరి ఆమె యవ్వనంలో ఏం చేశారని ఎవరికైనా సందేహాలు రావచ్చు. డెమీ మోర్ తన 16వ ఏటనే ఓ గిటారిస్ట్తో సహ జీవనం చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేశారట. ఆ తర్వాత రెండేళ్లకు గిటారిస్ట్ను వదిలేసి రాక్ మ్యుజీషియన్ ఫ్రెడ్డీ మోర్‌ను ప్రేమించారట. అప్పుడే ‘జనరల్ హాస్పటల్’, ‘లాస్ట్ నైట్’ లాంటి హాలివుడ్ చిత్రాల్లో నటించే అవకాశం రావడం, వాటి ద్వారా పేరు రావడంతో మద్యానికి, కొకైన్కు బానిస అయ్యారట. కొచర్ పరిచయం అయ్యాక మద్యానికి, డ్రగ్స్‌కు దూరమై సంతానం కోసం ప్రాధాన్యత ఇచ్చారట. కొచర్ తనను మోసం చేస్తున్నాడని గ్రహించి ఆయనతో 2011లో విడిపోయినప్పటికీ వారిద్దరికి 2013లో వారికి విడాకులు మంజూరయ్యారట. డెమీ మోర్ 1990 దశకంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లీస్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాలను ఎవరో చెప్పడం లేదు. స్వయంగా డెమీ మోరే ‘ఇన్సైడ్ అవుట్’ అనే ఆత్మ కథలో చెప్పుకుంది. ఆ పుస్తకం ఈనెల 24వ తేదీన మార్కెట్లోకి వస్తోంది. బ్రూస్ విల్లీస్‌తో ఆమె ప్రేయాణం, అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేక పోయిందీ, ఆయన పిల్లలతో అనుబంధాన్ని ఎందుకు తెంచుకోవాల్సి వచ్చింది వంటి అంశాలు ఈ పుస్తకంలో ఉండే అవకాశం ఉంది. -
విమానం టాయిలెట్లో మృతపిండం
న్యూఢిల్లీ: గువాహటి నుంచి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏసియా విమానం టాయిలెట్లో మృత పిండం కనిపించడం ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. పిండం వయసు దాదాపు ఆరు నెలలు ఉండొచ్చని సమాచారం. విమాన టాయిలెట్లో పేపర్లలో చుట్టి ఉన్న పిండాన్ని గమనించిన సిబ్బంది.. ఈ పని ఎవరు చేశారో చెప్పాలంటూ మహిళా ప్రయాణికులను ప్రశ్నిస్తుండగా తనకు గర్భస్రావం అయినట్లు 19 ఏళ్ల వయసున్న తైక్వాండో క్రీడాకారిణి వెల్లడించింది. ఆమె ఓ టోర్నమెంట్ కోసం గురువారం తన కోచ్‌తో కలసి దక్షిణ కొరియా వెళ్లాల్సి ఉంది. టాయిలెట్లో సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, పిండం కనిపించిందని ఎయిర్ ఏసియా అధికారులు తెలిపారు. పోలీసులు పిండాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, క్రీడాకారిణికి ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. అయితే ఆమె గర్భంతో ఉన్న విషయమే తనకు తెలియదనీ, విమానమెక్కే ముందు విమానయాన సంస్థకు సమర్పించిన వివరాల్లోనూ ఈ విషయం లేదని ఆమె కోచ్ చెప్పారు. -
నిషేధం తర్వాత వార్నర్ ఇంట్లో విషాదం
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, బ్యాట్‌మెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో మానసికంగా కుంగిపోయిన వార్నర్.. తన ఇంట్లో జరిగిన మరో ఘటన తీవ్రంగా కలిచివేసింది. దానికి సంబంధించి వార్నర్ సతీమణి కాండిష్ వార్నర్ స్థానిక మహిళా వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన సంఘటనలతో వార్నర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడని ఆ విషాదం నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నించాడని ఆమె తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి తాము వచ్చిన తరువాత తమ జీవితంలో మరిచిపోలేని విషాద సంఘటన చోటు చేసుకుందని అన్నారు. ఒకరోజు తాను బాత్రూమ్లో ఉండగా తీవ్రంగా కడుపునొప్పి వచ్చిందని, సహాయం కోసం డేవిడ్‌ను పిలిచినట్లు తెలిపారు. అయితే తీవ్ర రక్త స్రావం జరగడంతో తన గర్భాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా ప్రయాణం చాలా కష్టంగా ఉంటుందని, పర్యటనకు ముందే తాను గర్భం దాల్చానని, వార్నర్ చాలా సురక్షితంగా తనను ఇంటికి తీసుకెళ్లాడని గుర్తు చేసుకున్నారు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో నిషేధం కారణంగా తీవ్రంగా కుంగిపోయన వార్నర్‌ను తన గర్భస్రావం మరింత కలచివేసిందన్నారు. -
