![Shoaib Ibrahim Sister Saba Suffers Miscarriage - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/13/Shoaib%20Ibrahim%20Sister%20Saba%20Suffers%20Miscarriage-01.jpg.webp?itok=XwyeNlFp)
అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఎవరికి ఉండదు. అందులోనూ గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ కడుపులోని పాపాయి ఎప్పుడు ఈ భూమి మీదకు వస్తుందా? అని వేయి కలలు కంటూ ఉంటారు. బాలీవుడ్ నటుడు షోయబ్ ఇబ్రహీం సోదరి, ఇన్‌ఫ్లూయెన్సర్ సబా కూడా అలానే కలలు కంది. గర్భవతి అయినప్పటి నుంచి పుట్టబోయే బిడ్డపై గంపెడాశలు పెట్టుకుది. కానీ ఆమె కలలు కల్లలయ్యాయి. కడుపులోనే బిడ్డ మరణించింది. దీంతో ఆమెకు అబార్షన్ చేయక తప్పలేదు.
ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సబా-సన్నీ దంపతులు తాజాగా మిస్‌క్యారేజ్ అయిన విషయాన్ని వెల్లడించారు. ముందు నుంచీ బిడ్డ గుండె సరిగా కొట్టుకోవడం లేదని చెప్పిన వైద్యులు ఆమెకు బెడ్ రెస్ట్ తీసుకోవమని చెప్పారు. తాజాగా స్కానింగ్‌కు వెళ్లినప్పుడు పరీక్షించగా శిశువు గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని తెలిపారు. ఆమెకు అబార్షన్ చేశారు.
దీనిపై సబా మాట్లాడుతూ.. 'ఈ బాధను ఎలా దిగమింగుకోవాలో తెలియడం లేదు. సన్నీ మనసుకెంత కష్టంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. ఆ భగవంతుడు ఇలా జరగాలని ఉందని రాసిపెట్టాడు. దానికి మేమేం చేయగలం? కానీ అబార్షన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లినప్పుడు చాలా భయమేసింది' అని చెప్పుకొచ్చింది. అటు సన్నీ మాట్లాడుతూ.. 'ఒకవేళ నేను ఆపరేషన్ అయ్యాక తిరిగి రాకపోతే ఏం చేస్తావు? అని సబా అడిగింది. ఆ మాట విని చాలా బాధేసింది. తను మానసికంగా చాలా భయపడింది' అని పేర్కొన్నాడు. కాగా సబా- సన్నీ గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.
చదవండి: రాజకీయాల్లోకి రీఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేశ్
Comments
Please login to add a commentAdd a comment