నెలసరి సమస్యలకు మండూకాసనం
మండూకాసనం గర్భకోశ వ్యాధులు, రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది. ఈ ఆసనంలో మొదట..వెన్ను నిటారుగా వజ్రాసన స్థితిలో కూర్చుని, అరచేతులను తొడల మీద ఉంచాలి.రెండు పిడికిళ్లు బిగించి కింది పొట్టకు ఆనించాలి. మోకాళ్లను కొంచెం దూరం జరిపి, నడుమును (వెన్నును కాదు) వంచి నుదురును నేలకు ఆనించాలి. ఆ స్థితిలో పదిసార్లు శ్వాస తీసుకుని వదిలిన తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. మొదటి ప్రయత్నంలో నుదుటిని నేలకు ఆనించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు బలవంతంగా ఆనించే ప్రయత్నం చేయరాదు. సాధనతో సాధ్యం చేసుకోవాలి. ఉపయోగాలు: గర్భకోశ వ్యాధులు, రుతు సంబంధ సమస్యలు పోతాయి. మోకాళ్ల నొప్పులు పోతాయి. నడుము ప్రదేశంలోని దేహభాగాలను ఆరోగ్యవంతంగా ఉంటాయి. పిరుదులలోని కొవ్వు కరిగిపోతుంది. జాగ్రత్తలు: బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు, విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు. -
స్మార్ట్ ఫోన్స్ వాడే మహిళలు బీ కేర్‌ఫుల్..
వాషింగ్టన్: ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ వాడే మహిళలు తమ ఆరోగ్య విషయంలో ఇక నుంచి జాగ్రత్త వహించాలి. స్మార్ట్ఫోన్లు, వైఫై రౌటర్లు, మైక్రోవేవ్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌తో మహిళలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆయా పరికరాల్లోని అయస్కాంత క్షేత్రాల నుంచి వెలువడే అయనీకరణం చెందని రేడియేషన్ వల్ల ఈ ప్రమాదం పొంచి ఉందని అమెరికాలోని కైజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తెలిపారు. సరికొత్త రక్త పరీక్ష కేన్సర్ వ్యాధులను నిర్థారించే సరికొత్త రక్త పరీక్ష ను జార్జియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లింపోమియా (తెల్లరక్త కణాల కేన్సర్), మెలనోమా (ఒక రకమైన చర్మ కేన్సర్)ను ఇన్ఫ్రారెడ్ స్పెకోŠట్రస్కోపితో రక్త పరీక్షలు చేసి నిర్ధారించవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన ఎలుకలు, కేన్సర్ వ్యాధి ఉన్న ఎలుకల నుంచి రక్త నమూనాలను సేకరించి ఇన్ఫ్రారెడ్ స్పెకోట్రస్కోపితో పరీక్షలు చేయగా.. లింపోమియా, మెలనోమా కేన్సర్లను గుర్తించగలిగినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మధుమేహం ముప్పు మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం, తదితర ఇబ్బందులుండే వారికి మధుమేహం వచ్చే ముప్పు ఉందని తాజా అధ్యయనంలో తేలింది. దీనికి కారణం యూరియాతో సంబంధమేనని వెల్లడైంది. ఇప్పటిదాకా మధుమేహం వల్ల కిడ్నీ పాడవుతుందని మాత్రమే తెలుసునని, కిడ్నీల వల్ల కూడా మధుమేహం వస్తుందని తమ తాజా పరిశోధనల్లో తేలిందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా మూత్రపిండాలు రక్తం నుంచి యూరియాను తొలగిస్తాయని, ఒకవేళ మూత్రపిండాలు పనిచేయడం తగ్గిపోతే రక్తంలో యూరియా శాతం పెరిగి మధుమేహానికి దారితీస్తాయని వివరించారు. -
ఆ దేశంలో అబార్షన్ అయితే జైలే!
శాన్ సాల్వడార్: అబార్షన్ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహిళలు ఉద్యమిస్తుండగా, ఎల్ సాల్వడార్ దేశంలో ఇప్పటికీ అబార్షన్ అయితే జైలుకు పంపించే ఆటవిక చట్టాలు అమలవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా కాకుండా సహజ సిద్ధంగా అబార్షన్ అయిన కేసుల్లో కూడా అమాయక మహిళలు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. ఏడాది, రెండేళ్లు కూడా కాదు.. ఏకంగా 40 ఏళ్లు జైలుశిక్ష పడుతున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. న్యాయపరంగా పోరాడేందుకు ఆర్థిక స్థోమత లేని అనాథలు, అభాగ్యులు జైళ్లలో మగ్గిపోతున్నారు. మారియా థెరిసా రివేరా అనే యువతి కూడా రాక్షస చట్టాలకు ఇలాగే చిక్కారు. ఒకోజు ఆమెకు తెలియకుండా అబార్షన్ జరిగిపోయింది. ఆ కారణంగా ఆమె మూర్ఛపోయింది కూడా. నిద్ర లేచేసరికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నారు. ఆ విషయం గ్రహించేలోగానే పోలీసులు వచ్చి ఆమె చేతులకు బేడీలు వేశారు. రాక్షస చట్టాల కింద ఆమెను విచారించిన కోర్టు 40 ఏళ్లు జైలుశిక్ష విధించింది. స్వతహాగా ఆమె ధైర్యవంతురాలవడం, ఆమెకు పలువురు సామాజిక కార్యకర్తలు అండగా నిలవడంతో అలుపెరగని న్యాయ పోరాటం సాగించారు. ఫలితంగా కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. దాంతో ఐదేళ్ల శిక్ష అనంతరం గత మే నెల పదో తేదీన జైలునుంచి విడుదలయ్యారు. 2011 నుంచి ఐదేళ్ల జీవితం మాత్రం జైలు ఊచలకే అంకితమైంది. ఆమె లాంటి, అభాగ్యులు, అమాయకపు మహిళలు ఆ దేశంలో ఎంతో మంది ఉన్నారు. సామాజిక కార్యకర్తల ఆసారాతో న్యాయ పోరాటం చేయడం వల్ల రివేరాకు చివరకు విముక్తి లభించింది. అలాంటి పరిస్థితి లేనివాళ్లు ఎంతో మంది ఇప్పటికీ జైళ్లలోనే మగ్గిపోతున్నారు. 2000 సంవత్సరం నుంచి 2011 మధ్య దాదాపు 123 మంది పేద మహిళలు అకారణంగా చట్టం కోరల్లో చిక్కుకుపోయారని, వారిలో కొంతమంది జైలు శిక్షలు పూర్తి చేసుకొని విడుదల కాగా, మరి కొందరు జైల్లోనే ఉన్నారని ఎల్ సాల్వడార్ పునరుత్పత్తి హక్కుల సంఘం తెలియజేసింది. అబార్షన్ చట్టానికి బలవుతున్న వారిలో ఎక్కువమంది రోజు కూలీలు, పని మనుషులు, కడు పేదలే ఉంటున్నారని ఆ సంస్థ వెల్లడించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అబార్షన్‌ను కఠినమైన నేరంగా పరిగణించే చట్టాలను 1990 ప్రాంతంలో ఎల్ సాల్వడార్ తీసుకొచ్చింది. అబార్షన్ చేయకపోతే శిశువు లేదా తల్లికి ప్రాణాపాయం ఉన్నా అబార్షన్ చేయించుకోవడం నేరమే. రేప్ సంఘటనల్లో కూడా అబార్షన్‌ను చట్టాలు అనుమతించడం లేదు. రేప్ కారణంగా అబార్షన్ చేయించుకున్నారన్న ఆరోపణలపై వెరోనికా అనే పనిమనిషికి 30 ఏళ్లు, ఇంట్లో ముందస్తుగా బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఆ బిడ్డ పురిట్లోనే చనిపోవడంతో అల్బా అనే ఆమె సహచరికి 20 ఏళ్లు జైలుశిక్ష పడింది. మృత శిశువుకు జన్మనిచ్చిన జొహానా అనే మహిళకు కూడా హోమిసైడ్ కింద జైలుశిక్ష విధించారు. 2011 తర్వాత సహజసిద్ధమైన అబార్షన్ల విషయంలో పోలీసులు తొందరపడి కేసులు దాఖలు చేయకపోవడంతో కేసులు తగ్గినా, చట్టాల్లో సంస్కరణలు రావాలని సామాజిక కార్యకర్తలు అక్కడ పోరాటం చేస్తున్నారు. గర్భ నియంత్రణ సాధణాలను దేశలోని చట్టాలు అనుమతిస్తున్నా, పేదవారికి అవి అందుబాటులో ఉండడం లేదు. అబార్షన్ కోసం గుట్టుచప్పుడు కాకుండా కొంత మంది మహిళలు నాటు పద్ధతులను అనుసిరిస్తుండడంతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఓ నివేదికలో తెలిపింది. అబార్షన్ చట్టాల్లో సంస్కరణలు తీసుకరావాలని ఈ సంస్థ కూడా పోరాటం జరుపుతోంది. కట్టుబాట్లకు, మత సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే దేశంలో ప్రభుత్వం అందుకు చొరవ తీసుకోవడం లేదు.